మహేష్‌ సరసన బాలీవుడ్‌ భామ.. ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తున్నారంటే..ఎప్పుడెప్పుడూ విడుదల అవుతుందా అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అలాంటిది ఈసారి ఆయన దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఆ సినిమా కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.

సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా వస్తుందా అంటూ సోషల్‌ మీడియాలో సెర్చింగ్‌ కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటిక ఈ సినిమా ఏషియాలోనే భారీ బడ్జెట్ సినిమా అనే టాక్‌ ఉంది. దీంతో సినిమా మీద అంచనాలు ఇంకా బాగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.  ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ పక్కన బాలీవుడ్‌ భామ అలియా భట్‌ హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసిందనే టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇది పూర్తి అడ్వెంచర్‌ సినిమా అని.. అమెజాన్ అడవులు బ్యాక్‌డ్రాప్‌ లో జరగబోతుందని సమాచారం. మరి అలాంటి సినిమాలో అలియా ఎలాంటి క్యారెక్టర్‌ చేస్తుందో చూడాలి. అలియా తెలుగు చిత్ర సీమకు కొత్తేమీ కాదు…రాజమౌళి దర్శకత్వంలో వచ్చి సినీ ప్రపంచాన్ని మొత్తం తెలుగు చిత్ర సీమ వైపు చూసేలా చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో సీత పాత్రలో నటించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories