రిషబ్‌ పంత్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్‌ భామ!

బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌతెలా గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌ గా నటించింది కొన్ని సినిమాలే అయినా కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.  అయితే ఈ బ్యూటీ ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆ మధ్యన టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ తో జరిగిన వివాదంలో ఊర్వశిని నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు.

ఆ తర్వాత కూడా తన హాట్ ఫొటోషూట్స్‌, కాంట్రవర్సీ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఊర్వశి రిషబ్‌ పంత్‌ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ఊర్వశి రౌతేలాను రిషబ్ పంత్‌ని పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్న అడిగారు. దీనికి ఈ ముద్దుగుమ్మ ‘నో కామెంట్స్’ అంటూ రెండు మాటల్లో సమాధానం ఇచ్చింది.

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఆమె రిషబ్ పంత్ అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏమైనా చేస్తుందని అనుకున్నారు. కానీ అదేమీ లేకుండా ఊర్వశి  నో కామెంట్స్ అంటూ పేర్కొవడం చర్చనీయాంశం అవుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories