Home Blog Page 880

జగన్ తలరాత ఇవాళే తేలుతుందా?

అదేమిటి? సోమవారమే కదా పోలింగ్ పూర్తయింది! ఖచ్చితంగా ఎంత శాతం ఓట్లు పోలయ్యాయనే లెక్క కూడా ఇంకా పూర్తిగా తేలలేదు కదా.. అంతలో జగన్ తలరాత ఎలా తేలుతుంది? ఆ విషయం తేలడానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉన్నది కదా.. జూన్ 4న కదా ఫలితాలు వెల్లడవుతాయి! అని మీకు ఆశ్చర్యం కలుగుతుండవచ్చు. మామూలు నాయకులకు అయితే.. అధికారం దక్కడమూ- దక్కకపోవడమూ మాత్రమే తలరాత అవుతుంది గానీ.. జగన్మోహన్ రెడ్డి వంటి బెయిలుమీద బయట ఉన్న నాయకుడి పరిస్థితి వేరు. సుమారు రెండునెలలపాటూ విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ ఎండనకా వాననకా  ప్రచారం నిర్వహించి అలసిపోయిన జగన్మోహన్ రెడ్డి.. పోలింగ్ పర్వం ముగిసిన వెంటనే.. చల్లటి విదేశాలకు వెళ్లి సేదతీరాలని అనుకున్నారు. కానీ.. బెయిల్ మీద ఉన్న నిందితుడు కావడం మూలాన, విదేశీయాత్ర చేయాలంటే ఆయనకు సీబీఐ కోర్టు అనుమతి కావాల్సిందే. మరి ఆయనకు అనుమతి దక్కుతుందా? లేదా? అనేది ఇవాళ (మంగళవారం) తేలనుంది.
జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీనుంచి జూన్ 1 వరకు కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. లండన్ లో చదువుతున్న కూతుళ్లతో గడపడం సహా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలు పర్యటించి రావాలని అనుకున్నారు. ఆ మేరకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కోర్టు, సీబీఐ వారి అభ్యంతరాలను కోరింది. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమార్జనల కేసుల విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ దశలో ఆయనను విదేశీయాత్రకు అనుమతించడానికి వీల్లేదని, దానివల్ల ఇబ్బందులు వస్తాయని సీబీఐ- కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్నటువంటి న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఆ వాయిదా మంగళవారం ఉంది. ఇవాళ తీర్పు వెలువడుతుంది.

సీబీఐ అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో.. వారు నో చెప్పడమే.. జగన్ ఓటమికి ఒక సంకేతం అని పలువురు భావించారు. జగన్ ఓడిపోయే అవకాశం ఉన్నది గనుక.. ఫలితాలకు ముందుగా ఆయన విదేశాలకు వెళ్లడాన్ని అనుమతిస్తే, మళ్లీ తిరిగి వస్తారో లేదో అనే భయం సీబీఐలో ఉండవచ్చునని కూడా పలువురు అనుకుంటున్నారు. మరి కోర్టు ఈ వ్యవహారాలను ఎలా పరిగణిస్తుందో..? జగన్ విదేశాలకు విహారయాత్రకు వెళ్లడానికి అనుమతి ఇస్తుందో లేదో? ఓటు వేయడానికి ఎటూ లండన్ నుంచి కూతుళ్లు కూడా ఇండియా వచ్చారు గనుక.. ఇప్పటికిప్పుడు వెళ్లకపోయినా పర్లేదులెమ్మని చెబుతుందో వేచిచూడాలి.

