రాజాసాబ్‌ కోసం బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా “ది రాజాసాబ్” పైన ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా హారర్, కామెడీ శైలిలో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమా మీద మంచి బజ్‌ని కలిగించాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. క్లైమాక్స్ పార్ట్ అంతా పూర్తవగా, చివరికి ఓ ప్రత్యేక గీతం షూట్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. సినిమాలో భాగంగా ఉండే ఈ ఐటెం సాంగ్ కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ నటి‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పాట కోసం కరీనా కపూర్‌ని సంప్రదించడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఆమె ఈ పాటలో నాట్యం చేయాలని చిత్రబృందం భావిస్తుండగా, అందుకు గాను భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే కరీనా నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం తేలాల్సి ఉంది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లాంటి తారలే కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీత దర్శకుడిగా థమన్ పని చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories