ఓటీటీలో బాపు!

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో బ్రహ్మాజీ, ఆమనీ ప్రధాన పాత్రల్లో బలగం ఫేమ్ నటుడు సుధాకర్ రెడ్డి నటించిన చిత్రం “బాపు” కూడా ఒకటి. దర్శకుడు కే దయాకర్ రెడ్డి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ చిత్రం సాలిడ్ థ్రిల్స్ సహా మంచి ఎమోషన్స్ తో కూడా తెరకెక్కింది. అయితే ఇటీవలే థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అప్పుడే ఓటిటిలో అలరించేందుకు వచ్చేస్తుంది.

గత ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఇపుడు మార్చ్ 7 నుంచి ఓటిటిలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో మార్చ్ 7 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. సో ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించగా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories