బొత్స వారి పాట.. “రెండు లక్షలు ఒకటోస్సారి..”

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక మంచి కాక మీదకు చేరుకుంటుంది. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఒకవైపు అధికార ఎన్డీఏ కూటమి చాలా నింపాదిగా ఇంకా ఆధ్యాత్మిక కూడా ఎంపిక చేయకుండా కూల్ గా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ స్థానాన్ని తమ పార్టీ ఖాతాలోనే నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి దళం మాత్రం కంగారు పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో.. ఓటర్లు అయిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లకు ప్రస్తుతం వేలం పాట నడుస్తూన్నట్టుగా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికి బొత్స వారి పాట.. ఓటుకు రెండు లక్షల దగ్గర నడుస్తున్నదని పుకార్లు వినిపిస్తున్నాయి.

తమకు 600 ఓట్ల బలం ఉన్నదని వైసిపి ఆర్భాటంగా చెప్పుకుంటున్నది గానీ.. వారిలో ఎన్ని వందల మంది పక్క చూపులు చూస్తున్నారో ఎవ్వరికీ క్లారిటీ లేదు.  అందుకే వైసిపి వీరితో క్యాంప్ రాజకీయాలు చేస్తున్నది. పోలింగ్ వరకు తిరిగి రాకుండా.. వారికి కుటుంబాలతో సహా బెంగళూరు పంపి విహారయాత్రలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగవద్దని జగన్ వారిని కోరుతున్నారు. బొత్స వైపు నించి ఓటుకు రెండులక్షల ఆఫర్ నడుస్తుండగా.. ఇప్పుడు వైసిపికి ఓటు వేస్తే రాబోయే ఐదేళ్లపాటు ప్రభుత్వం తమను శత్రువులా చూస్తుందని.. దాన్ని తట్టుకోవడానికి రెండు లక్షలు ఎలా సరిపోతాయని పలువురు అంటున్నట్టు సమాచారం. 

రెండు లక్షలు కనీస పాటగా పెట్టి, డిమాండ్ ను బట్టి ఎక్కువ ఇవ్వడానికి బొత్స సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం మాత్రం.. ఆ ప్రజాప్రతినిధుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇవ్వడం మాత్రమే చేస్తున్నట్టు సమాచారం మరి ఈ స్థానిక నాయకులు.. డబ్బుకు లొంగుతారా? లేదా, అభివృద్ధి వైపు మొగ్గుతారా? అనేది వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories