టాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్నటువంటి బాలీవుడ్ హీరోయిన్స్ లో నటి కియారా అద్వానీ కూడా ఒకరు. తన మొదటి సినిమా తోనే తెలుగులో సూపర్ హిట్ డెబ్యూ అందుకున్న కియారా అద్వానీ తర్వాత వరుసగా రెండు సినిమాలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాలు చేసింది. ఈ ఏడాదిలోనే “గేమ్ ఛేంజర్” తో అలరించిన ఈ యంగ్ బ్యూటీ ఇపుడు ఒక ఎమోషనల్ గుడ్ న్యూస్ ని అందించింది.
తాను కొన్నేళ్ల కితం బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా తన భర్తతో కలిసి ఒక పోస్ట్ ద్వారా తాను ప్రెగ్నెంట్ అయ్యినట్టుగా రివీల్ చేసింది. తమ ఇద్దరి జీవితాల్లో ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటూ తమ ఇద్దరి చేతుల్లో ఊలుతో అల్లిన చిన్న పిల్లల పాద రక్షలు పెట్టి పోస్ట్ చేశారు. దీనితో ఈ గుడ్ న్యూస్ ఇపుడు వైరల్ గా మారగా వీరికి తమ ఫాలోవర్స్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.