Home Blog Page 857

విద్యార్థుల కన్నీళ్ల పాపం.. జగన్ కా? జవహర్ కా?

మేం ఆల్రెడీ బటన్లు నొక్కేశాం.. ఇవన్నీ కొత్త పథకాలు ఏం కాదు.. అర్జంటుగా డబ్బులు వారి ఖాతాల్లోకి వేసేయకపోతే పాపం వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు.. అంటూ సరిగ్గా పోలింగ్ కు రెండు రోజుల ముందు మొసలి కన్నీరు కార్చారు. రెండునెలలు ఖాళీగా కూర్చుని.. ఇప్పుడొచ్చి అర్జంటుగా డబ్బులు వేయాలంటే కుదర్తు.. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉన్నట్టు కాదు.. కాబట్టి పోలింగ్ అయిపోయాక డబ్బు వేసుకోండి అని ఈసీ ఆదేశిస్తే.. అదేదో నేరం అయినట్టుగా కోర్టును ఆశ్రయించారు. 13వ తేదీకి ముందే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేయాలని నానా యాగీ చేసేశారు. కానీ కోర్టు కూడా ఆపింది. అప్పుడు ఊరుకుండిపోయిన అధికారులు ఇప్పటిదాకా మళ్లీ నోరు మెదపడం లేదు. ఎన్నికలు పూర్తయి మూడు రోజులు గడుస్తున్నా.. విద్యార్థుల ఖాతాల్లోకి విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయడం గురించి పట్టించుకోవడం లేదు. విద్యార్థుల కన్నీళ్ల పాపం మోయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనా? లేదా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డినా? అనే వ్యాఖ్యానాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం వద్ద 14 వేల కోట్లరూపాయలకు పైబడి నిధులు ఉన్నాయి గానీ.. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నొక్కేసిన బటన్లకు సంబంధించి కూడా పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలంటే మనసురావడం లేదని అంటున్నారు. పోలింగుకు ముందు నిధులు విడుదల తక్షణం చేయాలని హడావుడి చేసిన వ్యక్తులు, పోలింగ్ తర్వాత ఇవ్వడానికి ఈసీ పరంగా అభ్యంతరాలు లేకపోయినా పట్టించుకోవడం లేదు.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన నాలుగు క్వార్టర్లకు కలిపి 2832 కోట్లరూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రావాలి. జగన్ ఒక క్వార్టర్ కు సంబంధించి మాత్రం బటన్ నొక్కారు. అది కూడా ఇంకా డబ్బు పడలేదు. దీంతో మొత్తం ఆ భారమంతా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం మీదికే వెళ్లిపోతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. గతంలో నేరుగా కళాశాలల యాజమాన్యాలకే ఫీజులు చెల్లిచేవారు. జగన్ వచ్చిన తర్వాత.. కాలేజీలకు ఇవ్వకుండా తల్లులకు ఇచ్చి.. వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ నిధులు ఇవ్వకపోవడం వల్లన కాలేజీ యాజమాన్యాలు పిల్లలను పరీక్ష కూడా రాయనివ్వడం లేదు. గతంలో అయితే.. ఫీజులు ఆలస్యం అయినా సరే.. నేరుగా తమ ఖాతాకే వస్తాయి గనుక.. యాజమాన్యాలు పిల్లలను ఇబ్బందిపెట్టేవారు కాదు.. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. దానికి తగ్గట్టుగా పోలింగ్ ముగిసిపోయింది గనుక.. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతున్నారు. ప్రభుత్వ దుశ్చర్య వలన వందల మంది పీజీ విద్యార్థులు ఇంకా సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు. వేల మంది పరీక్షలు రాయడం అనేది డౌటుగా మారుతోంది. విద్యార్థులను ఇలా వేధిస్తున్న పాపాలు ముఖ్యమంత్రి జగన్ ఖాతాలోకి వెళతాయా? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఖాతాలోకి వెళతాయా? అని ప్రజలు నిలదీస్తున్నారు.

Local Police Officers’ Covert Operations Ignited Violence In Palnadu!

The large scale violence that spread in Palnadu district on the polling day and also in post- polling period is mainly said to be due to covert operations by some local CIs and SIs, who colluded with YCP MLAs and provided information to them on the movement of opposition leaders and special police forces movements.

Higher police authorities, who are going in depth into local police covert operations, said to be surprised at the nasty role they played to spread violence, and to terrorise TDP activists.

