మరో స్టార్‌ హీరో సినిమాలో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన బాలీవుడ్‌ భామ!

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ, అతిలోక సుందరి కుమార్తె…తెలుగులో ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాక ముందే వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దేవర సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తుండగానే…చరణ్ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా పై భారీగా అంచనాలను క్రియేట్‌ చేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..అంతేకాకుండా రాంచరణ్ హీరోగా చేస్తున్న ఆర్ సి 16 మూవీలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం కొట్టేసిన జాన్వీ కపూర్ ముచ్చటగా మూడో సినిమాలో కూడా అవకాశం పట్టేసిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అది కూడా ఎవరో తెలుసా.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వర్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం అని హను రాఘవపూడి కూడా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వివరించిన సంగతి తెలిసిందే .

అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ ని తీసుకున్నట్టు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఇదే కనుక నిజమైతే జాన్వీ తెలుగులో అతి తక్కువ కాలంలో ముగ్గురు స్టార్ హీరోలతో చేసి స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా అని సినీ అభిమానులు చెబుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories