రౌడీ హీరోకి వేదిక మీద ముద్దు పెట్టిన బాలీవుడ్‌..!

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సినిమాలో  నటించినప్పటికీ ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్‌ రెడ్డి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువ అయిపోయింది.

ఆ తరువాత గీత గోవిందం అయితే విజయ్‌ ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. అర్జున్ రెడ్డి సినిమాను సందీప్‌ వంగా డైరెక్షన్‌ వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆ సినిమాను కబీర్‌ సింగ్‌ గా రీమేక్‌ చేసి విడుదల చేశారు. బాలీవుడ్‌ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

ఆ సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీలు హీరో, హీరోయిన్లుగా నటించారు. ఏకంగా రూ. 250 కోట్ల గ్రాస్‌ ను వసూల్‌ చేసింది. ఈ సినిమాతో సందీప్‌ వంగా కూడా బాలీవుడ్‌ లో స్టార్‌ డైరెక్టర్‌ గా ఎదిగాడు. ఈ క్రమంలోనే తెలుగు అర్జున్‌ రెడ్డి, హిందీ కబీర్ సింగ్‌ ఇద్దరూ కూడా ఒకే వేదిక పై మెరిశారు.

మంగళవారం ముంబైలో జరిగిన అమెజాన్‌ ప్రైమ్‌ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి అన్ని సినీ పరిశ్రమల నుంచి తమ తమ వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్, షాహిద్‌ కపూర్‌ ఒకే వేదిక మీద కనిపించి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.

ఈ సందర్భంగా షాహిద్‌ మాట్లాడుతూ.. విజయ్‌ వల్లే నాకు మంచి సినిమా చేసే అవకాశం దక్కింది. అర్జున్‌ రెడ్డి సినిమా విజయ్‌ చేయకపోతే నా కబీర్‌ సినిమా లేదు అంటూ వేదిక మీదనే విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు. ఈ ముద్దుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories