Home Blog Page 868

తారక్‌- నీల్ సినిమా టైటిల్‌ అదేనా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ను త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తుంది.  దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది.  అదే విధంగా బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టింది. ఈ రెండు సినిమాలు అవ్వగానే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు.

 ఆ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 31 పేరిట మొదలుకానున్న ఈ చిత్రంపై బొలేడు అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్లు టాక్‌.

ఇప్పటివరకూ తన చిత్రాలన్నింటికీ కాస్త వెరైటీ టైటిల్స్‌యే పెట్టారు నీల్. కేజీఎఫ్, సలార్ ఇలా ఈ పేర్లను పెట్టారు. అలాగే డ్రాగన్ అనే పేరుకు సినిమా స్టోరికి ఏదైనా లింక్ ఉందా అనేది వేచి చూడాల్సిందే. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ టైటిల్‌ ని విని ఫుల్ ఖుషి అవుతున్నారు.

త్వరలోనే ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు..వెయిట్ చేయండంటున్న ప్రభాస్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ అంటే అందరూ ఠక్కున చెప్పే పేరు ప్రభాస్‌. 44 ఏళ్లు దాటినా ఇంకా ప్రభాస్‌ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ‘రెబల్ స్టార్’ సై అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్‌లో ఉన్నా.. మనోడు మాత్రం పచ్చజెండా ఊపడం లేదు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని డార్లింగ్ బంధువులు, సన్నిహితులను అడిగినా.. వారు కూడా ఏం సమాధానం  చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడా? అని ఆయన ఫాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రభాస్‌ ఇన్‌ స్టా వేదికగా తన అభిమానులకు ప్రభాస్ ఓ శుభవార్త చెప్పారు. తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. ‘డార్లింగ్స్.. చివరకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. వెయిట్ చేయండి’ అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబుతున్నాడు, ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెబుతున్నాడు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ పోస్ట్ తన వ్యక్తిగత జీవితం గురించా? లేదా సినిమా గురించా? అన్నది తెలియాల్సి ఉంది.ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 

రౌడీ హీరో సినిమా అంత పెద్ద కథ ఉందా?

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్‌.  ఈ సినిమా గత నెలలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను కానీ, ప్రేక్షకులను కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీస్ లో రాహుల్‌ సాంకృత్యాన్‌ సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ ఎంతో గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే  విజయ్‌ దేవరకొండ , రాహుల్‌ సాంకృత్యాన్‌ కాంబోలో ట్యాక్సీవాలా సినిమా వచ్చింది. అంతేకాకుండా  శ్యామ్‌సింగరాయ్‌ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ఇప్పుడు విజయ్ దేవరకొండతో పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ విషయంలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.  

దర్శకుడు రాహుల్‌ ఈ  కథను విజయ్‌  కంటే ముందు తమిళ స్టార్ హీరో సూర్యకి చెప్పాడట. ఈ సినిమాలో హీరో సూర్య, కార్తీ తండ్రీకొడుకులుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ ప్లాన్ చేసారు. కానీ అనుకొని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనితో కథలో మార్పులు చేసి విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఓ యోధుడిగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్‌. 

What’s the Real Story Behind SS Rajamouli and Mahesh Babu’s Next Film?

Renowned Maverick director SS Rajamouli is gearing up for his upcoming film with Superstar Mahesh Babu. Following the global success and widespread acclaim for ‘RRR’, the anticipation grows for his next collaboration with Mahesh Babu, tentatively titled ‘SSMB 29’. With each passing day, the excitement builds around Rajamouli’s upcoming endeavor.

Ever since the announcement was made, numerous rumors have been circulating online. But now the tentatively titled ‘SSMB 29’ is making headlines for a different reason. Recently, casting rumors have been circulating for this highly anticipated project. Striking the rumors, the makers have released a press note to clear up the casting rumors that were published by the media outlet.

The makers took to their social media handles to clear the rumors and wrote, “It has come to our notice that the prominent publication has published an article regarding the casting of SS Rajamouli and Mahesh Babu’s project. We want to clarify that, contrary to what is stated in the article, Mr. Viren Swamy is not involved in any part of our film in any way. An official announcement will be made by the production house if and when necessary.”

Speaking more about ‘SSMB 29’, the film will be helmed by visionary director Rajamouli and will be backed by K.L. Narayana of Durga Arts. Touted to be a globe-trotting action adventure, the film sparks excitement among fans and global audiences. The makers have yet to announce the cast and technical crew details of the film.

