Home Blog Page 962

BJP-Led NDA May Win 393 Seats, Predicts India TV-CNX Opinion Poll

Prime Minister Narendra Modi-led National Democratic Alliance (NDA) may win 393 out of a total of 543 Lok Sabha seats if elections are held now, with the Bharatiya Janata Party (BJP) alone projected to win 343 seats, says India TV-CNX Opinion Poll.

The opposition Congress-led I.N.D.I.A. bloc (minus Trinamool Congress) may win 99 seats, while others including Trinamool Congress, YSRCP, BJD and independents may get the remaining 51 seats, says the opinion poll projection.

Details of the opinion poll were telecast on the news channel today. The opinion poll was conducted in all 543 constituencies between April 1 and April 13, and the total number of respondents was 1,22,175. These include 62,350 males and 59,825 females. 

Party-wise seat predictions: BJP 343, Congress 40, Aam Aadmi Party (AAP) 8, Trinamool Congress (TMC) 19, Samajwadi Party (SP) 4, JD(U) 12, DMK 17, TDP 12 and Others 88 seats. 

The ruling Bharatiya Janata Party is going to make a clean sweep of all 26 seats in Gujarat, all 25 seats in Rajasthan,  all 11 seats in Chhattisgarh, all seven seats in Delhi, all 5 seats in Uttarakhand and all 4 seats in Himachal Pradesh, according to the opinion poll. BJP is going to win 28 out of 29 seats in Madhya Pradesh and eight out of 10 seats in Haryana. 

The most spectacular win is going to be in Uttar Pradesh, where BJP may win 72 seats, its alliance partners Rashtriya Lok Dal (RLD) and Apna Dal may win two seats each, out of a total of 80 seats, leaving the remaining four seats for Samajwadi Party. Both Congress and Bahujan Samaj Party (BSP) may draw a blank in UP. 

Other states where the BJP is going to score remarkable wins are Bihar (17 out of 40), Jharkhand (12 out of 14), Karnataka (21 out of 28), Maharashtra (29 out of 48), Odisha (10 out of 21), Assam (11 out of 14) and West Bengal (23 out of 42). 

Among regional parties, Trinamool Congress may win 19 seats in West Bengal, DMK may win 17 seats in Tamil Nadu, YSRCP may win 10 and TDP may win 12 seats in Andhra Pradesh and Biju Janata Dal may win 11 out of 21 seats in Odisha. 

సజ్జల కుట్రప్రచారాలకు సునీత ఘాటైన కౌంటర్!

ముఖ్యమంత్రి ప్రజల ఎదుటకు, మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడవలసిన ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు.. ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి తరఫున సకలశాఖా మంత్రిగా అందరూ ప్రేమగా పిలుచుకునే సజ్జల రామక్రిష్ణారెడ్డి వస్తుంటారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన చేస్తారు. నిజానికి ఆ ప్రకటన చాలా సుదూర వ్యూహంతో కూడుకున్నది అయి ఉంటుంది. సజ్జల ఏ మాటలైతే చెబుతారో.. అది పార్టీ విధానం అన్నమాట. అదే మాటలను ఆ తర్వాత మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు ప్రకటనల రూపంలోను, కిందిస్థాయి కార్యకర్తలు టీ బంకుల వద్ద, నాలుగురోడ్ల కూడళ్లలో చర్చల రూపేణా ప్రజల్లోకి వ్యాప్తి చేయించడానికి ప్రయత్నిస్తుంటారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎపిసోడ్- తన తండ్రి హత్య విషయంలో అసలు దోషులకు శిక్ష పడాలని న్యాయం కోసం పోరాడుతున్న సునీత ఎపిసోడ్ లలో కూడా అధికార పార్టీ ప్రతిస్పందనలు ప్రతిసారీ సజ్జల నుంచే వినవస్తుంటాయి. ఆయన సునీత క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, ఆమె విశ్వసనీయత మీద అనుమానాలు రేకెత్తించడానికి చాలా వ్యూహాత్మకమైన ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడంతా గోబెల్స్ యుగమే నడుస్తున్నది కాబట్టి ఒక కుట్రపూరితమైన ప్రచారాన్ని తమ సొంత మీడియా సంస్థలతో, సోషల్ మీడియా దళాలతో  విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలరు కాబట్టి.. ప్రజలను నమ్మించేయగలం అనుకుంటూ ఉంటారు. అయితే తన  గురించి సజ్జల ఆ తరహాలో లేవనెత్తిన ఒక విషపూరితమైన ప్రచారాన్ని సునీత చాటా ఘాటుగా తిప్పికొట్టారు. సజ్జల సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించారు.

తెలుగుదేశం పావులాగా సునీత ప్రవర్తిస్తున్నదనే భావం కమ్యూనికేట్ చేసేలా.. ఆమె ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భార్య చనిపోతే ఆయన ఇంటికి వెళ్లినట్టుగా సజ్జల ఆరోపించారు. దీనికి సునీత గట్టి కౌంటరే ఇచ్చారు. ‘అవును ఆమె నా పేషెంట్ కాబట్టే వెళ్లాను. సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్న చనిపోయినప్పుడు వాళ్ల ఇంటికి కూడా వెళ్లాను. సజ్జలకు అది గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి చనిపోయినప్పుడు ఆమెను కూడా కలిసాను. మానవత్వాన్ని కూడా మీ రాజకీయ ప్రయోజనాలకు సంకుచితంగా ప్రచారం చేస్తారా అంటూ సునీత నిలదీశారు.

మీడియా ముందు నిల్చుని సుతిమెత్తటి పదాలతో ప్రత్యర్థుల మీద అడ్డగోలుగా బురద చల్లుతూ ఉండే సజ్జల దీనికేం సమాధానం చెబుతారు. 

జగన్‌కు దళితప్రేమ ఉంటే త్రిమూర్తులను తప్పించాలి!

ఎస్సీ ఎస్టీల కోసం ఎంతో పాటుపడుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయా నిమ్న వర్గాలపై తనలో ప్రేమ పొంగిపొర్లుతూ ఉంటుందని కూడా చాటుకుంటూ ఉంటారు. వారి అభ్యున్నతికి అనేకానేక పథకాలు తీసుకువచ్చినట్లుగా కూడా మాటలు వల్లెవేస్తుంటారు. అయితే ఆయన తనలోని దళిత ప్రేమను ఇప్పుడు ఆచరణలో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. దళితులకు శిరోమండనం చేయించిన కేసులో జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తులును మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నుంచి పక్కకు తప్పిస్తే గాని  జగన్ మోహన్ రెడ్డి తనలోని దళిత ప్రేమను నిరూపించుకున్నట్లు  తేలదు.

ఎస్సీ ఎస్టీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చులకన భావం ఉన్నదా? వారికి పథకాలు తాయిలాలు ప్రకటిస్తూ ఉంటే చాలు వారు ఎప్పటికీ తమకు బానిసలుగా పడి ఉంటారనే అభిప్రాయం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఉన్నదా? ప్రభుత్వం నుంచి పథకాల కోసం ఆశపడడం తప్ప- ఎస్సీ ఎస్టీలకు ఆత్మాభిమానంగానీ, ఆత్మగౌరవం గానీ ఉంటాయని జగన్‌కు తెలియదా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో సాగుతోంది. ఎస్సీ ఎస్టీల పట్ల అమానుషంగా ప్రవర్తించిన నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉండడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

దళిత డ్రైవరును హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాలలో ఒక  స్టార్ క్యాంపెయినర్. అంతా తానై నడిపిస్తున్నారు. అదే మాదిరిగా 28 ఏళ్ల కిందట ఐదుగురు దళితులను నిర్బంధించి.. ఇద్దరికి కనుబొమలు తీయించడంతో సహా శిరోముండనం చేయించిన దుర్మార్గమైన కేసులో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావడానికి తలపడుతున్నారు. తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా!
ఇలా దళితులకు శిరోముండనం చేసిన త్రిమూర్తులు, దళితుడిని హత్య చేసి ఇంటికి చేరవేసే అశోక్ బాబు ఇద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజపూజ్యం కల్పించిన ఎమ్మెల్సీలే కావడం విశేషం! త్రిమూర్తులకు తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం డబుల్ బొనాంజా అనుకోవాలి.

పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులును తక్షణ మండపేట అభ్యర్థిత్వం నుంచి పక్కకు తొలగించి ఆ స్థానం నుంచి మరొకరు పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించకపోయినట్లయితే ఆ పార్టీ పరువు గంగలో కలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Where Is Manamey Teaser?? Krithi Shetty Asks Director Sriram Adittya

Tollywood’s young and talented actress Krithi Shetty is gearing up for her next film, ‘Manamey’, helmed by Sriram Adittya. The film stars Sharwanand and Krithi Shetty as the main leads. 

The actress asked her next film director, Sriram Adittya, about the teaser update. Krithi took to her Instagram handle, shared a video, and wrote, “Director Gaaru @tsriramadittya!!! Inka wait cheyadam maa valla kadhu -Krithi & Vikram.”

In the video, Krithi playfully chided the director for prioritizing updates about Sharwa’s role while leaving her fans eagerly awaiting news about her in the upcoming film, Manamey. Krithi Shetty requested her director, Sriram Adittya, about the teaser update.

Earlier on Sharwanand’s birthday, the moviemakers released the first look poster for the actor’s next ‘Manamey.’ The makers also released the first single, ‘Ika Na Maate’, a few weeks ago.

Speaking of Manamey, the film is touted as a romantic comedy-drama, helmed by Sriram Adittya and backed by People Media Factory. Hridayam and Hi Nanna fame music director Hesham Abdul Wahab is composing tunes for this flick. Vishnu Sharma and Gnana Shekar VS are in charge of cinematography, while Prawin Pudi handles the editing.

On the work front, Krithi Shetty will be seen in Vignesh Shivan’s next, LIC, alongside Pradeep Ranganathan. Meanwhile, apart from Manamey, Sharwa will be seen in two movies. One is tentatively titled Sharwa 36, helmed by Abhilash Reddy Kankara, and the other film is directed by Ram Abbaraju.

ప్రభాస్‌ గిఫ్ట్‌ పంపించిన వేణు స్వామి భార్య!

ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నటులు, నటీమణులు, రాజకీయవేత్తలపై షాకింగ్ కామెంట్లు చేస్తూ వారి జాతకాలు చెబుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి గురించి కూడా తెలియని వారుండరు. సినిమా పాటలతో పాటు..భక్తి గీతాలను కూడా వీణతో వాయించడం లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఆమె సోషల్‌ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటారామె. తాజాగా ఆమె ప్రభాస్‌ కు ఓ గిఫ్ట్‌ పంపించినట్లు ఆమె తాజాగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ…‘మా ఇంటికి వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అందరికి పంచిపెట్టడం  మాకు అలవాటు. అదే రీతిలో కొన్ని రోజుల క్రితం కొన్ని పళ్లను మేము ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఇంటికి వెళ్లాయి. అక్కడ నుంచచి అవి డార్లింగ్‌ ప్రభాస్‌ కు పంపారు. వాటిని తిన్న ఆయన ఇవి చాలా బాగున్నాయి. మరిన్ని పంపించండి అని అడిగారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడిగితే పంపించమా.. ఈరోజు పంపిస్తున్నాను. ఈ పంటే లాస్ట్.. ఎవరికి పెట్టకండి. మీరే తినేయ్యండి. మళ్లీ సీజన్‌లో ఎక్కువ పంపిస్తాను అప్పుడు పంచిపెట్టడండి. అలాగే ఇది నా క్యూట్ గిప్ట్ మీ కోసం. హాండ్ మేడ్, కస్టమైడ్, ఆర్గానిక్ బ్యాగ్. మీరు షూటింగ్స్‌కు వెళ్లేటప్పుడు ఇందులో ఫ్రూట్స్ పట్టుకుని వెళ్లండి. ఆరోగ్యానికి మంచిది’ అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ  వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ‘ప్రభాస్ అన్నా ఫ్యాన్స్.. మీ భర్తను వేసుకుంటున్నారు కదా.. అందుకే పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నావా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆ సినిమాలో మహేశ్‌ పాత్ర అలా ఉంటుందా?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకు దీరుడు రాజమౌళి ఇద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రస్తుతం వర్కింగ్‌ టైటిల్ గా ఎస్‌ఎస్‌ఎంబీ 29 అని పెట్టారు. సంక్రాంతికి మహేష్‌ గుంటూరు కారంతో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రాజమౌళి సినిమా అంటే యాక్షన్ కి ఏ మాత్రం లోటు ఉండదని ప్రేక్షకుల అభిప్రాయం.  అలాగే తనకు కావాల్సిన ఎమోషన్స్‌ ను పండించడంలో రాజమౌళి దిట్ట అని చెప్పవచ్చు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రాజమౌళి వ్యూహం ఎప్పుడు మిస్ కాలేదు. నిజానికి ఆ నటుడు నుంచి ప్రేక్షకుడు ఏమి కోరుకుంటాడో రాజమౌళి ముందుగానే ఊహిస్తాడు.

ఆ ఊహకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ చేసి రచిస్తాడు.  ఆయన మొదటి సినిమా స్టూడెంట్‌ నంబర్‌ 1′ నుంచి మొన్నటి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు ఆయన సినిమాలన్నీ అలా ఆయన నుంచి వచ్చినవే. ఈ క్రమంలోనే మహేశ్‌ సినిమా కూడా ఎమోషనల్ గా సాగుతుందని సమాచారం. దక్షిణాఫ్రికా రచయిత విల్బర్‌ స్మిత్‌ రాసిన ఓ నవల ఆధారంగానే ఈ మూవీ కథను రాయడం జరిగిందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

 తాజాగా ఈ సినిమాలో మహేశ్‌ పాత్ర విషయంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని రాజమౌళి మహేష్ పాత్రను డిజైన్‌ చేశారని సమాచారం. అలాగే ఈ సినిమాలో మహేశ్‌ లుక్‌ని కూడా ఎంతో డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం…

ఎన్నికలు పూర్తవగానే మొదలు!

నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోకు ఉన్న క్రేజ్‌ అంత ఇంత కాదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మాస్‌ మూవీస్‌    ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టాయి.  అసలు ఆ కాంబోలో సినిమా అంటే బాలయ్య అభిమానులకు మామూలు పండుగ కాదు.

 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు వీరిద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ మీద ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘అఖండ-2’  కూడా ఉంటుందని బోయపాటి ఇంతకు ముందే చెప్పారు. తాజాగా ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి నడుస్తోంది.  ఎన్నికలు పూర్తి కాగానే  ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది.

 ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక  భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని బోయపాటి అన్నారు. ఈ చిత్రం  స్క్రిప్ట్  వర్క్‌ ఇప్పటికే మొదలైనట్లు బోయపాటి సన్నిహితుల ద్వారా సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శరవేగంగా దీని షూటింగ్‌ జరుగుతోంది.

యస్‌ ఈ సినిమాలో ఆయన ఉన్నారు: మంచు విష్ణు!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప సినిమా కోసం తన సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టార్లను అందర్ని సినిమాలోకి దింపుతున్నాడు. ఖర్చుకు కూడా వెనకడడం లేదు. తాజాగా ఈ సినిమా సెట్స్‌ లోకి బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ కూడా అడుగుపెట్టారు.

ఈ సినిమాలో అక్షయ్‌  కీలక పాత్ర పోషిస్తున్నారనే గతవారం రోజులుగా నెట్టింట షికారు చేస్తుంది. దాని గురించి చెబుతూ మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా ఆయన పంచుకున్నారు. మోహన్‌ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.   ‘కన్నప్ప’ పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా ప్రభాస్‌, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివ రాజకుమార్‌తో పాటు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, మధుబాల వంటి స్టార్‌ నటీనటులు సినిమా లో నటిస్తున్నారు.  కన్నప్ప సినిమాతో అక్షయ్‌ కుమార్‌ తెలుగు పరిశ్రమలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నాడు.

బాలీవుడ్ లో అడుగు పెడుతున్న విరూపక్ష హీరోయిన్‌!

తెలుగులో చేసిన మొదటి సినిమా నుంచి కూడా మంచి విజయాలను అందుకున్న హీరోయిన్‌ ఎవరైనా అన్నారంటే..అది కచ్చితంగా సంయుక్త మీనన్‌ అని చెప్పవచ్చు. మలయాళ భామ అయిన ఈమె తెలుగులో భీమ్లా నాయక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి విరూపక్ష, బింబిసార, సార్‌ సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

తాజాగా ఇంకో పెద్ద తెలుగు ప్రాజెక్ట్ ‘స్వయంభు’ చేస్తోంది, ఇందులో నిఖిల్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమని సంయుక్త గుర్రం స్వారీ కూడా నేర్చుకుంది. ‘స్వయంభు’ ని పాన్‌ ఇండియా వైజ్‌ గా విడుదల  చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇదిలా ఉంటే శర్వానంద్ పక్కన కూడా ఇంకో సినిమా చేస్తోంది. ఇలా మంచి ప్రాజెక్టులతో వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న సంయుక్తకి ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అది దక్షిణాదిలో కాదు, ఏకంగా బాలీవుడ్ నుండి అంట…

హిందీలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం సంయుక్త ని ఎంపిక చేసారని ఒక టాక్ నడుస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా బాగుంటుంది అని, అందుకే ఆమెని ముంబై పిలిపించారని, ఆమె ఈ హిందీ సినిమా ఖరారు చేసుకునేందుకు ముంబై వెళ్లిందని తెలుస్తోంది. విమానాశ్రయంలో సంయుక్త వెళుతున్న ఫోటోస్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో  వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

కేవలం ఆ హిందీ సినిమా ఖరారు చేసుకునేందుకు ముంబై లో ల్యాండ్‌ అవుతుందని.. త్వరలోనే ఆ సినిమా వివరాలు సంయుక్త ప్రకటించ వచ్చని తెలుస్తోంది. ఈ హిందీ సినిమా ఖరారైతే ఇటు దక్షిణాదిలో కొనసాగిస్తున్న విజయపరంపరని ఇప్పుడు అటు హిందీలో కూడా సంయుక్త కొనసాగిస్తుందని చెపుతున్నారు.

ఈ స్టార్‌ హీరోకు కూతురిగా..ఆ స్టార్‌ హీరో కూతురు!

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతకాలం క్రితం జైలర్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఆ ఊపు మీదే లాల్‌ సలామ్‌ చేసి బోల్తా పడ్డారు. రజినీ  ప్రస్తుతం జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టైయాన్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.

కాగా ఈ మూవీ తరువాత తలైవా తన 171వ చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కళుగు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు  ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే తాజాగా ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్‌ను  టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్‌ జూన్‌ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్‌ నటించనున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్‌లో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూతురు ఇప్పుడు రజినీకాంత్ కు కూతురుగా నటించనుండటం విశేషం అని చెప్పాలి. దాదాపు మూడేళ్ల తరువాత శృతి హాసన్ కు కోలీవుడ్ లో నటించే అవకాశం దక్కింది. తాజాగా శృతి హాసన్  తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్‌ అనే పాట ఆల్బమ్‌లో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌తో కలిసి నటించింది. ఇప్పుడు అదే లోకేష్ దర్శకత్వంలో రజనీకాంత్ కు కూతురుగా శ్రుతి నటించనుంది.