Home Blog Page 924

తప్పుకున్నారా..తప్పించారా!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాన్‌ ఓ పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ఆయన బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదంతా రాజకీయంగా పక్కన పెడితే ఆయన ఎప్పుడో మొదలు పెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తవుతుంది. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.

కొండ పొలం సినిమా చేసిన తర్వాత క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే ఒక బందిపోటు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ముందు నుంచి టాక్‌ నడుస్తుంది. అయితే ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తున్న క్రమంలో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.

ఇప్పుడు ఆ ప్రచారానికి ఊతమిస్తూ రెండు రోజుల నుంచి విడుదల చేస్తున్న పోస్టర్లలో క్రిష్ పేరు లేపేసింది చిత్ర బృందం. అయితే క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం వల్లే ఆయన పేరుని సినిమా పోస్టర్ మీద నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి సమాచారం ఇస్తూ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ చేసిన సోషల్‌ మీడియా ఖాతాలో  మాత్రం క్రిష్ ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేశారు. ఒకవేళ క్రిష్‌ తప్పుకుంటే ఆయన ట్విట్టర్ అకౌంట్‌ ని ట్యాగ్‌ చేయాల్సిన అవసరం లేదు.

అయితే సినిమా పోస్టర్ మీద ఆయన పేరు ఎందుకు లేదు అనేదాని మీద మాత్రం క్లారిటీ లేదు. ఆ మధ్య క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. జ్యోతికృష్ణ గతంలో పలు సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఉండడంతో ఆయన సినిమాని టేకప్ చేశారని అన్నారు. 

వారి వల్లే నా కెరీర్‌ ముగిసింది: ఇలియానా!

తెలుగు, తమిల సినిమాలతో వరుస అవకాశాలు వచ్చిన తరువాత ఇక్కడ అందివచ్చిన అవకాశాలను వదులుకొని ముద్దుగుమ్మలు బాలీవుడ్‌ కి చెక్కేయడం కామనే. ఇప్పటికీ కొత్తమంది హీరోయిన్లు అలానే చేస్తుంటారు. ఈ క్రమంలోనే గోవా భామ ఇలియానా కూడా ఇలాగే బాలీవుడ్‌ మోజులో పడి టాలీవుడ్‌ కి గుడ్ బై చెప్పేసి చాలా సంవత్సరాలు పాటు అక్కడే సెటిలైంది.

ఆ తరువాత ఇబ్బందులు ఎదురవ్వడంతో మళ్లీ తెలుగు సినీ ప్రపంచం వైపు చూసింది. కానీ ఆమెకు అవకాశాలు వచ్చినా పెద్దగా ఉపయోగపడలేదు. వరుస డిజాస్టర్స్‌ తో కెరీర్‌ ముగిసిపోతుందని అనుకుంటున్న నేపథ్యంలో పెళ్లలి చేసుకొని , ఓ బిడ్డను కని హ్యాపీగా ఉంటుంది.

పెళ్లయిన తర్వాత బాలీవుడ్ లో ఒకటి అర అవకాశాలు వస్తుంటే వాటిని చేస్తూ హ్యాపీ హ్యాపీగా గడిపేస్తోంది. ఇక తాజాగా ఆమె చేసిన ఒక సినిమా ప్రమోషనల్ ఆక్టివిటీస్ లో తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. రవితేజతో చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత బాలీవుడ్ కి వచ్చానని అప్పటి నుంచే తెలుగు ఆఫర్స్ రాలేదని ఆమె చెప్పుకొచ్చింది.

తెలుగు సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న టైమ్‌ లోనే బాలీవుడ్ లో  బర్ఫీ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నిజానికి టాలీవుడ్ లో చాలా సినిమా అవకాశాలు నాకు ఉన్నా సరే ఎందుకో బర్ఫీ అవకాశాన్ని మాత్రం వదులుకోవాలి అనిపించలేదు. నేను జడ్జ్ చేసినట్టుగానే ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆ సినిమా  హిట్ కావడంతో తెలుగులో ఆమె ఇంకా నటించదు అని కొంతమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీలో ప్రచారం మొదలుపెట్టారు.

ఆ ప్రచారంతో  తెలుగులో సినిమా అవకాశాలు ఇస్తారు అనుకున్న వాళ్లు కూడా నాకు ఇవ్వలేదు. నేను ముంబైలో ఉండడం వల్ల ఇక్కడే సెటిల్ అయిపోయాను అని అందరూ అనుకున్నారు. నేను ఏ ఇండస్ట్రీలో  నటించినా ఎంతో నిజాయితీగానే పని చేశానని ఈ సందర్భంగా ఇలియానా చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను పడిన కష్టానికి తగ్గ గుర్తింపు దక్కలేదేమో అని తాను ఫీల్ అవుతున్నానని ఆమె చెప్పకు వచ్చింది.

ఛాంపియన్‌ గా రాబోతున్న శ్రీకాంత్‌ తనయుడు!

0

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ తొలి చిత్రం తోనే మంచి మార్కులు కొట్టేశాడు. నిర్మలా కాన్వెంట్‌ సినిమాలో రోషన్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అదే జోరులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌ పర్యవేక్షణలో వచ్చిన  పెళ్లి సందడి సినిమాలో రోషన్ హీరోగా నటించాడు . రోషన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించి మెప్పించింది.

 అలాగే నటన,  డాన్స్ పరంగా ఎంతగానో ఆకట్టుకున్నారు..అయితే ఈ సినిమా కమర్షియల్గా అంతగా ఆకట్టుకోకపోయిన హీరో రోషన్ కు హీరోయిన్ శ్రీలీలకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది . కానీ రోషన్ మాత్రం మరో సినిమాలో నటించలేదు. తాజాగా రోషన్‌ ఇప్పుడు వైజయంతీ మూవీస్ సంస్థలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

రోషన్ హీరోగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంస్థలు కలిసి ‘ఛాంపియన్’ అనే సినిమా రూపొందిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ ‘అద్వైతం’తో జాతీయ అవార్డు అందుకున్న ఈ డైరెక్టర్‌ ‘ఛాంపియన్’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ‘ఛాంపియన్’ మూవీ రూపొందుతోంది.

జులై నుంచి సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు అవనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రోషన్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఛాంపియన్’ సినిమాలో హీరో లుక్ ను విడుదల చేస్తూ రోషన్ కు చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలిపింది. 

అక్కడ కుదిరితే రాష్ట్రమంతా అదే చేయాలి!

గాజు గ్లాసు గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదా? వారి భిన్నమైన వ్యవహార సరళి కారణంగా.. కూటమి పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో పోటీచేస్తున్న ఒక పార్టీకి కామన్ సింబల్ గా ఒక గుర్తును కేటాయించినప్పుడు.. ఆ రాష్ట్రంలో మరెవ్వరికీ అదే గుర్తు దక్కకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. కానీ వారా పని చేయలేదు. జనసేన పోటీచేస్తున్న 21+2 నియోజకవర్గాల్లో తప్ప గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గానే నోటిఫై చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం.
ఆయా నియోజవకర్గాల్లో ఇండిపెండెంట్లు జనసేన, తెలుగుదేశం రెబెల్స్  ఆ గుర్తును తీసుకుంటున్నారు. దీంతో కూటమిగా పోటీచేస్తున్నప్పటికీ ఈసీ నిర్ణయం కారణంగా.. తెలుగుదేశం, బిజెపి అభ్యర్థులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. అదే సమయంలో.. గాజు గ్లాసు గుర్తుగా పొందుతున్న ఇండిపెండెంట్లకు భారీగా ఫైనాన్స్ చేసి, వారు విస్తృతంగా ఓట్లు వేయించుకునేలా ఆ మేరకు తమ ప్రధాన ప్రత్యర్థిని దెబ్బకొట్టేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ కుట్ర వ్యూహాలను కూడా ప్రారంభించింది. ఈ లోగా జరుగుతున్న తీవ్రనష్టం గురించి- జనసేన హైకోర్టును ఆశ్రయించింది.

అయితే హైకోర్టుకు ఈసీ ఇచ్చిన నివేదిక చిత్రంగా ఉంది. జనసేన ఎంపీ స్థానాల్లో కూడా పోటీచేస్తున్న కాకినాడ, మచిలీపట్నం నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యే ఇండిపెండెంట్లు ఎవ్వరికీ ఆ  గాజు గ్లాసు గుర్తు ఇవ్వబోమని చెప్పింది. అంటే అక్కడ మాత్రం కూటమి అభ్యర్థులు నష్టం తప్పించుకుంటారు.
మిగిలిన సీట్లలో అంటే ఇంచుమించు 140 స్థానాల్లో తెలుగుదేశం, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల మెడపై కత్తిలాగా గాజుగ్లాసు గుర్తు వేలాడుతూ ఉంటుంది. అక్కడ ఎవరైనా ఆ గుర్తు తీసుకుంటే వారు భారీగా నష్టపోతారు.
అయితే రెండు ఎంపీసీట్ల పరిధిలో ఏ ఏర్పాటు చేయగలుగుతున్నదో, అదే ఏర్పాటును ఈసీ రాష్ట్రమంతా కూడా చేసి తీరాలని కూటమి పార్టీలు అభ్యర్థిస్తున్నాయి. ఇలాంటి మెలిక వలన.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు  అవుతుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆరోగ్యభద్రతలో బాబు వరం బ్రహ్మాస్త్రమే!

ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం శ్రద్ధ వహించడం అంటే ఏమిటో .. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు కలిసి తాజాగా విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో నిరూపిస్తున్నది. కోట్ల మంది ప్రజల యొక్క ఆరోగ్య భద్రత గురించి ప్రభుత్వం బాధ్యత వహించడంతో పాటు ప్రజలకు అద్భుతమైన వరాన్ని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని బీపీ, షుగర్ రోగులు అందరికీ అవసరమైన జనరిక్ మందులను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని అన్నారు. ప్రత్యర్థులకు దిమ్మతిరిగే హామీ ఇది. కనీసం కోటిమంది మీద సంధించిన బ్రహ్మాస్త్రం ఇది.
కేవలం అనువంశికంగా మాత్రమే కాకుండా.. ఇప్పుడు సమాజంలో బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆధునిక జీవన శైలులు, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా.. బీపీ మరియు షుగర్ వ్యాధులు చాలా చిన్నవయసులోనే వచ్చేస్తున్నాయి. మూడు పదులు కూడా నిండకుండానే ఈ వ్యాధుల బారిన పడుతున్న వారు కూడా పెరుగుతున్నారు. నడివయసు వారైతే ఇక చెప్పే అవసరమే లేదు. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి షుగర్, బీపీ వ్యాధులు తప్పకుండా ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం అంటే అద్బుతమైన వరమే.

అదొక్కటి మాత్రమే కాదు.. ప్రజారోగ్యం గురించి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో.. ఈ మేనిఫెస్టో ద్వారా నిరూపించుకున్నారు కూడా. ప్రతి కుటుంబానికి దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా చేయించేందుకు కూడా తెలుగుదేశం పూనుకుంటున్నది. అలాగే ప్రతి పౌరుడికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం అని.. అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాలు ఏర్పాటుచేస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యం విషయంలో కూడా తన ఎప్పటిమాదిరి అలసత్వ ధోరణినే ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రజలకు ఎలాంటి కొత్త హామీలు ఆయన ఇవ్వలేదు సరికదా.. తమ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే మెరుగైన వైద్య సేవలు అందిస్తాం అనే స్వీపింగ్ స్టేట్మెంట్ తప్ప.. నిర్దిష్టంగా తాము చేయదలచుకున్నది ఏమిటో ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజారోగ్యం గురించి ఉన్న శ్రద్ధపై అనుమానాలు కలుగుతున్నాయని, చంద్రబాబునాయుడు ఉచితంగా మందులు పంపిణీ వంటి హామీ.. బీపీ షుగర్ రోగుల్లో జీవితం పట్ల ఒక భరోసాకు కారణం అవుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే వార్త!

యంగ్‌ రెబల్‌ స్టార్‌  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా 2023 లో విడుదల  అయింది. ఈ సినిమా గతేడాది భారీ వసూళ్లను రాబట్టింది.  ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే రెండవ భాగం కూడా ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇప్పట్లో ఆ సినిమా ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది.

ఎందుకంటే ప్రభాస్ లైన్‌ లో  చాలా సినిమాలు ఉన్నాయి. కాబట్టి సలార్ 2 సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరి కొద్ది రోజుల్లోనే సలార్ 2 సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తుంది. మే నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో పది రోజుల పాటు షూటింగ్ జరపనున్నారని సమాచారం. ఇప్పటికే గత మూడు నెలల నుంచి ప్రశాంత్, అతని టీం మొత్తం కలిసి సలార్ 2 స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇప్పుడు అది ఒక కొలిక్కి రావడంతో ఈ నెలాఖరు నుంచి పది రోజుల పాటు షూట్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే ఈ ఏడాదిలో సలార్ 2 షూటింగ్ పూర్తి చేస్తారని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే దాదాపుగా ప్యాచ్ వర్క్ లు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళతారని చెబుతున్నారు.

హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు బెంగుళూరు అవుట్ స్కర్ట్స్ లో ప్రత్యేకమైన సెట్స్ నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2025 చివరిలోపు సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా మొదటి భాగం డిసెంబర్లో వచ్చింది కాబట్టి రెండో భాగాన్ని కూడా డిసెంబర్ లోనే విడుదల చేసే  అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక మొదటి భాగంలో రివిల్ చేసినట్లుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న పృథ్వీరాజ్, ప్రభాస్ ఎలా ప్రాణాలు తీసుకునేంత శత్రువులు అయ్యారు అనే లైన్ లోనే సినిమా సాగనుంది.

Anupam Kher Shares A Pic With His ‘Favorite Actor’, Jr. NTR: Deets Inside

Jr. NTR is one of the most talented and revered actors in the Indian film industry. The actor garnered acclaim for his remarkable talent and versatility. Currently, Jr. NTR is in Mumbai, working on his much-anticipated next, ‘War 2’ alongside Hrithik Roshan, helmed by Ayan Mukherji. 

Recently, Jr. NTR met the veteran actor Anupam Kher in Mumbai. The renowned actor Kher took to his Instagram handle and shared a picture with his favorite actor, Jr. NTR. Along with the photo, the renowned actor Kher wrote, “It was such a pleasure to meet one of my favourite persons and actor @jrntr last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! #Actors”

On the work front, Anupam Kher will be seen in Nikhil’s upcoming film ‘The Indian House’ and is currently working on his second directorial, ‘Tanvi The Great’, marking his return to the director’s chair after a long hiatus.

Meanwhile, Jr. NTR is currently gearing up for his upcoming endeavors, including War 2 and Devara: Part 1, helmed by Ayan Mukherji and Koratala Siva, respectively. War 2 marks his debut in Bollywood alongside Hrithik Roshan and Kiara.

The actor will also appear in his much-anticipated next, ‘Devara: Part 1, pairing with Janhvi Kapoor. Adding to the anticipation, the film also stars Saif Ali Khan, Srikanth Meka, Prakash Raj, Abhimanyu Singh, and Ramya Krishnan in pivotal roles.

పెన్షనర్ల ఓటు సైకిలుకు పడకుండా ఆపేదెలా??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పింఛనర్ల ఓట్లు గంపగుత్తగా సైకిలు గుర్తుకు, వారి భాగస్వామ్య పార్టీల గుర్తులైన కమలం, గాజు గ్లాసుకే పడబోతున్నాయా? ఏపీలో ఈ దఫా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్న వారే కీలకభూమిక పోషించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. పెన్షనర్ల ఓట్లు తెలుగుదేశానికి పడకుండా కట్టడి చేయడం ఎలా?  అనేది వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎదురవుతున్న కొత్త తలనొప్పిగా ఉంటోంది.
సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిన తర్వాత చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలు పొందుతున్న పెన్షనర్లకు ప్రకటించిన వరం.. ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పాలి. సుమారు నెలరోజుల కిందట తన వాగ్దానాన్ని సభల్లో ప్రకటించిన చంద్రబాబునాయుడు తాజాగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆ విషయం ప్రస్తావించారు. ఆ హామీ ఇప్పటికే మారుమూల గ్రామాల్లో ఉన్న పెన్షనర్లకు కూడా బాగా రీచ్ అయింది. జగన్మోహన్ రెడ్డి.. తన దృష్టిలో ప్రజలు అంటే కేవలం ఓట్లు తప్ప మరొకటి కాదు అన్నట్టుగా.. ప్రస్తుతం మూడు వేలు ఉన్న పెన్షన్లను 2029 ఎన్నికలకు ముందు రెండేళ్ల పాటు 250 వంతున పెంచుతానని హామీ ఇవ్వడం కేవలం వారిని హేళన చేయడం లాంటిదే అని పలువురు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు వారికి ఘనమైన హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పెన్షను నాలుగు వేలకు పెంచి.. తమ ప్రభుత్వం రాగానే జులైనెలలో అరియర్స్ మూడువేలతో పాటు మొత్తం ఏడువేల రూపాయలను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే అందజేస్తాం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ హామీని తెలుగుదేశం శ్రేణులు ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాయి. పెన్షనర్ల ఓట్లు తెలుగుదేశానికి, కూటమి పార్టీలకు గంపగుత్తగా పోలయ్యే పరిస్థితి. అయితే వారికి ఓట్లు పడకుండా చేయడం ఎలా అని వైసీపీ దళాలు  తలలు పట్టుకుంటున్నాయి.
చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు, ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోరు.. అనే ఒక్క వాదన తప్ప.. జగన్ వద్ద మరో అస్త్రం లేదు. జగన్ ను గెలిపిస్తే.. ఇప్పుడు వచ్చేదే వస్తుంది. అదే చంద్రబాబుకు ఓటువేస్తేపెంచిన పెన్షను వస్తుంది, ఆయన గెలవకపోయినా ఇప్పుడున్నది ఎటూ వస్తుంది.. అనే ఉద్దేశంతో పెన్షనర్లు సిద్ధమవుతున్నారు. ఈ దెబ్బ వైసీపీకి మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Is BJP Avoiding PM Modi Presence In Andhra Pradesh!

In the entire country, even states like Kerala and Tamil Nadu where the party presence is negligible, all the BJP candidates are mostly depending on the image of Prime Minister Narendra Modi only. Even BJP’s election manifesto named as `Modi Guarantee and even Prime Minister himself in public meeting assuring that `Modi guarantee for you’.

But, in Andhra Pradesh not only its alliance parties like TDP and Jana Sena, even BJP candidates are avoiding mentioning Modi’s name. Several poll surveys at national level reveal that Modi is the most popular leader and choice for the Prime Minister of majority people in almost all states. But, only in Kerala, Tamil Nadu and Punjab, Congress leader Rahul Gandhi’s popularity is ahead of Modi.


Whereas in Andhra Pradesh, Modi’s popularity is at the bottom. BJP’s vote share in 2019 also less than NOTA and below 1 per cent. Even BJP MP candidates hardly mention Modi’s name in their campaigns, unlike in all other states. That’s why BJP star campaigners hardly take part in the poll campaign in the state.

Ahead of finalising alliance with BJP, both TDP and Jana Sena expected that Muslims shifting their loyalty from YCP to them in the state. Even after alliance they are making every effort to convince them that irrespective of their alliance with BJP, they will stand for protection and welfare of Muslims.

Moreover, Minister Ambati Rambabu’s statement that even if they would win in all 25 Lok Sabha seats, they will extend support only to the BJP government at the center, as their party in principle opposes any alliance with Congress. This paved the way for TDP and Jana Sena to convince Muslims they can only stand for their interest.

It may be recalled that the BJP was kept away from a joint manifesto on the alibi that it is a national party and it was confined to TDP and Jana Sena. There is no photo of PM Modi. Hardly any cutouts of Modi are seen in the campaigns of three parties.

People in AP believe that only due to PM Modi’s support, CM Jagan is able to continue his regime of anarchy and cases of corruption are not moving ahead in courts. There is a strong feeling that without Modi’s concurrence Jagan could not dare to dilute Amaravati as state capital.

On the issue of Visakha Steel plant privatization, ignoring bifurcation promises like Polavaram Project, Visakha Rail Zone and Kadapa steel Plant, strong anti- Modi sentiments prevailed in the state.

KCR Predicted Third Front Government At The Center

While BJP-led NDA is confident of winning a record number of 400 seats in the Lok Sabha and the Congress-led INDIA though silent on forming government on its own, but claiming that they can prevent BJP from forming next government, BRS chief and former Telangana chief minister K Chandrasekhar Rao predicting that a third front government will be formed at the Centre after the Lok Sabha elections.

Incidentally, he made the same prediction both in 2014 and also 2019 claiming that his party is going to play a crucial role in forming the next government. According to him, both NDA and INDIA will get around 200 seats each only and are unable to form the government on their own.

He said that the regional parties are growing in stature and will act as deciding factors in the government formation. “The power of regional parties is increasing. He said that parties like TMC in West Bengal, AAP in Delhi, Punjab and DMK in Tamil Nadu will play a big role and will be deciding factors.

“I.N.D.I.A alliance is nothing. Even ND Alliance (NDA), is also not very big, many parties left the coalition…but they can get around 200 seats each,” he said.

On being asked who could be the PM candidate for the I.N.D.I.A bloc, he said. “It is too early to say now. Let’s wait for the election results…NDA will definitely not get the complete majority and BJP will also not reach 272 (seats)…”

 When questioned about his support for BJP or Congress, he said that BRS will be fighting against both of them. “We have to fight with both (Congress and BJP). Both of them are enemies of Telangana and this has been proved several times. So we need to fight both,” he added.

KCR further stated that people will vote against BJP in the elections. “The farmers in the country are distressed. Both BJP and Congress have done injustice to them. People will go against Narendra Modi. I think BJP can’t reach a majority on its own,” the former CM said.

Attacking the Congress party, he said the whole country knows about the ‘corruption’ that happened under Congress. “The entire country knows about corruption done by Congress…because of this they have been named ‘Scamgress’,” he added.