ECI Furious On CS, DGP On Post-Poll Violence

The Election Commission of India (ECI) was furious against AP Chief Secretary Jawahar Reddy and DGP Harish Kumar Gupta for their failure in checking post-poll violence in Andhra Pradesh. Both were summoned to Delhi on Thursday and the full commission grilled them for about halfen hour.  DG Intelligence Vishwajeet was also present.

Chief Election Commissioner Rajeev Kumar, Commissioners Gyanesh Kumar and Sukhbir Singh Sandhu questioned them on how no preventive measures were taken and additional forces were deployed on intelligence inputs.

In an official statement, the ECi said  “We have expressed our anger over the post-poll violence in AP. We have told the CS and DGP strongly and directly to ensure appropriate action against SPs so that such incidents do not recur.”

Jawahar Reddy and Harish Kumar Gupta, who were in defence, said that the violence broke out due to personal factions and feuds between certain communities. But the ECI asked them why they could not control the incidents of violence?

 “If the problematic areas were identified earlier, why were adequate precautionary measures not taken? Why couldn’t the riots be controlled? Who is responsible for these incidents? You or we? Don’t you have intelligence information?”, they grilled.

It seems that the ECI is angry and asked who is responsible for the three consecutive days of violence. It particularly expressed deep anger over the outbreak of violence in Macherla, Narasarapeta, Chandragiri and Tadipatri. The ECI stated why they could not control incidents like stray attacks and burning of vehicles.

The ECI deplored attacks on some candidates of opposition parties and some ruling party candidates themselves involved in attacks. It wondered why they failed to take action despite being warned in advance. It seems the ECI was not satisfied with the report given by CS and DGP in the form of incidents that happened in the state and actions taken, besides actions to be taken.

సీఎంగా చంద్రబాబు ముహూర్తం జూన్ 5, అమరావతిలో!

మేకపోతు గాంభీర్యానికి అచ్చమైన ఆనవాళ్లు లాగా.. అటు ఐప్యాక్ వారితో సమావేశంలో తాము 151 కంటె ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే.. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ 9వ తేదీన విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టుగా వెల్లడించారు. విశాఖలో ప్రమాణం అనేది.. నిజానికి జగన్ విశాఖ వాసులను ఊరించడానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పిన మాట. బొత్స కొత్తగా తేదీ మాత్రమే ప్రకటించారు. అయితే తెలుగుదేశం వర్గాలు ఏం ఆలోచిస్తున్నాయి? ఎన్డీయే కూటమి తప్పకుండా గెలుస్తుందనే అంచనాలున్న నేపథ్యంలో.. వారు కూడా ఇప్పటికే ముహూర్తం అన్వేషణలో ఉండాలి కదా?

పార్టీ  వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. చంద్రబాబునాయుడు జూన్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి బాగుంటుందని వేదపండితులు సూచించినట్టు సమాచారం.
జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఆరోజు సాయంత్రానికి ఏపీలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వచ్చేస్తాయి. అదే రోజు సాయంత్రం కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ప్రతినిధులు జట్టుగా వెళ్లి తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా రాష్ట్ర గవర్నరుకు లేఖ ఇచ్చే అవకాశం ఉంది. ఆవెంటనే 5వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం.

నిజానికి జూన్ 5వ తేదీ బుధవారం కృష్ణ పక్షం చతుర్దశి అవుతుంది. ఆరోజు మిస్సయితే 6వ తేదీ అమావాస్య నాడు శుభకార్యాలు చేయరు. అలాగే 7వ తేదీ పాడ్యమినాడు కూడా మంచి పనులు ప్రారంభించడం తెలుగువారికి అలవాటు లేదు. 8వ తేదీ శనివారం శుక్లపక్షం విదియ మంచి రోజు- అలాగే 9వతేదీ ఆదివారం శుక్లపక్ష తదియ కూడా మంచిదే అని వేదపండితులు సూచనలు చేసినట్టు సమాచారం. ప్రజలు తమకు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత.. ఒక్కరోజు కూడా జగన్ ను అధికార పీఠంపై ఉంచడానికి వీల్లేదని, అందుకే 4వ తేదీ ఫలితాలు వచ్చిన వెంటనే.. 5వ తేదీనే ప్రమాణస్వీకార కార్యక్రమం పెట్టుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
వేదిక కూడా ఖరారైనట్టే. అమరావతిలో.. ఎక్కడినుంచి అయితే రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారో.. అదే ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. తద్వారా.. అమరావతి నిర్మాణానికి తమ ప్రభుత్వం పునరంకితం అవుతున్నదనే సందేశాన్ని ఇవ్వాలని ఆయన ఉత్సాహపడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మహానాడు బదులుగా ఈ దఫా విజయోత్సవం!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతికి అన్న- నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడు వేడుకలను ఈసారికి నిర్వహించడం లేదు. ఈ మేరకు పార్టీ వ్యూహ కమిటీలోని సీనియర్ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. సాధారణంగా.. మే 28న ఎన్టీఆర్ జయంతి కావడంతో ఆరోజున ముగింపు సభ ఉండేలాగా రెండు రోజులు లేదా మూడురోజుల పాటూ మహానాడు వేడుకలు జరుగుతుంటాయి. ఇప్పుడు పోలింగ్ పూర్తయి.. ఫలితాల కోసం జూన్ 4 వరకు ఎదురుచూడాల్సి ఉన్నందున మహానాడును రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

