Home Blog Page 993

EC Transfers AP Intelligence Chief, Vij Police Commissioner

In a major setback to Chief Minister YS Jaganmohan Reddy, just three weeks ahead of elections, the Election Commission on Tuesday transferred Andhra Pradesh intelligence chief P Sitaramanjaneyulu and Vijayawada police Commissioner Kanthi Rana Tata with immediate effect.

AP Chief Electoral Officer Mukesh Kumar Meena has directed the Chief Secretary of the AP Government to immediately relieve them from their duties and keep them away from any election- related duties.

“The Commission has ordered transfer of the following officer with immediate effect – P Sitaramanjaneyulu, DGP, Intelligence,” said the EC in an order. Issuing similar orders for Rana, the Commission directed both the transferred officers to hand over charge to the officer immediately below them in rank.

Further, the Commission ordered that the transferred officers should not be assigned any election duty until the simultaneous Lok Sabha and Assembly polls end in the southern state.

TDP and other opposition parties have been making complaints against these two police officers alleging their collusion with the ruling party and playing a key role in harassing opposition leaders and activists.

According to sources, the Election Commission has taken serious action against the stone pelting on Chief Minister YS Jaganmohan Reddy incident in Vijayawada and expressed concern over politicization of the incident. It has reportedly found fault with the security system to the chief minister and wondered about suspension of power supply en-route chief minister’s tour.

After the attack on  CM Jagan, the EC expressed its displeasure at the manner of dealing with it by the police. It is reported that the ECI felt that the police had failed to take security precautions in this incident. Moreover, it has given scope to politicize the entire incident.

Apart from this, there are allegations that he is acting in favor of the ruling party. It is reported that the failure to take security measures at the public meeting attended by the Prime Minister Modi at Chilakaluripet last month was the main reason behind the axe on the intelligence chief.

Along with BJP, TDP and Jana Sena have complained to the EC regarding this matter. Apart from that, it is believed that the NDA alliance has made a series of complaints to the Central Election Commission that if he continues as the intelligence chief, there will be no chance of a transparent general election.

గులకరాయే గుదిబండ : వేటు పడింది!

జగన్ మీద చిన్న గులకరాయి పడి గాయమైతే.. దానికి హత్యాయత్నం కేసు నమోదు చేసి.. ప్రచారపర్వం రాజకీయాల్లో కామెడీ ఎపిసోడ్ ను సృష్టించిన ఐపీఎస్ అధికారి విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా టాటా మీద వేటు పడింది. ఆయనతో పాటు నిఘావిభాగాధిపతిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా విధులనుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరికీ ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించకుండా చూడాలని ఆదేశించింది.


చూడబోతే.. జగన్ మీద పడిన గులకరాయి.. దర్యాప్తులో జగన్ భక్తిని అమితంగా ప్రదర్శించిన కాంతిరాణా టాటా పాలిట మెడలో గుదిబండగా మారినట్టు కనిపిస్తోంది. కాంతిరాణా, ఆంజనేయులు ఇద్దరి పాత్ర గురించి చాలాకాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. అనేక పర్యాయాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇవన్నీ పెండింగులో ఉండగానే గులకరాయి కేసు తెరమీదకు వచ్చింది. తెలుగుదేశానికి చెందిన వారిని బలవంతంగానైనా సరే కేసులో ఇరికించాలని పోలీసులు ప్రయత్నించినట్లుగా అనేక విమర్శలు వచ్చాయి. తెదేపా నాయకుడు దుర్గారావును అరెస్టు చేయడం, బోండా ఉమా పేరు చెప్పాల్సిందిగా వేధించడం, చివరకు ఆయన పాత్రను నిరూపించలేక వదలిపెట్టడం జరిగింది. ఈ చర్యలన్నీ చాలా వివాదాస్పదం అయ్యాయి. కాంతిరాణా వ్యవహరించిన తీరు, అధికార పార్టీ నాయకుడిలాగానే.. ఆయన మాట్లాడుతూ వచ్చిన తీరు ఇవన్నీ కూడా చర్చనీయాంశం అయ్యాయి. తీరా ఇప్పుడు ఈసీ కాంతిరాణాతో పాటు, ఆంజనేయులు మీద కూడా వేటు వేసింది.