జగన్‌! ప్రజలకు ‘థాంక్స్’ చెప్పే టైం లేదా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజలు అంటే చాలా ప్రేమ! కనీసం తాను ప్రేమ కురిపించడానికి అయినా సరే రాష్ట్రంలో పుష్కలంగా పేదలు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు! ప్రజలను ఉద్దేశించి ఆయన చేసే సంబోధన కూడా చాలా చిత్రంగా ఉంటుంది. అదే తరహాలో సోమవారం నాడు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుండగా.. జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ తప్పకుండా కదిలి వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ఆయన పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు కూడా సభలలో ఆయన ప్రసంగం మాదిరిగానే నాటకీయంగా సాగిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే పోలింగ్ ముగిసిన తర్వాత ఓటు వేసిన రాష్ట్ర ప్రజలకు కనీసం థాంక్స్ చెప్పడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఐదు నిమిషాల సమయం లేదా అని ప్రజలు విస్తుపోతున్నారు.
‘‘నా అవ్వాతాతలు అందరూ.. నా అక్క చెల్లెమ్మలందరూ.. నా అన్నదమ్ములందరూ.. నా రైతన్నలందరూ.. నా యువతీ యువకులు అందరూ.. నా ఎస్సీ.. నా ఎస్టి.. నా బీసీ.. నా మైనారిటీలందరూ.. అందరూ కదలిరండి తప్పకుండా ఓటు వేయండి’’ అని జగన్ ఉదయాన్నే ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఓటర్లలో ఆ మేరకు చైతన్యం కలిగించడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి! ఆయన పిలుపునకే స్పందించి ఓటర్లంతా అనేక కష్టనష్టాలకు ఓర్చి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేశారని అనుకుందాం. మరి అలాంటప్పుడు ప్రజలకు థాంక్స్ చెప్పడం కూడా నాయకుడుగా ఆయన బాధ్యత కదా! పోలింగ్ ముగిసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి కదా! అని ప్రజల ప్రశ్నిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాంటి పని సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. పోలింగ్ సరళి మీద వ్యాఖ్యానించడానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి అనుకూలంగా జరిగిందని సభ్యుల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం అధిక పోలింగ్ అధికార పార్టీని ఓడిస్తే, ఈసారి అధిక పోలింగ్ అధికార పార్టీని మళ్ళీ గెలిపిస్తుంది అన్నారు. ఆయన ప్రెస్ మీట్ మొత్తం తెలుగుదేశం పార్టీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందని ఆరోపించడానికి సరిపోయింది. పోలీసులు కూడా తెలుగుదేశంతో కుమ్మక్కై రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి సహకరించారని, సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన మాటలు గమనిస్తే ఓడిపోయిన తర్వాత చెప్పుకోవాల్సిన కారణాలను ఇప్పుడే తయారు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.
ఆ గొడవ పక్కన పెడితే ఇన్నాళ్లు పేద ప్రజలను ఇంతగా ప్రేమించానని చెప్పుకునే జగన్.. పోలింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్న నేపథ్యంలో.. ఆ ప్రజలకు థాంక్స్ చెప్పడానికి జగన్ కు సమయం లేదా? ఇంత కష్టపడి ప్రజలంతా వచ్చి ఆయనకు ఓట్లు వేస్తే కనీసం ధన్యవాదాలు చెప్పలేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు! లేదా, ఓటమి ఖరారు అని అంచనాకు రావడంతో ప్రజల ఎదుటకు రాలేక మొహం చాటేస్తున్నారా? అని అంటున్నారు.

YCP goons resorts to attacks, kidnappings on polling day

As the crucial polling started in Andhra Pradesh on Monday morning, at several places YCP goons are resorting to attacks and kidnappings indiscriminately.

They abducted seven polling agents in the Punganur area of Chittoor district. Agents of BJP MP candidate N. Kiran Kumar Reddy and TDP MLA candidate Challa Ramachandra Reddy were kidnapped. Polling agents belonging to another independent candidate were also kidnapped.

TDP agents of three polling centers in Punganur were kidnapped when  they were going to the polling centers in Boorugamanda of Sadum mandal. TDP agents Raja Reddy, Subbaraju and Surendra  were among those kidnapped. TDP leaders said that it was the YSRCP leaders who had kidnapped them.

Similarly, TDP complained to the EC that three agents were kidnapped in Pileru. The complaint stated that they were left in an inaccessible area of the polling stations. YSRCP cadres attacked TDP agents in Rentachintala mandal of Palnadu district. Two TDP agents were seriously injured in the mob attack. The injured were taken to the hospital for treatment.

Before the start of polling, the EC expressed its anger over disturbances in Rentachintala Mandal of Palnadu district. The Election Commission ordered the situation under control immediately. It said that more additional forces would be mobilized if necessary. Immediately, ECI special observer Rammohan Mishra left for the Palnadu area.

The YSRCP leaders got into an argument with the polling officials at the 129 polling center of Uravakonda Government School in Anantapur district. YSRCP leaders stormed into the polling center claiming that their party’s agents were not allowed and created chaos. The officials concluded that they were not allowing the agents because they did not come on time. Officials expressed their anger at YSRCP leaders entering the polling station.

YSRCP goons committed atrocities in Papakkagaripalle of Pullampeta mandal of Annamayya district. YSRCP leaders are pulling out the TDP agents from the polling stations. There was a tense situation at the 201st polling station as the TDP agents were pulled out.

TDP agents were pulled out in Chinna Gulavalur of Chapadu mandal of YSR district also. The TDP objected to allowing of YSRCP workers into the polling station. Opposition leaders objected as some volunteers who resigned are seen as YSRCP agents in 4 and 5 polling centers in Srisailam.

న్యాయం కావాలి : తంగెడలో రీపోలింగ్ పెట్టాల్సిందే!

ఓటమి భయం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో అనేక అరాచకాలు చేయించింది. అసలు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ రోజున విధ్వంసాలు సృష్టించడం, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం ద్వారా ఓటింగ్ శాతం తక్కువ జరిగేలా చూడాలని చాలాకాలం కిందనుంచే వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం వ్యాప్తిలోకి వచ్చింది. పోలింగ్ నాడు చాలా చోట్ల అలాంటి ప్రయత్నాలు జరిగాయి గానీ.. పెద్ద ఎత్తున జరగలేదు. చెదురుమదురు అల్లర్లు జరిగినా.. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలు.. అక్కడినుంచి కదలలేదు. ఓటు వేసి తీరాలన్నట్టుగా అక్కడే ఉండిపోయారు. అయితే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పరిధిలోని తంగెడలో జరిగిన సంఘటనలు.. వైసీపీ వారి అరాచకమైన దాడులు, చేసిన విధ్వంసం క్యూలైన్లో ఉన్న ఓటర్లందరూ ప్రాణభయంతో పారిపోయే పరిస్థితిని కల్పించాయి. ఈ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించి తీరాల్సిందేనని, లేకపోతే వైసీపీ వారి అరాచకాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పలువురు భావిస్తున్నారు.
గురజాల నియోజకవర్గం పరిధిలోని దాచేపల్లి మండలం తంగెడలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోలు సీసాలతో దాడులకు తెగబడ్డారు. ఓటమి భయంతో ఇాది వైఎస్సార్ కాంగ్రెస్ వారు వ్యూహాత్మకంగా చేసిన దాడులుగా ప్రజలు భావిస్తున్నారు. ఈ దాడులు సరిగ్గా పోలింగ్ ముగుస్తున్న సమయానికి, అంటే, ఆరుగంటల సమయంలో జరిగాయి. ఆరుగంటల తర్వాత కూడా పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చుని ఉన్నారు. 6 గంటల వరకు క్యూలైన్లోకి వచ్చిన చివరి ఓటరు కూడా ఓటు వేసే వరకు పోలింగ్ జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. అయితే పోలింగ్ శాతం బాగా పెరిగితే.. తమకు నష్టం జరుగుతుందనే భయంతో వైసీపీ వర్గీయులు తెలుగుదేశం వారితో తొలుత ఘర్షణ పడ్డారు. అంతలోనే నాటుబాబులతోను, పెట్రోలు సీసాలతోను దాడులు చేశారు. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది.
ఈ విధ్వంసం మొదలు కాగానే.. పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరి ఉన్న ఓటర్లందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వాళ్లెవ్వరూ ఓట్లు వేయకుండా చూడడానికే వైసీపీ వారు ఇలాంటి కుట్రలు, దాడులు చేసినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే.. తంగెడలో రీపోలింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా మాత్రం.. పోలింగ్ అధికారులు నివేదికను బట్టి రీపోలింగ్ పెడతాం అంటున్నారు. కానీ తంగెడలో అల్లర్లు, విధ్వంసాన్ని పట్టిచుకుని రీపోలింగ్ పెడితేనే న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు.

Get Ready for Manchu Vishnu’s Star-Studded ‘Kannappa’ Teaser: Unveils on May 20

Since the announcement of Manchu Vishnu’s dream project ‘Kannappa’, enthusiasm has grown around this highly anticipated mythological film. Adding to the anticipation, the film team is set to unveil the latest updates on this project, revealing that the teaser of this much-awaited magnum opus will be released on May 20.

Making an official announcement, actor Manchu Vishnu took to his social media platforms and shared an update on the film’s teaser. The actor shared a new poster and wrote, “Can’t wait to show you all a glimpse into ‘The World Of Kannappa’ on the 20th-May. Launching it in Cannes Film Festival.”

Absolutely correct! The teaser of the film will be unveiled at the Cannes Film Festival on May 20, marking a significant milestone for Indian cinema on a global scale.

The film features an ensemble, star-studded cast of prominent names from the Indian film industry, including Prabhas, Akshay Kumar, Nayanthara, Kajal Aggarwal, Mohan Lal, Shiva Rajkumar, Madhubala, Sarath Kumar, Brahmanandam, and numerous others in pivotal roles. Recently, Bollywood actor Akshay Kumar concluded filming for ‘Kannappa’, and the renowned Rebel star Prabhas has now commenced shooting for the highly anticipated film, generating immense excitement and interest among fans.

‘Kannappa’ is helmed by Mukesh Kumar Singh and backed by the collaboration of actor-producer Mohan Babu through 24 Frames Factory and Ava Entertainments. Enhancing the cinematic experience are the melodic arrangements by Mani Sharma and Stephen Devassy, with captivating cinematography by Sheldon Chau. Editing is handled by Anthony Gonsalves.

YCP Goons Violence… Tenali, YCP MLAs Taken Into Custody

As YCP goons resorted indiscriminate violence at various places of the state, the Election Commission of India (ECI) and Police swing into action. Atleast two MLAs were taken into custody. They are Tenali MLA Annabattuni Shivakumar and Tadipatri MLA Ketireddy Pddareddy.

ECI has directed to keep sitting MLA and Tenali candidate Annabatuni Shivakumar, who allegedly slapped a voter in a polling booth, under house arrest till the polling is over.

When Sivakumar tried to go directly into the polling centre, it was blocked by voters who were waiting to vote. Then he became impatient and slapped the voter in anger. The voter also became furious and was given a return slap. Then MLA supporters beat him indiscriminately.

Witnessing this incident from the central control room at the state secretariat, AP ECI Special Observer Mishra became angry and sought a report.  Reacting to this incident, CEO Mukesh Kumar Meena said that a comprehensive investigation has been ordered. He said that they have live webcasting footage from the polling center. He said that the SP of Guntur has been ordered to register a case against the MLA who committed the attack and others.

Meanwhile, Tadipatri became a battlefield. Both sides pelted stones at each other. Two policemen and members of two rival parties were injured in the stone pelting. MLA’s son Harshavardhan Reddy reached the polling booth after being told that there was a clash at the polling booth set up in Om Shanti Nagar Colony.

Later when both TDP and YCP candidates faced each other at that place, two groups pelted stones against each other. On learning this, SP Amit Bardar reached the spot and dispersed both the parties. Later, MLA Ketireddy Peddareddy was taken into custody and taken to the police station.

TDP chief and former chief minister N Chandrababu Naidu  expressed concern over the violence happening in the state during the polling. He blamed that attacks are unchecked in places like Macherla due to the failure of the police.


He deplored the attack on SP’s vehicle in Tadipatri, besides attack on TDP candidate. He lamented that all this is the culmination of YSRCP politics. The rowdy mobs that Jagan nurtured for five years  have conspired to reduce polling percentage by creating terror. He asked people to vote fearlessly to end the YCP’s politics of violence.

భారీ సెట్ లో తెరకెక్కుతున్న విక్రమ్‌ సినిమా!

కోలీవుడ్‌ స్టార్ నటుడు విక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉన్నాడు.

 విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ హీరోగా హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’..విక్రమ్ 62 వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. భారీ సెట్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జరుగుతుంది.

 రీసెంట్‌గా విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. తెన్ కాశీలో భారీ సెట్ వేసి సినిమాను పూర్తి చేస్తున్నారు మేక‌ర్స్‌.. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. విక్రమ్ ఇప్పటి వరకు సరికొత్త పాత్రలో నటిస్తూ వచ్చాడు.. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ రోల్‌లో విక్ర‌మ్ కనిపించబోతున్నారు.

ఆయ‌న లుక్ మాస్‌, ర‌గ్డ్‌గా ఉంది. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ లో విక్ర‌మ్ కాళి పాత్ర‌లో నటిస్తున్నాడు.. సిద్దిఖీతో పాటు ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

సలార్‌ 2 లో భారీ రెబల్‌ స్టార్‌ భారీ డైలాగ్‌!

రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో, స్టార్ మాస్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సలార్‌ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 అయితే మొదటి పార్ట్ లో ప్రభాస్ కి ఎక్కువగా డైలాగ్స్ లేవు. అది ఫ్యాన్స్ ను కాసింత నిరాశకి గురి చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ను పార్ట్ 2 లో పెట్టాడు. సలార్ 2లో ప్రభాస్ భారీ డైలాగ్ ఉందని, ఇది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది అని చిత్ర బృందం ప్రకటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌ గా చేస్తుంది. హోంబలే ఫిలిమ్స్ మరో రెండు నెలల్లో సలార్ 2ని సెట్స్ పైకి తీసుకు వెళుతోంది. ప్రస్తుతంఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కల్కి చిత్రానికి డబ్బింగ్‌ పూర్తి చేసిన బాలీవుడ్‌ బ్యూటీ!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో, మహానటి ఫేమ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం కల్కి. ఈ సినిమాని వచ్చే నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా మీద అటు ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ అభిమానులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో దీపికా పదుకునే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి తన పార్ట్ డబ్బింగ్ ను దీపికా పదుకునే పూర్తి చేసినట్లు సమాచారం.ఇప్పటికే హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ ను చెప్పినట్లు సమాచారం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

తారక్‌ బర్త్‌ డే కి అదిరిపోయే ట్రీట్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాని టాలీవుడ్‌ మాస్‌ అండ్ డైరెక్టర్‌ కొరటాల శివ తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాకి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో తారక్‌ కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తుంది.

అంతేకాకుండా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ ఆలీఖాన్‌ విలన్‌ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్‌. ఈ క్రమంలోనే  మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేవర మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కు సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగల్ విడుదల చేయనున్నట్లు సమచారం. ఈ ఫస్ట్ సింగల్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు .తన మాస్ బీట్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే అనిరుద్ అసలైన మాస్ హీరోకి ఏ రేంజ్ లో ఇచ్చాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే దేవర టీం మాత్రం ఫస్ట్ సింగల్ తో ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు సమాచారం.