సూపర్ సిక్స్ హామీలు సక్సెస్ కావడం, ప్రభుత్వానికి మంచి పేరు రావడం చూసి జగన్మోహన్ రెడ్డి దళాలు ఓర్వలేకపోతున్నాయి. ఉడికిపోతున్నారు. ప్రజల్లో సూపర్ సిక్స్ పథకాలకు ఆదరణ పెరుగుతుండడం, మంచి పరిపాలన పట్ల మంచి పేరు వస్తుండడం వారు సహించలేకపోతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అనే జగన్ వెటకారాలను పార్టీ మొత్తం ఫాలో కావాలని అనుకుంటున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన తీరును ప్రభుత్వం ప్రజల్లో ఘనంగా చెప్పుకుంటుండగా.. అక్కడే బద్నాం చేయడానికి వారు పాట్లు పడుతున్నారు. జగన్ పాట్లు ఒక రకం అయితే.. తాజాగా బొత్స సత్యనారాయణ సూపర్ సిక్స్ గురించి.. పది లో మూడు అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా? అని ప్రశ్నించడం చాలా కామెడీగా ఉంది.
శాసనసభ సమావేశాల తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. మండలిలో తమ పోరాటాల గురించి టముకు వేసుకున్నారు. అంత వరకు అంతా బాగానే ఉంది. ప్రజల తరఫున తాము పోరాటం చేస్తున్నామని చెప్పుకున్నారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఇలాంటి మాట చెప్పగల ధైర్యం జగన్ కు కూడా ఉండదు గానీ.. ఆయన మండలికి ఎటెండ్ అయ్యారు గనుక చెప్పుకున్నారు. కాకపోతే సూపర్ సిక్స్ విషయంలోనే జగన్ పార్టీలోని అందరికీ అలవాటు చేసిన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి 3 అమలు చేస్తే అది సూపర్ హిట్ అవుతుందా? అని బొత్స ప్రశ్నిస్తున్నారు. సిక్స్ అంటే టెన్ అని బొత్స అనుకుంటున్నారా? అంటూ ఇప్పుడు ప్రజల్లో జోకులు పేలుతున్నాయి.
సూపర్ సిక్స్ అంటూ తెలుగుదేశం కూటమి ప్రజలకు కీలకమైన ఆరు హామీలు ఇచ్చింది. ఆ ఆరుహామీలను నెరవేర్చడానికి వారికి ప్రజలు అయిదు సంవత్సరాల పాలనాధికారం ఇచ్చారు. కేవలం 15 నెలల్లో నాలుగు పథకాలు అమల్లోకి వచ్చాయి. మరొక పథకానికి డెడ్ లైన్ కూడా ప్రకటించారు. నిజానికి రాబోయే నాలుగేళ్లలో మిగిలిన రెండింటిని అమలు చేసినా కూడా.. సూపర్ హిట్ అనే అనాలి. కానీ.. ఈ విశ్లేషన చెబితే.. ప్రజల్లో వారికే ఆదరణ పెరుగుతుందని భయపడుతున్న జగన్ దళాలు.. బొత్స.. సూపర్ సిక్స్ అంటే 10 లో 3అమలు చేశారని వంకర మాటలు మాట్లాడడం పద్ధతిగా లేదని ప్రజలు అనుకుంటున్నారు. అభిప్రాయాలు ఎంత వంకరగా అయిన ఉండొచ్చుగానీ.. గణాంకాలను కూడా వక్రంగా మార్చాలనుకుంటే ఎలా అంటున్నారు.