అలాగే పీఎస్ఆర్ ఆంజనేయులు గురించి కూడా ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేశాయి. ఆయన ప్రతిపక్షాలను అణచివేయడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయిస్తున్నారని, ఆ సమాచారాన్ని అధికార పార్టీకి చేరవేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలకు సంబంధించినకదలికలను, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చేరవేస్తున్నారనే ఫిర్యాదులు ఆయన మీద వచ్చాయి. వెరసి ఇప్పుడు వేటు పడింది.

వీరితో పాటు చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న సీఐ గంగిరెడ్డి మీద కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను తక్షణం బదిలీచేసి, హెడ్ క్వార్టర్స్ కు ఎటాచ్ చేయాలని సూచించింది. ఆయన చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వచ్చారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిపై వేటు వేయడంతో పాటు తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల సమయంలో ఓటర్ల గుర్తింపుకార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో అవకతవకలు, దొంగఓట్లు పడడానికి కారకులంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి గిరీశా పనితీరుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని  కూడా ఈసీ ఆదేశించడం విశేషం. 

జై హనుమాన్ లో మరిన్ని సర్ప్రైజింగ్‌ క్యారెక్టర్స్ !

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా,  యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విడుదల అయిన ప్రతి భాషలో హనుమాన్ మూవీ భారీ  కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.  

చిన్న సినిమాగా విడుదల అయిన ”హనుమాన్” మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో హనుమాన్ మూవీ ఏకంగా 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇంతటి ఘన విజయం సాధించిన హనుమాన్ సినిమా విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా వేడుకలను నిర్వహించింది.

ఈ 100 రోజుల సెలబ్రేషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేస్తామని గట్టి నమ్మకంతో  అన్నారు. కానీ ఆ మాట నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ప్రేక్షకులంతా దాన్నినిజం చేసి చూపించారు. నేను దర్శకుడిగా మారిన తరువాత ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే అది కేవలం వారం మాత్రమే థియేటర్ లో ఉంటుంది.

ఇలాంటి పరిస్థితిలో కూడా హనుమాన్ మూవీని వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే అది మా సినిమా అదృష్టంగా భావిస్తున్నాం అని ప్రశాంత్ వర్మ తెలిపారు. అలాగే తాను తెరకెక్కించబోయే జై హనుమాన్ సినిమాలో పాత పాత్రలు కొనసాగుతూనే మరిన్ని సర్ప్రైజింగ్ పాత్రలు వచ్చి చేరతాయని ప్రశాంత్ వర్మ తెలిపారు. జైహనుమాన్ సినిమాని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాలో వుంటాయని ప్రశాంత్ వర్మ వివరించారు.

ఫ్యాన్స్ బీ రెడీ…మాస్‌ బీట్‌ వేయ్యడానికి సిద్దమవ్వండి!

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా నటిస్తున్న లేటెస్ట్‌ పాన్‌ ఇండియా దేవర్‌ ..ప్రస్తుతం పార్ట్‌ 1 రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్‌ భామరు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవర సినిమాతోనే ఈ భామ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే .ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు.

ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నారు .ఈ సినిమాలో శ్రీకాంత్ ,ప్రకాష్ రాజ్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నా..నిజానికి ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 5 న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల అక్టోబర్ 10 కి వాయిదా పడింది.

ఇదిలా ఉంటే మే 20 న ఎన్టీఆర్ బర్త్డే కానుకగా దేవర నుంచి ఫ్యాన్స్ బిగ్గెస్ట్ అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. . గత ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేవర టీం గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఎంతో సర్ప్రైజ్ చేసింది .ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్టీఆర్ బర్త్డే రానుంది . దేవర టీం ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్ ఏమి ఇస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు .తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్ గా దేవర టీం ఓ మాస్ బీట్ ను ఫ్యాన్స్ కు అందించనున్నట్లు సమాచారం 

అబ్బా ఏం స్టైల్‌ గా ఉన్నాడు..అదరగొడుతున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో వచ్చిన సలార్‌ మూవీ తో భారీ హిట్‌ ను తన ఖాతాలో వేసుకున్నారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని రూపొందింస్తున్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న  ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ ,అమితాబ్ వంటి లెజెండరీ నటులంతా నటిస్తున్నారు .అలాగే ప్రభాస్ మరోవైపు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా కూడా ఒకేసారి చేస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్నారు.ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

అలాగే ప్రభాస్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ”స్పిరిట్” అనే మూవీ చేస్తున్నాడు .ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు .త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ..ఇప్పటికే కల్కి ,రాజా సాబ్ సినిమాల నుంచి విడుదల అయిన ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ కు తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రభాస్ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా సరికొత్త అవతార్‌లో కనిపిస్తూ వావ్ అనిపిస్తున్నాడు. పొడవు జుట్టుతో ఉన్న ప్రభాస్‌ లుక్ ఒకటి నెట్టింట తెగ షికారు చేస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లుక్ ఏ సినిమా కోసం అనేది మాత్రం క్లారిటీ లేదు. 

పుష్ప 2 నుంచి సడెన్‌ అప్టేడ్‌.. రేపే ఫస్ట్‌ సింగిల్‌ ప్రొమో!

జాతీయ నటుడు అల్లు అర్జున్‌  హీరోగా , స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా పుష్ప. ఈ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. బన్నీని జాతీయ కథానాయకుడిగా నిలబెట్టింది. దీంతో బన్నీ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా పెరిగింది. ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రూపుదిద్దుకుంటుంది.

ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 1 కంటే భారీగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప మూవీ తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేసింది. పుష్పలో అల్లు అర్జున్ యాక్టింగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పుష్ప 2 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా అల్లుఅర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసారు.

మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. టీజర్ లో బన్నీ అమ్మవారి వేషంతో ఇరగదీశాడు .ఈ సినిమాను ఆగష్టు 15 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  టీజర్ లోనే  ప్రకటించారు. ఇదిలా ఉంటే పుష్ప 2 నుంచి మరో స్టన్నింగ్ అప్డేట్ తో మేకర్స్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 లో ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను బుధవారం  సాయంత్రం 04.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  పుష్ప 2 శ్రీవల్లి పాత్రలో మరోసారి రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.

ఏంటి ఇది నిజమా..? ప్రభాస్ డైరెక్టర్ తో రౌడీ హీరో సినిమానా!

టాలీవుడ్ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ రీసెంట్‌ సినిమా ఫ్యామిలీ స్టార్‌..సినిమా పెద్దగా హిట్‌ టాక్‌ అందుకోకపోయినప్పటికీ కూడా మంచి కలెక్షన్స్‌ ను అయితే అందుకుంది. గతేడాది విజయ్‌ సమంత కాంబోలో వచ్చిన ఖుషి సినిమా కూడా మంచి టాక్‌ నే అందుకుంది. ఈ క్రమంలో విజయ్‌ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ తో తన నెక్ట్స్‌ సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో ఓ వార్త నెట్టింట షికారు చేస్తున్న విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్‌ న్యూస్‌ అయ్యింది. హైదరాబాదులో ఉన్న విజయ్ దేవరకొండ ఇంట్లో దర్శకుడు  ప్రశాంత్ కనిపించడంతో కొత్త ఊహగానాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండకు మధ్య ఓ మూవీ స్టోరీకి సంబందించిన డిస్కర్షన్ జరిగినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయం పై అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ ఈ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు..

ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సలార్2, ఎన్టీఆర్  సినిమాలు అయ్యాకే విజయ్ తో సినిమా చేస్తాడేమో అనే టాక్ వినిపిస్తుంది.. ప్రశాంత్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కాంబో మాత్రం అదిరింది. 

బాలయ్య బాబు మూవీలోకి బాలీవుడ్‌ నటుడు!

నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. అంతేకాకుండా తాజాగా విడుదలైన సినిమా పోస్టర్స్‌ అభిమానుల్లో పిచ్చ హైప్‌ ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్ తోనే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు మలయాళ స్టార్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోకి బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ ఇచ్చేశాడు.. గతేడాది యానిమల్ సినిమాతో బాగా పాపులర్ అయిన బాబీ డియోల్’.. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారని… తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ లోకి ఆయన అడుగు పెట్టినట్లు తెలుస్తుంది.. చిత్ర బృందం షూటింగ్ సెట్ లో ఆయనతో  దిగిన ఫోటోను  షేర్ చేశారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

అజిత్‌ సరసన టాలీవుడ్‌ హీరోయిన్‌!

తమిళ స్టార్ నటుడు  అజిత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో ఒకరు అజిత్. ఆయన ఇటీవల యాక్ట్‌ చేసి మంచి విజయాన్ని అందుకున్న  చిత్రం తుణివు.  ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయం పై యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ..ఈ సినిమాలోకి మాత్రం టాలీవుడ్‌ హీరోయిన్‌ ని ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

త్రిషకు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ అమ్మడు ఇప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది. అజిత్ సినిమాకు ఓకే చెప్తుందో లేదో చూడాలి . ఇదిలా ఉంటే ఈ సినిమాలో  మరోవైపు యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మే నెల 1వ తేదీన నటుడు అజిత్‌ పుట్టిన రోజు సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్‌డేట్‌ వస్తుందనే ఆశాభావంతో అజిత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే అజిత్ సినిమాలు రీరిలీజ్ కావడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఈ సినిమాలో అజిత్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయం పై ఫ్యాన్స్ లో పెద్ద చర్చే జరుగుతుంది. త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరి చిత్ర బృందం ఎవరిని ఫిక్స్ చేశారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది.

Faria Abdullah Reveals The Meaning Of Her Tattoo

Faria Abdullah is currently busy with the promotions for her upcoming film, ‘Aa Okkati Adakku’. The film is touted as a romantic comedy, helmed by debutant director Malli Ankham and starring Allari Naresh and Faria Abdullah as the main leads. The film is scheduled to hit theaters on May 3. As the film is about to be released, the movie team is busy promoting their film.

At a recent promotional event, Anchor asked Faria Abdullah about the significance of her tattoo. Faria replied, “The tattoo is about the roots. Personally, I believe that the stronger your roots are, the higher you can grow.” She added, “Grounding is very important, especially when you are dealing with public life. It’s like a reminder for me to be myself and true to my core.” Fans and Netizens are impressed with the significance of her tattoo. 

Speaking of ‘Aa Okkati Adakku’, the film is helmed by Malli Ankham and backed by Rajiv Chilaka under the banner of Chilaka Productions. Apart from Faria and Allari Naresh, the film also features Vennela Kishore, Harsha Chemudu, and Ariyana Glory in the key roles. The technical crew includes Suryaa as the cinematographer and Chota K. Prasad as the editor. Gopi Sundar composed the tunes for this romantic comedy. Recently, Natural Star Nani unveiled the trailer for this flick.

On the work front, Faria Abdullah’s upcoming endeavors include ‘Bhagavanthudu’, alongside Thiruveer, and the film is directed by Gopi Vihari. The actress will also be seen in the Tamil film ‘Valli Mayil’, helmed by Suseenthiran. The actress pairs with Vijay Antony in this flick.