On the polling day in Macherla constituency, it was found that some CIs and SIs followed instructions of YCP MLA brothers, then their higher officials. On the day of polling, an SI working at the border police station of Macherla Constituency, in a pro-TDP village, provoked YCP workers and sent TDP agents out.

In another village, when an SI tried to prevent YCP agents who were throwing out the TDP agents, the CI called him immediately and stopped from interfering.  The CI was silent when the Pinnelli brothers were moving in dozens of vehicles. Moreover, he is suspected of providing information about the movement of their opponents to them, so as to attack them.

An SI under the Karampudi circle informed the Pinnelli brothers about the activities of the opposition leaders and the movements of the police personnel on the polling day. The role of the said SI was also found in the incidents of Tuesday in Karampudi.

It was found that due to CI’s covert operations the forces did not reach the place even after an hour of the attack on Brahma Reddy in Rentachintala Mandal. YCP mob vandalized the car of Telugu Desam MP candidate Lau Srikrishna Devaraya, who went to check the polling pattern in Dondapadu of Narasaraopet mandal, allegedly prior information on his movement was provided by SI to YCP goons.

It was also alleged that SI helped YCP goons for pelting stones on Narasaraopet TDP candidate dr Chadalawada Arvind Babu. The SI is said to be loyal to YCP MLA G Srinivasa Reddy, who had posted him here.

Moreover, a CI who colluded with the ruling party at Narasaraopet district headquarters contributed for igniting tensions by taking his own decisions without informing higher authorities on problematic issues.

After Polling, KCR On War-Path On Revanth’s `Anti- Farmer’ Policies

BRS chief and former Chief Minister K Chandrasekhar Rao, who had led an aggressive poll campaign against Congress government in the state, has swung into `war- path’ on `anti- farmer’ policies of the Congress government soon after completion of polling. Though three major parties in Telangana claim to win more than half of Lok Sabha seats KCR seems to be preparing ground for a long-run battle against the government.

Rao has called for State-wide protests on Thursday against the anti-farmer decisions of the Congress government in Telangana. The call for protest comes amidst growing discontent among farmers who feel deceived by the government’s recent decisions.

During the election campaign also he mainly focused on `betroyl of farmers’ by the Revanth Reddy government. He expressed outrage over the State government’s decision to provide Rs.500 bonus per quintal only for fine rice.

He lashed out at the State government for taking a U-turn on its promise to provide the bonus to all farmers after the Lok Sabha elections and betraying the farmers’ trust. He blamed that the Congress government cheated farmers on all accounts without giving them Rythu Bandhu or Rythu Bharosa and all other benefits promised before the elections.

He pointed out that nearly 90 per cent farmers in Telangana cultivate coarse rice during the Yasangi season. He expressed his anger at the government’s disregard for this crucial aspect and said the Congress was exploiting farmers for political gain.

“The Congress government’s sudden change in stance after the elections reveals its true intentions. They misled farmers for their political benefit without fulfilling their promises. If the same announcement was made before the elections, farmers would have taught the Congress a fitting lesson,” he added.

In response to the government’s actions, the BRS chief asked the party cadre to mobilise and join the protests in support of farmers. He asked BRS leaders to visit harvesting and storage points as well as procurement centres on a daily basis to safeguard the farmers’ interests.

TDP Complains Governor On Rayalaseema, Palnadu Violence

Leaders of TDP and its alliance partners complained to the Governor Abdul Nazir at Raj Bhavan about the incidents of post-poll violence in Palnadu and Rayalaseema. The leaders disclosed that they have brought to the notice of the Governor that the police have acted inefficiently in preventing violent incidents.

They said that the Governor was shocked to see the incidents of violence when they handed over all the video evidence on the pen drive to the governor. The leaders said that it was a shame for the government that ECI issued summons to the Chief Secretary and DGP over the violence.

They expressed anger that the ruling party resorted to instigating this kind of violence predicting their defeat is certain. Telugu Desam leaders Varla Ramaiah, Devineni Umamaheswara Rao, Kollu Ravindra, BJP leader Lanka Dinakar and Jana Sena leader Chillapalli Srinivas met Governor Abdul Nazir.

TDP leader Varla Ramaiah alleged that Chief Minister YS Jaganmohan Reddy, after realizing his defeat, attempted to create anarchy at the polling stations on the polling day. He said that they explained to the governor on the violent incident that took place after the polling, along with the evidence.

