Home Blog Page 892

Anushka Shetty Is All Set For Her Malayalam Debut With Kathanar

 అనుష్క శెట్టి, కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్, జయసూర్య

తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు మలయాళంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తాజా మూలాల ప్రకారం, నటి రాబోయే చిత్రం కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ సెట్స్‌లో చేరింది.

చిత్ర యూనిట్ నటిని సెట్స్‌పైకి స్వాగతించడంతో చిత్ర దర్శకుడు రోజిన్ థామస్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొన్ని చిత్రాలను పంచుకున్నారు. అదే విషయాన్ని పంచుకుంటూ, థామస్ ఒక నోట్ రాశారు- “మా కథనార్ యొక్క సినిమా ప్రయాణంలో అసాధారణమైన అనుష్క శెట్టితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను!”

మనకు తెలిసినట్లుగా, అనుష్క చివరిసారిగా 2023 తెలుగు రొమాంటిక్ కామెడీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో మహేష్ బాబు పాచిగొల్ల దర్శకత్వంలో కనిపించింది. నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క 30 ఏళ్ల అవివాహిత స్వతంత్ర మహిళగా కనిపిస్తుంది.

ఇంతలో కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ గురించి మాట్లాడుతూ, ఈ కాలపు ఫాంటసీ థ్రిల్లర్ R. రామానంద్ రాసిన మరియు రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన రెండు సినిమా భాగాలలో మొదటిది.

ఆధ్యాత్మిక శక్తులు కలిగిన పురాణ 9వ శతాబ్దపు క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో జయసూర్య టైటిల్ పాత్రలో నటిస్తుండగా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.

శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సుబ్రమణియన్ ఉన్ని స్ట్రింగ్స్‌పై పనిచేస్తున్నారు, నీల్ డి కున్హా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు.

కథనార్ మొదటి భాగం 2024లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది.

ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ గుండెపోటుతో కన్నుమూత

ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ గుండెపోటుతో కన్నుమూత!

ప్రముఖ డైరెక్టర్‌ సూర్య కిరణ్‌ సోమవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  ఈ క్రమంలోనే ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇయన తెలుగులో సుమంత్‌ తో కలిసి సత్యం అనే సినిమాని తీశారు.

ఆ సినిమా వీరిద్దరికీ మంచి హిట్‌ ఇచ్చింది. ఆ తరువాత సూర్య కిరణ్‌ రాజుభాయ్, ధన 51, బ్రహ్మస్త్రం అనే సినిమాలను తీశారు. కొంత కాలం క్రితం సూర్య కిరణ్‌ తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో కూడా పాల్గొన్నారు. సూర్య కిరణ్‌ మాస్టర్‌ సురేష్‌ అనే పేరుతో 200 చిత్రాల్లో బాలనటుడిగా నటించారు.

నటి కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. నటి సుజిత సూర్య కిరణ్‌ కు సోదరి అవుతారు.

పవన్ కల్యాణ్.. ఈ పట్టువిడుపు శుభపరిణామం!

ఇద్దరు కలిసి ప్రయాణం ప్రారంభించాలని అనుకున్న తరువాత.. కొన్ని సర్దుబాట్లు ఉభయులకూ తప్పనిసరి. ఏ ఒక్కరు మొండిపట్టు పడుతూ ఉన్నా వ్యవహారం బెడిసికొడుతుంది. అంతా గందరగోళం అవుతుంది. ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వరాదనే సంకల్పంతో.. తెలుగుదేశం- జనసేన- బిజెపి కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ కొన్ని పట్టువిడుపులు పాటిస్తుండడం శుభపరిణామంగా కనిపిస్తోంది. మిత్రబంధానికి చేటు రాకుండా వారు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. జనసేన పార్టీ తరఫున ఆరో అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను నిడదవోలు అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించడం మంచి పరిణామం అని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఆశించారు. కాస్త దూకుడు ప్రదర్శించి.. చాలా కాలం కిందటే.. రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేయబోయేది నేనే అని కూడా ప్రకటించేసుకున్నారు. అయితే.. గత ఎన్నికల సమయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెగ్గారు. అప్పట్లో జగన్ ‘ఒక్క చాన్స్’ విజ్ఞప్తి, వేడుకోలు రాష్ట్రమంతా పనిచేసిన సమయంలో కూడా తెలుగుదేశం నెగ్గిన స్థానాల్లో రాజమండ్రి రూరల్ కూడా ఒకటి.
అలాంటిది, తెలుగుదేశానికి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటును జనసేన ఆశించడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దుర్గేష్ తీరు మీద మండిపడ్డారు. పొత్తులు, సీట్ల పంపకాలు తేలకుండానే.. తనకు తానుగా ఆయన సీటు ఎలా ప్రకటించుకుంటారని ఆగ్రహించారు. అయితే.. ఇలాంటి మనస్పర్ధలకు తెరదించేస్తూ… పవన్ కల్యాణ్ కాస్త పట్టువిడుపు ప్రదర్శించారు. కందుల దుర్గేష్ కు సర్దిచెప్పి ఆయన నియోజకవర్గం మార్చారు. నిడదవోలు నుంచి బరిలోకి దించుతున్నట్టు జనసేన అధికారికంగా ప్రకటించింది. కందుల దుర్గేష్ కూడా.. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యం అని మీడియాకు వెల్లడించడం గమనార్హం.
ఇలాంటి సర్దుబాట్లు కూటమి పార్టీలకు ఎంతో మేలు చేస్తాయి. తొలిదశలో నాయకుల స్థాయిలోనే సీట్ల సర్దబాట్లు అవసరం. ఆ తర్వాతి దశలో ఆయా నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నాయకుల, కార్యకర్తల సమన్వయంను వారు సాధించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా సవ్యంగా జరిగితే.. ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి విజయదుందుభి మోగిస్తుంది. 

వారిని వదులుకోవడం జగన్ అహంకార ప్రతీక!

0

ఎన్నికల సమయంలో, ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక సమయంలో పార్టీల అధినేతల మీద ఎంతో ఒత్తిడి ఉంటుంది. అంతటి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునేప్పుడు ఏవో కొన్ని పొరబాట్లు ఖచ్చితంగా దొర్లుతాయి. ఆ పొరబాట్లకు చెల్లించవలసి వచ్చే మూల్యం ఎంత అనేది నిదానంగా తేలుతుంది. ఒత్తిడిలో జరిగే పొరబాట్లు ఓకే.. కానీ కేవలం అహంభావంతో, అహంకారంతో తీసుకునే నిర్ణయాలు తప్పుడువి అయితే పరిస్థితి ఏమిటి? బాధ్యత ఎవరిది? పార్టీకి చేటు చేసే నిర్ణయం అని అందరూ చెవినిల్లు కట్టుకుని పోరినా కూడా పట్టించుకోకుండా.. కేవలం తన అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం.. తాను తలచిందే చేసుకుంటూ పోతే దాని వలన జరిగే నష్టానికి కూడా ఆ అధినేతే బాధ్యత వహించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి వలన జరుగుతున్న పరిణామాలు ఇలాంటి భావనను కలిగిస్తున్నాయి.
కొందరు నాయకుల విషయంలో జగన్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. తాజా పరిణామాలను గమనిస్తే.. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఆయన వదిలేసుకున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఆయనను పొమ్మనకుండా పొగబెట్టారని అనవచ్చు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రజల్లో చాలా గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉన్న మాగుంట కుటుంబాన్ని వదిలించుకోవడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమే చేస్తుందని సొంత పార్టీలోనే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీకి అనేక రకాలుగా వెన్నుదన్నుగా ఉండే నాయకుడు. పైగా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎవరు వచ్చి సాయం అడిగినా చేసేవాళ్లుగా వారి కుటుంబానికి పేరుంది. ఆయన తప్పకుండా మళ్లీ గెలుస్తారనే విశ్వాసమూ అధికారపార్టీలోనే ఉంది. అందుకోసమే.. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాగుంట కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని అడిగారు. ఇవ్వకపోతే తాను ఎమ్మెల్యేగా కూడా పోటీచేయను అని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. ఏం చేసినా సరే.. జగన్ పట్టించుకోలేదు. మాగుంట కుటుంబానికి టికెట్ ఇచ్చేది లేదని అనేశారు.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విషయంలో కూడా ఇలాంటి మొండి వైఖరినే జగన్ అనుసరించారు. నరసరావుపేట పరిధిలో ఎంతో మంచిగా పనిచేస్తూ వచ్చిన లావు ను గుంటూరునుంచి పోటీచేయాలని అన్నారు. పేట పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ.. లావుకే ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ వద్ద మొరపెట్టుకున్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఎంపీగా ఆయన లేకపోతే తమ గెలుపుమీద కూడా ప్రభావం పడుతుందని కూడా వారు చెప్పుకున్నారు. వినలేదు. తీరా అలిగి, లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే తరహాలో మాగుంటను కూడా జగన్ స్వయంగా తెలుగుదేశంలోకి పంపుతున్నారు. ఇలాంటి ప్రజల్లో మంచి పేరున్న నాయకుల్ని వదులుకోవడం వైసీపీకి మంచిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఆ భయమే జగన్ బలహీనత, పతనహేతువు!

0

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సిద్ధం సభల్లో విపక్ష నాయకుల మీద చాలా రెచ్చిపోయి విమర్శలు కురిపిస్తూ ఉంటారు. గొంతు జీర పోయే రేంజిలో పెద్దపెద్దగా అరచి మరీ చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను తిట్టిపోయడానికి ఆయన కష్టపడుతుంటారు. కానీ.. మొన్నమొన్నటిదాకా జరిగిన సిద్ధం సభలకు, తాజాగా ఆదివారం నాడు మేదరమిట్ట వద్ద జరిగిన సిద్ధం సభకు ఒక పెద్ద తేడా ఉంది. గత సభలలో తిట్టినట్టుగా కేవలం చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను మాత్రం తిడుతూ విపక్షాలన్నీ దొంగలు అని ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదు. ఈ సభకు ముందుగానే విపక్ష కూటమిలోకి భాజపా కూడా చేరుతూ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి తనను ఓడించడానికి వారితో చేతులు కలిపిన బిజెపిని కూడా జగన్ అదేస్థాయిలో విమర్శిస్తారా? లేదా, లౌక్యం పాటిస్తారా? అనేది చాలా మంది ఎదురుచూశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి.. తన బలహీనతను సిద్ధం సభలో చాలా స్పష్టంగా బయటపెట్టేసుకున్నారు. బిజెపి అంటే తనలో ఉండే భయాన్ని ఆయన నిరూపించుకున్నారు. ఆ భయమే, ఆయనలోని బలహీనతే ఆయన పార్టీ ఓటమిని కూడా శాసించబోతున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో సత్సంబంధాలను కలిగిఉండడం వేరు- ఎన్నికల సమయంలో రాజకీయంగా పరస్పరం తలపడుతున్నప్పుడు ఉండాల్సిన తీరు వేరు. ఈ రెండింటి మధ్య ఒక సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఆ విభజన రేఖ తెలియనివాడు రాజకీయాల్లో రాణించలేడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అదే తరహాలో.. ఆ రాజనీతిని పాటిస్తుంటారు. ఫరెగ్జాంపుల్ తెలంగాణ రాజకీయాలను తీసుకుంటే.. ప్రధానిగా నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తే స్వయంగా వెళ్లి స్వాగతం పలికి, మోడీ మా పెద్దన్న అంటూ కితాబులిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేవలం ఒకటిరెండు రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడాల్సి వచ్చేసరికి మోడీ విధానాలను తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. అదే ఇక్కడ అవసరమైన రాజనీతి! జగన్మోహన్ రెడ్డిలో లేనిది కూడా అదే. ఆయన మోడీని పల్లెత్తు మాట అనరు.
మోడీ తనకు తండ్రితో సమానం అని కీర్తిస్తారు. పథకాల ప్రారంభోత్సవాల సభల్లో అలా కీర్తించినా.. ఎయిర్ పోర్టు దగ్గరినుంచి కలిసిన ప్రతిసారీ.. ఆయన కనపడగానే కాళ్ల మీద పడిపోయి పాదాలు ముట్టుకుని దణ్నం పెట్టుకునేందుకు ప్రయత్నించినా అదంతా ఆయన ఇష్టం! అలాగని బిజెపి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా.. మోడీ పట్ల అదే మాదిరి భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తే.. కుదరదు. బిజెపి అంటే జగన్ లో భయం ఇంకా పుష్కలంగా ఉంది. మేదరమిట్ట సిద్ధం సభలో భాజపాను పెద్దగా విమర్శించకుండా పైపైనే మాటలు అనడం.. తెలుగుదేశాన్ని, జనసేనను మాత్రం తీవ్రస్థాయిలో విమర్శించడం జగన్ యొక్క ప్రధాన బలహీనతను బయటపెడుతోందని పలువురు అనుకుంటున్నారు. ఆ బలహీనతే ఆయనను ఈ ఎన్నికల్లో పరాజయం పాల్జేస్తుందని కూడా అంటున్నారు. 

రెబల్‌ స్టార్‌ పక్కన సీతామహాలక్ష్మి

సీతారామం సినిమాతో కుర్రాళ్ల మనుసులు దోచుకున్న మృణాలు ఆచితూచి ఇండస్ట్రీలో అడుగులు వేస్తుంది. సీతారామంతో తరువాత నాని సరసన హాయ్‌ నాన్న సినిమాతో మరో హిట్‌ ని తన ఖాతాలో వేసుకుంది. తొలి సినిమాతోనే భారీ విజయానని సొంతం చేసుకుంది. త్వరలో విజయ్‌ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నట్లు సమాచారం.

ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే మృణాల్ టాలీవుడ్‌ లో మరో బంపరాఫర్ కొట్టేసింది. అది కూడా ఎవరి పక్కనో తెలుసా.. ప్రభాస్‌ పక్కన. ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి సినిమా, మారుతీ డైరెక్షన్‌ రాజా సాబ్ అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఎందుకంటే సలార్ తరువాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న సినిమాలు. ఈ రెండు సినిమాలు తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్‌ ఒప్పుకున్నట్లు సమాచారం.  ఈ సినిమాలో మృణాల్‌ కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.

శివరాత్రి ఘర్షణలో భీముడిపై గామి విజయం సాధించింది)

Inbox

సంక్రాంతి సీజన్ నుండి పెద్ద హిట్‌లు లేకపోవడంతో చాలా వారాల పాటు లీన్ ఫేజ్‌లో ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ గత వారాంతంలో కొంత ఉపశమనం పొందింది. మహా శివరాత్రి సందర్భంగా గత శుక్రవారం రెండు తెలుగు సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా విడుదలయ్యాయి. ఈ మూడింటిలో, విశ్వక్సేన్ యొక్క ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా గామి మొదటి వారాంతంలో మంచి వసూళ్లతో బాక్స్ ఆఫీస్ విజేతగా నిలిచింది.

నూతన దర్శకుడు విద్యాధర్ కగిత దర్శకత్వం వహించిన గామి, ప్రారంభ వారాంతంలో 20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆకట్టుకున్న టీజర్లు మరియు ట్రైలర్ల తర్వాత విడుదలకు ముందు ఉన్న బలమైన హైప్ కారణంగా ఈ చిత్రం ఘనమైన ఓపెనింగ్స్ సాధించింది. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, గామి ఆశాజనకమైన టాక్‌ను పొందగలిగింది మరియు శని మరియు ఆదివారాలలో మంచి పట్టును కొనసాగించింది. ఇది ఇప్పటికే అనేక ప్రాంతాలలో బ్రేక్-ఈవెన్ మార్కును సాధించింది.

ఓవర్సీస్‌లో, గామి దాదాపు $ 500k గ్రాస్‌తో అద్భుతమైన వారాంతంలో ఉంది. ఇది గురువారం ప్రీమియర్లలో $165Kతో ఆకట్టుకుంది మరియు శుక్రవారం $125Kతో దానిని అనుసరించింది. శనివారం ఈ చిత్రం $110K వసూలు చేసింది. ఆదివారం నాటికి, ఇది హాఫ్-మిలియన్ డాలర్ల మార్క్‌లో ముగిసే అవకాశం ఉంది.

గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన భీమా ట్రేడ్ అంచనాలను అందుకోలేకపోయింది. మంచి ప్రారంభాన్ని తీసుకున్న తర్వాత, బలహీనమైన నివేదికల కారణంగా ఈ చిత్రం తన పట్టును కొనసాగించడంలో విఫలమైంది. మొదటి వారాంతంలో దాదాపు 11 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో, భీమా మూడు రోజుల్లో కేవలం $ 40K వసూలు చేసింది.

రన్‌అవే మలయాళ బ్లాక్‌బస్టర్ ప్రేమలు తెలుగులోకి డబ్ చేయబడింది మరియు మొదటి వారాంతంలో అంత మంచి వసూళ్లు సాధించింది. తెలుగు వెర్షన్ USAలో $60K వసూలు చేసింది.

ReplyReply allForwardAdd reaction

Search for all messages with label Inbox

Varun Tej’s hat-trick flops incur 100 Crores loss

Mega hero Varun Tej is going through the toughest phase of his career. He scored a hat-trick of disasters with his latest offering Operation Valentine. Unfortunately, his last three outings, if we keep aside F3 ( multi-starrer with Venky), incurred a massive 100 Crores loss for his producers. Before Operation Valentine, he bagged debacles with Ghani and Gandeevadhari Arjuna. 

Varun Tej’s last commercial hit was Gaddalakonda Ganesh. After this film, his success graph witnessed a steady downhill as all his next three outings left no trace at the box office. Ghani, a sports drama, didn’t recover even publicity costs and incurred close to 25 Crores loss for his buyers. Gandeevadhari Arjuna, which was made on a budget of 40 Crores, tanked heavily because of its negligible shares. 

Operation Valentine is the third debacle in a trot for Varun Tej. Despite heavy publicity campaigns, the aerial spectacle came a cropper in the first weekend and sank at the box office in no time. The magnitude of the flop is so high that the film didn’t even collect 5 Crores gross worldwide. It was made with a 50 crore budget. 

In an attempt to experiment with diverse roles in different genres, Varun Tej made an irreparable loss to his decent market. He delivered big hits with Kanche, Fidaa and Tholi Prema. He bagged the biggest hit of his career with F2. He proved his acting mettle with Gaddalakonda Ganesh. But, the string of flops in recent times has pushed him to the brink. 

Varun Tej now wants to keep aside his experiments and concentrate on making a strong comeback. He will next appear in a period drama based on gambling which is titled Matka.