సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు అయినప్పటికీ ఏ మాత్రం అందం తగ్గకుండా…తన అభినంయంతో అభిమానులను ఆకట్టుకుంటున్న నటి త్రిష. కొద్ది రోజుల క్రితం వరకు కూడా సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న త్రిష ‘పొన్నియన్ సెల్వన్’తో మళ్లీ రేసులోకి వచ్చారు. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ.. బిజీ బిజీగా ఉంది.
ప్రస్తుతం ఈ చెన్నై చిన్నదాని చేతిలో విశ్వంభర’, ‘థగ్ లైఫ్’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇంత బిజీలో కూడా ఆమె ఓ మలయాళ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసింది. త్రిష, టోవినో థామస్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్‌ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో త్రిష తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసిందని చిత్ర బృందం ప్రకటించింది.
ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంటూ.. ‘ఐడెంటిటీలో త్రిష పాత్రకు సంబందించిన చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆమె మా ప్రాజెక్టులో పాల్గొని సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు’ అంటూ తెలిపింది. ఐడెంటిటీలో త్రిష షూటింగ్ పూర్తయినా.. డబ్బింగ్ పని మాత్రం ఇంకా మిగిలి ఉందని పేర్కొన్నారు.
ఇది తర్వాతి షెడ్యూల్‌లో పూర్తవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఐడెంటిటీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ధనుష్ ఓ గే… స్టార్ సింగర్ సంచలన కామెంట్స్!
కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుచిత్ర తెలుగు, మలయాళ భాషాల్లో సుమారు 100 కి పైగా పాటలు పడింది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కొంతకాలం క్రితం సౌత్ ఇండస్ట్రీలో జరిగిన చీకటి బాగోతాలు బయటకు తీసుకుని వచ్చి సంచలన విషయాలు బయటపెట్టింది.
అయితే అప్పట్లో ధనుష్, రానా దగ్గుబాటి, త్రిష, ఆండ్రియా జెర్మియా, అనిరుధ్ రవిచందర్ లాంటి ప్రముఖుల పార్టీ పోటోలు లీక్ చేసి ‘సుచీ లీక్స్’ అంటూ తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అయితే తాజాగా మరోసారి సుచిత్ర తన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో స్టార్ హీరో ధనుష్ పై ఆరోపణలు చేసింది. గాయని సుచిత్ర 2017 సంవత్సరంలో సోషల్ మీడియాలో ధనుష్‌పై సంచలన కథనాలు బయటపెట్టింది.
అప్పట్లో తన అకౌంట్ హ్యాకింగ్ చేశారంటూ ఆరోపణలు చేసింది. మళ్ళీ తాజాగా సుచిత్ర మరోసారి ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య పై షాకింగ్ కామెంట్లు చేసింది . ధనుష్ ఓ గే అని .. అతను అర్దరాత్రి 3 గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకుంటు ఉంటాడని… స్వలింగ సంపర్కుడు కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చాడని అని ఓ బాంబు పేల్చింది. ఇక తమ దాంపత్య జీవితంలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరు ఒకరిని ఒకరు చీట్ చేసుకొని వారు వేరేవారితో ఎఫైర్, సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. ధనుష్ గే, డ్రగ్స్‌కు బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని సుచిత్ర వెల్లడించింది. అయితే సుచిత్ర చెప్పిన విషయాలపై ధనుష్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.