Home Blog Page 915

అప్పల్రాజూ.. ఏమిటి నాయనా ఈ అతి!

అవును మరి. అయిదేళ్లపాటూ అధికారంలో ఉండగా తమ చిత్తానికి ఎలా తోస్తే అలా విపరీతంగా రెచ్చిపోతూ వచ్చారు. తాము ఆడిన ఆటకు ఎదురుచెప్పేవాళ్లు లేరు. అడ్డు నిలిచే అధికారులు లేరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అచ్చంగా అలాంటి దుర్మార్గపు దందానే అలవాటు అయిపోయినట్లుంది. అందుకే ఎన్నికల అధికారి నిబంధనల గురించి మాట్లాడితే.. పలాస నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సీదిరి అప్పలరాజు ఒక రేంజిలో రెచ్చిపోయారు. తన వాహనాన్ని ఆపినందుకు ఆయన ఎన్నికల అధికారి ఆశాలత మీద విరుచుకుపడ్డారు.

‘డోన్ట్ యాక్ట్ టూ స్మార్ట్’, ‘వాటీజ్ హేపెనింగ్ హియర్’, ‘ఏంటీ టార్చర్ మాకు’, ‘ఏంటి తమాషా ఇది’, ‘ఎవరికి కంప్లయింటు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి’, ‘ఇంకోసారి మా ప్రచారరథం ఆపారంటే బాగోదు చెబుతున్నాను.. సీరియస్ గా చెబుతున్నాను నేను’, ‘రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇంకెక్కడా ప్రచార రథాలు లేవా.. మీరొక్కరే విధులు నిర్వర్తిస్తున్నారా’, ‘ప్రచారరథం కీస్ ఆమెకే ఇచ్చేయండయ్యా.. ఇంకో లక్షరూపాయలు కూడా ఇచ్చేయండి.. ఎలా ఉండాలో ఏ రంగులు వేయాలో ఆమే తయారుచేసి ఇస్తారు’.. ఈ మాటలన్నీ గమనిస్తే సీదిరి అప్పలరాజు ఏ స్థాయి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అర్థం అవుతుంది. తన ప్రచారరథం వాహనం ఆపి, నిబంధనలు గుర్తుచేసినందుకు ఎన్నికల అధికారి ఆశాలతతో ఆయన వ్యవహరించిన తీరు ఇది.

ఒక వైపు అధికారి ఆశాలత చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ.. ‘నిబంధనలు చెబుతోంటే గొడవ పెట్టుకుంటారేమిటి సార్’ అని అంటూ ఉన్నప్పటికీ మంత్రి సీదిరి అప్పలరాజు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. దాదాపుగా కొట్లాటకు దిగిన రీతిలో సీదిరి అప్పలరాజు అధికారి మీదిమీదికి వెళుతూ బెదిరించేందుకు ప్రయత్నించారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వంలోని మంత్రులు కూడా వారి అధికార వైభోగాన్ని పక్కన పెట్టాల్సిందే. బుగ్గకార్లు వాడడానికి కూడా వీలుండదు. నామ్ కే వాస్తే వారిని మంత్రిగా వ్యవహరించాల్సిందే తప్ప.. సీఎం సహా, మంత్రులు సుషుప్తావస్థలో ఉన్నట్టే లెక్క. ఎన్నికల సమరాంగణంలో ఒక మామూలు ఇండిపెండెంటు అభ్యర్థి ఎంతో, మంత్రి అయినా అభ్యర్థిగా అంతే. ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం మాత్రమే సర్వాధికారాలను కలిగి ఉంటాయి. అయితే ఏకంగా ఎన్నికల అధికారి మీదికే సీదిరి అప్పలరాజు గొడవకు దిగినట్టుగా మీదిమీదికి వెళ్లిపోవడం.. తీవ్రస్థాయిలో బెదిరించడం ఇవన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దందాలు, బెదిరింపులను నమ్ముకునే గెలవాలనుకుంటున్నారా? అనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తున్నాయి.

Nara Lokesh Takes A Gutsy Decision In The Last Lap

There is no denying the fact that the upcoming assembly elections in Andhra Pradesh are going to be do-or-die polls for the main opposition, the Telugu Desam Party. Particularly Nara Lokesh, the national general secretary, who is tipped to take over the reins of the party from his father and president Chandra Babu Naidu in the coming years, will face a huge litmus test as he is contesting from Mangalagiri constituency, where he faced an embarrassing defeat in 2019. 

Nara Lokesh is very determined to turn his electoral fortunes around this time. Despite losing by a significant margin in 2019, Lokesh didn’t give up on his role within the party and emerged as a strong leader in all aspects. Moreover, he did not ignore the Mangalagiri constituency in the last five years, as he frequently made visits and connected with the masses there very effectively. Ground reports suggest that Lokesh is likely to romp home with a thumping majority in Mangalagiri. 

Lokesh has been canvassing quite rigorously in Mangalagiri for the past few weeks. As Chandra Babu Naidu and Pawan Kalyan have been touring the entire state besides campaigning in their own constituencies, it is quite surprising that Lokesh didn’t step out of Mangalagiri till now, ever since the election schedule was announced. This led to rumors by the YSRCP leaders that Lokesh was intentionally confined to Mangalagiri as the chances of his winning are bleak there and also because he has an image to woo voters across the state. 

In what could be a big slap to this propaganda, Lokesh took a gusty decision just two weeks before the polling date. In the last lap of electioneering, Lokesh will embark on a whirlwind tour from April 30th to May 8th. Lokesh will canvass in some of the key parliamentary and assembly constituencies across the state where the party is facing a tough challenge from the YSRCP candidates. This is a brave decision from Lokesh to silence his naysayers. 

After completing this tour, Lokesh will campaign in Mangalagiri in the last two days and will stay there till the completion of the polls. 

అమ్మోరు పూనేసిందిరా!

గామి సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం విజయాలను ఆస్వాదిస్తూ ఫుల్‌ ఖుషీలో ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ఛల్‌ మోహన్ రంగ దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్షన్‌ లో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి అనే సినిమాను చేస్తున్నాడు.  ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా మే 17న విడుద‌ల కానుంది. విడుదల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో చిత్ర బృందం  టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ను చూస్తే ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. ఒక్కసారి లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని సంపకుండా వదలరు.. అనే మాస్‌  డైలాగ్ తో టీజర్‌ స్టార్ట్‌ కాగా.. ఊరంతా విశ్వక్ ని చంపడానికి చూస్తున్నట్టు, విశ్వక్ వారిని ఎదుర్కొంటున్నట్లు చూపించారు. అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తి పోద్దంతే.. అనే పవర్ ఫుల్ డైలాగ్ తో విశ్వక్ ను మాస్ యాంగిల్ లో చూపించారు.

ఈ టీజర్ తో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.  ఈ సినిమాలో అంజలి మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. 

ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది!

యంగ్‌ రెబల్‌ స్టార్, పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ హీరోగా…బాలీవుడ్‌ బిగ్‌ బి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ . ఈ సినిమాలో వీరితో పాటు లోక నాయకుడు కమల్‌ హాసన్‌ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది మాత్రం  ఉత్కంఠభరితంగా మారగా ఈ రిలీజ్ డేట్ అప్డేట్ కోసమే ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు దానికి  ఫైనల్ గా  తెరపడనుంది. శనివారం  సాయంత్రం చిత్ర నిర్మాణ సంస్థ ఓ అప్డేట్ అందిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది రివీల్ చేయడమే అన్నట్టుగా తెలుస్తుంది.

బాల్యంలోనే వేధింపులకు గురయ్యాను: స్టార్ నటి!

స్టార్ నటుడి కూతురిగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటికీ తన నటనతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌. అంతే కాకుండా.. ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భాష ఏదైనా సరే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే త్వరలో ‘శబరి’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని అనిల్ దర్శకత్వం వహిస్తుండగా.. మహేంద్రనాథ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీ మే 3వ తేదీన రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి.. తన వ్యక్తిగత జీవితం గురించి,  సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

సినిమా గురించి చెప్తూ.. ‘‘శబరి’ సినిమా తల్లీ కూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సింగిల్ మదర్ తన కూతరుకి ఎలాంటి లోటు తెలియకుండా పెంచాలని అనుకుంటుంది. అలాంటి సమయంలో తన బిడ్డకి ఎవరైనా ఆపద తలపెట్టాలని ప్రయత్నిస్తే.. తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది.. కూతురుని ఎలా కాపాడుకుంటోంది అనేది స్టోరీ. ప్రధానంగా ఓ మూవీ అంశాలు కథను మలుపు తిప్పుతాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తన వ్యక్తిగత జీవితం గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ‘తాను బాల్యంలోనే లైంగిక వైధింపుల‌కు గురైనట్లు. అదే తన జీవితంలో మర్చిపోలేని గాయం. అయితే.. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది మానసిక పరిస్థితుల గురించి పక్కన వాళ్లకి, రిలేటివ్స్‌కు, ఫ్రెండ్స్‌కు చెప్పుకోలేరు. ఎందుకంటే ఎవరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదు కాబట్టి థెరపిస్ట్ ఉంటే చాలా బెటర్. కుటుంబ‌స‌భ్యుల‌తో నీ సమస్యల గురించి మాట్లాడితే మనల్నే జడ్జ్ చేస్తారు. అదే థెరపిస్ట్‌తో మాట్లాడితే మనల్ని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎవరికైనా ఏదైనా సమస్య  ఉంటే.. థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి నయం చేసుకోవడం ముఖ్యం’ అంటూ తెలిపింది వరలక్ష్మి. 

రామం రాఘవం అంటూ వచ్చేస్తున్న ధనరాజ్‌ కొత్త సినిమా!

కమెడియన్ ధనరాజ్‌ డైరెక్టర్‌ గా మారి చేసిన సినిమా రామం రాఘవం..ఈ సినిమా ని స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్ బ్యానర్‌ పై ప్రభాకర్‌ అరిపాక సమర్పిస్తుండగా  పృథ్వీ పోలవరపు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ సినిమాలో సముద్ర ఖని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ శనివారం  విడుదల అయ్యింది. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, నటులు సూరి,దీపక్ ,హరీష్ తదితరులు పాల్గొన్నారు.

ఇక తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా గురించి దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ రచయిత శివప్రసాద్ కథ ఇదని వివరించారు. ఈ కథ గురించి సముద్ర ఖని అన్నకి వివరించాను, దాంతో కథను నువ్వే డైరెక్ట్ చేయాలిని చెప్పారు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేను ఈ సినిమాకి దర్శకత్వం వహించా. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా, ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా, సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు, నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ళ తండ్రులతో కలిసి ఈ సినిమా చూడాలని ధనరాజ్ అన్నారు.

ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ… సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా సుమారు 10కి పైగా సినిమాల్లో నటించా, ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్‌ స్టోరీ. అలాంటి మరో కొత్త కథ ఇదన్నారు. ధనరాజ్ కి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది, అందుకు తగ్గ దర్శకుడు ఉండాలని భావించాను. ధనరాజ్ పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా. దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు, తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇదని పేర్కొన్నారు.

హీరో సుహాస్‌ ని నానితో పోల్చిన స్టార్‌ డైరెక్టర్‌!

నటుడు సుహాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సహా నటుడిగా నటిస్తూనే హీరోగా ఎదిగాడు. ఒక్క సినిమాతోనే స్టార్‌ ఇమేజ్‌ అందుకున్నాడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సుహాస్‌ నటిస్తున్న  ‘ప్రసన్న వదనం ‘ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఆ ట్రైలర్ ను డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  సుకుమార్ మాట్లాడుతూ.. సుహాస్ సినిమాల పై ప్రశంసలు కురిపించారు.  సుహాస్ లాంటి నటుడు ఇండస్ట్రీకి అవసరం అని పేర్కొన్నారు. అలాగే నేచురల్ స్టార్ నాని లాగా సుహాస్ పైకొచ్చాడంటూ ఆకాశానికి ఎత్తేశారు.  ఆయనను నేచురల్ స్టార్‌  అంటే సుహాస్ మట్టి స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు

 సుహాస్ నువ్వంటే నాకు, అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. అల్లు అర్జున్ నీ గురించి చాలా సార్లు మాట్లాడాడు. ఫస్ట్ పుష్పలో జగదీశ్ చేసిన కేశవ క్యారెక్టర్ కి నేను, బన్నీ నిన్నే తీసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు అప్పటికే హీరోగా చేస్తుండటంతో నిన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడగడం ఏం బాగుంటుందని ఆగాము అని సుక్కు అన్నాడు..

ఇలాగే కొత్త కొత్త కథలతో సినిమాలు తీస్తు మంచి స్థానంలో ఉండాలని కోరుకున్నాడు.. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుందని అన్నారు.

బాలీవుడ్ సీతారాములను చూశారా..!

రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలన్ని కూడా ఎంతో హిట్ గా నిలిచాయి. తాజాగా మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో మరో రామాయణం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దంగ్ దర్శకుడు నితేశ్‌ తివారీ రూపుదిద్దుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా  మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో యశ్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెబుతూనే చిత్ర బృందం సినిమాను సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకుని వచ్చేశారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి కొన్ని  ఫోటోలు లీక్ అయ్యాయి.  ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారు. మరో ఫొటోలో రణబీర్ కారవాన్ నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంది . సాయి పల్లవి సీత  గెటప్ లో చాలా అందంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. .

నాకు అలాంటి అబ్బాయే కావాలంటున్న చిట్టి!

జాతిరత్నాలు సినిమాతో యువత గుండెల్లో గూడు కట్టుకున్న భామ ఫరియా అబ్దుల్లా. ఒక్క సినిమాతోనే ఓవర్‌ నైట్‌ హీరోయిన్‌ అయిపోయింది.  అందులో చిట్టి పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది.  ఆ తర్వాత కూడా ఈ అమ్మడు కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును తీసుకుని రాలేకపోయాయి.

 కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ ల్లో కూడా మెరిసింది . తాజాగా చిట్టి అల్లరి నరేశ్ సరసన ఓ సినిమా చేస్తుంది. సినిమాలు విషయం ఎలా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం చిట్టి ఎప్పుడూ యాక్టివ్‌ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన తాజా చిత్రాలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

ఈ అమ్మడు జాతి రత్నాలు సినిమా తర్వాత బంగార్రాజు, రావణసుర, లైక్ షేర్‌ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాలతో అలరించింది. ఇటీవల తెలుగు సినిమాల్లో కనిపించలేదు . కానీ చిట్టి ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఈక్రమంలోనే  తెలుగులో అల్లరి నరేష్ తో  ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ క్రమంలోనే చిట్టి  పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టి  తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. నేను చాలా హైట్ ఉంటాను కదా నా హైట్ కు మ్యాచ్ అయ్యేలా ఉండే అబ్బాయి కావాలి. అంతకన్నా ముందు తనను అర్థం చేసుకుంటూ ఎప్పుడు సరదాగా ఉండే అబ్బాయి అయితే బాగుంటుందని ఫరియా ఇంటర్వ్యూలో వివరించింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

What A Change In KCR : Makes Debut On ‘X’

In a surprising development, former Telangana Chief Minister and Bharatiya Rastra Samithi party president Kalvakuntla Chandra Sekhar Rao, who is popularly called as KCR, made his social media debut this Saturday ahead of the Loksabha elections. On the eve of the 23rd formation day of BRS party, which was floated in 2001 as TRS, KCR joined ‘X'( Twitter) and wished his supporters and the people of Telangana a happy anniversary. 

Unlike other politicians of his age, who interact with the masses and the rank and file of their parties through various platforms like Facebook, X and Instagram, KCR kept himself away from social media behemoths all these years. When he was in power , KCR was not easily accessible for his supporters. But, he seems have realised the importance of communication with the public and his supporters after the recent political developments in Telangana. It is a known fact that his party is facing an existential crisis after facing a humiliating electoral defeat against the hands of Congress in December last year. This seems to have brought change in KCR. 

Immediately after making his debut on X, KCR gained thousands of followers in no time. He posted a couple of tweets which clearly hint that he will not only stay connected with his followers but also highlight the ruling government’s inefficiencies. 

In one post, KCR expressed his gratitude towards BRS leaders and supporters for making his first road show( Bus Yatra)  a huge success. In the next post, the BRS supremo flayed at the Congress party for continuous power outages across the state ever since it came to power. He said that all constituencies in Telangana are facing a similar situation and the government has failed to address the issues. 

The handle name of KCR is @KCRBRSPresident. He is following the official handle of BRS party.