Home Blog Page 912

Siddharth, Aditi Rao Hydari, And Rashmika Mandanna Graced Heeramandi Screenings

The newly engaged couple Siddharth and Aditi Rao Hydari attended together as they graced the premiere of the eagerly anticipated Netflix series, ‘Heeramandi’. The drama series, helmed by Sanjay Leela Bhansali, will start streaming on Netflix on May 1.

The actors dressed in an ethnic look for the screenings of this periodic drama. Aditi Rao Hydari wore an ethnic blue-colored lehenga, while Siddharth opted for an ethnic black outfit. The couple exudes absolute charm and elegance and captivates everyone with their look.

Actors Rashmika Mandanna, Shruti Haasan, and others also attended the Heeramandi screenings. Rashmika dazzled in a green-colored dress, while Shruthi Haasan opted for black, radiating undeniably beauty.

Speaking of Sanjay Leela Bansali’s creation, “Heeramandi” is a captivating Hindi period drama about the lives of courtesans in the red-light district of Heeramandi in Lahore against the backdrop of the Indian Independence Movement. The series boasts an ensemble cast, including Manisha Koirala, Aditi Rao Hydari, Sonakshi Sinha, Richa Chadha, Sharmin Segal, and Sanjeeda Shaikh in the pivotal roles.

On the work front, Siddharth will be seen in the much-anticipated sequel ‘Indian 2’, starring Kamal Haasan as the main lead. The film is helmed by Maverick director Shankar, and the film features a stellar cast including Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, Priya Bhavani Shankar, and S.J. Suryah. The actor will also be seen in his next ‘Test’, alongside Madhavan and Nayanthara.

Aditi Rao Hydari is currently awaiting Heeramandi’s OTT release, and the actor will appear in the English film ‘Lioness’. Meanwhile, Rashmika Mandanna is gearing up for her much-anticipated release, ‘Pushpa 2: The Rise’.

చిన్నమ్మ డిమాండ్ ఓకే అయితే.. జగన్‌కు దబిడిదిబిడే!

ఏ చిన్న ఫిర్యాదులు వచ్చినా ఎన్నికల సంఘం ఉపేక్షించడం లేదు. ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని సమాచారం అందితే చాలు.. ఎన్నికల సంఘం కత్తి దూస్తోంది. వారిపై వేటు వేసి ఎన్నికల విధుల నుంచి పూర్తిగా దూరం ఉంచడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. సిఎస్ జవహర్ రెడ్డి ద్వారా కొత్త పేర్లు తెప్పించుకుని వారిలో ఒకరిని ఆయా స్థానాలకు నియమిస్తోంది. తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ నగర కమిషనర్ల నియామకం ఒక హాట్ టాపిక్. కాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథి, రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఎంపీగా తలపడుతున్న దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల సంఘానికి చేసిన తాజా విజ్ఞప్తిని గమనిస్తే మరిన్ని సంచలనాలు రాష్ట్రంలో నమోదవుతాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే చిన్నమ్మ ఏకంగా 26 మంది ఐపీఎస్ అధికారులను తక్షణం విధుల నుంచి తప్పిస్తే తప్ప ఎన్నికలు పారదర్శకంగా జరగవు అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. దాదాపుగా అన్ని కీలకపోస్టుల్లోనూ తనకు పూర్తిగా అనుకూలంగా ఉండే వారిని మాత్రమే నియమించారనే కంప్లయింటు చాలా కాలంనుంచి ఉండనే ఉంది. ప్రత్యేకించి ఐపీఎస్ అధికారుల విషయంలో స్థానిక వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తే వారిని మాత్రమే నియమిస్తూ వచ్చారనే మాట ఉంది. ఇటీవల తిరుపతి జిల్లాకు కొత్త ఎస్పీని నియమిస్తే.. దొంగఓట్ల కేసుల గురించి ఆరా తీసినందుకు కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే, స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆమెను అక్కడినుంచి బదిలిచేసేశారు. జగన్ పరిపాలనలో ఆయన మాటకు డూడూ బసవన్నలాగా తల ఊపే అలవాటు లేని ఐపీఎస్ అధికారులంతా కూడా అప్రాధాన్య, లూప్ లైన్ల పోస్టుల్లో ఉన్నారనే వాదన చాలా కాలంగా ఉంది. అందుకే ఇప్పుడు పురందేశ్వరి ఏకంగా 26 మంది ఐపీఎస్ లను విధులనుంచి తప్పిస్తే తప్ప ఎన్నికలు పారదర్శకంగా జరగబోవని అంటోంటే.. ఆమె వాదనకు బలం పెరుగుతోంది.

పైగా ఏ ఐపీఎస్ మీద ఎన్నికల సంఘం వేటువేసినా కూడా.. కొత్త ప్యానెల్ గా సీఎస్ సూచించే పేర్లలో ఖచ్చితంగా మళ్లీ వైసీపీ అనుకూల వ్యక్తుల పేర్లు ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పురందేశ్వరి అడుగుతున్నట్టుగా.. 26 మందిని ఈసీ మారుస్తుందా? నిష్పాక్షిక అధికారులు వస్తారా? అనేది ఒక చర్చ. అదే జరిగితే గనుక.. ఎన్నికల వేళ అక్రమాలకు పాల్పడడం ద్వారా నెగ్గవచ్చుననే ధీమాతో ఉన్న జగన్ అండ్ కో దళాలకు దబిడిదిబిడే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

‘బూడి’ కుటుంబంలో మణిరత్నం ‘ఘర్షణ’!

90లలో మణిరత్నం దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఘర్షణ గుర్తుందా? పురాణకథను కాస్త సోషలైజ్ చేసి.. సవతి సోదరుల మధ్య ఘర్షణను అత్యంత అందంగా చిత్రీకరించారు మణిరత్నం. పెద్దభార్య కొడుకుగా ప్రభు, చిన్న భార్య కొడుకుగా కార్తీక్. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, నిత్యం ఘర్షణ వాతావరణం.. వీరిద్దరి మధ్య రచ్చ కారణంగా ఆ కుటుంబ పెద్ద సతమతం అయిపోతుండడం ఇదంతా ఆ సినిమా కథ. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బూడి ముత్యాలనాయుడు ఇంట్లో అదే సినిమా కథ రిపీట్ అవుతోంది.

బూడి ముత్యాల నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే. 2014, 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. అసలే అనకాపల్లిలో ఎన్డీయే కూటమి తరఫున బలమైన అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీచేస్తున్నారు. ఎంపీగా తన నియోజకవర్గాన్ని చూసుకోవడమే ఆయనకు ఇబ్బందిగా ఉంది. అయితే ఆయన రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గం తన చేజారిపోవడం లేదనే నిన్నటిదాకా అనుకున్నారు.

ఎందుకంటే ఆయన రెండో భార్య కుమార్తె ఈర్లె అనురాధకు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే తాజాగా ఆయన కుటుంబంలో ఘర్షణ సినిమా రిపీట్ కావడం మొదలైంది.

ఆయన పెద్ద భార్య కొడుకు రవికుమార్ తాజాగా తన నిరసన గళం వినిపిస్తున్నారు. సదరు రవికుమార్ కూడా ఇండిపెండెంటుగా అక్కడ నామినేషన్ వేశారు. వైకాపా నాయకుల అడుగులకు మడుగులొత్తే అధికార్లపై న్యాయపోరాటం చేయడానికే తాను పోటీచేస్తున్నట్టుగా రవికుమార్ చెబుతున్నారు. అసలే మాడుగుల నియోజకవర్గంలో విస్తృతంగా బంధుత్వ, స్నేహ సంబంధాలు ఉన్న బండారు సత్యనారాయణమూర్తిని తెలుగుదేశం అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత… బూడి ముత్యాల నాయుడు పరిస్థితి క్లిష్టంగా మారింది. దానికి తోడు ఇప్పుడు తన సొంత ఇంట్లోనే ఘర్షణ సినిమా మొదలు కావడంతో.. ఈ సమస్యను గట్టెక్కడం ఎలాగా అని ఆయన తల పట్టుకుంటున్నారు. ఇన్ని తలనొప్పుల మధ్యలో ఆయన తన అనకాపల్లి ఎంపీ ఎన్నిక మీదనైనా కాన్సంట్రేట్ చేయగలరా? అనే చర్చ నడుస్తోంది. 

Shahid Kapoor In Vamshi Paidpally’s Hindi Directorial Debut? Deets Inside

Exciting news is circulating within Tollywood’s film industry that Vamshi Paidipally is set to team up with Bollywood’s renowned actor Shahid Kapoor for an upcoming project. The buzz is that, recently, director Vamshi Paidpally met with Shahid Kapoor to discuss the scripts.

It was reported that Shahid gave an affirmative response to the director. The anticipated project will be slated to begin next year, allowing Shahid to wrap up his ongoing commitments. The film will be backed by Dil Raju under Sri Venkateswara Creations. The film marks Paidpally’s foray into pan-Indian cinema, marking his directorial debut. However, an official announcement should have to be made by the film team.

On the work front, Vamshi Paidpally’s last directed film was ‘Varisu’ with Vijay Thalapathy. The film received mixed reviews and failed to live up to expectations, but garnered a collection of around 300 crores at the box office. 

On the work front, Shahid Kapoor is currently basking in the success of his latest film, ‘Teri Baaton Mein Aisa Uljha Jiya’, helmed by Amit Joshi and Aradhana Sah. The film stars Kriti Sanon, Dimple Kapadia, and Ashish Verma in significant roles. 

The actor is currently working on his next film, ‘Deva’, helmed by Rosshan Andrrews. Pooja Hegde romances Shahid Kapoor in this flick. His upcoming endeavors include ‘Ashwatthama: The Saga Continues’, directed by Sachin Ravi.

నేను ఆయన్ని బ్రదర్ లా ఫీలావుతున్నా..నటించలేను!

సినిమా ఇండస్ట్రీ అంటేనే హీరోయిన్లు కానీ, హీరోలు కానీ అన్నాచెల్లెళ్లులాగా ఫీల్‌ అవ్వరు. ఎందుకంటే ఎవరితో ఎప్పుడు ఎలాంటి రోల్స్‌ చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు సినీ ప్రపంచంలో మాత్రం ఓ వార్త తెగ వైరల్  అవుతుంది.  టాలీవుడ్ స్ట్రీలో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య ని బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ బ్రదర్ గా ఫీల్ అవుతుందని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్  హీరోయిన్ గా పలు సినిమాలో నటించింది. అయితే ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో నాగచైతన్య తో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ భామ నాగచైతన్య ని బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి అతనితో నేను నటించలేను అంటూ డైరెక్టర్లకి  చెప్పిందంట.

ఇది విన్న డైరెక్టర్ లు షాక్ అవ్వడం వారి వంతు అయ్యిందంట. అసలు సారా అలీ ఖాన్ కి నాగచైతన్య కి ఎక్కడ ఎలాంటి సంబంధమే లేదు. ఆమె ఎలా బ్రదర్ గా ఫీల్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది దీనిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. నాగచైతన్య తో నటించడం ఇష్టం లేకనే ఆయన్ని బ్రదర్ అని సంబోధింస్తున్నది అంటూ చెప్పుకొస్తున్నారు.

రీజన్ ఏంటో తెలియదు కానీ సారా – నాగచైతన్యను బ్రదర్ గా ఫీల్ అవుతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అర్థాలకు దారితీస్తుంది. అసలు వీళ్ళ మధ్య ఏ రిలేషన్ షిప్ బ్రదర్ అనే విధంగా చైతును సారా అలీ ఖాన్ ఫిక్స్ అయ్యేలా చేసింది అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

శ్రీలీల స్పెషల్‌ సాంగ్..ఆ స్టార్ హీరో సినిమాలోనే!

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే..ఫస్ట్‌ సినిమాతోనే స్టార్‌ హీరోయిన్ రేంజ్‌ ను సొంతం చేసుకుంది. అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలకు ఓకే చెబుతూ..బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే బోలేడు హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ కు అంతగా కలిసి రాలేదు.  గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను సొంతం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం శ్రీలీల పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన  లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.  ఇదిలా ఉండగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చిత్రం గోట్ లో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ చేస్తుందనే  ఓ వార్త షికారు చేస్తుంది.

వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను శ్రీలీల చెయ్యనుందనే టాక్.. ఆమెతో మేకర్స్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.. 

ఇక అలసిపోయాను..నా వల్ల కాదు అంటున్న గోవా బ్యూటీ!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌ లోకి దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత పోకిరి సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. టాలీవుడ్‌ లో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. సుమారు పదేళ్ల పాటు ఇండస్ట్రీని అలరించిన ఇలియానా…కెరీర్‌ మంచి ఫామ్‌ లో ఉండగా…బాలీవుడ్‌ లో రాణించడానికి వెళ్లిపోయింది.

అక్కడ ఇలియానా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఇలియానా కెరీర్‌ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. ఇలియానా టాలీవుడ్ ని వదిలి వెళ్లినప్పటికీ .. ఆమెని బాలీవుడ్ లో కూడా ఎవరూ పెద్దగా  పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇలియానా నడిపిన లవ్‌ ఎఫైర్స్‌ కూడా పెద్ద సంచలనాలనే సృష్టించాయి.  బ్రేకప్ ల వల్ల ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన విషయం గురించి కూడా తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇలియానా ఓ వ్యక్తిని ప్రేమించి ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం కొడుకు, భర్తతో ఇలియానా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఇలియానా సినిమాల్లో ఆఫర్స్ కూడా అందుకుంటుంది.

ఇలియానా తాజాగా నటించిన చిత్రం ”దో ఔర్ దో ప్యార్” కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఇలియానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో ఇలియానా నోరా అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో పాత్ర తన నిజ జీవితానికి  ఎంతో దగ్గరగా ఉంటుందని ఇలియానా తెలిపింది. ఈ సినిమాలోని నోరా లాగే తాను కూడా ఎంతో సెన్సిటివ్ అని ఇలియానా పేర్కొంది.

ఈ మూవీ డైరెక్టర్ శిరీష స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాను.ఈ చిత్రంలో నా పాత్ర కోసం శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు జిమ్ వర్క్ ఔట్స్ చేయాలేమో అని భయపడ్డాను .ఎందుకంటే నేను మానసికంగా ఎంతో అలసిపోయాను .బరువు తగ్గడం నా వల్ల కాదు అని ఆమెతో చెప్పాను. ఆమె నన్ను అర్ధం చేసుకొని ఇప్పుడు మీరు బరువు తగ్గాల్సిన పని లేదు ఇప్పుడు మీరు ఎలా వున్నారో అలాగే కంటిన్యూ చేయమని ఆమె చెప్పినట్లు ఇలియానా తెలిపారు .

MLA Raja Singh Absent In BJP Lok Sabha Campaign

Though BJP has been claiming that they would get double- digit Lok Sabha seats from Telangana, out of total 17 seats and party’s national leadership is making efforts to improve their present strength of 4 MPs considerably, the party’s campaign is yet to get momentum.

Though a couple of national leaders visited during the filing of BJP nominations by BJP candidates, concentrated efforts on behalf of state BJP is yet to be figured out. Key leaders like Union Minister and state party chief G Kishan Reddy and OBC Morcha chief Dr K Lakshman are mostly confined to media conferences. They are hardly seen going to people.

Kishan Reddy, who is more worried on retaining his Secunderabad seat is practically not going out of his constituency. Holding `Rythu Deeksha’ protesting state government’s apathy towards suffering farmers at the party office in Hyderabad, reflects how he isolated himself from people.

More prominently, the absence of a lone leader having a mass following and winning Goshamahal assembly seat three consecutive terms on his own Raja Singh is practically avoiding a poll campaign. He was not present even when BJP candidate Kompella Madhavilatha filed her nomination for Hyderabad parliamentary constituency on Wednesday.

His constituency is part of Hyderabad. He is reportedly angry with party leadership that his candidature was not considered to contest in Lok Sabha polls and also not even discussed with him. Although Union Minister Anurag Singh participated in the rally organized on the occasion of Madhavi Latha’s nomination, the MLA was nowhere to be seen.

 He participated in the rallies organized on the occasion of Sri Rama Navami and Hanuman Jayanti. But He was not seen in Madhavi Latha’s campaign or meetings. While participating in the Hanuman Jayanthi rally, he said that he would do it wherever the party ordered him to work.

He did not even attend the meeting of booth level activists held at Nampally exhibition ground earlier this month. Even though the party had entrusted the in-charge of Hyderabad Parliament to Raja Singh in the past, he did not pay much attention to it.

PM Modi Now To Focus On Campaign In Telugu States

As the last date to file nominations in two Telugu states ends on Thursday and the poll campaign for first two phases also completed, Prime Minister Narendra Modi is now focusing on campaigning in Telugu states. BJP is focusing on Telugu states to get maximum number of Lok Sabha seats here, so as to cover any drawbacks in its stronghold states.

Already the poll campaign in two Telugu states has reached its peak. PM Modi’s programme schedule for three days in Telangana has already been announced. He is said to be addressing poll rallies in Andhra Pradesh for two days, during the first week of May. He is visiting Telangana on April 30, May 3 and 4. On April 30, he will attend a meeting of prominent people in Hyderabad and address an election rally in Andole of Medak Lok Sabha constituency.

On May 3rd, the Prime Minister will address public meetings in Warangal, Bhuvanagiri and Nalgonda Lok Sabha constituencies. On May 4th, he will address public meetings in Mahabub Nagar and Chevella constituencies.

Prime Minister’s AP tour schedule is yet to be finalised. But, party sources said that he will participate in a road show in Visakhapatnam and address public meetings in Anakapalli, Rajahmundry and Rajampet Lok Sabha constituencies. Soon after the announcement of the election schedule, he addressed a joint rally near Chilakaluripet last month.

TDP chief N Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan also will participate in Prime Minister’s public meetings.

తెలంగాణ మంత్రి నోట.. ఏపీ సిగ్గుపోయింది!

తుమ్మల నాగేశ్వరరావు రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకు కూడా బాగా తెలిసిన సీనియర్ నాయకుడు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండగా,  ఆయనకు ఎదురైన అనుభవం, ఆయన స్పందించిన తీరుతో ఏపీ ప్రభుత్వం పరువు పోతోంది. ‘మీ రోడ్లు మీరు మరమ్మతు చేయిస్తారా? లేదా మా తెలంగాణ నిధులతో మీ రోడ్లకు కూడా ప్యాచ్ వర్కులు చేయించమంటారా’  అంటూ ఆయన ఏపీలోని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారిని అడిగారంటే.. అక్కడి ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటు? అలాంటి దుస్థితే ఇప్పుడు దాపురించింది.


తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నాడు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లారు. అలా వెళ్లడానికి- రెండు రాష్ట్రాల సరిహద్దులో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఎటపాక- కన్నాయిగూడెం రోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది. ఎటపాక, చింతలగూడెం, కన్నాయిగూడెం ప్రాంతాల్లో రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో గతంలో ఆర్ అండ్ బీ మంత్రిగా కూడా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అసహనానికి గురయ్యారు. అక్కడినుంచే ఏపీ ఆర్ అండ్ బీ సీఈ శ్రీనివాసరెడ్డితో ఫోనులో మాట్లాడారు. ఈ మార్గంలో ఏపీ పరిధిలోని 8 కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉందనే సంగతిని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ ఏర్పడ్డాక తాను ఆర్ అండ్ మంత్రిగా చేసినప్పుడే, ఎటపాక కన్నాయిగూడెం మధ్య ఈ 8 కిలోమీటర్ల రోడ్డు వేయించానని, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కనీసం ఒక్కసారి కూడా మరమ్మతులు కూడా చేయించినట్టు లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఈరోడ్డు పై ప్రయాణం చాలా కష్టంగా ఉంది. మీరు చేయించలేకపోతే చెప్పండి.. తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేయిస్తాం అని ఆయన సీఈతో అనడం విశేషం.

మీ రోడ్లు ఇలా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు అని కూడా తుమ్మల హెచ్చరించారంటే.. అది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరువు పోయే వ్యవహారం కాక మరేమిటి? పాపం తుమ్మల.. ఏదో తెలంగాణ ప్రాంతంలో ఓ మారుమూలగా వచ్చే రోడ్డు గురించి మాట్లాడుతున్నారు గానీ.. ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించిన రోడ్లు తప్ప.. తతిమ్మ అన్ని రోడ్లూ అధ్వానంగానే ఉన్నాయనే సంగతి ఆయనకు తెలుసో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు.