Home Blog Page 973

Kavitha’s Arrest A BJP- BRS Match Fixing?

The sudden arrest of BRS MLC and BRS supremo K Chandrasekhar Rao’s daughter Kavitha on Friday evening is creating political uproar ahead of Lok Sabha polls. Though central agencies are behind her for the last more than a year, the very timing of her arrest gives scope for suspicion of a political plot.

It may be recalled that her arrest was engineered all of a sudden just a day ahead of Election Commission of India (ECI) swing to announce poll schedule. Soon after her arrest, Prime Minister Narendra Modi landed in Hyderabad, to participate in a ‘road show’ in Malkajgiri Lok Sabha constituency, with the highest number of voters in the country.

It is normal practice for Prime Minister Modi to give a brief speech during `road show in any city or atleast he will send his message to people through a series of tweets. But in Hyderabad he was completely silent and not a single tweet was given.

Immediately after her arrest, state BJP president and union minister G Kishan Reddy conducted a video conference with all important party functionaries in Telangana. He cautioned them not to make any comment in the media about her arrest. He said that the BJP stand is Kavitha’s arrest is her individual issue, nothing political.

While ED and IT officials are at Kavitha’s residence, state Congress minister Komatireddy Venkat Reddy made a key allegation that this is match fixing between BRS and BJP parties. He accused that ED raids are a drama of Modi and Amit Shah.

A fortnight ago, Congress party senior leader Jagga Reddy sensed a conspiracy and claimed that BJP and BRS were enacting a new drama, as part of which Kavitha could be arrested if it would fetch them votes and impact the Congress’s prospects in the upcoming Parliament polls.

It may be mentioned here that in last November assembly polls Congress swing into power in Telangana mainly by exposing `BRS- BJP unholy alliance’, for which they pointed out that Kavitha was not arrested in Delhi Liquor case, though Delhi Deputy Chief Minister, another minister and some other prominent persons were arrested.

By avoiding ED summons, when Kavitha approached the Supreme Court, ED even didn’t challenge her contentions and assured they are not in hurry to arrest her. BJP realised that their `unholy proximity with KCR’ cost them a lot in Assembly polls and they could not win seats in their traditionally strong Greater Hyderabad and surrounding constituencies, except Raja Singh from Ghoshamahal.

Presently various surveys indicate that Congress is bound to repeat its performance in Lok Sabha polls also by winning over 10 of total 17 seats in Telangana. Congress leaders alleged that both BJP and BRS became panicked with continued Congress popularity in the state and enacting a drama of `Kavitha arrest’ to divert public attention.

Electoral bonds exposes Megha proximity with BRS

The exposure of electoral bonds details in the SBI documents submitted to the Election Commission of India reveals that Hyderabad- based Megha Engineering promoters are one of the top contributors to electoral bonds. Their proximity with YSRCP in Andhra Pradesh and BRS in Telangana is an open secret.

They have hijacked most of the high-profile infrastructure projects like Kaleswaram and Polavaram from the two governments. It was this bondage of Megha’s proximity with BRS and YCP governments said to be the reason that brought both KCR and YS Jaganmohan Reddy together politically.

While the ruling BJP topped the list encashing electoral bonds to the tune of Rs 6,060.5 crore, the regional party All India Trinamool Congress followed with Rs 1,609 crore in donations. is in place. Later, the Congress encashed Rs.1,421.90 crore in donations and the fourth-placed regional party, the Bharatiya Rashtra Samithi, received Rs.1,214.70 crore.

Lion share of these donations, BRS said to be received from Megha, the major engineering contractor for Kaleswaram project. As a result, it

exposes the reason behind BRS chief K. Chandrasekhar Rao taking personal interest in re-designing the Kaleshwaram project and monitoring its implementation.

Despite the BRS chief’s huge amount of funds and hard work, the Kaleshwaram project turned out to be a disaster as the Medigadda barrage cracked and showed signs of collapsing in the near future.

This shows that a huge amount of corruption has taken place in the design and implementation of the Kaleshwaram project, which was undertaken at a cost of nearly Rs 1 lakh crores. For this reason, Telangana CM A. Revanth Reddy is throwing dirt on the defects in the project works.

For obvious reasons, the BRS government is involved in neck-deep corruption in relation to the project, the construction standards are not proper.

షూటింగ్‌ కి బ్రేక్‌ ఇస్తున్న బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్ లోని రామోజీ ఫిలీం సిటీలో జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్ అభిమానులకు పునకాలు తెప్పించేలా ఉన్నాయి. మండుతున్న వాహనంలో నుంచి దిగి శత్రువులను చెండడుతూ…బాలయ్య బాబు చెప్పిన డైలాగ్‌ అయితే వేరే లెవల్ అంతే.

ఇదిలా ఉంటే బాలయ్య కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.

శనివారంతో బాబి సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతున్న నేపథ్యంలో ఆదివారం విశ్రాంతి తీసుకుని సోమవారం నుంచి హిందూపుర్‌ వెళ్లిపోనున్నారని సమాచారం. ఈ సినిమాలో మలయాళం నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా నటిస్తున్నట్లు చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాక్‌.

అయితే ఇప్పటి వరకు ఆయన ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కడ కూడా ఎంటర్ అవ్వలేదు. బాలయ్య బాబు బ్రేక్ సమయంలో ఆయన కానీ డేట్స్ ఇస్తే ఆయన మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి చిత్ర బృందం రెడీ గా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ ఉర్వశి రౌతేలా పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుంది. బాలయ్య బాబు పక్కన శ్రద్ద శ్రీనాథ్‌ హీరోయిన్‌ గా నటిస్తుందని ఇంకో టాక్‌ వినిపిస్తుంది. 

రేపో మాపో.. జనసేనలోకి పెండెం దొరబాబు!

పిఠాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెండెం దొరబాబు త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఇప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ను గెలిపించేందుకు ఆయన తన సర్వశక్తులూ ఒడ్డి పనిచేయనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, టికెట్ ఇవ్వకుండా జగన్ తిరస్కరించిన వారిలో పిఠాపురం పెండెం దొరబాబు కూడా ఒకరు. ఆయన ఇప్పుడు పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ తుదివిడత అభ్యర్థిత్వాలను ప్రకటించిన తర్వాత.. అంటే పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్టుగా జాబితాలరూపంలో అధికారికంగా ప్రకటించిన తర్వాత దొరబాబు చేరిక ఉంటుందని అంచనాలు సాగుతున్నాయి.

నిజానికి పెండెం దొరబాబు జనసేనలో చేరుతారనే ఊహాగానాలు ఇప్పుడు పుట్టినవి కాదు. నాలుగు నెలల కిందటే అలాంటి ప్రచారం జరిగింది. అప్పట్లో తన పార్టీ మార్పు గురించి సంకేతాలు ఇచ్చేలా దొరబాబు మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ అనేక వార్తాకథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

తర్వాతి పరిణామాల్లో.. ఎమ్మెల్యేలను బదిలీచేస్తూ, టికెట్లు నిరాకరిస్తూ ఒక్కటొక్కటిగా తేలుస్తూ వచ్చిన జగన్.. ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్చార్జిగా పంపి.. పెండెం దొరబాబుకు రిక్తహస్తం చూపించారు. ఆ సమయంలోనే దొరబాబు.. పిఠాపురం నుంచి తానే పోటీచేస్తానని, చివరి వరకు ఏమైనా జరగవచ్చునని కూడా అన్నారు. అలిగి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లాంటివి జరగలేదు. ఎమ్మెల్యేహోదాలో తాను, కొత్త ఇన్చార్జి వంగా గీతతో కలిసి అనేక అధికారిక కార్యక్రమాల్లో ఇప్పటిదాకా పాల్గొంటూనే ఉన్నారు. అయితే చాపకిందనీరులా.. గుట్టుచప్పుడు కాకుండా.. ఆయన జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ తో ఈమేరకు మంతనాలు కూడా పూర్తయ్యాయనే వినిపిస్తోంది.

పిఠాపురంలో గత ఎన్నికల్లో దొరబాబు చేతిలో ఓడిపోయిన తెలుగుదేశం నాయకుడు వర్మ ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించే బాధ్యతను చంద్రబాబునాయుడు చూస్తున్నారు. ఒకవేళ ఆ బుజ్జగింపులు ఫలించకపోయినా సరే.. తెలుగుదేశం పార్టీకి ఉండగల ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంటుందని, వర్మ సొంత వర్గీయులు మాత్రం దూరం అవుతారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. అదే మాదిరి సమీకరణాన్ని వైసీపీ మీదకు పవన్ ప్రయోగిస్తున్నారు. పెండెం దొరబాబును జనసేనలో చేర్చుకుంటే.. వైసీపీ స్థిరమైన ఓటుబ్యాంకు వారికి పడుతుంది. దొరబాబు వర్గీయులు, ఆయనదైన సొంత ఓటుబ్యాంకు తనకు అనుకూలంగా పడుతుందని ఆశిస్తున్నారు. ఈ సమీకరణాలు ఆశావహంగా కనిపించినందునే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రేపో మాపో చేరిక పూర్తవుతుందని స్థానికంగా అనుకుంటున్నారు. 

TDP Chief Demand CBI Probe Into APPSC Jobs Scam

Deploring over the circumstances under which the High Court has cancelled the Group-1 main exams conducted by the APPSC and ordered for fresh examinations, TDP chief and former chief minister N Chandrababu Naidu accused that large scale irregularities in YS Jaganmohan Reddy regime were responsible for it.

Demanding a CBI probe into these irregularities, he also sought stern action against APPSC Chairman Gautam Sawang and also senior IPS officer PSR Anjaneyulu, who were responsible for all this mess in this recruitment drive.

He stronly condemned the alleged practice of selling APPSC jobs under the current administration and expressed strong disapproval of the reported mismanagement.

Naidu highlighted his concerns over the misrepresentation of facts in court proceedings, particularly regarding the alleged failure to conduct second valuations. He went on to deliver a detailed powerpoint presentation outlining the irregularities observed within the APPSC, emphasizing the detrimental impact on the aspirations of youth aspiring for government jobs through Group-1 exams.

The former Chief Minister alleged that APPSC has been converted into a rehabilitation center for the politically unemployed and the youth of the state has been viciously lied to and killed their hopes. He said that there is nothing wrong with the miscreants who have committed the unforgivable crime through mistakes in the commission.

He alleged that after the arrival of Gautang Sawang, the valuation was opened again, the first valuation was hidden and the second time was decided to be done again, the first mistake was made by doing digital valuation, manual valuation was done after digital valuation was done, manual valuation was trampled and it was done again.

He said that Sitaramanjaneyu, who was the secretary of APPSC, was key in the irregularities. He said that they tried to mislead the court by cutting off the valuation process. It was alleged that Tadepalli Palace bosses committed irregularities for the candidates they wanted, and Gautam Sawang, who was at the chairman level, acted accordingly.


Calling for transparency and integrity in the recruitment process,  Naidu emphasised the importance of appointing a person of high moral standing as the chairman of the APPSC. He lamented the perceived decline in ethical standards within the commission, contrasting the current situation with the tenure of the TDP government, during which he claimed a chairman known for honesty and integrity was at the helm.

He cautioned against the perceived trend of using the commission for political purposes, urging for a return to principles of meritocracy and impartiality in the recruitment processes.

 

Chandrababu chose Anganwadi worker from Rampachodavaram

Surprising everyone, TDP chief Chandrababu Naidu has chosen an ordinary Anganwadi teacher to face YCP’s MLC Anantha Babu, who is known for his muscle powers, from Rampachodavaram constituency in Alluri Sitaramaraju district.

When TDP announced an ordinary woman named Miriyala Sirisha Devi’s name in its second list of candidates, to fight in the elections from this remote tribal constituency, everyone wondered.  

Since some time Anant Babu has been making noises from this sleepy tribal belt, making everyone panic. With the murder of Anantha Babu’s car driver Subramanyam, a dalit youth, raised political sensation all over the state.

MLC Anantha Babu, who is accused of beating the driver to death, has been politically ruling the Rampachodavaram area for several years. He  is the main accused in the case of killing Subrahmanyam, a Dalit youth who works as a car driver and delivering him to his home in the same car. Presently Anantha Babu is on bail.

For the past few years, Anantha Babu has been playing a key role in the constituency from the selection of YCP MLA candidates to their victory. There are allegations that Anantha Babu, who is a close relative of the leaders of the strong Kapu community in East Godavari district, has kept the agency area in his palm.

After driver Subrahmanyam’s murder, Anantha Babu became popular across the state. YCP continued him in the party even after he came out on bail. In this background, TDP  has fielded an Andanwadi teacher Miriyala Shirishadevias, a candidate of TDP in Rampachodavaram with the aim of blocking YCP.

Shirisha, who taught children for several years as an anganwadi worker, resigned from the job in December last year due to political reasons. She has been working as an Anganwadi worker in Rajavommangi Mandal Anantgiri for eight years.

Her husband Vijaybhaskar is the president of Telugu Youth in the constituency. Due to this, she had to face political harassment. She said that she was subjected to trolling on social media as her husband was in politics.

The TDP claims that the photos were morphed and spread misinformation. She has attended the investigation of the authorities many times on the complaints of not attending the duties. Memos had to be received in the wake of political complaints.

The opponents put intense pressure on the officials of the Women and Child Welfare Department to remove Shirisha Devi from her duties. Due to this, she resigned from the job last year.

In the background of the situation in Rampachodavaram, she was selected as the MLA candidate because she was a local and opposed to Anantha Babu’s faction. In the last three elections, TDP candidates did not win in Rampachodavaram.

TDP won the agency consecutively from 1983 to 2004. Congress candidate won in 2009. In 2014 YCP candidate Rajeshwari and in 2019 Nagulapalli Dhanalakshmi won.

BRS Party On Ventilator Ahead Of Polls

The Bharatiya Rastra Samithi party led by K. Chandra Sekhar Rao in Telangana, which ruled the state for a decade after its bifurcation from Andhra Pradesh, is struggling to keep its flock together after facing an ignominious defeat in the recent assembly elections held in December last year. It has been 100 days since the Congress government under the leadership of Revanth Reddy came into force and the BRS party appears to be gasping for survival from all corners. Political experts say that the party is already on a ventilator because it is facing a serious existential crisis. 

Immediately after the swearing-in ceremony of Revanth Reddy, BRS leaders started making a beeline to join the Congress party. Quite surprisingly, several former MLAs and MPs who were with the BRS for many years deflected into the Congress in no time. The party-hopping tradition turned out to be a daily ritual as we see one or two leaders deserting the BRS and joining the Congress or the BJP every day. 

The situation of BRS is so pathetic that KCR is unable to finalize candidates for the upcoming parliament elections. So, those who are planning to jump into other parties are immediately offered tickets. This is just to appease them from not leaving the party. It is quite shocking that no one is coming forward voluntarily to contest from the BRS. 

KCR even agreed to ally with Mayawati’s BSP which has a negligible vote share in Telangana. BSP will get two seats as per the seat-sharing agreement. 

This serves as a stark reminder of the situation of the party which, three months ago, was confident of retaining the third term in the state and also tipped to emerge as a formidable force to reckon with at the national level. Quite contrastingly, the party lost power in the state and subsequently lost relevance at the national level. Now, it is on the brink of a wipe-out in the parliament elections because going by the current trend BRS might be confined to a complete zero or one or two seats at most. 

Addressing a recent public gathering, CM Revanth Reddy said BRS will be vacated if he opens the gates of Congress without any hesitation. The situation of BRS is the same now. 

సాక్షి టీవీ .. వైసీపీ వారికి గండమేనా?

అప్పట్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే లక్ష్యంగా జగన్ సాక్షి పత్రికను, సాక్షి టీవీని స్థాపించారు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వీటి అవసరం లేకుండానే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ మీడియా సంస్థలు మాత్రం- జగన్ ఏ పనిచేస్తే ఆ పని గురించి డప్పు కొట్టడానికి, ఆయనను నిత్యం కీర్తిస్తూ ఉండడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. తాను అధికారంలోకి రావడానికి కూడా ఆ మీడియా  సంస్థలను ఆయన సహజంగానే వాడుకున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉంటే.. సాక్షి టీవీ ఛానెల్ పార్టీ అభ్యర్థులకు గండంగా మారేటట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆ టీవీలో ప్రచారం వారి పుట్టిముంచేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా చేసిన ప్రకటన చూస్తే అలాగే అనిపిస్తుంది.
సొంత టీవీ ఛానెళ్లను కలిగిఉన్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు ఆ చానెళ్లలో కల్పించే ప్రచారాన్ని వారి ఎన్నికల ఖర్చుకిందే పరిగణిస్తాం అని మీనా ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో ఇది చాలా కీలక పరిణామం అని చెప్పాలి. ఎన్నికల ఖర్చుల పరంగా వైసీపీ అభ్యర్థులకు ప్రమాదం అని కూడా చెప్పాలి.

నిజానికి జగన్ ఏ సభలో తాను మాట్లాడుతున్నా.. వారిలాగా నాకు సొంత పత్రికల లేవు, సొంత టీవీ ఛానెళ్లు లేవు.. నాకున్నదంతా ప్రజాబలం మాత్రమే అని పచ్చి అబద్ధాలను అలవోకగా చెబుతూ ఉంటారు. ఆయన ప్రజల ఎదుట ఎలాంటి అబద్ధాలైనా చెప్పవచ్చు గానీ.. ఎన్నికల సంఘం నిబంధనల వద్దకు వచ్చేసరికి ఆయన తప్పించుకోలేరు. జగన్ సాక్షి పత్రిక, సాక్షిటీవీ సంస్థల్లో యజమానిగా లేకపోవచ్చు. కానీ ఆయన భార్య భారతి ఒక డైరక్టరు అనే సంగతి అందరికీ తెలుసు. జగన్ ఎన్ని నిందలు వేసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సంస్థలు తెలుగుదేశం పార్టీకి చెందినవి అని నిరూపించలేరు. అదే సమయంలో సాక్షి టీవీ ఆయనదే అని నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆస్తుల అఫిడవిట్లలోనే అభ్యర్థితో పాటు భార్య ఆస్తుల్ని కూడా ఈసీ పరిగణిస్తుంది. అలాంటప్పుడు భారతి డైరక్టరుగా ఉన్న సాక్షిటీవీ ఛానెల్ ను,  జగన్ అధ్యక్షుడుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా గుర్తించడం జరుగుతుంది. దాంతో సాక్షిటీవీలో వచ్చే అభ్యర్థుల ఇంటర్వ్యూలు వారి అతి ప్రచారం యావత్తూ వారి ఖర్చులోకి వచ్చేస్తాయి.

నిజానికి సాక్షి టీవీ తమ సొంత పార్టీ అభ్యర్థులకు కూడా ఉచితంగా ఏమీ సేవలు అందించదు. వారినుంచి భారీగా డబ్బుతీసుకుని వ్యాపారంచేస్తూనే వారికి ప్రచారం అందిస్తుంది. సాక్షి టీవీ చూసే ప్రతి ఒక్కడూ ఎటుతిరిగీ ఫ్యాను గుర్తుకే ఓటు వేస్తాడు. వారికోసం అదనంగా ఖర్చు పెట్టడం అనవసరం అని తెలిసినా అభ్యర్థులు మొహమాటానికి సాక్షి టీవీకి చదివింపులు ఇచ్చినట్టుగా డబ్బులిచ్చి ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలతో సాక్షిలో వచ్చే ప్రచారం మొత్తం వారి ఖర్చులో చేరుతుంది. దానికంటె ఈనాడు, ఆంద్జజ్యోతిల్లో దక్కే ప్రచారం కాస్త బెటర్ అనే భావన వారికి కలుగుతోంది.

చంద్రబాబు రాజనీతి : జ్వాలలు చల్లారుతున్నాయ్!

అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీలోని పలు నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రేగాయి. అయితే ప్రత్యర్థి కంటె ముందుగానే టికెట్లు ప్రకటించేయడం ద్వారా కాస్త ఎడ్వాంటేజీ దక్కించుకున్న చంద్రబాబునాయుడు.. అసమ్మతుల్ని ఎక్కడికక్కడ బుజ్జగించడానికి, పరిస్థితుల గురించి సర్దిచెప్పి వారిని ఒప్పించడానికి సమయం వెచ్చిస్తున్నారు. ఆయన రాజనీతి ఫలిస్తోంది. టికెట్ దక్కలేదనే బాధతో ఉన్న పార్టీ నాయకులను చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నారు. ఆయనను కలిసిన తర్వాత.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్న నాయకులు నియోజకవర్గంలో పార్టీ గెలుపుకోసం మనస్ఫూర్తిగా పనిచేయడానికి తిరిగి వెళుతున్నారు.

రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో.. వారికి ఏకంగా 31 అసెంబ్లీ స్థానాలను కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలో అసంతృప్తులు రేగడం సహజం. అందుకే చంద్రబాబు నాయకుల్ని ఉండవల్లిలోని నివాసానికి పిలిపిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాల్సిన పరిస్థితి, ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే.. రాష్ట్రం ఎంతగా అథోగతి పాలవుతుందనే వాస్తవాల్ని ఆయన వారికి వివరించి చెబుతున్నారు. రెండు పార్టీలతోనూ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో.. వారి అవసరం ఏమిటో వివరంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు ధర్మాన్ని అనుసరిస్తూ.. వారి విజయానికి కూడా మనందరం మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడే.. అధికారంలోకి రావడం కుదురుతుందని నచ్చజెపుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకోసం కష్టపడిన వారందరికీ, పొత్తుల కారణంగా నష్టపోయిన వారందరికీ కూడా తగిన పదవులు దక్కుతాయని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు.

