Home Blog Page 976

కూలీలకు కక్కుర్తి పడి అనాథలతో అనుచిత ప్రచారం!

వారేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. కనీసం జగనన్న అందిస్తున్న పథకాల ద్వారా సొమ్ము చేసుకుంటున్న లబ్ధిదారులు కూడా కాదు. అనాథలు. కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న అనాధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారానికి వారందరినీ మూకుమ్మడిగా తరలించింది. అనాథ బాలికలు అందరికీ వైసీపీ కండువాలు కప్పేసి, పార్టీ టోపీలు పెట్టేసి.. ఇంటింటికీ తిప్పించింది. జగనన్నకే ఓటు వేయమంటూ వారితో అభ్యర్థింపజేసింది.

గతిలేని పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ సంపన్నులు, ఔదార్యం ఉన్న వారు..

అనాథశరణాలయాలకు తమకు తోచిన సాయం చేస్తుంటారు. అలాంటి దైన్యస్థితిలో ఉన్న వారిని ప్రచారానికి వాడుకోవాలనే ఆలోచన వైసీపీ నేతలకు ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఎందుకు వాడుకున్నారంటే మాత్రం.. వారు అనాథలు గనుక.. వారి తరఫున ఎవ్వరూ అడగరు గనుక.. వారికి ‘ప్రచారం కూలీ’ ఇవ్వాల్సిన అవసరం లేదు గనుక.. అనే సమాధానాలు వస్తున్నాయి.

మామూలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.. కిరాయి కూలీలను నియమించుకుని ఇంటింటి ప్రచారాలను ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. కొన్ని గంటల ఎన్నికల ప్రచారానికి వస్తే చాలు.. వారికి రెండు మూడొందల రూపాయలు, బిర్యానీ పొట్లాలు, క్వార్టర్ బాటిళ్లు అన్నీ సప్లయి చేస్తున్నారు. ప్రతిరోజూ వారికి కొత్త పార్టీ కండువాలు, కొత్త టోపీలు,కొత్త జెండాలు అదనం. ఆర్భాటపు ప్రచారానికి అలవాటు పడిపోయిన తర్వాత.. వీరిమీద పెడుతున్న ఖర్చే అభ్యర్థులకు తడిసి మోపెడవుతోంది. ఆ ఖర్చును తప్పించుకోవాలని అనుకున్నారేమో.. నూజివీడు వైకీపా అభ్యర్థి అనాథ శరణాలయం పిల్లలను ప్రచారానికి తరలించారు. ఆ అనాథశరణాలయం.. తమ పార్టీకే చెందిన సర్పంచి భర్త నాగేశ్ బాబు నిర్వహిస్తుండడం వారికి కలిసి వచ్చింది.

నిజానికి ఇలాంటి అనాథశరణాలయాల్లో అక్రమాలు జరగకుండా ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వారి అనుమతి లేకుండా.. ఇలాంటి కిరాయి పనులకు అనాథ బాలికలను వాడుకోవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ప్రజలు ఇలాంటి దిక్కుమాలిన పనులను ఈసడించుకుంటున్నారు.

ఈ రకమైన ప్రచారంపై జనసేన నాయకులు ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. మరి వారు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. 

గులకరాయి కేసు : ఇరికించే కుట్ర వికటించింది!

‘‘ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరిన కేసులో అతడిని ఇరికించడానికి మార్గాలు సులభంగా కనిపిస్తున్నాయని భావించారు. ఒకడిని ఇరికించేస్తే.. అతడి ద్వారా.. తెలుగుదేశం పెద్దల పేర్లు కూడా తాము కోరుకున్నట్టుగా చెప్పించవచ్చునని భావించారు. అక్కడితో కేసు క్లోజ్ అవుతుందనేది తమ ఆలోచన అయితే.. తెలుగుదేశాన్ని దోషిగా నిలబెట్టేస్తే జగన్ కళ్లలో ఆనందం చూడవవచ్చునని కూడా అనుకున్నారు. తీరా వారి కుట్ర ప్రయత్నాలు మొత్తం బెడిసి కొట్టాయి.. ఏ నేరమూ చేయని వాడిని అయిదురోజుల పాటు నిర్బంధించినా.. ఏమీ నిరూపించలేక చివరికి విడిచిపెట్టాల్సి వచ్చింది..’’ ఇదీ.. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల దుర్గారావు నిర్బంధం, అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు సాగించిన ఆందోళన అనే  ఎపిసోడ్ మొత్తం గమనించిన వారికి కలుగుతున్న అభిప్రాయం.

జగన్ మీద రాయివిసిరినది వేముల సత్తి అంటూ అరెస్టు చూపించిన పోలీసులు, సత్తితో ఆ పని చేయించినది వేముల దుర్గారావు అనే తెలుగుదేశం కార్యకర్తగా అనుమానించారు. అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కుటుంబానికి ఆచూకీ కూడా చెప్పలేదు. కుటుంబసభ్యులు పలువిడతలుగా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా కూడా.. సూత్రధారులుగా తమ పేర్లు చెప్పాలని నిందితులను టార్చర్ పెడుతున్నారంటూ బహిరంగ ఆరోపణలు చేశారు. పోలీసుల వైపు నుంచి చలనం రాలేదు. కాగా, దుర్గారావు ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అతడిని విడిచిపెట్టారు.

రోడ్డు మీద కొట్టులో టీ తాగుతుండగా పట్టుకెళ్లిన తనను, మీ వెనుక ఎవరు ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నించారని దుర్గారావు చెబుతున్నాడు. నేను ఏ తప్పూ చేయనప్పుడు వెనుక ఎవరుంటారంటూ చెప్పానన్నారు. వేముల సతీష్ జగన్ మీద రాయి విసిరితే వెయ్యి రూపాయలు ఇస్తానన్నావట కదా.. అని అడిగితే.. అసలు సతీష్ తో పరిచయమే లేదన్నాను.. అంటూ దుర్గారావు మీడియాకు వివరించారు. అతని మాటలను బట్టి సతీష్, దుర్గారావు లను సీసీఎస్ పోలీసు స్టేషన్లో విడివిడిగా పక్కపక్క గదుల్లో పెట్టి, మరియు, ఇద్దరినీ కలిపి విచారించినప్పటికీ.. దుర్గారావు కు సంబంధం ఉందని పోలీసులు నిరూపించలేకపోయినట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశం కార్యకర్త అయిన దుర్గారావును తెరవెనుక సూత్రధారిగా, రాయివిసరడానికి డబ్బులు ఇస్తానన్న వ్యక్తిగా ఇరికించగలిగితే.. ఆ తర్వాత అతని వెనుక తెలుగుదేశం పెద్ద తలకాయలు ఉన్నాయని నిరూపించడం కష్టంకాదు అని పోలీసులు అనుకుని ఉండొచ్చు గానీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

తుపాకీ చూపి బెదిరించి, సత్తిని బుక్ చేశారా?

జగన్ మీద రాయివిసిరినట్టుగా వేముల సతీష్ అనే వడ్డెర కాలనీకి చెందిన యువకుడు అంగీకరించినట్టుగా.. ఆయన వెనుక ప్రోద్బలం చేసినది ఎవరు అనేది మాత్రమే ఇంకా తేల్చవలసిన విషయంగా పోలీసులు చెబుతున్నారు. వేముల సతీష్ అలియాస్ సత్తి అరెస్టు, కోర్టుకు కూడా రిమాండు రిపోర్టు సమర్పించిన నేపథ్యంలో జగన్ మీద రాయి విసిరిన కేసు దాదాపుగా తేలిపోయినట్టే పోలీసులు మాట్లాడుతున్నారు. అయితే వేముల సతీష్ నేరాన్ని అంగీకరించిన మాట నిజమేనా అనే విషయంలో అనేక సందేహాలున్నాయి.

వడ్డెర కాలనీలోని మొత్తం అయిదుగురు కుర్రాళ్లను (నలుగురు మైనర్లే) అదుపులోకి తీసుకున్న పోలీసులు సత్తిని దోషిగా ఎలా ఖచ్చితంగా నిర్ధారించారనేది ఇంకా బయటకు రానేలేదు. దానికి సంబంధించిన ఆధారాలు బయటకు రాలేదు. అసలే చీకటి, పైగా జనం రద్దీ అని సాక్షాత్తూ కమిషనర్ చెప్పిన తర్వాత.. నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలియదు. కాకపోతే.. అతడు నేరం ఒప్పుకున్నట్టుగా ప్రచారం మీదనే రకరకాల సందేహాలు కలుగుతున్నాయి.

పోలీసులు సత్తిని తుపాకీ చూపించి బెదిరించి మరీ.. నేరం ఒప్పించారనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. అతని తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘‘జైలులో సతీష్ ను కలిసి మాట్లాడాం. ఏం జరిగిందని అడిగితే.. పోలీసులు తనని చీకట్లోకి తీసుకెళ్లి నేరం ఒప్పుకోమని తుపాకీ చూపించి బెదరించినట్లుగా చెబుతున్నాడు. అందుకే అలా చెప్పానని ఏడుస్తున్నాడు. తనకేం సంబంధం లేదని, తానేం చేయలేదని అంటున్నాడు’ అని అన్నారు. అంటే పోలీసులే బలవంతంగా సత్తితో నేరం ఒప్పించినట్టుగా అనుమానాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. సోమవారం నాడు మేజిస్ట్రేట్ ఎదుట సత్తి వాంగ్మూలం రికార్డు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. నిందితుడు సతీష్ రాయి విసురుతుండగా చూసిన వారు ఎవరూ లేరు. అందువల్ల కస్టడీలోకి తీసుకుని విచారించడం అనే ఆలోచన పక్కకు పెట్టి, ముందుగా మేజిస్ట్రేటు వద్దకు తీసుకెళ్లి వాంగ్మూలం రికార్డు చేయించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఆదిత్య కాలేజీపై కోర్టుకు వెళ్లనున్న స్టూడెంట్స్!

తమ కాలేజి విద్యార్థులు కూడా గంటకు రెండు వందలు తీసుకుని జై కొట్టడానికి వచ్చే కూలీలు లాంటి వారని, ఆ కాలేజీ యాజమాన్యం అనుకున్నదేమో తెలియదు. తాము చెప్పినట్టుగా కాకుండా మరొక రకంగా జై కొట్టినందుకు వారు ఆగ్రహోదగ్రులయ్యారు. కత్తి దూశారు. వారి మీద సస్పెన్షన్ వేటు వేశారు. యాజమాన్యం జగన్ కు జై కొట్టించడానికి వారిని రోడ్డు మీద నిలబెట్టింది. వారిలో కొందరు తమ ఇష్టపూర్వకంగా పవన్ కళ్యాణ్ కు జై కొట్టారు. కాలేజి అధిపతులు దాన్ని జీర్ణం చేసుకోలేక సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థులు తమ సస్పెన్షన్ పై కోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా తమ కళాశాల ముందునుంచి వెళుతున్నారని తెలిసి కాలేజీ యాజమాన్యం కాస్త ఓవరాక్షన్ చేసింది. విద్యాదీవెన నిధులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా థాంక్యూ జగన్ అంటూ పెద్ద ఫ్లెక్సి వేయించి స్టూడెంట్స్ దాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడేలా ఏర్పాటుచేశారు. ఎన్నికల సమయంలో స్టూడెంట్స్ ను అలా రాజకీయ పావుల్లాగా వాడడమే కాలేజీ యాజమాన్యం చేసిన పెద్దతప్పు. అలా నిలబెట్టారు.

ఆ ఫ్లెక్సి చూసి.. ఇక్కడేదో మన అభిమానగణం ఉన్నదని మురిసిపోయి.. బస్సు ఆపించి దిగి, కాలేజీ వైస్ చైర్మన్ తో ముచ్చటించారు. పిల్లలతో కూడా మాట్లాడారు. ఈలోగా పిల్లల్లోంచి పవన్ కల్యాణ్ అనుకూల నినాదాలు ఒక్కసారిగా మిన్నంటాయి. అసహనానికి గురైన జగన్ వెంటనే బస్సు ఎక్కి వెళ్లిపోయారు.

ఆ తర్వాత పార్టీ వాళ్లు.. కాలేజీ యాజమాన్యానికి తలంటు పోశారో ఏమో.. వారు ముందూ వెనుకా చూసుకోకుండా, పవన్ అనుకూల నినాదాలు చేసిన అయిదుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు.
 
అయితే ఈ నిర్ణయం ఇప్పుడు కోర్టు వద్దకు వెళ్లబోతోంది. పిల్లలను వస్తువుల్లా అలా నిలబెట్టడమే కాలేజీ చేసిన తప్పు అంటూ.. కోర్టులో చర్చకు వస్తుంది. స్టూడెంట్స్ తమ భావప్రకటన చేయకుండా ఎందుకు ఉండాలని, దానిని అణచివేసే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదని వారు కేసు వేయబోతున్నారు. కేసే గనుక పడిందంటే.. కాలేజీ యాజమాన్యం జగన్ కళ్లలో సంతోషం చూడడానికి విద్యార్థుల్ని ఎలా అడ్డగోలుగా వాడుకున్నదో అంతా చర్చకు వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

సింగర్ ఇంట్లో నవమి వేడుకలు.. సందడి చేసిన నాని!

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ..పాప్‌ సింగర్‌ స్మిత నివాసంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేచురల్‌ స్టార్‌ నాని, అంజనా దంపతులు పాల్గొని సందడి చేశారు. స్వామి వారి కల్యాణం అనంతరం తలంబ్రాలు పోసి సందడి చేశారు. అనంతరం పూమాలలు మార్పిడి ఆడారు. ఈ వీడియోను శనివారం ఇస్ స్టా ఖాతాలో విడుదల అయ్యింది.

అంతేకాకుండా నాని నటించి జెర్సీ సినిమా కూడా విడుదలై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా నాని భార్య అంజనా ఇన్‌ స్టాలో స్పెషల్‌ పోస్ట్ పెట్టారు. ‘‘సినిమా విడుదలైన రోజుల్లో తొలిసారి థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్‌ నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. మా అబ్బాయి అర్జున్‌ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్‌ సాంగ్‌ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు’’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నారు.  వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

బేబీ జాన్‌ సెట్లో కీర్తి పాప!

సౌత్‌ లో మహనటిగా పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్‌ ఇప్పుడు తాజాగా ఆమె బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు వరుణ్‌ ధావన్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా బేబీ జాన్‌ తో ఆమె బాలీవుడ్‌ కి పరిచయం కానుంది. ఈ సినిమాని కాలీస్ డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం.

తాజాగా  ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ క్రమంలో కీర్తి షూటింగ్‌ లో పాల్గొంది. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో పోస్ట్‌ చేసింది. బేబి జాన్‌ సెట్స్ లో బేబీ కీర్తి అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చింది. బేబి కీర్తి అనే పేరున్న బట్టలు ధరించి ఎంతో యాక్టివ్‌ సందడి చేస్తుంది.

దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్‌ ఎంట్రీ ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్లు కనపడుతోంది. అయితే ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేయాలనుకున్నారు ..కానీ పలు కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి తమిళంలో మూడు, చిత్రాలతో బిజీగా ఉంది.

Congress’ Shehzada Will Run Away From Wayanad Too, After Amethi, Says PM Modi

In a direct swipe at Congress leader Rahul Gandhi,  Prime Minister Narendra Modi on Saturday said that the way “Congress’ Shehzada ran away from Amethi” after 2019 in a similar manner he will have to run away from Wayanad after the Lok Sabha polls this year.

The Congress is yet to declare candidates for Rae Bareili and Amethi for upcoming Lok Sabha elections 2014. Rahul Gandhi lost family stronghold Amethi to Smriti Irani in 2019. Earlier this year, his mother Sonia Gandhi vacated the Rae Bareli seat and moved to the Rajya Sabha.

Addressing a public gathering in Nanded, Prime Minister said, “The crisis is visible for Congress’ Shehzada in Wayanad. Shehzada and his gang are waiting for April 26 when voting in Wayanad will be concluded. After the voting concludes in Wayanad, they will again announce a safe seat for him as their alliance partners are hurling abuse at each other. The way he ran away from Amethi, he will again run away from Wayanad.”

Modi said the information available for the first phase of Lok Sabha polls indicates that there has been a one-sided voting in favour of the National Democratic Alliance (NDA). In an apparent reference to Sonia Gandhi, he said some INDIA bloc leaders left the Lok Sabha and moved to the Rajya Sabha as they have no courage to contest elections.

“For the first time, the family will not vote for a Congress candidate in the constituency where they live as there is no party candidate there,” he said.  Modi said he has spent 10 years fixing the bad governance of the Congress regimes. “A lot of work needs to be done,” he added.

The Congress has been a barrier in the development of farmers and poor people, he alleged. Targeting the INDIA bloc, he said it has no face to project and people do not know whom to entrust the country’s future.

“They may claim anything, but the reality is that Congress leaders have accepted defeat even before the announcement of polls,” he said. He termed the opposition alliance a grouping of selfish people who have come together to protect their corrupt practices.

TDP Seeks ECI Intervention In Police Attempts To Arrest Bonda Uma

Accusing that the police is harassing and attempting to arrest political opponent, Telugu Desam Party urged the intervention of Election Commission of India (ECI) to prevent the police attempts to arrest party’s former MLA and presently contesting from Vijayawada (Central) Assembly Constituency Bonda Umamaheswara Rao.

It alleged that the police are implicating his name in stone pelting on chief minister YS Jaganmohan Reddy’s case with an evil intention of benefiting the ruling party in the elections.

In a letter to the Election Commission of India (ECI), TDP’s former Rajya Sabha member Kanakamedala Ravindra Kumar mentioned the attempts to arrest TDP candidate and former MLA Bonda Umamaheswara Rao, who filed his nomination for the Vijayawada (Central) Assembly seat.

He has expressed his concerns over the lack of transparency in the conduction of elections in Andhra Pradesh. He highlighted the alleged misuse of the police administration and targetting NDA alliance partners and further their electoral prospects.

He also highlighted an incident involving Chief Minister YS Jaganmohan Reddy, where a roadshow was conducted PM in violation of the Model Code of Conduct. He alleged that the police launched a reign of terror, arresting and torturing individuals to implicate political opponents.

Ravindra Kumar called on the ECI to intervene and ensure a level playing field in the elections. He requested independent reports from Special Police Observers/Election Observers or a special ECI team to examine the functioning of the police in Vijayawada. He emphasized the need for fair and transparent elections in Andhra Pradesh to prevent the electoral process from becoming a mockery of democracy.

The letter highlights the ongoing challenges faced by opposition parties in the state and raises important questions about the integrity of the electoral process. The ECI’s response to these concerns will be crucial in ensuring free and fair elections in Andhra Pradesh, he added.

Meanwhile, AP TDP Chief Atchannaidu expressed his anger that TDP leader Bonda Uma is being harassed by the police and  demanded that the ECI should order an inquiry into the incident. He said they have already complained to the Governor about the harassment of TDP candidates and also will bring to the notice of the ECI and also the AP High Court. If the harassment is not stopped, he warned that those responsible will have to pay the price in the future.

వార్ 2 కోసం రంగంలోకి ఫేమస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌!

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కాంబోలో వసత్ఉన్న బిగ్గెస్ట్‌ మూవీ వార్‌ 2. ఈ సినిమాను బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైఆర్‌ఎఫ్‌ బ్యానర్లో ఆదిత్య చోప్రా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్ట్‌ 14న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ లో తారక్‌ కూడా జాయిన్‌ అయ్యాడు. పది రోజుల పాటు జరిగిన తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ఫై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వార్ 2 సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతుంది .’వార్ 2′ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ అయినా స్పిరో రాజటోస్ వార్ 2 సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా పని చేయనున్నారని సమాచారం. స్పిరో రాజటోస్ ‘కెప్టెన్ అమెరికా సివిల్ వార్’ వంటి చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

ఇప్పుడు వార్ 2కి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ‘వార్ 2’కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఆయనే రూపొందిస్తున్నట్లు సమాచారం.”వార్ ” మొదటి పార్ట్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కంటే వార్ 2 యాక్షన్ సీన్స్ అంతకు మించి ఉండనున్నాయని చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.

Producer Radha Mohan Hints On The Much-Anticipated Sequel ‘Vikramarkudu 2’

Mass Maharaja Ravi Teja’s superhit blockbuster Vikramarkudu is getting its highly anticipated sequel soon. Vikramarkudu marks the first collaboration between Mass Maharaja Ravi Teja and Maverick director SS Rajamouli. The film garnered critical and commercial acclaim and marked a significant milestone in both Ravi Teja and Rajamouli’s film careers. Following the film’s enormous success, it was eventually remade in Kannada, Tamil, Hindi, and Bengali.

Producer Radha Mohan recently hinted at Vikramarkudu 2 during the promotions of the Hindi film ‘Ruslaan’. Radha Mohan revealed his intentions to create a sequel to 2006’s action-entertainer Vikaramarkudu under the title ‘Vikramarkudu 2’, affirming that the script work for the sequel is complete.

He also announced that the script work for Salman Khan’s much anticipated ‘Bajrangi Bhaijaan’ has also been completed. Vijayendra Prasad has confirmed the completion of both Vikramarkudu and Bajrangi Bhaijaan’s sequel scripts. The Bajrangi Bhaijaan sequel will start shooting once Salman Khan reviews and approves the script.

The writer for both Vikramarkudu and Bhajrangi Bhaaijaan was the renowned Vijayendra Prasad, who is the father of cinematic genius SS Rajamouli. Vijayendra Prasad recently completed the script work for SS Rajamouli and Super Star Mhesh Babu’s much-anticipated next, which is tentatively titled ‘SSMB 29’. World-wide fans were eagerly awaiting its release.