మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ థియేటర్లలో విడుదల కి రెడీ అయిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ కి ఓ ప్రశ్న ఎదురైంది. పాన్ ఇండియా మూవీస్ కల్కి, పుష్ప లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడగగా అందుకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు హరీష్.
పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వవు, మనం ఒక మంచి సినిమా చేస్తే, అది ఇండియా మొత్తం ఆదరిస్తే, అది పాన్ ఇండియా చిత్రం అవుతుంది. కల్కి లాంటి సినిమాలు చేయడానికి నాగ్ అశ్విన్ ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాలు చేయడానికి సుకుమార్ ఉన్నాడు. నేను నా స్టైల్ లో సినిమాలు తీస్తా అని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆ ఇద్దరూ కూడా నా అభిమాన దర్శకులే అని పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.