బొత్సది అమాయకత్వమా? అంధత్వమా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంతో మాట్లాడుతున్నారరో,  వాస్తవాలను చూడలేని అంధత్వంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కూటమి పార్టీల నాయకులకు.. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు బొత్స సత్యనారాయణ విసురుతున్న సవాళ్లు ఆయననే నవ్వుల పాలు చేస్తున్నాయి. కూటమి నాయకులను విమర్శించేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కనీస జ్ఞానం ఉండడం లేదని,  లాజిక్ లేకుండా మాట్లాడుతూ ప్రజలకు దొరికిపోతున్నారని అంతా అనుకుంటున్నారు. 

 ఒకవైపు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల ఎదుటకు వెళ్లి.. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఏం చేసిందో,  రాబోయే నాలుగేళ్లలో ఏం చేయదలుచుకుంటున్నదో వివరించి చెప్పడానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ విస్తృతంగా ఇంటింటికి తిరుగుతున్నారు.  ప్రజలు వారికి నీరాజనాలు పడుతున్నారు. కొన్నిచోట్ల కొత్తగా తమ సమస్యలను కూడా నివేదిస్తున్నారు.  నిజానికి ప్రభుత్వ లక్ష్యం కూడా అదే.  ప్రజల కోసం తాము చేయదలుచుకున్నది ఏమిటో చేసుకుంటూ పోవడం మాత్రమే కాకుండా..  ప్రజలకు అవసరమైనది ఏమిటో వారి ద్వారా తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ సుపరిపాలనలో  తొలి అడుగు.  ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ కూడా స్వయంగా విస్తృతంగా పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షంలోని మాజీ మంత్రిత్వ సత్యనారాయణకు ఇవేమీ కంటికి కనిపిస్తున్నట్లుగా లేదు. 

చంద్రబాబు నాయుడు, పవన్ రండి గ్రామాల్లోకి వెళదాం..  ఎవరి తాటతీస్తారు తేలిపోతుంది.. అని బస్సు సత్యనారాయణ అంటున్నారు.  నిజానికి ఆయన ఏ ఇద్దరు నాయకులను అయితే ఉద్దేశించి సవాలు విసురుతున్నారో..  వారిద్దరూ ప్రజల్లోనే కదా తిరుగుతున్నారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే మొహం చెల్లక  ఇళ్లకు పరిమితమై కూర్చుని, పార్టీ కార్యాలయాల్లో  మీటింగులు పెట్టి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు.  ప్రజలు తాట తీయబట్టే కదా వారు కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి విలపిస్తున్నారు. 

 ఏడాది గడవకముందే లాంటి అతిశయమైన సవాళ్లు విసరడం బొత్స సత్యనారాయణకు మంచిది కాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు నాయకులు పార్టీని వదిలి వెళుతుండగా, మరొకవైపు కార్యకర్తలు కూడా పార్టీని కాదనుకుంటున్న దుస్థితిలో వైసీపీ ఉంది. అందుకే ప్రతిసారీ కిరాయి మూకలను కార్యక్రమాలకు పోగేసి హడావుడి చేయాలనుకుంటున్నారు. ప్రతిసారీ.. జగన్ 2.0 పాలన వస్తే కార్యకర్తలు చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతుంది.. అంటూ కార్యకర్తలను భ్రమపెట్టాలని చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories