యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా, రితిక నాయక్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం మిరాయ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించి బలమైన ఇంపాక్ట్ చూపించాడు. ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ అందుకోవడంతో అభిమానుల్లో మంచి ఉత్సాహం నెలకొంది.
రిలీజ్‌కు ముందే బుకింగ్స్ బాగా ఉండగా, మౌత్ టాక్ సూపర్‌గా రావడంతో డే 1కి ఆ డిమాండ్ మరింత పెరిగింది. బుక్ మై షోలో టికెట్ల బుకింగ్స్ గంట గంటకు రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదట గంటకు 15 వేల టికెట్ల దాకా వెళ్లిన రేటు, తరువాత 18 వేలు కూడా దాటింది. ఈ స్పీడ్ చూస్తుంటే మొదటి రోజు మిరాయ్ గట్టి ఓపెనింగ్స్ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.