Home Blog Page 998

Chiranjeevi Supports NDA Candidates In AP

In a significant political development, Megastar Chiranjeevi Konidela, giving up his political silence for over 10 years, has appealed to the people of Andhra Pradesh to vote for NDA candidates, ahead of the simultaneous Lok Sabha and Assembly elections in the state.

He openly extended his support to NDA following BJP Lok Sabha candidate C M Ramesh and Panchakarla Ramesh Babu, Jana Sena candidate from Pendurthi assembly, met him at his residence in Hyderabad on Sunday and sought his support.

Though he has been extending his moral support to his brother Pawan Kalyan and his Jana Sena party, he never endorsed brother’s political activity openly. Only recently he conveyed his blessings to his brother, who is contesting from Pithapuram assembly seat and handed over a cheque of Rs 5 lakh towards election expenses.

At the time of AP bifurcation in 2014, he was in the Congress-led Union Cabinet and after bifurcation he is keeping silence politically and concentrating on his film career. SO, AP Congress Committee is claiming that technically he is still a member of the Congress party, as he didn’t resign from the party.

In a video statement, he was seen asking people to support NDA candidates CM Ramesh and Panchakarla Ramesh Babu. “After years of political disinterest, I’m back discussing politics, spurred by the alliance between the Jana Sena, TDP, and the BJP,” he said.

He further said: “For the development of Andhra Pradesh, consider voting for NDA candidates, especially my close associates CM Ramesh and Panchakarla Ramesh Babu.”

Meanwhile, speculations are going on that he is likely to participate in his brother Pawan Kalyan’s campaign in Pithapuram at the fag end. As Kapu community is a politically sensitive and predominant community in the state and Chief Minister YS Jaganmohan Reddy is making all efforts to divide that community, Chiranjeevi is said to be facing pressures from his own community to open up at this crucial time.

నయా లుక్ లో అదరగొట్టిన ఎన్టీఆర్!

యంగ్‌ టైగర్  ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.  తారక్‌ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆయన బాలీవుడ్‌ సినిమాపై ఫోకస్‌ పెట్టారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్స్‌  వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో తారక్‌ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయితే చాలా రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు..

అక్కడి సినిమా వాళ్లు ఎన్టీఆర్‌కి పార్టీ ఇచ్చారు. ప్రముఖ నటుడు అక్బర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.  తాజాగా ఎన్టీఆర్ మరోసారి ముంబై కు వెళ్లాడు.  ఎన్టీఆర్ విమానాశ్రయంలో ఉన్న ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వైట్‌ షర్ట్, జీన్స్ లో మెరిశారు. మాస్ లుక్ లో ఎన్టీఆర్ సూపర్ గా ఉన్నాడు. 

దేవరలో ఐటమ్ సాంగ్‌ చేయబోతున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా.. జాన్వీకపూర్ హీరోయిన్‌గా చేస్తుంది.  ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న‌ట్లు చిత్ర బృందం ముందే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తొలిభాగం దసరా కానుకగా 2024 అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే విషయం ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది . ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ విష‌యం గురించి పూజను చిత్ర‌యూనిట్ సంప్ర‌దించ‌గా.. పూజ ఓకే చెప్పినట్లు టాక్‌ వినిపిస్తుంది.

కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. పూజ హెగ్డే ఇంత‌కుముందు రామ్ చ‌రణ్‌తో రంగ‌స్థ‌లం సినిమాలో జిగేలు రాణి అంటూ ఆడిపాడిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు  తారక్‌ కోసం మరోసారి పూజా ఐటమ్‌ సాంగ్‌ చేయనుంది.

నాకు రష్మిక లాంటి పాత్ర చేయాలనుందంటున్న మిస్‌ వరల్డ్‌!

మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ‘యానిమల్’పై ప్రశంసలు కురిపించిది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో రణ్ బీర్, రష్మిక, త్రిప్తి డిమ్రిలు ప్రధాన పాత్రల్లో నటించగా విమర్శలతోపాటు ప్రశంసలు కూడా అందుకుంది ఈ మూవీ. అయితే రీసెంట్ గా వరుస సినిమాలు చేస్తున్న మానుషి.. ప్రస్తుతం ‘బడే మియాన్ ఛోటే మియాన్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న నటి.. ఈ మధ్య కాలంలో తనకు ‘యానిమల్’ మూవీ  బాగా నచ్చిందని పేర్కొంది. ‘నాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలని ఆశగా ఉంది. ‘యానిమల్’ సినిమాలో రష్మిక, త్రిప్తిల పాత్రలు చాలా బాగున్నాయి. ఆసక్తికరంగా అనిపించాయి. నాకు రష్మిక పాత్రలో నటించాలని ఉంది.

భర్త ఎలా ఉన్న ఒక బాధ్యత గల భార్యగా ఆమె అతని కోసం నిలబడటం ఆదర్శంగా అనిపించింది. ధైర్యంగా ఉండగలిగింది. రష్మిక యాక్టింగ్ సూపర్. ఈ సందర్భంగా మానుషి నాకు ఇలాంటి సవాలు చేసే పాత్రల్లో నటించాలనుంది’ అంటూ తన మనసులో మాట అభిమానులతో పంచుకుంది.

కల్కి నుంచి బచ్చన్‌ గ్లింప్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ ల భారీ బడ్జెట్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్‌ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ గ్లింప్స్‌ ను చిత్రం విడుదల చేసింది.  

ఈ మేరకు ఓ బాలుడు నీవు ఎవరూ దేవుడివా? నీకు మరణం లేదా? అంటూ అడగగా.. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామను అంటూ బిగ్‌ బి తానను తాను పరిచయం చేసుకుంటున్న గ్లింప్స్‌ చిత్రం మీద భారీ అంచనాలు పెంచాయి. ఇందులో మరో విశేషం ఏంటంటే…ఇందులో అమితాబ్‌ యంగ్‌ లుక్‌ లో అదరగొట్టారు.

కాగా ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌ గా నటిస్తుండగా.. కమల్‌ హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మే 9న విడుదల కావాల్సిన సినిమా.. లోక్ సభ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

Students Suspended For `Jai Pawan’ Slogans Infront Of CM Jana

YCP leaders and Chief Minister YS Jaganmohan Reddy seems to be losing patience after witnessing negative trends among people, particularly in youth. They became scare when students applauded Jana Sena chief Pawan Kalyan in the presence of the chief minister. Soon after those students were suspended from the college.

All this happened during Jagan Mohan Reddy’s `Memantha Siddam’ Bus Yatra, two days ago in Jaggampeta constituency. When the chief minister was moving forward on his bus in the constituency, an unexpected incident took place.

When Jagan’s bus reached Aditya College, a section of student slogans went viral on social media. In the presence of the Chief Minister, they raised slogans hailing Pawan Kalyan. They said `Babulake Babu Kalyan Babu’.

However, it seems that the management of Aditya College has taken action against the students who raised those slogans. When CM Jagan Bus Yatra arrived at Aditya College, the college management stopped the bus mobilising their engineering students on the road. They told the students to greet Jagan when he came and made them stand on the road.

However, while Jagan was getting off the bus at the college, some students raised slogans saying ‘Jai Pawan’. After this, CM Jagan spoke to a woman and left in the bus. But the management of Aditya College became serious about the students hailing Pawan in front of CM Jagan.

It is reported that action has been taken against five engineering students who raised slogans in favor of Pawan and they have been suspended from the college.

The college management has stated in the letter that the students are being suspended for misbehaving in front of CM Jagan Convoy. The opposition and the parents of the students are expressing their anger that the students have been suspended unfairly.

వైసీపీకి- ఇతరులకు.. దౌర్జన్యాల్లో తేడా ఇదే!

రాజకీయాల్లో ప్రతి అడుగూ తాము అనుకున్నట్టుగా పడుతుందని అనుకోవడం భ్రమ. మనం సొంత డబ్బా కొట్టుకుంటూ వెళ్లిపోతుంటే మధ్యలో ప్రశ్నించేవారు కూడా ఉంటారు. మన అభిప్రాయాలతో విభేదించేవారు కూడా ఉంటారు. అలాంటి వారిని కూడా సహించగలిగే ఓర్పు సంయమనం సహనం అనేవి రాజకీయ నాయకుడికి ఉండాలి. అవి లేకపోతే వారే భ్రష్టు పట్టిపోతారు. సహనం లేకుండా దౌర్జన్యాలకు దిగితే నష్టం జరిగేది వారికే. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఉండే తేడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవల వైఎస్ షర్మిల కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక సంఘటన జరిగింది. మధ్యలో జగన్ వీరాభిమాని ఒకడు వచ్చి.. ఆమెను అడిగి మైకు తీసుకున్నాడు. తీసుకున్నదే తడవుగా.. షర్మిల మీద విమర్శలు కురిపించడం ప్రారంభించాడు. ఒకరేంజిలో విమర్శించాడు. జగనన్నను కీర్తించాడు. షర్మిల ఏపీకి రావడమే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. అంతా అయ్యాక మైకు తీసుకుని అతణ్ని పంపేసింది షర్మిల. అంతకుమించి అక్కడేం ఘోరాలు జరగలేదు.

కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రీతిగా సహనంగా స్పందిస్తారా? ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరైనా తమకు వ్యతిరేకంగా మాట్లాడితే.. అంతే సంయమనం చూపించగలరా? ఆ విషయం ఇప్పుడు పాణ్యం వైకాపా అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు ఆయన అనుచరులు నిరూపించారు.

కాటసాని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. కొన్ని అబద్ధాలు వల్లించారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్  సిక్స్ హామీలు రద్దు అయ్యాయని, ఆ హామీలను నమ్మవద్దని ఆయన అన్నారు. దీంతో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు సలాం స్పందించి తప్పుడు ప్రచారాలు చేయవద్దని, సూపర్ సిక్స్ రద్దయ్యాయని ఎవరు చెప్పారు.. అంటూ నిలదీశారు. దీంతో ఒక్కసారిగా కాటసాని అనుచరులు సలాంపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే వారిని వారించడానికి కూడా ప్రయత్నించలేదు.

దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు.. ఆయన ప్రచార వాహనాన్ని అడ్డగించారు. గ్రామ సర్పంచి సహేరా బీ కూడా ఎమ్మెల్యేను నిలదీశారు. అబద్ధాలు ప్రచారంచేస్తున్నారా, దాడులుచేస్తూ ఉంటే మేం గ్రామంలో ఉండాలా వద్దా? అంటూ నిలదీశారు.

ఇదిరెండు పార్టీల మధ్య ఉండే వ్యత్యాసం. అధికార పార్టీ వారు ఎంతగా భయంలో కొట్టుమిట్టాడుతున్నారంటే.. వారిని నిలదీయడాన్ని, వారి అబద్ధాలను ప్రశ్నించడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇది వారిలో ఓటమి గురించిన భయానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

చివరి విడతలో మెగాస్టార్ ఎన్నికల ప్రచారం

ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు అనుకూలంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒకవైపు ఆయన ఇంకా తమ కాంగ్రెసు పార్టీ సభ్యుడిగానే ఉన్నారని.. ఏపీలో కాంగ్రెసు నాయకులు చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. ఎన్డీయే కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు. వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే మెగాస్టార్ జోక్యం ఇంతటితో ఆగడం లేదు. ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చేసరికి ఆయన స్వయంగా రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారని కూడా తెలుస్తోంది.

అనకాపల్లి నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోలీచేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పంచకర్ల రమేశ్ బాబు ఇద్దరూ హైదరాబాదులోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడడాన్ని స్వాగతించిన చిరంజీవి ‘ఇది మంచి పరిణామం. చాలా సంతోషం. చాలాకాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడడానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కల్యాణ్’ అంటూ ప్రకటించారు.

ఈ ఇద్దరు అభ్యర్థులకు అనుకూలంగా మెగాస్టార్ ఒక ప్రచార వీడియోను కూడా విడుదల చేశారు. ‘ఏపీ అభివృద్ధి పథంలో వెళ్లాలనేది నాకు పెద్ద కోరిక. మీరంతా అందుకు నడుం బిగించండి. మీరంతా వీరికి ఓటేయండి. మీ ఆశీస్సులు వారికి ఉన్నాయనే నమ్మకాన్ని మాకు కలిగించండి’ అంటూ అభిమానులకు పిలుపు ఇచ్చారు.
సీఎం రమేశ్ తనకు చిరకాల మిత్రుడని, పంచకర్ల రమేశ్ కూడా తన ఆశీస్సులో రాజకీయ అరంగేట్రం చేసిన వారేనని. ఇద్దరూ మంచివారే కాకుండా, సమర్థులని వారిని గెలిపించాలని కోరారు.

అయితే మెగాస్టార్ ఇప్పటికే జనసేన పార్టీకి అయిదు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయత్నానికి తన మద్దతు పుష్కలంగా ఉన్నదని సంకేతాలు పంపారు. ఇప్పుడు ఈ ఇద్దరికి అనుకూలంగా వీడియో సందేశం విడుదల చేశారు. అలాగే.. ఆయన ప్రచారం చివరి విడతలో స్వయంగా ప్రచార సభల్లో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఆయనతో పాటు బాబాయి కోసం రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని, రోడ్ షోలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కూలీలకు కక్కుర్తి పడి అనాథలతో అనుచిత ప్రచారం!

వారేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. కనీసం జగనన్న అందిస్తున్న పథకాల ద్వారా సొమ్ము చేసుకుంటున్న లబ్ధిదారులు కూడా కాదు. అనాథలు. కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న అనాధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారానికి వారందరినీ మూకుమ్మడిగా తరలించింది. అనాథ బాలికలు అందరికీ వైసీపీ కండువాలు కప్పేసి, పార్టీ టోపీలు పెట్టేసి.. ఇంటింటికీ తిప్పించింది. జగనన్నకే ఓటు వేయమంటూ వారితో అభ్యర్థింపజేసింది.

గతిలేని పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ సంపన్నులు, ఔదార్యం ఉన్న వారు..

అనాథశరణాలయాలకు తమకు తోచిన సాయం చేస్తుంటారు. అలాంటి దైన్యస్థితిలో ఉన్న వారిని ప్రచారానికి వాడుకోవాలనే ఆలోచన వైసీపీ నేతలకు ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఎందుకు వాడుకున్నారంటే మాత్రం.. వారు అనాథలు గనుక.. వారి తరఫున ఎవ్వరూ అడగరు గనుక.. వారికి ‘ప్రచారం కూలీ’ ఇవ్వాల్సిన అవసరం లేదు గనుక.. అనే సమాధానాలు వస్తున్నాయి.

మామూలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.. కిరాయి కూలీలను నియమించుకుని ఇంటింటి ప్రచారాలను ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. కొన్ని గంటల ఎన్నికల ప్రచారానికి వస్తే చాలు.. వారికి రెండు మూడొందల రూపాయలు, బిర్యానీ పొట్లాలు, క్వార్టర్ బాటిళ్లు అన్నీ సప్లయి చేస్తున్నారు. ప్రతిరోజూ వారికి కొత్త పార్టీ కండువాలు, కొత్త టోపీలు,కొత్త జెండాలు అదనం. ఆర్భాటపు ప్రచారానికి అలవాటు పడిపోయిన తర్వాత.. వీరిమీద పెడుతున్న ఖర్చే అభ్యర్థులకు తడిసి మోపెడవుతోంది. ఆ ఖర్చును తప్పించుకోవాలని అనుకున్నారేమో.. నూజివీడు వైకీపా అభ్యర్థి అనాథ శరణాలయం పిల్లలను ప్రచారానికి తరలించారు. ఆ అనాథశరణాలయం.. తమ పార్టీకే చెందిన సర్పంచి భర్త నాగేశ్ బాబు నిర్వహిస్తుండడం వారికి కలిసి వచ్చింది.

నిజానికి ఇలాంటి అనాథశరణాలయాల్లో అక్రమాలు జరగకుండా ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వారి అనుమతి లేకుండా.. ఇలాంటి కిరాయి పనులకు అనాథ బాలికలను వాడుకోవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ప్రజలు ఇలాంటి దిక్కుమాలిన పనులను ఈసడించుకుంటున్నారు.

ఈ రకమైన ప్రచారంపై జనసేన నాయకులు ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. మరి వారు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. 

గులకరాయి కేసు : ఇరికించే కుట్ర వికటించింది!

‘‘ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరిన కేసులో అతడిని ఇరికించడానికి మార్గాలు సులభంగా కనిపిస్తున్నాయని భావించారు. ఒకడిని ఇరికించేస్తే.. అతడి ద్వారా.. తెలుగుదేశం పెద్దల పేర్లు కూడా తాము కోరుకున్నట్టుగా చెప్పించవచ్చునని భావించారు. అక్కడితో కేసు క్లోజ్ అవుతుందనేది తమ ఆలోచన అయితే.. తెలుగుదేశాన్ని దోషిగా నిలబెట్టేస్తే జగన్ కళ్లలో ఆనందం చూడవవచ్చునని కూడా అనుకున్నారు. తీరా వారి కుట్ర ప్రయత్నాలు మొత్తం బెడిసి కొట్టాయి.. ఏ నేరమూ చేయని వాడిని అయిదురోజుల పాటు నిర్బంధించినా.. ఏమీ నిరూపించలేక చివరికి విడిచిపెట్టాల్సి వచ్చింది..’’ ఇదీ.. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల దుర్గారావు నిర్బంధం, అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు సాగించిన ఆందోళన అనే  ఎపిసోడ్ మొత్తం గమనించిన వారికి కలుగుతున్న అభిప్రాయం.

జగన్ మీద రాయివిసిరినది వేముల సత్తి అంటూ అరెస్టు చూపించిన పోలీసులు, సత్తితో ఆ పని చేయించినది వేముల దుర్గారావు అనే తెలుగుదేశం కార్యకర్తగా అనుమానించారు. అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కుటుంబానికి ఆచూకీ కూడా చెప్పలేదు. కుటుంబసభ్యులు పలువిడతలుగా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా కూడా.. సూత్రధారులుగా తమ పేర్లు చెప్పాలని నిందితులను టార్చర్ పెడుతున్నారంటూ బహిరంగ ఆరోపణలు చేశారు. పోలీసుల వైపు నుంచి చలనం రాలేదు. కాగా, దుర్గారావు ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అతడిని విడిచిపెట్టారు.

రోడ్డు మీద కొట్టులో టీ తాగుతుండగా పట్టుకెళ్లిన తనను, మీ వెనుక ఎవరు ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నించారని దుర్గారావు చెబుతున్నాడు. నేను ఏ తప్పూ చేయనప్పుడు వెనుక ఎవరుంటారంటూ చెప్పానన్నారు. వేముల సతీష్ జగన్ మీద రాయి విసిరితే వెయ్యి రూపాయలు ఇస్తానన్నావట కదా.. అని అడిగితే.. అసలు సతీష్ తో పరిచయమే లేదన్నాను.. అంటూ దుర్గారావు మీడియాకు వివరించారు. అతని మాటలను బట్టి సతీష్, దుర్గారావు లను సీసీఎస్ పోలీసు స్టేషన్లో విడివిడిగా పక్కపక్క గదుల్లో పెట్టి, మరియు, ఇద్దరినీ కలిపి విచారించినప్పటికీ.. దుర్గారావు కు సంబంధం ఉందని పోలీసులు నిరూపించలేకపోయినట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశం కార్యకర్త అయిన దుర్గారావును తెరవెనుక సూత్రధారిగా, రాయివిసరడానికి డబ్బులు ఇస్తానన్న వ్యక్తిగా ఇరికించగలిగితే.. ఆ తర్వాత అతని వెనుక తెలుగుదేశం పెద్ద తలకాయలు ఉన్నాయని నిరూపించడం కష్టంకాదు అని పోలీసులు అనుకుని ఉండొచ్చు గానీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు.