Home Blog Page 934

చేతగానితనానికి తోడు చంద్రబాబుపై విమర్శలా?

వాలంటీర్ల ద్వారా పింఛన్ల లబ్ధిదారులను మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, భయపెట్టి వారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకోవాలని జగన్ దళం ఆశించింది. అయితే సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు పర్యవసానంగా.. మూడు నెలల పాటు వాలంటీర్లను పింఛన్ల పంపిణీ వ్యవహారానికి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నట్లయితే గనుక.. ఈసీ ఆదేశాలు వచ్చిన తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం గురించిన ఆలోచన సాగి ఉండాలి. అలాంటి ప్రయత్నం చేయకపోగా సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్లు తీసుకువెళ్లాలంటూ ఒక చేత్తో ఉత్తర్వులు జారీ చేసేసి.. మరొక చేత్తో తమ పార్టీ కార్యకర్తలను ఎగదోలి వృద్ధులందరినీ రోడ్లమీదకు లాక్కొచ్చి వారి ప్రాణాలను బలిగొన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా చంద్రబాబు నాయుడుని నిందించడానికి ప్రయత్నిస్తున్నది.

ఏప్రిల్ నెలలో 32 మంది వృద్ధుల ప్రాణాలను బలి తీసుకున్న ప్రభుత్వ వైఫల్యం.. నెల రోజుల వ్యవధిలో ఎలాంటి ప్లాన్ బి మార్గాన్ని కనిపెట్టలేకపోవడం చేతకానితనం కాక మరేమిటి? ఒకవైపు చంద్రబాబు నాయుడు- ఎంత మంది సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటారో గణాంక వివరాలతో సహా పదేపదే మొత్తుకుంటూ ఉన్నారు. ఆయన ఒకవైపు ఎన్నికల సంఘానికి మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖలో రాస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.6 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పుడు వారి ద్వారా రోజుకు 20 మందికి పంపిణీ చేసినా సరే రెండు మూడు రోజుల్లో మొత్తం లబ్ధిదారులకు అందజేయవచ్చుననేది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిపాదన. కానీ పోగాలము దాపురించిన వారికి హిత వాక్యములు చెవినికెక్కవు అనే సామెత రీతిగా ఈ మాటలను ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

తమంత తాముగా ఒంటెత్తు పోకడలతో పింఛన్లను 74 శాతం మంది బ్యాంకు ఖాతాల్లో వేయడానికి మిగిలిన వారికి మాత్రం ఇళ్లవద్ద ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మొత్తం అందరికీ కూడా ఇళ్ల వద్ద ఇచ్చే ఏర్పాటు ఎందుకు చేయలేకపోతున్నారు?  మీ సమర్థత ఇంతేనా? అని ప్రశ్నించినందుకు చంద్రబాబును అసలు మనిషేనా అనే అభ్యంతరకర పదజాలంతో సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం అసహ్యం కలిగిస్తున్నది. ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్నది అనే సామెత మనకు తెలుసు. పెన్షనర్లకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయడం చేతగానటువంటి జగన్ సర్కారు, ఎదురవుతున్న వైఫల్యాలు అన్నింటికీ చంద్రబాబే కారకుడు అన్నట్లుగా అతిశయంగా నిందిస్తున్నది.

కడపలో కాంగ్రెస్ ప్రచారానికి రేవంత్ రెడ్డి!

కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల విషయంలో పొరుగు రాష్ట్రాల వారికి కూడా ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గం కడప. ఇక్కడినుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డితోను, అవినాష్ ను మళ్లీ గెలిపిపంచడానికి కంకణం కట్టుకున్న అన్న జగన్ తోను ఆమె తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ ను గెలిపించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని, మేనెల మొదటివారం తర్వాత ఆయన ఒకరోజు సుడిగాలి ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి.. బాధ్యత గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గాను, ముఖ్యమంత్రిగాను ఊపిరి సలపని బాధ్యతల్లో ఉన్నప్పటికీ కూడా.. ఆయన కేరళ వెళ్లి అక్కడ కాంగ్రెసుకు అనుకూలంగా ప్రచార సభలు నిర్వహించారు. అలాగే కర్ణాటకలో కూడా సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు.

అయితే ఏపీలో కూడా ప్రత్యేకించి కడప నియోజకవర్గంలో తనను గెలిపించడానికి రేవంత్ వచ్చి ప్రచారం చేయాల్సిందిగా.. వైఎస్ షర్మిల ఆయనను కోరినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పలుప్రాంతాల్లో సభలు నిర్వహించాలని షర్మిల కోరినప్పటికీ, తన సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతల ఒత్తిడిని కూడా చూసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఒక్కరోజు ప్రచారానికి మాత్రం అంగీకరించినట్టు తెలుస్తోంది. కడపలో మాత్రమే ఆయన పర్యటించనున్నారు.

ఇప్పటికే షర్మిల తన పదునైన విమర్శనాస్త్రాలతో వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నారు. జగన్ ను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. చిన్నాన్నను చంపిన హంతకుడిని మళ్లీ గెలిపించి పార్లమెంటుకు పంపుతారా? అని ప్రజలను నిలదీస్తున్నారు. హంతకుడికి మద్దతివ్వడానికి మనసెలా వచ్చిందని జగన్ ను అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా.. రేవంత్ రెడ్డి కూడా కడపలో ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో రేంజిలో ఊపు వస్తుందని, సూటిగా పదునైన విమర్శలు చేయడంలో మేటి అయిన రేవంత్ రెడ్డి షర్మిల విజయానికి దోహదం చేస్తారని అంతా అనుకుంటున్నారు.

గ్లాసు గుర్తుపై హైకోర్టుకు కూటమి పెద్దలు!

జనసేన పార్టీ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును మాత్రమే కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే, అందులో మరొక మడతపేచీ ఏంటంటే.. జనసేన పార్టీ పోటీలో లేని నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం అందరికీ అందుబాటులో ఉంచింది. దీంతో తెలుగుదేశం, భాజపా పోటీచేస్తున్న అనేక నియోజకవర్గాల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు, తిరుగుబాటు అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును తీసుకుంటున్నారు. దీని ప్రభావం కూటమి అభ్యర్థులకు భారీగా దెబ్బపడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై తక్షణం హైకోర్టుకు వెళ్లి.. ప్రమాదాన్ని నివారించడానికి గల అవకాశాలను ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన న్యాయనిపుణులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం అనేది ఏపీలో ఎన్డీయే కూటమికి చాలాపెద్ద దెబ్బ అని చెప్పాలి.

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కూటమిలోని రెండు పార్టీలకు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన తిరుగుబాటు అభ్యర్తులతో పాటు, కొందరు ఇండిపెండెంట్లు కూడా గాజుగ్లాసు గుర్తును పొందారు. అయితే గాజు గ్లాసు అనేది జనసేన గుర్తుగా బాగా పాపులర్ అయింది. గ్లాసు అనగానే అది పవన్ కల్యాణ్ గుర్తు అనేది రాష్ట్రమంతా తెలుసు. ఈ నేపథ్యంలో ఈవీఎంలో ఆ గుర్తు కనిపిస్తే ఆటోమేటిగ్గా కొన్ని ఓట్లు పడిపోయే అవకాశం ఉంది. అంటే ఆ మేరకు తెలుగుదేశం బిజెపి నష్టపోతాయన్నమాట.

ఈ ఇబ్బందిని నివారించేందుకు.. ఒక పార్టీకి కేటాయించిన కామన్ సింబల్ ను, మిగిలిన నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ గా కేటాయించకుండా కోరేందుకు హైకోర్టును సంప్రదించాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. ఈ మేరకు న్యా య నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం ఉదయం హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలుచోట్ల గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు కూడా జరిగిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందో వేచిచూడాలి. 

ఏంటీ చరణ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్‌!

మెగా పవర్‌ స్టార్, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చరణ్‌  ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుంచి జరగడం లేదు.  గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ తప్ప మరే అప్డేట్  బయటకు రాలేదు.  అయితే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని అనుకునేలోపే ఎన్నికలు  రావడంతో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ పూజా కార్యక్రమాలు కాకపోవడంతో సెట్‌పైకి రాలేదు. అయితే ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ఎలాగు వాయిదా పడింది కాబట్టి.. బుచ్చిబాబు తెరకెక్కించే సినిమా షూటింగ్ అయినా స్టార్ట్ అవుతుందని ఊహించారు.

తాజాగా, రామ్ చరణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు నెలల పాటు చరణ్ చాలా గ్యాప్ తీసుకుని కుటుంబంతో సమయం గడిపాక బుచ్చిబాబు చేసే సినిమా సెట్‌లో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నాడని టాక్. అంతేకాకుండా ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

అందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా.. ఏకంగా ఏడాది పాటు సమయం తీసుకోవడం మూర్ఖమైన నిర్ణయం అని అంటున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం ప్లీజ్ చరణ్ అలా చేయకు? అని తలలు పట్టుకున్నారు. సినిమాని ఎంత త్వరగా పూర్తి చేస్తే చరణ్‌కు అంత ప్లస్‌ అవుతుందని సలహాలు ఇస్తున్నారు.

సారీ నేను రాలేను..నాకు కొంచెం టైమ్‌ కావాలి!

ఐపీఎల్‌ కాపీ రైట్స్ కేసులో హీరోయిన్‌ తమన్నా సైబర్ పోలీసు కార్యాలయానికి హాజరు కాలేదు. ఆమెకు ముందుగా అనుకున్న షూటింగ్‌ కార్యక్రమాలు ఉండడంతో సోమవారం బయట ఉన్నందున ఆమె రాలేకపోతుందని ఆమె తరుఫున న్యాయవాది సైబర్‌ పోలీసులకు వివరించారు.

అయితే ఈ కేసులో తమన్నాను ప్రశ్నించేందుకు సైబర్ పోలీసులు మరో తేదీని ఇంకా ప్రకటించలేదు. నిజానికి, మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విషయంలో  సైబర్ పోలీసులు తమన్నాను విచారణకు పిలిచారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఇతర యాప్ ఫెయిర్ ప్లే 2023 IPLని చట్టవిరుద్ధంగా ప్రసారం చేసిందని పేర్కొంది. తమన్నా ఫెయిర్ ప్లేని ప్రమోషన్ చేసింది.

  కారణంగానే మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి ఆమెను పిలిపించారు. తమన్నా భాటియా ఏప్రిల్ 29న అంటే ఈరోజు సైబర్ పోలీసు కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది కానీ ఆమె ఈరోజు చేరుకోలేదు. షూటింగ్‌కు సంబంధించి బయట ఉన్నందున రాలేకపోయారని ఆమె లాయర్ తెలిపారు. ఆమెను సాక్షిగా విచారణకు పోలీసులు పిలిచారు.

ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను అరెస్టు చేశారు. 40 గంటలపాటు ఆపరేషన్‌ నిర్వహించిన ఛత్తీస్‌గఢ్‌ నుంచి పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పాటు ఈ కేసులో రాపర్ బాద్ షా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. 

అభిమానులకు దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన ముద్దుగుమ్మ!

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్‌ ఆయన వారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ యంగ్‌ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్‌ లో ది రాజా సాబ్‌ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్‌ తో ఓ ప్రాజెక్టులో ఆమె భాగస్వామిగా మారింది.

 ఆమె తరువాతి సినిమా పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న “తంగలాన్”.  ప్రస్తుతం ఈ సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌ అండ్‌ పాపులర్ అనే విషయం తెలిసిందే. ఆమె తన అభిమానులు, ఫాలోవర్స్ కోసమే అన్నట్లు పలు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. సోమవారం  ఆమె తన ఫాలోవర్స్ తో X.comలో చిట్‌ చాట్‌ సెషన్‌ లో అనేక రకాల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

అందులో పెళ్లి ఎప్పుడని ఓ అభిమాని అడగ్గా, “”నేను పెళ్లి చేసుకోవాలని ఎందుకు తొందరపడుతున్నావు?” అని ఆమె ప్రశ్నించింది. మొదటి సెలబ్రిటీ క్రష్ గురించి అడిగితే ఆమె హృతిక్ రోషన్ అని వెల్లడించింది. బొడ్డుకు రింగ్స్ లాంటివి పెట్టించుకోవడం గురించి ప్రస్తావిస్తే ఈ చాట్ కింకీ సెషన్ కాదని ఆమె అతనికి తెలియజేసింది. “సరే, మీరు ప్రశ్నోత్తరమైన ప్రశ్నోత్తరాల కోసం చూస్తున్నారు, నేను మేధోపరమైన వినోదం కోసం చూస్తున్నాను అని  ఆమె కూడా అంతే నాటీగా సమాదానం ఇచ్చింది.

ఇక ఆమె స్కిన్‌షోలు చేయడం మానేసి, మరింత సీరియస్‌గా నటించడం ఎప్పుడు ప్రారంభిస్తుంది అని అభిమాని అడిగినప్పుడు, ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. గ్లామర్ షో ఎప్పటికీ ఆపను అని సమాదానం ఇచ్చింది. ఆమె “నాకు ఇష్టం. సింపుల్… దానితో సమస్య ఉందా?” అని ప్రశ్నించింది. ఆమె ప్రభాస్ చిత్రంలో నటించడానికి హైదరాబాద్‌కు రెగ్యులర్ ట్రావెల్స్ చేస్తూ ఉంది కాబట్టి హైదరాబాద్ ఫుడ్ గురించి అడిగితే ఈ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. 

అభిమాని కోరిక తీర్చిన యంగ్‌ టైగర్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులన్నారన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ నటనకు ఫ్యాన్స్‌ ఎప్పటికప్పుడు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు.తారక్‌ ప్రస్తుతం డ్యాషింగ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ డైరెక్షన్‌ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చివరి దశ షూటింగ్‌ కు చేరుకుంది.  దీనితో సమానంగానే ఎన్టీఆర్ “వార్ 2 ” మూవీలో కూడా నటిస్తున్నాడు.

వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే .  ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. వార్ 2 తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అయితే నిన్న ముంబైలో ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి ఓ డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు.

ఈ పార్టీకి రణ్ బీర్ కపూర్,అలియా భట్ ,కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ సెలెబ్రెటీస్ హాజరు అయ్యారు.డిన్నర్ ముగించుకొని ఎన్టీఆర్ ,ప్రణతి బయటకు వస్తుండగా అభిమానులు సెల్ఫీస్ కోసం వచ్చారు. అయితే వారిలో ఓ అభిమాని ఎన్టీఆర్ ముందుకు వచ్చి సార్ ఇవాళ నా పుట్టినరోజు మీతో ఓ ఫొటో తీసుకోవచ్చా అని అడిగింది. దీనికి వెంటనే స్పందించిన ఎన్టీఆర్ చిరునవ్వుతో ఆమెను దగ్గరికి తీసుకుని ఆమెతో ఫొటో దిగి బర్త్డే విషెస్ తెలిపాడు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. 

Mahesh Babu Attends A Wedding Ceremony With His Family In A New Look

Superstar Mahesh Babu, accompanied by his family, graced a wedding ceremony in Hyderabad. The actor attended the wedding with his wife Namrata Shirodkar, and daughter Sitara Ghattamaneni. 

Mahesh Babu made a stylish entrance in a collared t-shirt paired with blue denim jeans, while Namrata and Sithara opted for traditional outfits. Photos and videos from the wedding have gone viral for Mahesh Babu’s new look with long hair.

In one of the videos, Mahesh Babu was seen with his sister, Manjula, where she was playfully teasing Mahesh with his hair. Fans are buzzing with excitement over his new avatar, anticipating it for his upcoming project with renowned director SS Rajamouli.

As we all know, Mahesh Babu, the acclaimed superstar, is currently gearing up for his highly anticipated next, tentatively titled ‘SSMB 29’, helmed by Maverick director SS Rajamouli. Mahesh Babu is currently working to achieve the look that visionary director Rajamouli envisioned. His latest appearance has left fans stunned and in love with his new look.

Speaking more about ‘SSMB 29’, touted to be an exhilarating globe-trotting jungle adventure, it will be backed by K.L. Narayana of Durga Arts. ‘SSMB 29’ marks the first collaboration between Rajamouli and Superstar Mahesh Babu, sparking expectations among global fans. With anticipation mounting, the latest update reveals that Indonesian actress Chelsea Elizabeth Islan will play a pivotal role in this flick. However, the makers have yet to make an official announcement.

Chandrababu Warns Officials Working For A Party Or An Individual

Strongly warning officials who are working for the interests of a political party or an individual, TDP chief Chandrababu Naidu said that government officials should work responsibly keeping in view of public interest only.  He said that officials who work for the interests of parties are dangerous to democracy.

Expressing concern over uncertainty prevailing in distribution of pensions in the state during the election period, Chandrababu warned that the government will be held responsible if any person dies while taking pension. He demanded Rs 10 lakh compensation to be given to the families of those who died after coming for pension and to register a case under government murders.

Chandrababu was furious that a situation of going to the governor on the pension issue was created in the state. Stating that last month they were turned around the secretariats and now they are asked to go around banks, he wondered how can they go for pension in the scorching heat of the sun if they deposit cash in the banks?

Is it an excuse to go around the banks in the middle of heatwaves saying that they are not getting money for the need?, he asked. He demanded that the government should mobilise alternative staff for pension distribution at doorstep and it is not appropriate to bother the elderly with lame excuses.

Accusing that the officials are searching for excuses, the former chief minister recalled that the officials who are now stating that they would deposit the pension cash in the bank accounts had previously said that they did not have the bank account details of the pensioners.

He asked how the details that were not there last month have come now? Stating that there are about 65 lakh pensioners and 48 lakh accounts are available, the officials said that it is not appropriate to ask beneficiaries who have Aadhaar link to deposit in banks.  Chandrababu expressed his grief that it is unfortunate that officials are also becoming part of one or other conspiracies of the ruling party.  

Setback To CM Jagan In Supreme Court On Illegal Sand Mining

Chief Minister Jagan Mohan Reddy faced a setback in the Supreme Court on Monday. The Apex High Court was furious over illegal sand mining. It ordered Jagan’s government to immediately stop illegal sand mining.

It is directed to implement the NGT directive as it is. The Supreme Court has passed orders to immediately stop the sand mining carried out without permits. The Supreme Court directed the AP government to take immediate action against illegal sand mining.

The Union Environment and Forest Department has been directed to file an affidavit by May 9 on the action taken against illegal sand mining. Also, the Supreme Court made it clear that the state government should also file an affidavit on illegal sand mining within the same date.

The court ruled that there was no stay on the NGT verdict. The Supreme Court also directed the NGT to take action against those who committed irregularities as per the rules. Jaypee Ventures has also been directed to give an affidavit stating that illegal sand mining is not taking place.

It has also directed the AP government to immediately stop sand mining where there are no environmental permits. Where there are permits, sand mining should be done only manually, it said.

 Petitioner Nagendra Kumar was advised to file a complaint against the illegal sand mining to the state government immediately. The Supreme Court also directed the AP government to take immediate action on the complaints of the petitioner.

Clarifying that even if an FIR is filed against those involved in illegal sand mining, action will be taken, the next hearing has been postponed to May 10. Meanwhile, the Apex Court rejected the state government’s plea for more time to file the affidavit due to elections. The Supreme Court ruled that environmental issues are more important than elections.