Home Blog Page 931

KCR Predicted Third Front Government At The Center

While BJP-led NDA is confident of winning a record number of 400 seats in the Lok Sabha and the Congress-led INDIA though silent on forming government on its own, but claiming that they can prevent BJP from forming next government, BRS chief and former Telangana chief minister K Chandrasekhar Rao predicting that a third front government will be formed at the Centre after the Lok Sabha elections.

Incidentally, he made the same prediction both in 2014 and also 2019 claiming that his party is going to play a crucial role in forming the next government. According to him, both NDA and INDIA will get around 200 seats each only and are unable to form the government on their own.

He said that the regional parties are growing in stature and will act as deciding factors in the government formation. “The power of regional parties is increasing. He said that parties like TMC in West Bengal, AAP in Delhi, Punjab and DMK in Tamil Nadu will play a big role and will be deciding factors.

“I.N.D.I.A alliance is nothing. Even ND Alliance (NDA), is also not very big, many parties left the coalition…but they can get around 200 seats each,” he said.

On being asked who could be the PM candidate for the I.N.D.I.A bloc, he said. “It is too early to say now. Let’s wait for the election results…NDA will definitely not get the complete majority and BJP will also not reach 272 (seats)…”

 When questioned about his support for BJP or Congress, he said that BRS will be fighting against both of them. “We have to fight with both (Congress and BJP). Both of them are enemies of Telangana and this has been proved several times. So we need to fight both,” he added.

KCR further stated that people will vote against BJP in the elections. “The farmers in the country are distressed. Both BJP and Congress have done injustice to them. People will go against Narendra Modi. I think BJP can’t reach a majority on its own,” the former CM said.

Attacking the Congress party, he said the whole country knows about the ‘corruption’ that happened under Congress. “The entire country knows about corruption done by Congress…because of this they have been named ‘Scamgress’,” he added.

PM Modi Says Congress Govt. Collecting `RR Tax’ In Telangana

Prime Minister Narendra Modi has severely criticized Chief Minister Revanth Reddy and Congress leader Rahul Gandhi for imposing Double R (RR) tax after the Congress government came to power in Telangana. He alleged that traders and industrialists have to pay this tax secretly and there is a discussion about it in Telangana.

Prime Minister Modi addressed a public meeting on Tuesday evening, organized by the BJP at Alladurgam under Zaheerabad constituency in Medak district. He alleged that the way Telangana was first looted by BRS, now Congress is looting in the same way in the name of double R tax.

Modi alleged that the Double R tax will go to Delhi, and everyone knows who will reach there. He recalled that the Telugu film industry has spread the fame of our country to the world with the Oscar-winning movie Triple R. But, he deplored that now the country is facing shame with double R tax.

If the double R tax is not prevented, PM Modi warned that the sate development will be halted.  Prime Minister Modi criticized that along with the BRS leaders, there are leaders of the Congress allies in Delhi in the liquor scam.

He assured that if BJP candidates are elected in all 17 seats of Telangana, they would block collection of this `RR Tx’. The prime minister alleged that the Congress, which announced that it would investigate Kaleshwaram corruption if it comes to power, is now trampling on the corrupt files of the project even though it is now in power.

Prime Minister Narendra Modi has made it clear that the Congress Party and the BRS are not different, they are birds of the same nest and are cooperating with each other. Modi also made harsh comments targeting CM Revanth Reddy on Amit Shah’s fake video.

 Accusing that both BRS and Congress are colluding with each other in corrupt practices, Modi recalled that it was BRS government that hid him from notes for the vote case. And as a gratitude, he said that the Congress party suppressed the Kaleshwaram corruption case of the BRS party, and criticized that both the parties are supporting each other.

కల్కిలో అదిరిపోయిన ప్రభాస్‌ లుక్‌!

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ కల్కి సినిమా కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా యావత్‌ సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ లో కల్కి 2898 ఏడీ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దిశా పటానీ, దీపికా పదుకొనె హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘కల్కి 2898 AD’లో ప్రభాస్ కొత్త లుక్ ను మూవీ మేకర్స్‌ విడుదల చేశారు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై చిత్ర బృందం కీలక అప్డేట్ ఇచ్చారు. అందులో ప్రభాస్ లుక్ ను కొత్త తరహలో  స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో విడుదల చేశారు.  

IPLలో మే 3న ముంబై, KKR మ్యాచ్ ఉంటుందని ప్రభాస్ తో చెప్పించారు. ఇక ఆ తరువాత భైరవ ఆశ్చర్యపరిచాడా? అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ప్రభాస్ లుక్ అయితే ఒక రేంజ్ లో కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా IPL 2024 మ్యాచ్ మధ్యలో ప్రభాస్ ‘భైరవ’ అవతార్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ వీడియో లక్నో సూపర్ జెయింట్స్ VS ముంబై ఇండియన్స్ IPL మైక్ సందర్భంగా ప్రదర్శించడం జరిగింది.

తన భైరవ గెటప్ లో ప్రభాస్ కనిపించాడు. మునుపటి IPL ప్రసారాల సమయంలో అమితాబ్ బచ్చన్  అశ్వత్థామ పాత్రను రివీల్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ భైరవ అవతార్ ను రివీల్ చేశారు. ఇక ‘కల్కి 2898 AD’ 27 జూన్ 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

బిజెపి కూటమి ధర్మాన్ని పాటిస్తున్నదా?

భారతీయ జనతా పార్టీకి ఏమైంది. తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమిగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోటీచేస్తున్నది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా అతిపెద్ద ద్రోహాలు తలపెట్టిన పార్టీనే అయినప్పటికీ.. ఈ దఫా తెలుగుదేశాన్ని, జనసేనను కలుపుకుని.. పోటీచేయడం వల్ల అటు ఎమ్మెల్యేలుగా గానీ, ఎంపీలుగా గానీ.. ఏపీలో తమ అస్తిత్వాన్ని చూపించుకోగల పాజిటివ్ వేవ్ తో అడుగు వేస్తోంది. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే.. భారతీయ జనతా పార్టీ కూటమి ధర్మాన్ని పాటిస్తున్నదా? లేదా? అనే అనుమానం అనేకమందికి కలుగుతోంది.

ఇవాళ ఎన్డీయే కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కవర్ పేజీ మీద చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఫోటొలు మాత్రమే ప్రచురించారు. మోడీ ఫోటో గానీ, బిజెపి జాతీయ సారథి నడ్డా ఫోటోగానీ, ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి ఫోటో గానీ లేకుండా పోయింది. బిజెపినే వద్దన్నది అనే మాట వినిపిస్తోంది. పైగా ఈ మేనిఫెస్టోలో జనసేన సూచించిన హామీలను కూడా అనేకం జత చేశారు. అయితే బిజెపి మేనిఫెస్టోకు తమ తరఫున కొన్ని సూచనలను కూడా ఇవ్వలేదు. అలాంటి ప్రస్తావన అందులో ఎక్కడా లేదు.
కనీసం మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి వారు రాలేదు. కేంద్రం తరఫున పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాత్రమే వచ్చారు. ఆయన కూడా మేనిఫెస్టోను పట్టుకుని ఫోటో దిగడానికి ఇష్టపడలేదు. ఇలాంటి వ్యవహారాలు ప్రజల దృష్టిలో కూటమి పార్టీల ఐక్యత మీద సందేహాలు రేకెత్తిస్తాయనే కనీస స్పృహ భాజపాకు లేదా అనేది ప్రశ్న.

ఈ పార్టీల మధ్య ఓటు బదిలీ పద్ధతిగా జరిగి, అన్ని పార్టీలు విజయం సాధించాలని వారు కోరుకుంటున్నారు. కానీ బిజెపి వ్యవహారం గమనిస్తుంటే.. వారు కూటమి ధర్మాన్ని పాటించడం లేదని, ప్రజల్లో వీరు పలుచనకాకుండా.. జాగ్రత్త పడాలని తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు. 

వారెవ్వా : ఐదేళ్ల జీతం.. ఒక్క రోజుకు తాయిలం!

గ్రామాల్లో ఓటర్లతో ఇంతకాలం వ్యక్తిగతంగా టచ్ లో ఉంటూ వచ్చిన వాలంటీర్లను ప్రలోభ పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విసురుతున్న వల చాలా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారు ఆఫర్ చేస్తున్న తాయిలాల గురించి విని వాలంటీర్లకే దిమ్మ తిరుగుతోంది. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఇంత సొమ్ములు అప్పనంగా వచ్చి పడిపోతాయా? సాధ్యమేనా? కల కాదు కదా? అని ఆశపడుతున్నారు. ఇంతకు ఏం జరుగుతోంది..?

వాలంటీర్లను ప్రలోభ పెట్టి వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికల రోజున తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లుగా వాడుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా వ్యూహం. వారిద్వారా పింఛన్లు పంపిణీ చేస్తూ ‘‘జగన్ మళ్ళీ గెలవకపోతే ఆ లబ్ధి ప్రజలకు శాశ్వతంగా ఆగిపోతుంది’’ అని లబ్ధిదారులను భయపెడుతూ, గెలవవచ్చునని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ పాచిక పారకపోవడంతో ఇప్పుడు వారితో రాజీనామాలు చేయిస్తున్నది. వారిని ఎన్నికల ప్రచారంలో తమ వెంట తిప్పుకోవడానికి కూడా వీల్లేకపోవడం వల్ల ఇలాంటి ఎత్తుగడకు వెళ్ళింది. ఇప్పుడు రాజీనామా చేసేస్తే ఈ పది రోజులు పాటు ముమ్మరంగా వారితో ప్రచారం నిర్వహించవచ్చు అనేది పార్టీ ఆలోచన. అలాగే వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాడుకుంటే ఓటర్లు బూత్‌కు వచ్చిన సమయంలో అక్కడ కూర్చుని ప్రభావితం చేయగలరు అనేది ఆశ!

అయితే వాలంటీర్లకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనం 10000 రూపాయలకు పెంచుతామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటన ఇప్పుడున్న వాలంటీర్లలో ఆశలను పెంచుతుంది. వైసిపి వారు మాత్రం అందరూ తమ కార్యకర్తలే గనుక బలవంతంగా రాజీనామా చేయించాలని అనుకుంటున్నారు. అందుకుగాను ఒక్కొక్కరికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయల సొమ్ము ఒకేసారి ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు లక్షల రూపాయలు అంటే గత ఐదేళ్లపాటు వాలంటీరుగా పనిచేసే సంపాదించిన జీతంతో సమానం అని ఆ ఆఫర్ వినిన వారు కూడా విస్తుపోతున్నారు.

ఒక వాలంటీరుకు నెల జీతం ఐదు వేల రూపాయలు. ఈ లెక్కన అయిదేళ్లు పనిచేస్తే 3 లక్షల రూపాయలు వస్తాయి. ఒక్కరోజు పోలింగ్ బూత్ ఏజెంటుగా పని చేయడానికి సిద్ధపడి ఆ పదవికి రాజీనామా చేస్తే ఐదేళ్ల జీతంతో సమానమైన మూడు లక్షల రూపాయలు తాయిలంగా లభిస్తోందంటే వారు నమ్మలేకపోతున్నారు. అయితే వారి ద్వారా లబ్ధిదారులైన వృద్ధులను వికలాంగులను వితంతువులను భయపెట్టడం ప్రలోభ పెట్టడం సులువు కనుక, వారి మీద ఇంత భారీ పెట్టుబడి పెట్టి పోలింగ్ ఏజెంట్లుగా వాడడానికి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.

అరే ఏంట్రా ఇది.. మా చైతూని ఇలా చేశారు!

అక్కినేని వారసుడు నాగ చైతన్య గురించి టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాయి. మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో కనిపించే చై ఇప్పుడు ఒక్కసారిగా రఫ్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేశాడు.

తాజాగా చైతూ ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎయిర్ పోర్ట్ లో ఎక్కడికో వెళ్తున్న చైతన్యను కెమెరాలు బంధించాయి.  ఆ ఫోటోల్లో చై గుబురు గడ్డంతో పాటు బాడీ బిల్డర్ లాగా ఫిట్ గా కనిపించాడు.. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అరె ఏంట్రా ఇది .. ఎలా ఉన్న మా హీరోను ఎలా మార్చారు.. సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా స్టైలిష్‌ గా  ఉండే వాడిని ఇలా తయారు చేశారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి నాగ చైతన్య ధూత సినిమా తర్వాత ఇలాగే లుక్ కనిపిస్తున్నాడు.. ఇకమీదట ఇలాంటి యాక్షన్ సినిమాలనే చేస్తాడేమో అని ఫ్యాన్స్ అంటున్నారు.. ఇక చై సినిమాల విషయానికొస్తే.. తండేల్ సినిమా చేస్తున్నాడు.. అలాగే మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.. ఇక ధూత 2 కూడా రాబోతుందని సమాచారం..

ఆ మాట జనం నమ్మితే. జగన్ కు గండమే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘‘అ ఆ’’ చిత్రంలో క్లైమాక్సులో ఒక డైలాగు ఉంటుంది. హీరో నితిన్‌ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన విలన్ రావు రమేష్, అన్ని ప్రయత్నాలలోనూ విఫలమైన తర్వాత చిట్టచివరగా కొడుకుతో ఒక మాట అంటాడు ‘‘శత్రువులు సెపరేటు ఎక్కడ ఉండర్రా..  మన ఇళ్లలోనే కూతుళ్లలాగానో.. చెల్లెళ్లులాగానో పుడతారు’’ అని! ఈ మాటను బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజుకు వందసార్లు మననం చేసుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమరంలో ఆయన ఎదుర్కొంటున్న మొట్టమొదటి ప్రత్యర్థి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలనే! ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, దుర్మార్గుడు, రాష్ట్రాన్ని దోచుకు తినేస్తున్నాడు లాంటి రకరకాల రొటీన్ ఆరోపణలతో చంద్రబాబు నాయుడు ఆయనకు చేయగలిగే డ్యామేజీ కంటే, షర్మిల చేసే నష్టం ఎక్కువ! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి తెలుగు ప్రజలలో ఉండే అభిమానం అనే పునాదుల మీదనే జగన్మోహన్ రెడ్డి రాజకీయ బతుకు ప్రస్థానం నడుస్తోంది. అలాంటిది రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో జగన్ అంటే అసహ్యం పుట్టే లాగా వైఎస్ షర్మిల కొత్త కొత్త ఆరోపణలను రోజుకొకటిగా బయటకు తీస్తున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి రాముడైతే లక్ష్మణుడిలా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేయించిన హంతకుడు అవినాష్ రెడ్డిని రెండోసారి పార్లమెంటుకు పంపడానికి జగన్ తపన పడిపోతున్నాడు అంటూ షర్మిల ఇప్పటికే చెలరేగిపోతున్న సంగతి అందరికీ తెలుసు. తాజాగా ఆమె అక్రమాస్తులకు సంబంధించిన సిబిఐ ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ పేరును జగన్ బలవంతంగా ఇరికించారంటూ సరికొత్త ఆరోపణలను తెరమీదికి తెచ్చారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా మూడు కోర్టులలో పిటిషన్లు వేయించి తొలుత ఎఫ్ఐఆర్లో లేని వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును చార్జిషీట్లోకి వచ్చేలాగా చేసింది అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అని ఆమె చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా,  రాజశేఖర్ రెడ్డి పేరు కూడా చార్జిషీట్లో ఉన్నట్లయితే తాను తప్పించుకోవడం సులభం అవుతుంది అని జగన్ ఆ రోజు నమ్మాడు అనేది ఆమె వాదన.

ఈ మాటలను ప్రజలు నమ్మారంటే గనుక జగన్ బతుకు భ్రష్టు పట్టిపోతుందనటంలో సందేహం లేదు. ఇవాల్టికైనా సరే జగన్‌కున్న ప్రధానమైన బలం రాజశేఖర్ రెడ్డి అభిమానులే. అలాంటిది వారందరూ కూడా తమ ప్రియతమ నేతకు ద్రోహం చేసింది కన్నకొడుకే అనే సంగతిని గుర్తించారంటే షర్మిల మాటలను విశ్వసించారంటే జగన్‌ను అసహ్యించుకుంటారు, ఆయన పతనాన్ని కోరుకుంటారు! అందుకు తమ శక్తి యుక్తులు అన్నీ వెచ్చిస్తారు. అదే జరిగితే గనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతుంది అని ప్రజలు అనుకుంటున్నారు.

PM Modi Asks BJP Candidates To Highlight Congress’ Regressive Politics

Prime Minister Narendra Modi on Tuesday wrote to the Bharatiya Janata Party (BJP) candidates ahead of the third phase of voting and urged them to spread the word against the regressive politics of the Congress and I.N.D.I. alliance.

He also asked them to speak against their agenda to give reservations to Muslims by snatching it from SC/ST and OBC. “They (Congress) are hell-bent on snatching away people’s hard-earned money and giving it to their vote bank. Congress has also made it clear that they will support dangerous ideas like ‘inheritance tax’. The country will have to unite to stop them, the PM’s letter read”.

He asserted that very vote that the BJP gets is a vote to accelerate its efforts to form a strong government and make India a developed nation by the year 2047. The encouraging trends of the first two phases of elections show that the people of India are determined to support our vision in this election, he added.

“Through this letter, I would like to tell the people of your constituency that this is not an ordinary election. Families across India, especially the senior members, would remember the difficulties they have gone through in the 5-6 decades of Congress’ rule”, he said.

Referring to his 10-yeaer regime, he said that in the last 10 years, the quality of life of every section of society has improved, with many of these troubles removed. “Yet, a lot more is still to be done and this election will be decisive in our mission to ensure a better life for everyone,” the PM wrote in the letter.

Responding to the PM’s letter, Union Minister and BJP’s Porbandar candidate Mansukh Mandaviya expressed gratitude for his inspiring words. “The work done by you in the last 10 years has brought a big change in the lives of the poor, youth, farmers and women power. All of us workers will work hard on these suggestions of yours,” Mandaviya wrote on X. 

TDP, Jana Sena, BJP Joint Manifesto Highlights

* First signing on Mega DSC

* Increase in social pensions to Rs.4,000 (applicable from April 2024)

* Three gas cylinders free per year

* Free travel in RTC buses for women

*  Increase in pension for disabled persons to Rs.6 thousand

*  Rs.4,000 pension for BCs after 50 years of age

*  Rs.1,500 per month for every female above 18 years

*  20 lakh jobs for youth in five years at the rate of 4 lakh per annum

*  Allowance of Rs.3 thousand per month for unemployed youth

*  Rs. 15,000 per year for children studying under `TallikI Vandanam’

* Investment assistance to farmers at the rate of Rs.20,000 per year

* Volunteers’ honorarium increased to Rs.10,000

* Two cents in urban areas and 3 cents land in rural areas for house and construction of houses

* Sand is free.

* Special law for protection of BCs

*  Free tap connection to every household and clean drinking water supply

* Repeal of Land Rights Act

* Assurance that electricity charges will not be increased

* Free electricity for handloom workers up to 500 units I

* Giving Rs.1 lakh as a wedding gift

* Revival of foreign education scheme

* stop selling of inferior liquor and regulationof prices.

* Rs. 1.50 per unit of electricity for Aqua farmers.

* Renewal of schemes for SC, ST, BC, Minorities

*  Special policies and schemes for handloom weavers

*  An honorarium of Rs. 25,000 for Nayi Brahmins working in temples

* Financial assistance of Rs.20,000 to fishermen during hunting break, to cancel GO 217 and financial assistance for boat repairs

* A special corporation for goldsmiths and support them

* Interest free loans up to Rs.10 lakh to Dwakra societies  

*Interest free loans for small traders

* Inauguration of ‘Kalalaku Rakkala Padhakam’ for girl child education

* Rs.10 lakh subsidy for MSMEs and StartAp companies

* Implementation of 10 percent EBC reservation brought by NDA

* Consultation with the Center for 33 percent reservation for BCs in the Legislative Assembly

* Expenditure of Rs.1.50 lakh crores in five years through BC subplan

* Review CPS of employees and appropriate remedial action

* Outsourcing and justice for Anganwadi employees

*  To spend Rs. 15,000 crores for the welfare of Kapu ⇨

* Equipment with Rs.5,000 crores annually under Aadharana scheme

* Justice for the upper caste poor as well

* To build houses on already sanctioned sites  

*  200 units of free electricity to Dobi Ghats

* 10 percent reservation in liquor shops for Geetha workers

* 15% reservation in quarries for Vadderas. Exemption in Royalty, Scenarios

* Rs.10,000 under government stipend for advocates

* Continuation of Amaravati as capital

*  Generic drug stores in every mandal

* Anna canteens will be set up

*  Health insurance of Rs.25 lakh per family in the state

*  Digital health cards for all

* To build a Hajj House in Vijayawada

*  Release of Job Calendar annually

అనుకున్నట్టే హైకోర్టుకు… పవన్‌కు రేపు ఊరట!

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్ గా మారుతోంది. జనసేనకి ఉమ్మడి గుర్తుగా దానిని కేటాయించిన తర్వాత కూడా మిగిలిన నియోజకవర్గాల్లో ఫ్రీ సింబలుగా ఆ గుర్తు అందుబాటులో ఉండడం అనేది ఈ వివాదానికి మూల కారణం. అలాగే చాలా నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ లు గాజు గ్లాస్ గుర్తు తీసుకోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్- ఏ ఆశయంతో అయితే భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి తెలుగుదేశంతో తాము కూడా కలిసి జట్టు కట్టారో ఆ ఆశయం ఇప్పుడు సమూలంగా దెబ్బతినిపోతున్నది. అది కూడా పవన్ కళ్యాణ్ పార్టీ రూపంలోనే దెబ్బ పడుతున్నది. ఈ పరిణామంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం నాడు తీర్పు వెలువడుతుంది. జనసైనికులకు తప్ప మిగిలిన ఇండిపెండెంట్లు ఎవరికీ కూడా ఈ గాజు గ్లాసు గుర్తు లేకుండా నిర్ణయం వస్తుందని ఆశావహంగా ఎదురుచూస్తున్నారు.

తెలుగుదేశం కూటమిలోని మిత్రపక్షాలను తెలుగుదేశం పార్టీని కుట్రపూరితంగా దెబ్బకొట్టే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాంగం చేసిందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎన్నికల సంఘం ఇలాంటి కుట్రకు పాల్పడిందని అనడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే వారు నిబంధనల ప్రకారమే వెళ్తుంటారు. అయితే అనుకోకుండా కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి దళం బాగా వినియోగించుకుంటున్నారు.
జనసేన హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తమ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడిగా ఈ గుర్తుని కేటాయించిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలలో ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించాలని తాము ఎన్నికల సంఘాన్ని ముందే కోరినట్టుగా ఆ పార్టీ న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది మాట్లాడుతూ వారి ఫిర్యాదు పై 24 గంటల్లోగా ఈసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసు కూడా బుధవారానికి వాయిదా పడింది.

గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్ లకు ఉండడం కూటమి పార్టీలకు చాలా పెద్ద సీరియస్ సమస్య. కనుక హైకోర్టు ఈ విషయంలో వాస్తవ దృష్టితో ఆలోచించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ప్రకారం ఇండిపెండెంట్ లకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును తక్షణం రద్దుచేసి వారికి వేరే గుర్తు ఇవ్వవలసిందిగా అవసరమైతే అందుకు సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా చెల్లించవలసిందిగా హైకోర్టు ఆదేశించే అవకాశం ఉన్నది అని పలువురు భావిస్తున్నారు.