సంక్షేమ పథకాలు అంటే ప్రజల బాగు కోసం సంకల్పించినవిగా ఉండాలి. ఒకసారి అలాంటి పథకాలకు రూపకల్పన చేసిన తర్వాత వాటి సహజమైన పద్ధతిలో అవి కొనసాగుతూ పోవాలి. కానీ సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆకట్టుకోవడానికి విసిరే బిస్కెట్ల లాగా నిర్వచనాన్ని మార్చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి మాత్రమే చెల్లింది. బటన్ నొక్కడం కూడా పూర్తయి ఎంతో కాలం కింద ప్రజలకు విడుదల కావాల్సిన పథకాల నిధులను విడుదల చేయడంలో.. సరిగ్గా పోలింగ్ ముందు వరకు జాగు చేసి.. ఇప్పుడు విడుదల చేస్తానని పూనుకోవడం కుట్ర కాక మరేమిటి? అందుకే అలాంటి కుట్రలకు ఎన్నికల సంఘం తెరదించింది. పథకాలను జగన్ విసిరే బిస్కెట్లు లాగా మార్చేయాలనుకున్న కుట్రలకు చెక్ పెట్టింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించవలసిన పెట్టుబడి రాయితీ 847 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి మార్చి ఆరవ తేదీన బటన్ నొక్కారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 610 కోట్లు విడుదల చేయడానికి మార్చి 1న బటన్ నొక్కారు. మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆ 10, 15 రోజులపాటు విధులు విడుదల చేయకుండా ఆపేశారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇప్పటిదాకా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ నిధులను విడుదల చేయడం గురించి పట్టించుకోలేదు. తీరా మరొక వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనిగా ఇప్పుడు హడావుడి చేశారు. ఈ సమయంలో ప్రజల ఖాతాలలో డబ్బులు వేస్తే వారిని ఆకర్షించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం సాధ్యమవుతుందని కుట్రపన్నారు. అయితే ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వలేదు.
పైగా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా.. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వైఖరి ఈ వ్యవహారంతో వివాదాస్పదం అవుతుంది. జవహర్ రెడ్డి మీద కూడా వేటు వేసి ఎన్నికల విధులతో సంబంధం లేకుండా బదిలీ చేస్తే తప్ప రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పథకాలని జగన్ బిస్కెట్ల లాగా మార్చేస్తున్న సిఎస్
Delhi L-G Seeks NIA Probe Against Kejriwal Over ‘Khalistani Political Funding’
Delhi Lieutenant Governor (LG) VK Saxena has urged for a National Investigation Agency (NIA) inquiry into allegations of political funding received by Chief Minister Arvind Kejriwal from the banned terrorist organisation “Sikhs for Justice” (SFJ).
The recommendation for an NIA probe comes in response to a complaint received by the LG, accusing the Aam Aadmi Party (AAP) led by CM Kejriwal of accepting substantial funds amounting to USD 16 million from extremist Khalistani groups. The complaint alleges that these funds were used to secure the release of Devendra Pal Bhullar and advocate pro-Khalistani sentiments.
The LG office said that the complainant has “referred to the contents of a video, purportedly featuring Gurpatwant Singh Pannun (Khalistani terrorist and founder of banned organisation Sikhs For Justice), wherein he has alleged that AAP led by Arvind Kejriwal has received a staggering amount of $16 million in funding from Khalistani groups between 2014 and 2022”.
According to Raj Bhavan, the complaint states that a “clandestine meeting occurred in 2014 between Kejriwal and pro-Khalistani Sikhs at Gurdwara Richmond Hills, New York. During the meeting, Kejriwal purportedly promised to facilitate release of Devender Pal Bhullar, in return for substantial financial backing from Khalistani factions to the Aam Aadmi Party”.
The recommendation comes after a complaint was lodged by Ashoo Mongia, alongside former AAP member Munish Kumar Raizada, citing a video implicating Kejriwal’s Aam Aadmi Party (AAP) receiving a staggering $16 million in Khalistani funding from 2014 to 2022.
The complaint referenced a video featuring Gurpatwant Pannun, a Khalistani terrorist and SFJ leader, alleging that Kejriwal and Punjab CM Charanjit Singh Channi reneged on promises to release SFJ associates. Pannun’s associates were detained over connections to the Khalistan Referendum.
Additionally, claims emerged of a clandestine 2014 meeting between Kejriwal and pro-Khalistani Sikhs in New York’s Gurdwara Richmond Hills, purportedly in exchange for financial support to AAP. AAP’s Sanjay Singh’s frequent visits to Canada were also highlighted.
Reacting to the L-G’s recommendation of an NIA probe, the AAP said, “L-G sir is an agent of BJP. This is another big conspiracy against CM Kejriwal because BJP is going to lose all seven seats in Delhi.” Delhi minister Saurabh Bharadwaj said, “BJP had hatched this conspiracy even before Punjab Assembly elections.”
ముందే చేతులెత్తేసిన జగన్
అధికారులు బదిలీ అనేది కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారం అని ఎన్నికల నిర్వహణ స్వచ్ఛంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేకుండా పోతోంది.. అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. తన తొత్తులు అధికారంలో ఉంటే తప్ప ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు కాదు- అని ఆయన భావిస్తున్నారో ఏమో తెలియదు! అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న వారిని తప్పించి వేరే అధికారులను నియమిస్తూ ఉంటే- ఎన్నికల నిర్వహణ దారి తప్పి పోతున్నదని వ్యాఖ్యానిస్తున్న ఈ ముఖ్యమంత్రి- ఓటమి ఖరారు అని అర్థమై, ముందుగానే ఇలాంటి డొంకతిరుగుడు ఆరోపణలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా ఎన్నికల సమయంలో చిన్న చిన్న ఆరోపణలు వచ్చినాసరే.. అప్పటికి ఉన్నతాధికారులుగా ఉన్నవారిని ఈసీ తొలగించేస్తుంది. వారి స్థానంలో న్యూట్రల్ గా ఉంటారనే పేరున్న ఇతర అధికారుల్ని నియమించి.. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతున్నదనే భావనను ప్రజలకు కలిగిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజల్లో గౌరవం పెంచుతుంది. ఇది చాలా సహజంగా జరిగే వ్యవహారం. అయితే.. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్నాళ్లూ తమకు అత్యంత విధేయులుగా ఉండే అధికారుల్ని మాత్రమే కీలకపదవుల్లో నియమించుకుంటూ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొన్ని వారాల ముందు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికార్లు చాలా మందిని బదిలీచేశారు. ఎంత టూమచ్ గా విధేయతకు ప్రాధాన్యం ఇచ్చారంటే.. ఒకటిరెండు జిల్లాల ఎస్పీల విషయంలో పోస్టింగ్ అయి వారం రోజులు కూడా గడవక ముందే.. అక్కడ స్థానికంగా తమ పార్టీ నాయకులకు విధేయత చూపించలేదని, వారి అడుగులకు మడుగులొత్తలేదని కొందరు ఎస్పీలను మార్చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలుగా అంతా తమ విధేయులను నియమించారనే ఆరోపణలున్నాయి.
కోడ్ వచ్చిన తర్వాత.. అలాంటి అధికారులు దారి తప్పి వ్యవహరిస్తోంటే.. ఎన్నికల సంఘం వేటు వేస్తున్నది.అనేకమంది ఎస్పీలు, డీఐజీలు, కమిషనర్ ఇలా పలువురు బదిలీ అయ్యారు. ఎన్నికల ప్రచారపర్వంలో జరుగుతన్న అల్లర్లను అదుపుచేయడంలో, శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు రాష్ట్రమంతా విపలమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కూడా ఈసీ మార్చేసింది.
తన వీరభక్తుడైన వ్యక్తి డీజీపీ పదవిలో లేకపోయేసరికి జగన్ కు భయం పుట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఆయన అసలు ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదని వ్యాఖ్యానిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని పదవుల్లో విధేయుల్ని కూర్చోబెట్టిన వ్యక్తి, డీజీపీని మార్చగానే ఇలాంటి అల్లరి చేయడం ఆయనలోని ఓటమి భయం వల్లనేనని ప్రజలు అంటున్నారు.
ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్!
మాస్ యాక్షన్ హీరో ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాని టాలీవుడ్ మాస్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుని గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5 నా విడుదల చేయాలనీ భావించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది .ఈ సినిమాను అక్టోబర్ 10 న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారుతాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ అటు దేవర ఇటు వార్ 2 షూటింగ్ లతో బిజీ గా గడుపుతున్నారు.అలాగే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటంతో ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్ నిర్వహిస్తున్నాడు.
సినిమాలో ఎన్టీఆర్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు.అలాగే దర్శకుడు కొరటాల యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న “కృష్ణమ్మ ” సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవర షూటింగ్ చేస్తునే ఏమాత్రం గ్యాప్ దొరికిన కృష్ణమ్మ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.త్వరలోనే దేవర షూటింగ్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నారు.
కుబేర కోసం ధనుష్ అలాంటి పని చేశాడా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల విడుదలైన అన్నీ సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు అదే జోష్ కొనసాగిస్తూ మరో సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇక ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా స్టోరీని లీక్ చేశాడు. టైటిల్ కు తగ్గట్లే సినిమా కథ ఉండబోతుందని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. అంతే కాదు రీసెంట్ గా వచ్చిన నాగ్ పోస్టర్ సినిమా మరింత ఆసక్తిని పెంచింది.
నాగ్ పోలీస్ గా కనిపిస్తే, మరి ధనుష్ రిచ్ మ్యాన్ గా కనిపిస్తారేమో అని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ తీరాలంటే మాత్రం సినిమాలో చూడాల్సింది. ఇదిలా ఉండగా.. ధనుష్ ఈ సినిమా కోసం అతి పెద్ద సాహసం చేసినట్లే తెలుస్తుంది. ఒక బిచ్చగాడు ముంబై మొత్తాన్ని ఏలే డాన్ గా ఎలా మారాడు…అసలు కథ ఏంటి అనే నేపథ్యంలో రూపొందిస్తున్నారు.
తాజాగా ధనుష్ గురించి ఓ ఇంట్రస్టెంటింగ్ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే.. సుమారు పది గంటలసేపు ధనుష్ ఒక చెత్త కుప్ప పక్కనే గడిపాడని, సరైన ఎమోషన్స్ పలికించడం కోసం కనీసం మాస్కు కూడా పెట్టుకోకుండా ఆ పాత్ర కోసం ప్రాక్టీస్ చేశాడని తెలుస్తోంది. మాములుగా ఎవరైనా చెత్త అంటే ఛీ అంటారు. అలాంటి ధనుష్ ఇలా చెయ్యడం పై ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. నిజంగా ఇలా చెయ్యడమే గ్రేట్ కదా మరి!
PM Modi Slams Jagan’s Zero Development, Jet-Speed Corruption Agenda
Prime Minister Narendra Modi has alleged that development was at the top during AP Chandrababu Naidu’s rule, but it was derailed after the YSP government came in the state. Addressing a hugly attended public meeting held in Vemagiri of Rajahmundry, along with TDP chief Chandrababu Naidu, Jana Sena chief Pawan Kalyan and state BJP president D. Purandeswari, he lamented that during last five years YCP has plunged the state into debt trap.
Stating that NDA alliance is bound to win wherever elections are being held in the country, Modi asserted that a new chapter will begin in Andhra Pradesh too after May 13 polling. Stating that NDA is the only guarantee of working for the good of the people, he assured that the NDA’s double engine government will complete all the works that were stopped during the Jagan government.
The Prime Minister said that if the Congress admits defeat before it wins, then YCP is being rejected by the people of Andhra state. He said he is confident that there would be a double engine government at the center and also in the state for the development of the state.
He accused that corruption ran at jet speed during the YCP regime and said there was zero development, 100% corruption. He said that the YCP government has plunged the state into debt. He praised that there are talented youth in AP and the world has recognized the power of the state’s youth in technology.
He criticized CM Jagan Mohan Reddy for delaying the implementation of central projects like Polavaram, though the center provided funds. Modi also alleged that Jagan shelved capital Amaravati, though the center is ready to give Rs 15,000 crore. He ridiculed Jagan’s three- capital formula, of which not a single capital materialized.
He mentioned that the leaders of the INDIA alliance, who are talking about ED, are pouring out heaps of money. He complained that even machines are unable to count the money of those leaders.
Prime Minister Modi has criticized that the development of Andhra Pradesh has gone wrong under this YCP regime and he practically looted the state and its resources.
TDP National General Secretary Nara Lokesh stated that Narendra Modi is Vishwajeet, Vishwajeet means conqueror of the universe. Since Modi came to power, he said it has been revealed that India is being kept as the leader in the world.
Lokesh recalled that the development of the state was started during the TDP regime. He said that Visakhapatnam was made an IT hub during the TDP regime and Chandrababu knows well how to provide employment to the youth. Lokesh said that the first victims of Jagan’s rule were the youth.
Amitabh Bachchan Wraps Up Shooting For ‘Vettaiyan’: New Photo Unveiled From Sets
Touted to be an action-drama, anticipation builds around Superstar Rajinikanth’s much-anticipated next ‘Vettaiyan’. Ever since the announcement was made about the collaboration between Superstar Rajinikanth and Bollywood legendary actor Amitabh Bachchan, fans have been eagerly awaiting their on-screen reunion. Adding to the anticipation, the makers recently revealed BTS pictures from the sets of ‘Vettaiyan’, featuring Amitabh and Rajinikanth.
Now, again, a new picture from the ‘Vettaiyan sets has gone viral on social media, in which both the actors were seen wearing formal outfits against the backdrop of a courtroom, hinting at a pivotal court scene.
Recently, Big B wrapped up his shooting for ‘Vettaiyan’, and in the latest entry, Amitabh shared his shooting experiences and said, “Another day at work comes to an end and the end too of this project for me… But ever the dissatisfaction of a doubt, when in reflection, whether the work done was to satisfaction and whether there shall be an opportunity to have another try and redo and maybe improve the previous.”
The actor additionally added, “There is ever the apprehension that the production or the director may not give you another chance… but as you reminisce at night, it disturbs you and you wonder… so a request has been made and there is promised that the opportunity to redo and improve shall be given… but let us see.”
Directed by TJ Gnanavel, ‘Vettaiyan’ is backed by Subaskaran under Lyca Productions. Apart from the Titans of Indian cinema, the film boasts a stellar ensemble cast, including Fahadh Faasil, Rana Daggubati, Ritika Singh, Manju Warrier, Dushara Vijayan, and others in significant roles. Musical sensation Anirudh Ravichandran is composing the tunes for this flick. The makers have yet to announce the film’s release date, expecting it to arrive in theaters in late 2024.
Kanakamedala Asks To Transfer Chief Secretary Also
After the Election Commission of India (ECI) shifting AP DGP Rajendranath Reddy responding to the complaints of Model Code of Conduct (MCC) violations, TDP leader and former MP Kanakamedala Ravindra Kumar demands that Chief Minister KS Jawahar Reddy also should be shifted immediately.
He said already several complaints are pending with the ECI against him. He said EC’s actions against some senior IAS and IPS officers is proof of how key officials colluded with the ruling party in Andhra Pradesh. So, he said the Chief Secretary also should be kept away from election-related duties.
Expressing concern over the death of some pensioners due to the state government’s negligence attitude, he alleged that those are all `government muders’ only and the chief secretary also should be held responsible.
He said that severe anger has been coming out from the state government employees against YS Jaganmohan Reddy’s regime of anarchy. Stating that their anger is reflecting in their choice of vote, he is hopeful over 95 per cent of them are voting for NDA candidates.
Ravindra Kumar appealed to IAS officers in the state to act impartially. He urged the ECI to clear some more pending complaints so as to ensure people to exercise their right to vote freely.
He recalled that when Chandrababu Naidu was the Chief Minister, the IAS officers had freedom and respect. He did not trouble the officers like Jagan. While several officers were arrested in cases related to Jagan, he said not a single officer is facing allegations because of Chandrababu Naidu.
He cautioned that IAS officers still who are colluding with the ruling party should be aware how some officers in the past roaming around the country for their hand in glove during YS Rajasekhara Reddy’s regime.
రాజమండ్రికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం!
గ్లోబర్ స్టార్ రాంచరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో చరణ్ తరువాత సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న చిత్రం “గేమ్ చేంజర్”..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయాల్సి రావడంతో రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు.ఎంతోకాలంగా ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే రీసెంట్ గా రాంచరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి “జరగండి జరగండి ” సాంగ్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే గేమ్‌చేంజర్’ సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు వైరల్ అవుతున్నాయి .తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో సోమవారం మొదలు కానుందని తెలుస్తుంది. కథ ప్రకారం ఇది కీలకమైన షెడ్యూల్ అని సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే దర్శకుడు శంకర్ ,చరణ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.