అయితే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ ఏడాది మహానాడు కాకుండా, అధికారంలోకి వచ్చిన రెండునెలల్లోగా అత్యంత భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకను ఏదో ఒకరూపంలో నిర్వహించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. రాష్ట్రాన్ని ఏయే అభివృద్ధి ప్రాజెక్టుల దిశగా నడిపించే పనిలో ఉన్నారో.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక.. అదే అభివృద్ధి పనులకు పునరంకితం అవుతున్నామనే సంకేతాలు ఇవ్వడానికి తగిన రీతిలో భారీ స్థాయిలో విజయోత్సవాన్ని నిర్వహించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు, దేశంలోని ముఖ్యులైన ఎన్డీయే కూటమి ప్రముఖులు అందరినీ కూడా ఆహ్వానించి అత్యంత అట్టహాసంగా, ఆర్భాటంగా నిర్వహించాలని చంద్రబాబు తలపోస్తున్నారట. కేవలం తమ విజయాన్ని ప్రదర్శించుకోవడానికి మాత్రమే కాకుండా.. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి, ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలకు కూడా ఇలాంటి వేడుక ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. ఈ విజయోత్సవ వేడుక జులై లేదా ఆగస్టు నెలల్లో ఉండవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆగస్టు నెలలోనే గనుక ఇలాంటి విజయోత్సవాన్ని నిర్వహిస్తే.. తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం అనే గండం పొంచి ఉంటుందని వ్యాఖ్యానించే విమర్శకుల నోళ్లకు కూడా తాళం వేసినట్టు అవుతుందని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

జగన్ మేకపోతు గాంభీర్యం!.. వెనక వరసలో చూశారా?!

పోలింగ్ పూర్తయి మూడు రోజుల తర్వాత గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాహ్య ప్రపంచంలోకి రావడానికి ధైర్యం చిక్కలేదు. పోలింగ్ పూర్తయిన రోజున కనీసం ప్రజలకు థాంక్స్ చెప్పడానికి కూడా తన తరఫున సజ్జల రామకృష్ణారెడ్డిని  పురమాయించి పంపిన జగన్, సోమవారం పోలింగ్ జరిగితే గురువారం నాటికి కాస్త ధైర్యం చిక్కబట్టుకున్నారు. ఇప్పటికీ పార్టీ నాయకులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఫేస్ చేసే ధైర్యం లేదు. తను ఏం మాట్లాడినా కేరింతలు కొట్టే కుర్రకారు ఉన్న ఐప్యాక్ సమావేశానికి మాత్రం ఆయన హాజరయ్యారు.

శుక్రవారం యూరోప్ యాత్రకు వెళ్లే ముందు ఐప్యాక్ ప్రతినిధుల సమావేశానికి వెళ్లి, వారికి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కానుకలు కూడా అందించారు జగన్మోహన్ రెడ్డి. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే ఐదేళ్లపాటు కూడా కలిసి పనిచేయాలని ఆయన వారితో అన్నారు. తద్వారా అధికారంలోకి రాకపోతే వారి సేవలకు ఇక్కడ భరత వాక్యం పలుకుతున్నట్లు లెక్క.

గత ఎన్నికలలో తమ పార్టీకి 151 సీట్లు వచ్చాయని, ఈసారి జనం ఓట్లు వేసిన తీరు గమనిస్తుంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని అర్థమవుతుందని.. ఎంపీ సీట్లు కూడా 22 కంటే ఎక్కువ సాధించబోతున్నామని జగన్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

మేకపోతు గాంభీర్యం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం అని ఆర్భాటంగా ఒక తన ముద్రగలిగిన చిరునవ్వు నవ్వుతూ ప్రకటించారు. ఆయన ప్రకటనకు అక్కడ ఉన్న వారందరూ కేరింతలు కొడుతూ హర్షద్వానాలు చేశారు. అయితే అత్యంత కీలకమేంటంటే.. జగన్ వెనుక వరుసలో ఉన్న వారి మొహాలను కూడా గమనించాలి.

జగన్ వెనుక వరుసలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ నిలుచున్నారు. జగన్ తో పాటు ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవబోతున్న నాయకులు వాళ్లు. అయితే జగన్ తన విజయదరహాసంతో సాధించబోయే సీట్ల సంఖ్యను ప్రకటిస్తున్నప్పుడు, ప్రశాంత్ కిషోర్ అంచనాలకు అందకుండా సీట్లు దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ ఉండదు అంతా టీం చేసే పనే అని అక్కడివారిని ప్రోత్సహిస్తున్నప్పుడు సభ మొత్తం నవ్వులు కేరింతలు ధ్వనిస్తున్నాయి గాని.. ఆ ఇద్దరు కీలక నాయకుల మొహంలో కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు! బొత్స సత్యనారాయణ ప్రారంభం నుంచి చివరి వరకు మొహం మార్చుకుని సీరియస్ గానే ఉన్నారు.

కనీసం జగన్ సీట్ల సంఖ్యను ప్రకటిస్తున్నప్పుడు చిన్న ఆనందం కూడా ఆయన మొహంలో లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మొహం వేళ్లాడేసుకుని దిగాలుగా కనిపించారు. గెలుపు పట్ల తన పార్టీ కీలక నాయకులలో మినిమం నమ్మకాన్ని కలిగించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ వారితో మాత్రం చాలా ఘాటుగా గెలుపు ప్రస్తావన చేయడం మేకపోతు గాంభీర్యమే అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు!

వార్‌ 2 లో మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

ఎన్టీఆర్‌ – హృతిక్‌ రోషన్‌ కాంబోలో రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ మల్టీ స్టారర్‌ పాన్‌ ఇండియా సినిమా వార్‌ 2. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఐతే, ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్‌ స్టార్‌ నటి కత్రినా కైఫ్‌ తో ఈ సాంగ్‌ ను చేయించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు టాక్‌.

మరి ఈ వార్తలో నిజమెంతో వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని వినికిడి. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే.

ఈసీకి మకిలి పులమడమే వైసిపి లక్ష్యం !

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అదుపుతప్పాయన్నమాట వాస్తవం. ప్రజలు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి. ఘర్షణలు చెలరేగుతున్న చాలా ప్రాంతాలలో ఇప్పటిదాకా దుకాణాలు తెరిచిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించాలి. కానీ మరో 20 రోజుల్లో అధికారికంగా ప్రకటితమయ్యే ఓటమిని సమర్ధించుకోవడానికి యిప్పటినుంచే సాకులు వెతుక్కుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘానికి బురద పులమాలని చూస్తున్నది. తాము చేయించుకున్న సర్వేలలో ఓటమి తప్పదనే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో.. ఆ పరాభవం తమ వైఫల్యం కాకుండా తమకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని చాటి చెప్పడానికి వారు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్నికల సంఘానికి తెలుగుదేశంతో అక్రమ సంబంధం అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల సమయంలో సాధారణంగా ఎన్నికల సంఘానివే సర్వాధికారాలు! ఏ పార్టీ అయినా సరే పాలక ప్రతిపక్షం అనే హోదాలతో నిమిత్తం లేకుండా.. ఎన్నికల సంఘానికి లోబడి ఉండాలి. అయితే ఓటమి భయం వెన్నాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఎన్నికల సంఘానికి అక్రమ ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు.
ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయ్యి తమ స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రధాని మోడీని బతిమాలి బిజెపితో పొత్తు కుదుర్చుకున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు.

ముఖ్యమంత్రి తరఫున ఆయన గళం తానే అయినట్లుగా ప్రెస్ మీట్ లలో పార్టీ విధానాలను ప్రకటించే సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణ ఇది. ఇలాంటి ఆరోపణల ద్వారా.. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు అని సజ్జల పరోక్షంగా నిందిస్తున్నారు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందంగా.. అధినేత మౌత్ పీస్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ముడిపెట్టి ఆరోపణలు చేస్తుంటే.. ఆ పార్టీ ఇతర నాయకులు తమ తమ నియోజకవర్గాల జిల్లాల పరిధిలో ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్ల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈసీ తరఫున అబ్జర్వర్లుగా వచ్చిన ఉన్నతాధికారులు తెలుగుదేశం సానుభూతిపరులతో కుమ్మక్కు అయి వ్యవహారం నడిపించారని చెబుతున్నారు.

ఏ రకంగా చూసినా సరే కేంద్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది.. అని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడం ద్వారా రేపు తమ ఓటమి ఖరారు కాగానే అది కూడా ఎన్నికల సంఘం కుట్ర అని నింద వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.