రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక కోసం దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుపెట్టినట్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న టాక్. ఇక ఈ వివాహ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు హాజరు అయిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా, బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ చాలామంది ఈ వేడుకల్లో కనిపించి అలరించారు. కొందరు సినీ ప్రముఖులు అయితే వివాహ వేడుక వద్ద వద్ద చిందులు కూడా వేసి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అనంత్ – రాధిక పెళ్లికి హాజరుకాకపోవడంపై తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో ‘అనంత్ అంబానీ వివాహానికి హాజరవుతున్నారా ?’ అని ఓ విలేకరి అడగగా.. తాప్సీ మాట్లాడుతూ.. ‘ఆ పెళ్లికి నేను వెళ్లడం లేదు. నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తా. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను’’ అంటూ తాప్సీ తెలిపింది. మొత్తానికి ప్రస్తుతం తాప్సీ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.