బుక్‌ మై షో లో డాకు మహారాజ్ హవా!

బుక్‌ మై షో లో డాకు మహారాజ్ హవా! ఈ సంక్రాంతి బరిలో విడుదలకి రాబోతున్న టాలీవుడ్ సినిమాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్‌ బాబీ కొల్లి తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “డాకు మహారాజ్” కూడా ఒకటి. 

మరి ట్రైలర్ తర్వాత మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై మన దగ్గర ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. ప్రముఖ ఆన్లైన్ బుకింగ్స్ యాప్ బుక్ మై షోలో డాకు మహారాజ్ పట్ల ఏకంగా 2 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యాయి. 

దీంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ అలాగే చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories