నాని కోసం బాలీవుడ్‌ విలన్‌

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది పారడైజ్’ అనే సినిమాలో నాని సరికొత్త లుక్‌తో కనిపిస్తాడు. ఈ చిత్ర షూటింగ్‌ను మే 2వ తేదీ నుంచి స్టార్ట్ చేయనున్నారట చిత్ర యూనిట్. ఇక మే నెల మధ్యలో నాని కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అవుతాడట. అయితే, ఈ సినిమాలో విలన్‌గా ఓ బాలీవుడ్ నటుడు ఓకే అయినట్లు ఓ టాక్‌ వినపడుతుంది.

బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ‘కిల్’ మూవీలో సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నాని సినిమాలో కూడా ఈ యాక్టర్ విలన్‌గా నటించబోతున్నాడట. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories