Home Blog Page 979

కల్యాణి వచ్చా..వచ్చా.. పంచ కల్యాణి తెచ్చా..తెచ్చా!

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సీతారాం ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా పరుశురామ్‌ డైరెక్షన్‌ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్‌. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పోస్టర్స్‌, టీజర్‌, సాంగ్స్‌ విడుదలై సూపర్‌ హిట్ అయ్యాయి.

ఈ సినిమా ఏప్రిల్‌ 5న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. రిలీజ్ తేదీ దగ్గరకు వస్తుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషనస్‌ మొదలు పెట్టేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. కల్యాణి వచ్చా..వచ్చా.. పంచ కల్యాని తెచ్చా తెచ్చా అంటూ  వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా వస్తుందని తెలుస్తోంది.

పెళ్లి సందడిని ఈ పాటు రెట్టింపు చేసేలా ఉంది. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్ అందించగా..మంగ్లీ..కార్తీక్‌ మంచి ఊపు వచ్చేలా పాడారు. గోపి సుందర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. ఈ పాటలో విజయ్‌, మృణాల్‌ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ పాటలో విజయ్‌ కానీ, మృణాల్‌ కానీ ధరించిన దుస్తులు గురించి అయితే చెప్పుకోనవసరం లేదు. వేరే లెవల్‌ అంతే.

పాట మొత్తం రాయల్‌ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ లా అనిపిస్తుంది. ఈ సాంగ్‌ విజువల్స్‌ చూసిన ప్రేక్షకులు అయితే మిడిల్‌ క్లాస్ అన్నావ్‌ కదా అన్నా..అంబానీ రేంజ్‌ లో పెళ్లి చేసుకుంటున్నావ్‌ ఏంటంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకు ముందు రిలీజైన టీజర్‌ లో ఏమో పిల్లను ఎక్కించుకుని డ్రాప్‌ చేయడానికే వంద పెట్రోల్‌ కొట్టిస్తా అని చెప్పాడు.

ఇప్పుడేమో కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడా? అంటూ పంచ్‌ డైలాగ్‌ లు వేస్తున్నారు. 

జగన్ సర్కారును భ్రష్టు పట్టించేలా మంత్రి మాటలు!

ప్రజలకోసం సంక్షేమపథకాలు అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాలు వారి నమ్మకాన్ని ఆశించాలి. అంతే తప్ప వాళ్లందరూ తమకు రుణగ్రస్థుల్లాగా పడి ఉండాలని, తాము సర్కారు సొమ్మను సంక్షేమం పేరుతో పంచిపెట్టడం వల్ల ప్రజలందరూ తమకు విధేయులుగా, పాలేర్లలాగా జీహుజూర్ అంటూ బతకాలని కోరుకుంటే మాత్రం అది తప్పు. అది పాలకుల అహంకారానికి నిదర్శనం అనిపించుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లోని ఒక సీనియర్ మంత్రిగారు కూడా అలాంటి అహంకారాన్ని పుష్కలంగా ప్రదర్శిస్తున్నారు. తన సభలకు హాజరుకాని, వచ్చినాసరే మధ్యలో వెళ్లిపోతున్న వారిమీద ఆయన కోపం కట్టలు తెంచుకుంటోంది. వాళ్లను సభాముఖంగా తిట్టిపోస్తున్నారు. అంటే.. తాము సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తున్నాం గనుక.. తమకు జై కొడితేనే వాళ్లు మనుషులు.. లేకపోతే వాళ్లందరూ పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా సదరు మంత్రిగారి అహంకారం ఆయనతో మాటలు అనిపిస్తోంది. ఆయన మరెవ్వరో కాదు.. ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాదరావు.
‘‘ప్రభుత్వం నుంచి లబ్ధిపొంది కూడా ప్రభుత్వానికి విధేయులుగా లేని పనికిమాలిన వాళ్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అంటూ ధర్మాన ఒక సభలో రెచ్చిపోయారు. అయితే.. ఎన్నికలకు ముందు ప్రజలే దేవుళ్లు అని నాటకాలు ఆడే రాజకీయ నాయకులు.. ఎన్నికల తర్వాత.. వాళ్లంతా పనికిమాలిన వాళ్లు అనడమే వారి అసలు బుద్ధికి నిదర్శనంగా కనిపిస్తోంది. నిజానికి ధర్మాన వ్యాఖ్యలు.. జగన్ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించేలా ఉన్నాయని, ఆయనను ఇరుకునపెట్టేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ధర్మాన అతిగా మాట్లాడడం ఇది తొలిసారి కాదు. ఇది తొలిమాట కూడా కాదు. అనేక సార్లు అనేక విధాలుగా  ఆయన తన దూకుడును ప్రదర్శిస్తూనే ఉంటారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో తమ భూములను త్యాగం చేసిన రైతులంతా పోరాటాలు, దీక్షలు చేస్తోంటే.. దానికి పోటీగా విశాఖలో వెంటనే రాజధాని ఏర్పాటు కావాలంటూ దీక్ష నాటకాలు నడిపించిన వ్యక్తి ధర్మాన. న్యాయరాజధాని, శాసన రాజధాని అనే పదాలన్నీ ఉత్తుత్తివేనని, కేవలం ఆ ప్రాంతం వారిని తృప్తి పరచడం కోసం చెబుతున్న మాటలేనని.. ఎగ్జిక్యూటివ్ రాజధాని అని వ్యవహరిస్తున్నప్పటికీ.. విశాఖ ఒక్కటే అసలు రాజధాని అని ధర్మాన అనేక సందర్భాల్లో చెప్పారు. నిజానికి ఆయన మాటలతో గుంటూరు, కర్నూలు ప్రాంతాల ప్రజలకు జగన్ ప్రభుత్వం ఎలాంటి మోసానికి పాల్పడుతున్నదో అర్థమైంది. ప్రస్తుతం ఆయనను ప్రజలను దూషిస్తూ నిందలు వేస్తూ మాట్లాడుతున్నమాటలు కూడా.. ప్రభుత్వం యొక్క అసలు బుద్ధికి నిదర్శనాలని ప్రజలు అనుకుంటున్నారు. 

టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలను కొల్లగొట్టింది

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత నారా చంద్ర బాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్‌కి చెందిన జనసేన పార్టీలు మూడు పార్టీలకు సీట్ల పంపకంపై పరస్పరం నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం అర్థరాత్రి అమరావతిలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పాండా (బీజేపీ ఉపాధ్యక్షుడు)తో గొడవ.

అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలలో మొత్తం 6 ఎంపీ స్థానాలు, 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కైవసం చేసుకుంది. కాగా, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇకపై 2 ఎంపీ సెగ్మెంట్లు, 21 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టనున్న జనసేన పార్టీకి గతంలో కేటాయించిన మరికొన్ని సీట్లను త్యాగం చేసేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు.

గత వారం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మరియు చంద్ర బాబు నాయుడు అమిత్ షా మరియు జెపి నడ్డాతో కలిసి అనేక చర్చలు జరిపిన తర్వాత సీట్ల పంపకం ఖరారు చేయబడింది. ఇప్పటికే టీడీపీ, జేఎస్పీలు తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకం ఖరారైనందున, మిగిలిన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులెవరనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

అరకు, రాజమండ్రి, అనకాపల్లి, తిరుపతి, నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి బీజేపీ, మచిలీపట్నం, కాకినాడ నుంచి జనసేన మరో స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందని ధృవీకరించని నివేదికలు సూచిస్తున్నాయి.

2014లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి నిర్ణయాత్మక విజయంతో ప్రజల ఆదేశాన్ని కైవసం చేసుకున్నాయి. కానీ, మోడీ ప్రభుత్వంతో పతనం తర్వాత, నాయుడు 2018లో ఎన్‌డిఎ కూటమి నుండి వైదొలిగారు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో టిడిపితో తెగతెంపులు చేసుకున్నారు, అయితే 2020లో తిరిగి ఎన్‌డిఎలో చేరారు.

Ravi Teja rewatches his favorite hero’s film on flight

Mass maharaja Ravi Teja is one of the finest actors in Tollywood with a huge fan base. Currently, the actor is enjoying the success of his recent film Eagle which was released in February of this year.

Apart from his stardom as an actor, Ravi Teja is also a big movie buff and loves to watch films in his free time. Recently, the actor who was on a flight posted a story on Instagram revealing that he was watching none other than his favorite actor Amitabh Bachchan’s 1979 blockbuster Kaala Patthar.

The Kick actor shared the picture of Amitabh Bachchan from the film along with a caption saying- “Watching Kaala Patthar after a long time.”

Speaking about Kaala Patthar, this Hindi action drama was directed and produced by Yash Chopra. Apart from Amitabh Bachchan, this cult classic also has a powerful cast including Shashi Kapoor, Rakhee Gulzar, Shatrughan Sinha, Parveen Babi, Neetu Singh and others.

As we all know, Ravi Teja’s love for Amitabh Bachchan needs no words. Interestingly enough, Ravi Teja’s upcoming film under Harish Shankar’s direction is titled Mr. Bachchan.

The film which is said to be a remake of the 2018 Hindi crime drama Raid will be produced by the prestigious Telugu production house People Media Factory starring Ravi Teja and the debutant Bhagyashri Borse in the lead roles.

More details about this project’s cast and crew are yet to be unveiled. So, stay tuned for more updates

మంత్రి గుడివాడకు జగన్ చీటీ చించేసినట్లేనా?

మంత్రి గుడివాడ అమర్నాధ్.. జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాద్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తూ తెలుగుదేశాన్ని, ప్రధానంగా పవన్ కల్యాణ్ ని తీవ్రాతితీవ్రంగా తిట్టిపోస్తూ పనిచేసినందుకు.. ఆయనకు ప్రతిఫలం లభించింది. ఇన్నాళ్లూ అసలు ఎమ్మెల్యే టికెట్ గుడివాడకు దక్కుతుందో లేదో అనే భయం ఆయన అభిమానుల్లో ఉండేది. ప్రస్తుతం గుడివాడ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి ఆయన పేరును ప్రకటించకపోవడం.. వరుసగా అనేక జాబితాలు వచ్చినా ఆయన పేరు ఎందులోనూ లేకపోవడం చూస్తోంటే.. పాపం గుడివాడకు ఇప్పుడు దక్కినదే ఆఖరు పదవి అవుతుందేమో అనే అభిప్రాయం కూడా పలువురికి కలిగింది. ఒక దశలో గుడివాడ అమర్నాధ్ కు కూడా టికెట్ దక్కుతుందనే నమ్మకం పోయింది.
అయితే ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు దయతలిచారు. గుడివాడకు ఒక సీటు విదిలించారు. కానీ.. ఈ కేటాయింపులో కూడా ఇండైరక్టుగా ఆయన చీటీ చించేసినట్టేనని, చూడడానికి సిటింగ్ ఎమ్మెల్యే సీటే.. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సీటే గానీ.. మళ్లీ గెలుపు దక్కించుకోగల సీటు మాత్రం కాదని పలువురు అంటున్నారు. అలాంటిదానిని ఏరి మరీ గుడివాడకు కేటాయించినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. అందులో గుడివాడ అమర్నాధ్ ను గాజువాక నియోజకవర్గానికి కేటాయించారు.
కాగితం మీద చూసినప్పుడు గాజువాక వైసీపీ సీటే కదా అనిపిస్తుంది. గత ఎన్నికల్లో అక్కడ వైసీపీనే గెలిచింది. మామూలు విజయం కాదు. జనసేనాని పవన్ కల్యాణ్ ను వైసీపీకి చెందిన తిప్పల నాగిరెడ్డి ఏకంగా పాతికవేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడించారు. కాబట్టి అది ఢంకాపధంగా వైసీపీ సీటే అనిపిస్తుంది.
అయితే వైసీపీలో ఆ నియోజకవర్గంలో ఓడిపోతాం అనే భయం ఇప్పుడు ఉంది. అయితే ఆ ఓటమి భయానికి గల కారణాల్ని సిటింగ్ ఎమ్మెల్యే మీద నెట్టేశారు జగన్! పవన్ ను అంత మెజారిటీతో ఓడించిన తిప్పల నాగిరెడ్డిని పక్కన పెట్టేశారు. చాలా మీమాంస తర్వాత అనకాపల్లికి పనికి రాకుండాపోయాడని అనిపించిన, గత ఎన్నికల్లో గెలిపించిన ప్రజల ఆదరణని దూరం చేసుకున్నాడని అనిపించిన గుడివాడ అమర్నాధ్ ను అక్కడకు తీసుకువెళుతున్నారు. అక్కడ తిప్పల నాగిరెడ్డి వర్గం ఈ నిర్ణయంపై ఆగ్రహంగా ఉంది. పార్టీకి సహకరించే ఉద్దేశంతో లేరు.
పైగా ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం లలో ఓడిపోయాక జనసేన ఆ నియోజకవర్గాలపై చాపకింద నీరులా పైకి కనిపించకుండా గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఆ చోట్లనుంచి పవన్ బరిలో దిగకపోవచ్చు గానీ.. ఆ రెండు స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. పైగా ఇప్పుడు పవన్ కల్యాణ్ దళానికి లడ్డూలాగా.. ఇన్నాళ్లూ ఆయనను తెగవిమర్శిస్తూ వచ్చిన గుడివాడ అమర్నాధ్ దొరికారు. ఇక ఆయనను గెలవనివ్వరు అని విశ్లేషకులు భావిస్తున్నారు. గుడివాడ అమర్నాధ్ ను తొలుత యలమంచిలికి మారుస్తారని అనుకున్నప్పటికీ.. గాజువాకకు పంపడం ద్వారా జగన్ ఆయన చీటీ చించేసినట్టే అని జోకులు వినిపిస్తున్నాయి. 

ReplyForwardAdd reaction

శివం భజే ”అంటూ వచ్చేస్తున్న రాజుగారి గది హీరో!

Inbox

యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు, ఆట డ్యాన్స్‌ షో ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌ బాబు…అన్న దర్శకత్వంలో వరుస సినిమాలు చేసి హిట్లు అందుకున్నాడు. థ్రిల్లర్‌ సినిమాలతో ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకున్నాడు. రాజు గారి గది, దాని కొనసాగింపులు ప్రేక్షకుల్లో అశ్విన్‌ బాబు పై మంచి అభిప్రాయాన్ని ఏర్పరచాయి.

ఆ తరువాత హిడంబ మూవీతో యాక్షన్‌ సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు కానీ..అందులో అశ్విన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా అశ్విన్‌ బాబు మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. మహేశ్వర్‌ రెడ్డి మాలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌ 1 గా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.

గాంధర్వ ఫేమ్‌ అప్సర్‌ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివం భజే అనే పేరును అనౌన్స్ చేశారు. సోమవారం టైటిల్‌ పోస్టర్‌ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో మహాదేవుని రూపాన్ని చాలా గంభీరంగా చూపించారు.

హీరో అశ్విన్‌ బాబు శివుని భారీ రూపం ముందు , ఎత్తైన పర్వతాల మధ్య నుంచి నుంచుని చూస్తున్నట్లు ఉంది. పోస్టర్‌ విడుదలైన క్రమంలో చిత్ర నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. అశ్విన్‌ బాబు హీరోగా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. గంగా ఎంటర్‌టైన్‌ మెంట్‌ లో మొదటి చిత్రంగా శివం భజే చిత్రం రూపుదిద్దుకుంటుంది.

కొత్త కథ, కథనాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్‌, థ్రిల్లర్‌ ఇలా ప్రతి అంశాన్ని ఈ చిత్రంలో జోడించినట్లు మహేశ్వర్‌ రెడ్డి వివరించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా ఉత్కంఠగా సాగుతుందని తెలిపారు. ఇందులో హైపర్‌ ఆది , తమిళ నటుడు సాయి ధీనా , అర్బాజ్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వివరించారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకోవడానికి సిద్దం అయినట్లు నిర్మాత వివరించారు. అయితే ఇందులో కథానాయిక ఎవరూ అనేది ఇంకా చిత్ర బృందం వెల్లడించలేదు. త్వరలోనే ఆ వివరాలను విడుదల చేస్తామని మూవీ మేకర్స్‌ అన్నారు.

Search for all messages with label Inbox

Remove label Inbox from this conversation

కమలం కాదు.. కూటమికి వారు కవచం!

భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన కలిసి పెట్టుకున్న పొత్తులు కేవలం ఎన్నికలలో విజయం సాధించడానికి ఆ పార్టీ ఓట్ల బదిలీ రూపంలో ఉపయోగపడే మార్గం మాత్రమే కాదు. కమలంతో పొత్తుల వలన అంతకు మించిన ప్రయోజనాలు వారికి ఎన్నో ఉన్నాయి. అన్నింటిని మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పి.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా లేదా అనే సందేహాలు వ్యాపిస్తున్న తరుణంలో.. విపక్ష కూటమి స్వేచ్ఛగా ఎన్నికలలో తలపడడానికి.. ప్రజలు తమ సొంత అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించడానికి ఈ పొత్తులు పరోక్షంగా దోహదం చేస్తాయి. పైగా ఎన్నికల సమరాంగణంలో మరో రకమైన ఉపయోగం కూడా వారికి ఉంది.
తెలుగుదేశంతో పొత్తుల్లో ఉన్నది కనుక గెలిస్తే అధికారంలో కూడా భాగస్వామ్యం దక్కుతుంది కనుక భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మీద, ఆయన పరిపాలనలో సాగుతున్న సకల అరాచకాల మీద తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి జగన్ సాహసం చేయగల అవకాశం లేదు. జగన్ స్వయంగాను,  పార్టీలోని ఆయన కీలక సహచరులతో కలిసి అనేక సిబిఐ కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ఖరారుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉన్న మోడీ పార్టీని తిట్టడానికి జగన్ కు ధైర్యం చాలకపోవచ్చు.
ఆయన బిజెపి మీద నిప్పులు చెరగకపోతే.. జగన్మోహన్ రెడ్డి బిజెపికి భయపడుతున్నారనే ప్రచారం బాగా జరుగుతుంది. ఆయన ఎన్ని సభలలో మాట్లాడినా తెలుగుదేశాన్ని, జనసేన ను తిట్టవలసిందే తప్ప బిజెపి మీద నిశిత విమర్శలు చేయలేరు. బిజెపి- విపక్షకూటమికి ఒక కవచం లాగా ఉపయోగపడుతుంది. ఈ కవచాన్ని వాడుకొని వారు యుద్ధంలో ఎంత మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.
ఇప్పటికే ప్రతి సందర్భంలోనూ కేంద్రం ఎదుట సాగిలపడుతూ.. తనకున్న కేసుల భయంతో వారిని పల్లెత్తు మాట అనలేక, విభజన చట్టం హామీల గురించి గట్టిగా డిమాండ్ కూడా చేయలేక జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఆయన బీజేపీని ఏమీ అనలేక పోతే అది ఆయన దౌర్బల్యం మాత్రమే కాదు, లోపాయికారీతనంగా ప్రజలు పరిగణిస్తారు. ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి చేటుచేస్తుంది. 

జగన్.. నీ కల అధికారం.. వారి కల నీ పతనం!

0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం ఖర్చుతో సరికొత్త ప్రచార ఆర్భాటాన్ని ప్రారంభించారు. ‘నీకల- నాకల’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫ్లెక్సిలను వేయిస్తున్నారు. మొన్నమొన్నటిదాకా ‘సిద్ధం’ పేరుతో ఒక ప్రచార ఆర్భాటం నడిచింది. సిద్ధం సభల పేరుతో 600 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్రచారానికి తగలేశారని విపక్షాలతో పాటు, స్వయంగా ఆయన చెల్లెలు కూడా ఆరోపించింది. సిద్ధం సభలు అయిపోయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి బుర్రలోంచి ఇప్పుడు సరికొత్త ప్రచార ప్రహసనం మొదలైంది! ‘నీ కల – నాకల’ అంటూ ఆయన మళ్లీ రాష్ట్రాన్ని ఊదరగొట్టడానికి ప్రిపేర్ అయిపోయారు.
రాష్ట్రమంతా ఇప్పుడు సరికొత్త ఫ్లెక్సి పోస్టర్లు వెలుస్తున్నాయి. ‘అవ్వతాతల కల.. నా కల’, ‘అక్క చెల్లెమ్మల కల.. నా కల’, ‘ప్రతి బిడ్డ కల.. నా కల’.. అంటూ రకరకాలుగా అన్ని వర్గాల వారిని కవర్ చేసేలా వారి కలలన్నీ నా కలలు అని చెప్పుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో ఫ్లెక్సిలు తయారు చేశారు. తద్వారా ప్రజల్లో అన్ని వర్గాల వారి కలలను తన కలలుగా మార్చుకుని వాటిని నెరవేరుస్తానని జగన్ హామీ ఇస్తున్నట్ఠుగా వారు భావించుకున్నారు. అయితే ఈ ‘కలల నినాదాలు’ ప్రజల వెటకారానికి గురవుతున్నాయి.
‘అమరావతి రాజధాని అనేది రాష్ట్ర ప్రజల కల.. అమరావతిని స్మశానంగా మార్చేయడం అనేది నీ కల’, ‘స్థిమితంగా బతకాలనేది ప్రజల కల.. ఒక్కో కుటుంబానికి వంద రూపాయలు అందించి.. వెయ్యి రూపాయలు కాజేయడం ద్వారా కుటుంబాలను ఆందోళనల్లోకి నెట్టడం నీ కల’, ‘నకిలీ మద్యం సీసాలతో ప్రజల ప్రాణాలు తీసి, అక్కచెల్లెమ్మల తాళిబొట్లు తెంచడం నీ కల’ అన్నట్లుగా జగన్ ను ఉద్దేశించి జనం కౌంటర్ విమర్శలు చేస్తున్నారు.
మళ్లీ నెగ్గడం, రాష్ట్రంలో మిగిలి ఉన్న వనరులన్నిటినీ కూడా దోచుకోవడం, అంతో ఇంతో మిగిలిన ఉన్న రాష్ట్రాన్ని యావత్తుగా విధ్వంసం చేయడం మాత్రమే జగన్ కల అని ప్రజలు అంటున్నారు. ఈసారి గెలవాలని, ఈసారి గెలిస్తే ఇంకో ముప్పయ్యేళ్లపాటు ముఖ్యమంత్రిగా తానే ఉండిపోతానని తన కలను గురించి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకున్న వైనం ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. ప్రజలందరి కలలను తన కలలుగా భావిస్తానని అనడం ప్రజలకు కామెడీగా కనిపిస్తోంది. అందుకే జగన్ వైఖరి గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రం.. ‘జగన్.. నీ కల అధికారం.. ప్రజల కల నీ పతనం’ అని సింగిల్ లైన్లో అభివర్ణిస్తున్నారు. మరి జగన్ ఇలాంటి కుయుక్తుల మాయమాటల ప్రచారాలు ఎలాంటి ఫలితమిస్తాయో చూడాలి.

ReplyForwardAdd reaction

Devi Sri Prasad completes 25 years as composer

evi Sri Prasad is one of the most prolific music composers ever in the history of Telugu cinema after its inception 90 years ago. He entered the music scene with a private album ‘Dance Party’ and then went on to debut as a film composer in 1999 with the Telugu film Devi. He derived his first name from this film’s title and became popular with the sobriquet ‘DSP’ among music lovers. He successfully completed 25 years as composer today as Devi released on March 12th 1999. 

After his debut in Tollywood, there is no looking back for Devi because he emerged as one of the leading musicians with numerous chartbuster albums to his credit. He belted out a foot-tapping album with his third outing ‘Anandam’ and announced his arrival in style. After Anandam, Devi scored hits with Kalusukovalani, Sontham and Khadgam. He got the biggest break with Nagarjuna’s Manmadhudu and Varsham was the turning point in his career. 

With back-to-back hit albums like Arya and Shankar Dada MBBS, DSP consolidated his position in Tollywood. By this time, he was in his prime form dishing out chart-topping songs very frequently. He hit a purple patch by delivering consecutive hit albums over the years. 

Like every technician in the film industry, there was a lean phase in Devi Sri Prasad’s career as well due to various factors. However, he stood the test of time and bounced back strongly whenever critics wrote him off with his signature-style renditions. With the massive success of Pushpa album, DSP bagged accolades from pan-India audiences. 

Devi Sri Prasad tested his luck in other languages as well. He composed numerous albums in Tamil and Hindi. 

He won many awards at renowned events like Film Fare, Nandi, SIIMA, Santosham IIFA utsavam, etc. He is also known for making guest appearances in some of his songs besides star heroes. DSP’s onstage performances during audio events fetched him a legion of fans and he was often called a live wire because of his unwavering energy levels. 

Devi is known for composing redefining item numbers and romantic melodies in Tollywood. 

On the occasion of completing 25 years, the teams of his upcoming films paid tribute to the ace composer and wished him the best of luck. 

Up next, he has a bunch of crazy projects in his pipeline. Films like Pushpa 2, Thandel, Kanguva, Ustaad Bhagat Singh and Kubera are gearing up to release in the next few months. 

ReplyReply allForwardAdd reaction

షారుక్‌ ఖాన్‌ కాళ్లు పట్టుకున్న స్టార్‌ డైరెక్టర్‌!

Inbox

Search for all messages with label Inbox

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి ఒకే ఒక్క సినిమాతో స్టార్‌ డైరెక్టర్‌ గా ఎదిగిపోయాడు తమిళ దర్శకుడు అట్లీ. షారుక్‌ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ
జవాన్‌ తో రికార్డులు తిరగరాసేశాడు. షారుక్‌ ఖాన్‌ హీరోగా నయనతార, దీపికా పదుకొణె హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్‌ అందించారు.

ఫుల్‌ యాక్షన్‌ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను వసూలు చేసింది. దీంతో అట్లీ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ సినిమా జీ సినీ అవార్డుల్లో కూడా అవార్డుల మోత మోగించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి జవాన్‌ సినిమాకు ఉత్తమ దర్శకునిగా అట్లీ అవార్డు ని అందుకోవడానికి స్టేజీ మీదకు పిలిచారు.

ఆ  క్రమంలో అట్లీ పేరును అనౌన్స్ చేయగానే పక్కనే కూర్చుని ఉన్న షారుక్‌ ఖాన్‌ కాళ్లకు అట్లీ నమస్కరాం చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆ సీన్‌ కి పైకి లేచి చప్పట్లు కొట్టారు. తరువాత స్టేజీ మీదకు వెళ్లి అవార్డును అందుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అట్లీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే అని పొగుడుతున్నారు.

Remove label Inbox from this conversation