టికెట్ రాలేదని తెలిసిన క్షణానికి ఉండే ఆవేశం నాయకుల్లో కూడా చల్లబడుతోంది. నెమ్మదిగా వారు పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ఏపీ అధ్క్ష్యక్షుడుగా కూడా సేవలందించిన సీనియర్ నాయకుడు కళా వెంకట్రావుకే ఈసారి టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబును నివాసంలో కలిసిన ఆయన భేటీ తర్వాత.. ‘అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ఆయన మాటలకు కట్టుబడి సంతృప్తికరంగా వెళుతున్నాను’ అంటూ కన్విన్స్ కావడం గమనార్హం. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, పెనమలూరు టికెట్ ఆశించి భంగపడి- ఇండిపెడెంటుగా నైనా బరిలోకి దిగాలని అనుకున్న బోడె ప్రసాద్, కొవ్వూరులో తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వడంతో అలిగి స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి జవహర్.. తదితర సీనియర్ నాయకులు ఎందరో చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. వారందరినీ కూడా ప్రస్తుతానికి చంద్రబాబు బుజ్జగించినట్టే.
నెమ్మదిగా అసమ్మతి రాగాలు తగ్గుతున్నాయని, మామూలు వాతావరణం నెలకొంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వారంలోగా ఎక్కడా ఏ ఇబ్బందీ తలెత్తకుండా పొత్తుల్లో మూడు పార్టీలు కలిసిమెలిసి పనిచేస్తాయని, మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అనేది నూరుశాతం జరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

మౌనంగా ఉంటే మరక తొలగిపోదు జగన్!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ అయిదేళ్లూ ఆయన అన్నయ్య కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెడుతున్నారు. అయినా సరే చిన్నాన్న హత్యకేసును ఇప్పటిదాకా ఆయన ఒక కొలిక్కి తేలేకపోయారు. -ఈ వ్యవహారం చూస్తే సామాన్యులకు ఎలాంటి భావం కలుగుతుంది? ఈ ప్రభుత్వం తమకు ఎలాంటి రక్షణ కల్పించగలదు అనే భయం పుడుతుందా? లేదా? నిజానికి సామాన్యుల భయం తర్వాత, సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఇంకా తీవ్రమైనవి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు వివేకా, కోడికత్తి శ్రీను రక్తంతో తడిచిపోయాయని.. ప్రతి ఒక్కరూ వైకాపా నుంచి బయటకు రావాలి. లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. హంతకులున్న, హంతకుల పార్టీకి ఓటు వేయొద్దు.. జగనన్న పార్టీని ఎన్నికల్లో గెలవనీయొద్దు.. నా తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలి.. అని సునీత ప్రజల ఎదుట భోరుమన్నదంటే.. జగన్ వైఖరితో వారు ఎంతగా విసిగివేసారిపోయారో కదా అనిపిస్తుంది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని ఓడించడం మాత్రమే కాకుండా.. మొత్తం కడప జిల్లాలోనే వైఎస్ జగన్ కు ఉండగల ఆదరణకు గండికొట్టేలా ఆయన చెల్లెళ్లిద్దరి మాటలు ఉన్నాయి. సునీత స్వయంగా వైసీపీ పునాదులే రక్తంతో తడిచి ఉన్నాయని అంటున్నారు. ఇంత తీవ్రమైన ఆరోపణలకు పార్టీ తరఫున సమాధానం చెప్పి తీరాల్సిందే. సాధారణంగా ఎలాంటి సీరియస్ ఆరోపణలకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాల్సి వస్తుందో అలాంటి వాటన్నింటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తెరముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. ఈ సందర్భంలో కూడా.. పార్టీ పునాదుల్లో, వారు సాధించిన అధికారం పునాదుల్లో బాబాయిని చంపిన నెత్తురు ఉన్నదనే ఆరోపణకు కనీసం సజ్జల అయినా సంజాయిషీ చెప్పాలి. అవినాష్ రెడ్డి కూడా నోరు విప్పాలి. తండ్రిని కూతురే చంపేసిందని గుడ్డకాల్చి పడేయడం కాదు.. ఇన్నాళ్లుగా కేసు ఎందుకు తేలడంలేదో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండిపోయినంత మాత్రాన ఆయనకు అంటిన నెత్తుటి మరక తొలగిపోతుందని అనుకుంటే భ్రమ. అందుకే ఆయన ఆ జిల్లాలో ప్రచారానికి అడుగుపెట్టే ముందే సంజాయిషీలతో సిద్ధంగా ఉండాల్సిందేనని ప్రజలు ఆశిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరవాత తెచ్చిన పథకాలతో ప్రజలను ఆకర్షిస్తుండవచ్చు. కానీ మౌలికంగా ఆయనకున్న క్రేజ్ కేవలం వైఎస్ఆర్ కొడుకుగా మాత్రమే. ప్రత్యేకించి వైఎస్ అంటే ఎంతో అభిమానం ఉండే వ్యక్తులున్న కడపజిల్లాలో అది ఇంకా ఎక్కువ. వైఎస్సార్ కొడుకుగా మాత్రమే ఆయనను అభిమానిస్తుంటారు. ఆ రకమైన తండ్రి వలన వచ్చే ప్రజాభిమానం కూతురు వైఎస్ షర్మిలకు కూడా సమానంగా దక్కే అవకాశం ఉన్నదని జగన్ తెలుసుకోవాలి. బాబాయి హత్య కేసు గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తే.. ప్రజలు తనకు క్లీన్ చిట్ ఇచ్చేస్తారని జగన్ భ్రమిస్తే.. ఇబ్బందేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వక్రబుద్ధి, వక్రభాష్యం.. చిచ్చుపెట్టే వైసీపీ కుట్రలు!

తెలుగుదేశం పార్టీలో పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతిరాగాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీలో అయినా సరే.. టికెట్ల ప్రకటన తర్వాత ఖచ్చితంగా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. పైగా తెలుగుదేశం ఈసారి ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రాబోతున్నదని అనుకుంటున్న తరుణంలో పార్టీ టిక్కెట్ కోసం పోటీ అధికంగా ఉండడం సహజం. ఎవరో ఒకరికి మాత్రమే టికెట్ దక్కుతుంది గనుక.. మిగిలినవాళ్లు మనస్తాపానికి గురికావడమూ సహజం. ఆ అసంతృప్త్తులను ఒక్కరొక్కరుగా బుజ్జగించుకుంటూ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది.

అయితే ఈలోగానే వైసీపీ దళాలు వక్రపూరితంగా, వక్రబాష్యాలు, ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారాలతో తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు పోస్టులు తయారుచేస్తూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నాయి. తప్పుడు భాష్యాలు చెబుతూ.. సాక్షాత్తూ కేంద్రహోం మంత్రి మాటలను కూడా వక్రీకరించి.. విపక్ష కూటమి పొత్తులో ముసలం పుట్టించడానికి వారు కుట్రలు చేస్తుండడం జరుగుతోంది. ఈ దుర్మార్గంలో వైసీపీ అనుకూల సోషల్ మీడియా దళాలతో పాటూ, సాక్షి దినపత్రిక కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది.

జనసేనాని పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నట్టుగా ప్రకటించిన తర్వాత.. సహజంగానే అక్కడి తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇన్నేళ్లుగా ఆ పార్టీ ఇన్చార్జిగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వర్మ అసంతృప్తికి గురయ్యారు. ఆయన వర్గం అనుచరులు ఆందోళనకు దిగారు కూడా. ఆయనతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా.. ఆ అసంతృప్తిని వాడుకుని పార్టీలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ దళాలు కుట్ర చేసేశాయి. వర్మను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఒక లేఖను తయారుచేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసేశారు. పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఆ పోస్టును ఖండించాల్సి వచ్చింది.

ఇదొక ఎత్తు అయితే సాక్షి దినపత్రిక మరింత దిగజారి వ్యవహరించడం విశేషం. తెలుగుదేశం, బిజెపి పొత్తుల్లో ముసలం పుట్టించడానికి వారి కుట్రలు వారు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియాటుడే కాంక్లేవ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇదివరకు కూడా ఎన్డీయేలో భాగస్వామేనని, ఆయనను తాము వెళ్లమనలేదని, ఆయనంతట ఆయనే వెళ్లిపోయారని, నిజం తెలుసుకున్న తర్వాత తిరిగి ఇప్పుడు ఎన్డీయేలోకి మళ్లీ వచ్చారని మాత్రమే’ అన్నారు. అమిత్ షా after realising అనే మాటను మాత్రమే వాడారు. అయితే ఆయన మాటలకు వక్రభాష్యం పులిమిన సాక్షి దినపత్రిక, ‘చంద్రబాబుకు  బుద్ధొచ్చింది. బుద్ధొచ్చిన తర్వాత తిరిగి ఎన్డీయేలోకి వచ్చారు’ అని అమిత్ షా అన్నట్లుగా ప్రచురించింది. అచ్చంగా పార్టీ కార్యకర్తల్లో కోపం పుట్టించడానికి, ఆ రకంగా పొత్తుల మైత్రిని చెడగొట్టడానికి సాక్షి , వైసీపీ కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇద్దరు చెల్లెమ్మల పోరాటం సూటిగా జగనన్నతోనే!

రాష్ట్రమంతా రాజకీయ పరిస్థితులు అటుఇటుగా మారుతూ ఉండవచ్చు గానీ.. కడపజిల్లాకు సంబంధించినంత వరకు తమ పార్టీకి తిరుగుండదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉండవచ్చు గాక.. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన, వారసత్వంగా రాజకీయ వైభవాన్ని తాను అనుభవించిన, అనుభవిస్తున్న కడప పార్లమెంటు సీటు, పులివెందుల ఎమ్మెల్యే సీటుల్లో ఎంత ఉపద్రవం వచ్చినా సరే.. తమ పార్టీ హవా ఇంచుకైనా తగ్గదని ఆయన అనుకుంటూ ఉండవచ్చు గాక..! కానీ సొంతచెల్లెళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆయన మీద ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాల్లా దూసుకువస్తున్నారు. ‘ప్రజాకోర్టులో రాజకీయంగానే ఎదుర్కొందాం’ అనే స్పష్టమైన లక్ష్యంతో ఎన్నికల్లో జగన్ మీద తలపడడానికి ఆ చెల్లెళ్లిద్దరూ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి మరణించి అయిదేళ్లు అయిన సందర్భంగా కడపలో నిర్వహించిన వర్ధంతి సభ, ఆద్యంతం రాజకీయ సభలాగానే జరిగిందంటే అతిశయోక్తి కాదు. హత్యకు అసలు సూత్రధారి, హంతకులను కాపాడే వ్యక్తిగా జగన్ ను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో చెల్లెళ్లిద్దరూ తమ ప్రసంగాల్లో సమరశంఖాన్ని పూరించారు.

‘‘మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాను మీరు మరచిపోయాకరా? అన్నం పెట్టిన చేతిని నరకడం దారుణం కాదా? ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను చూస్తున్నాం’’ అంటూ వివేకా కుమార్తె సునీత నిప్పులు చెరిగినది అన్నయ్య జగన్ మీదనే! ‘‘తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు.. చంపినవాళ్లు, చంపించిన వాళ్లు.. వాళ్లను కాపాడుతున్న వాళ్లు మరోవైపు ఉన్నారు.. ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారు’’ అని సునీత ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆమె చాలా బ్యాలెన్స్‌డ్ గా మాట్లాడారు. జగన్ చంపించారని అనడం లేదు. పేర్లు ప్రస్తావించకపోయినా అవినాష్ రెడ్డి చంపించాడని, ఆయనను కాపాడడానికి జగన్ కాపాడుతున్నారని.. ఆమె మాటలను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
ఇదే సభలో తాను కూడా పాల్గొని సునీతకు స్థైర్యం అందించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా జగన్ మీద సూటిగానే ఝధ్వజమెత్తారు. ‘జగనన్నా అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ఆర్ తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? మీరేం చేస్తున్నారు. అయిదేళ్లు గడిచినా ఎందుకు న్యాయం జరగలేదు. చిన్నాన్నకే ఇలా అయితే సామాన్యుల సంగతేంటి?’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

మొత్తానికి ఈసారి కడప, పులివెందుల రాజకీయ బరుల్లో వాతావరణం వేడిగా ఉండబోతున్నది. జగనన్న, ఆయన ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డిల మీద.. ఈ ఇద్దరు చెల్లెళ్లు తలపడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి వారు దుర్మార్గులని ప్రచారం  చేస్తున్న వీరు విజయం సాధిస్తారో లేదో చూడాలి. విజయం సాధించకపోయినా.. వారి మెజారిటీలకు గండికొట్టగలిగినా కూడా.. ప్రజలు వీరి వాదనను అంగీకరించినట్టేనని, పలువురు భావిస్తున్నారు.