Home Blog Page 881

బన్నీ బర్త్‌ డే కి డబుల్‌ ధమాకా!

మరి కొద్ది రోజుల్లో అల్లు అర్జున్‌ పుట్టిన రోజు రాబోతుంది. బన్నీ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప 2 . ఈ సినిమా పుష్ప సినిమాకి సీక్వెల్‌ గా వస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్‌ ని ఈ సినిమా జాతీయ నటుడిగా నిలబెట్టింది.

పుష్ప 2 సినిమాని ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఈ సినిమా నుంచి బన్నీ బర్త్‌ డే రోజున పుష్ప 2 టీజర్‌ ను రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. అన్ని కుదిరితే  బన్నీ పుట్టినరోజు నాడు టీజర్‌ గ్యారంటీ గా విడుదల కానుంది.

ఇది ఇలా ఉంటే బన్నీ , సుకుమార్‌ డైరెక్షన్‌ లో వచ్చి బన్నీకి మంచి యూత్‌ ఫాలోయింగ్‌ ఇచ్చిన సినిమా ఆర్య..దాని సీక్వెల్‌ ఆర్య 2 కూడా వీరి కాంబోలో వచ్చిందే. ఏప్రిల్‌ 7న ఈ సినిమాని రీరిలీజ్‌ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

దీని బట్టి చూస్తే బన్నీ పుట్టినరోజు నాడు అభిమానులకు డబుల్‌ ధమాకా అని చెప్పవచ్చు.

సమయం వచ్చినపపుడు మీకే తెలుస్తుంది!

టాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడ్ని సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎందుకంటే తాప్సీ గత పది సంవత్సరాలుగా డెన్మార్క్‌ కి చెందిన బ్యాడ్మింటన్‌ ఆటగాడుమథియాస్‌ బో తో ప్రేమలో ఉందనే విషయం తెలిసిందే.

మార్చి 23 న వీరి వివాహం జరిగిందని.. దానికి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. ఉదయ్‌పూర్‌ లో తాప్సీ – మథియాస్‌ వివాహం జరిగినట్లు వినికిడి. అసలే క్లారిటీ లేదు అంటే.. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్‌ ఫ్రెండ్‌.. ప్రొడ్యూసర్‌ కనిక కొన్ని ఫోటోలను షేర్‌ నా స్నేహితుల పెళ్లిలో అని రాసుకొచ్చింది.

ఈ ఫోటోలను చూసిన వారు కనిక ఆ పెళ్లికి వెళ్లారంటూ…గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకకు అనురాగ్‌ కశ్యప్‌ కూడా వెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో తాప్సీనే స్వయంగా వీటి గురించి స్పందించారు.
పెళ్లి అనేది అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైన భాగం… దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం రాగానే నేనే మీ అందరికీ స్వయంగా తెలియజేస్తాను అంటూ వివరించింది.

బంధం గురించే ముందే తెలిస్తే!

కమల్‌ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్‌ గురించి తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ తో కలిసి చిందులు వేసింది. ఈ అల్బమ్‌ ఇనిమేల్‌ అనే పేరు కూడా పెట్టారు. దీనికి స్వయంగా కమల్‌ నే లిరిక్స్‌ ఇచ్చారు. ఈ సాంగ్‌ కి ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి ఈ పాటకు సంబంధించిన కొన్ని విషయాలను వివరించారు. లోకేశ్‌ గురించి అందరికీ ఓ సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ గా మాత్రమే తెలుసు. ఎందుకంటే అతను సినిమాలన్ని సూపర్‌ హిట్‌ అయ్యాయి కాబట్టి. తాజాగా ఈ పాటతో తనలోని నటుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఈ పాటలో ప్రేమ అనేది ఇద్దరిలో ఉండే బంధం. ఆ బంధాన్ని నాలుగు నిమిషాల్లో చూపించాలనుకున్నాం. ప్రేమ అనేది ఓ భ్రమని నా నమ్మకం. భవిష్యత్తులో ఓ బంధం ఎలా ఉండబోతుందో ముందే తెలిస్తే ఎవరైనా ఆ బంధంలో ఉంటారా లేదా అనే ప్రశ్నను మేము ఈ పాట రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాం.

ఈ సాంగ్‌ ని మూడు రోజుల పాటు వివిధ లోకేషన్లలో షూట్‌ చేశాం. నాన్నతో కలిసి మరోసారి పని చేసేందుకు అవకాశం దొరికింది. ఆయన గొప్ప రచయిత కూడా.. ఎంత బిజీగా ఉన్న పిల్లల గురించి ప్రతి విషయం తెలుసుకుంటారు…అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది.

Vijay Devarakonda And Mrunal Thakur Celebrate Holi In The Family Star Promotions

Vijay Devarakonda and Mrunal Thakur celebrate Holi in Hyderabad while promoting the film ‘Family Star’. The family star team celebrated Holi by dancing on stage during the event. Both Vijay Devarakonda and Mrunal donned pristine white attire for Holi. Vijay was seen in a white kurta and pyjama, while Mrunal Thakur wore a white Anarkali kurta. Mrunal shared a glimpse of their Holi celebration on her Instagram handle.
 
The Family Star, starring Vijay Devarakonda and Mrunal Thakur, is directed by Parasuram Petla and produced by Dil Raju and Sirish under Sri Venkateswara Creations. This is Vijay Devarakonda’s second movie together with filmmaker Parasuram, with whom he previously worked on the superhit film “Geetha Govindam.”
Touted to be an action drama, Family Star is all set to hit theaters on April 5, 2024. As the film is gearing up for its release, the film team has now unveiled the lyrical video of the third single, ‘Madhuramu Kadha’. The renowned singer Shreya Ghoshal lends her enchanting voice to the song, set to the mesmerizing composition of Gopi Sundar’s music.

Along with their third single, the team also shared an update on the trailer release. The trailer for Family Star will be released on March 28.


Speaking more about the film, apart from Vijay Devarakonda and Mrunal Thakur, Family Star features an ensemble cast that includes Ajay Ghosh, Divyansha Kaushik, and others. Adding on, the film’s cinematography was handled by KU Mohanan while editing was covered by Marthand K Venkatesh. 

క్షణం తీరిక లేకుండా లోకనాయకుడు!

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ 2 సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా కమల్‌ మరో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ప్రభాస్ తో కల్కి, మరోటి థగ్‌ లైఫ్‌.. ఇలా మూడు సినిమాలతో కమల్‌ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్నారు.

కమల్‌ సినిమాలు ఆలస్యం అవుతున్నప్పటికీ చిత్ర మేకర్స్‌ మాత్రం ఎక్కడా కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడట్లేదు. ఇండియన్‌ 2 సినిమా షూటింగ్‌ చివరికి వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అది పూర్తి అవ్వడమే దాని సీక్వెల్ పనులు కూడా మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉంది చిత్ర బృందం.

ఈ క్రమంలోనే ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. దీంతో కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. ఎన్నికల హడావిడి అవ్వగానే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్‌ లైఫ్‌ సినిమా చిత్రీకరణ కూడా మొదలు పెట్టేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. తెలుగులో కల్కి 2898 ఏడీలో కమల్ అతిథి పాత్రలో మెరసినట్లు.. దానికి సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఇళయరాజా బయోపిక్‌ లో కూడా కమల్‌ నటిస్తున్నట్లు సమాచారం.

మహేష్‌ సరసన బాలీవుడ్‌ భామ.. ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తున్నారంటే..ఎప్పుడెప్పుడూ విడుదల అవుతుందా అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అలాంటిది ఈసారి ఆయన దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఆ సినిమా కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.

సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా వస్తుందా అంటూ సోషల్‌ మీడియాలో సెర్చింగ్‌ కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటిక ఈ సినిమా ఏషియాలోనే భారీ బడ్జెట్ సినిమా అనే టాక్‌ ఉంది. దీంతో సినిమా మీద అంచనాలు ఇంకా బాగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.  ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ పక్కన బాలీవుడ్‌ భామ అలియా భట్‌ హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసిందనే టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇది పూర్తి అడ్వెంచర్‌ సినిమా అని.. అమెజాన్ అడవులు బ్యాక్‌డ్రాప్‌ లో జరగబోతుందని సమాచారం. మరి అలాంటి సినిమాలో అలియా ఎలాంటి క్యారెక్టర్‌ చేస్తుందో చూడాలి. అలియా తెలుగు చిత్ర సీమకు కొత్తేమీ కాదు…రాజమౌళి దర్శకత్వంలో వచ్చి సినీ ప్రపంచాన్ని మొత్తం తెలుగు చిత్ర సీమ వైపు చూసేలా చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో సీత పాత్రలో నటించింది.

Prabhas Says No New Projects Till 2028

After the enormous box-office success of Baahubali, Prabhas emerged as the reigning pan-India superstar. Even before the release of Baahubali 2, he promised to work with several crazy directors of South India. So, he has been obliging all his commitments without fail despite earning immense popularity and stardom like no other actor in the country. 

Having been occupied with multiple pan-India projects, the Saaho actor has decided not to green-lit new assignments till 2028. He is currently busy shooting for his forthcoming dystopian science fiction thriller Kalki 2898AD which is on the brink of completing its shooting formalities. He has Maruthi’s horror fantasy ‘Raja Saab’ lined up next. In the meantime, the second part of Salaar will also go on floors. 

After wrapping up both ‘Salaar 2’ and ‘Raja Saab’, the Radhe Shyam actor will join forces with Animal fame director Sandeep Reddy Vanga for a cop drama titled Spirit. As Spirit is going to be a mammoth project, Sandeep Reddy needs more than a year to complete the entire filming. 

The pre-production activities of Prabhas – Hanu Raghavapudi film are silently happening at present. The regular shooting will commence in mid-next year. He might simultaneously shoot for both of these films till 2027. 

It is a jam-packed schedule for Prabhas till the end of 2027. So, he has decided to take up new films only in 2028 as he wants to complete the present commitments in the next four years. 

While Kalki 2898AD is slated for release after Summer, Raja Saab will hit the screens in the first quarter of 2025. Salaar 2 is expected to hit the screens in Summer next year. Spirit and Hanu Raghavapudi’s film will target the subsequent years for release. 

ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ కు వెళ్లిన ఐకాన్ స్టార్‌.. కానీ వెకెషన్‌ కోసం కాదు!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ ను హైదరాబాద్‌, వైజాగ్‌ లో జరుపుకొని ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.  ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ కి వెళ్లాడు. అయితే ఇది వెకేషన్‌ కోసం మాత్రం కాదని సమాచారం.

సాధారణంగా ఫిల్మ్‌ స్టార్స్‌ విదేశాలకు వెళ్లారు అంటే అది కచ్చితంగా వెకేషన్‌ కోసమే కానీ మామూలుగా వెళ్లారు. ఇప్పుడు అల్లు అర్జున్ వెకేషన్‌ కోసం కాకుండా దేని కోసం వెళ్లాడో తెలుసా..! ఆయన మైనపు విగ్రహావిష్కరణ కోసం. ఈ ఈవెంట్‌ కోసమే బన్నీ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ కి వెళ్లాడు.

దుబాయ్‌ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. పుష్ప సినిమాతో జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్న బన్నీ విగ్రహాన్ని దుబాయ్‌లో మ్యూజియంలో ఏర్పాటు చేయడంతో బన్నీతో పాటు ఆయన ఫ్యాన్స్‌ కూడా పిచ్చ హ్యాపీగా ఉన్నారు.

ఆ విగ్రహాం కోసం బన్నీ పోయిన ఏడాదిలోనే కొలతలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మార్చి 28న రాత్రి 8 గంటలకు జరగునుంది. అయితే తెలుగు హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్‌ హీరోల మైనపు విగ్రహాలు కూడా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉన్నాయి. కానీ అది లండన్‌. దుబాయ్‌ మ్యూజియంలో తొలి ఇండియన్‌ యాక్టర్ గా బన్నీ కి మాత్రమే ఆ గౌరవం దక్కింది.

Official Update On RC17: The Force Reunites

The makers of RC17 have officially confirmed the film, which will be directed by Maverick director Sukumar and star global star Ram Charan as the main lead. Rc17 will feature music by National Award winner Devi Sri Prasad.


The tentatively titled RC17 will be the second collaboration between director Sukumar and Mega Powerstar Ram Charan. The hit duo previously collaborated on the film Rangasthalam, which was released in 2018.

The movie makers have announced the update on RC17 on their social media handles, saying, “Mighty forces reunite for an earth-shattering magnum opus Global Star @alwaysramcharan X The Maverick Director @aryasukku X Rockstar @thisisdsp X @mythriofficial X @sukumarwritings = #Raring2Conquer #RC17 is all set to add new colours to the Indian Cinema”

Sharing the same, Ram Charan penned a note saying – “RC17 the force Reunites @aryasukku @thisisdsp @mythriofficial”

RC17 will be a special reunion for the cast, as they all collaborated for the second time after the film Rangasthalam. RangaSthalam, helmed by the director Sukumar and bankrolled by Mythri Movie Makers. The film stars Ram Charan and Samantha Ruth Prabhu as the main leads, who gave stellar performances as Chitti Babu and Rama Lakshmi, respectively. Devi Sri’s musical added another layer to the cinematic experience.

Speaking about Ram Charan’s upcoming projects, he is currently working on his much-anticipated political drama Game Changer, helmed by S. Shankar. Recently, RC16 began with a pooja ceremony featuring Ram Charan and Janhvi Kapoor as the main leads.

మరోసారి రిపీట్‌ కాబోతున్న సూపర్‌ హిట్‌ కాంబో!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో 6 సంవత్సరాల క్రితం వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాలో చరణ్‌ యాక్టింగ్‌ కి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. దాంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా వస్తే బాగుండు అని ఎదురు చూసే అభిమానులకు గుడ్‌ న్యూస్‌ వీరిద్దరి కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాని తరువాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ తో కలిసి ఓ సినిమాని లైన్‌ లో పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ రెండు సినిమాలు ఇంకా లైన్లో ఉండగానే చరణ్ మరో డైరెక్టర్‌ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా.. సుకుమార్‌. రామ్‌ చరణ్‌ కెరీర్‌ లో 17 వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించబోతున్నారని సమాచారం.దీనికి సంబంధించిన రెండు గుర్రాల పోస్టర్‌ తో రోరింగ్‌ టూ కాంకర్‌ అనే ఉపశీర్షిక తో మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి సుకుమార్‌ రైటింగ్స్‌ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేశారు.

ఈ సినిమాని రంగస్థలాన్ని మించేలా తీర్చిదిద్దాలని చిత్ర బృందం భావిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.