He said they presented videos showing how police colluded with the YCP leaders. As the Election Commission also realized the indiscriminate violence in the state, he said both the Chief Secretary and DGP were summoned to Delhi.

Meanwhile, the ECI is said to be furious against four SPs in the state, where post-poll violence incidents were reported. It has already indicated that it will take action against them. They are Tirupati, Anantapur, Nandyal and Palnadu SPs. Already, ECI authorities from Delhi have reportedly given some indications to DGP in this regard.

ED Arrested Jharkhand Minister Days After Rs 35 Crore Cash Seizure

Jharkhand minister Alamgir Alam was arrested by the Enforcement Directorate (ED) on Wednesday after questioning by the probing agency in Ranchi in a money laundering case, days after seizure of Rs 35 crore cash  from the household help of his Personal Secretary (PS) Sanjeev Lal.

The Enforcement Directorate had recovered cash worth more than Rs 35 crore from Jahangir Alam’s house. All the money was from commission in lieu of tender for road construction in rural areas. He was arrested after the ED was not satisfied with Alamgir’s answer.

After recovering over Rs 35 crore in cash, ED had arrested Sanjeev Kumar Lal and his servant Jahangir Alam. On May 6, the ED conducted a raid at the residences of Alamgir Alam’s PS and other close associates. The counting of seized currency notes continued late at night and a total of Rs 35.23 crore was recovered.

According to officials, Jahangir Alam admitted in preliminary questioning that he was a caretaker of “commission and bribe-acquired money”, for which he received a salary of around Rs 15,000 per month.

“It was Minister Alamgir who had employed Jahangir as a servant at his PS Sanjeev Kumar Lal’s residence. Before this, for a few days, he had also worked at the minister’s residence,” said the sources.

However, Sanjeev initially denied that the money received from Jahangir’s flat belonged to him, but after solid evidence and Jahangir’s statement, the agency arrested him. During the raid on Monday, the ED also seized several documents, including records related to the transfer-posting of bureaucrats.

These documents also mention the recommendation made by Jharkhand Pradesh Congress President Rajesh Thakur for the posting of bureaucrats. In addition, a letter written by the state’s Chief Secretary to register an FIR regarding irregularities in the Rural Development Department, received by the ED, was also there. It is believed that instead of taking action on the ED’s letter, the government leaked it to the department’s officials.

పుష్ప 2 నుంచి అనసూయ అదిరిపోయే లుక్‌…బర్త్‌ డే సర్‌ప్రైజ్‌ అదిరింది!

జాతీయ నటుడు , స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ , లెక్కల మాస్టర్ సుకుమార్ డైరక్షన్‌ లో వచ్చిన పుష్ప సినిమా పాన్‌ ఇండియా లెవల్లో ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్‌ ని జాతీయ నటుడిగా నిలబెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌ గా పుష్ప 2 రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.

 ఇప్పటివరకు పుష్ప 2 నుంచి  వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. మొన్న రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ ను క్రియేట్ చెయ్యగా, నిన్న రిలీజ్ అయిన సాంగ్ తో ఫ్యాన్స్ సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అందులో నటి అనసూయ భరద్వాజ్ కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తుంది.. బుధవారం అనసూయ బర్త్ డే సందర్బంగా పుష్ప 2 సినిమా నుంచి లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఆ పోస్టర్ లో అనసూయ పక్కన మందు బాటిల్ పెట్టుకొని, పక్కా మాస్ లుక్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట హల్‌ చల్‌ చేస్తుంది. వైరల్‌ అవుతుంది.  ఇప్పటి కే  ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కుప్పం ఓటరు కసిగా వచ్చి ఓటేశాడు!

రాష్ట్రంలో అత్యధికంగా ఓటింగ్ నమోదైన నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ 85.87% ఓటింగ్ నమోదు అయింది. కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇది ఒక రికార్డు. అయితే ఇంత భారీ ఓటింగ్ అనేది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది.. అని మనం ఆలోచించాలి. సాధారణంగా ఓటింగ్ శాతం పెరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తుంటారు. కుప్పం విషయానికి వస్తే ఈ భారీ ఓటింగ్ కూడా వ్యతిరేకతకు నిదర్శనమా అని మనం ఆలోచించాలి.

అదే నిజమైతే వ్యతిరేకత ఎవరిమీద? ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు మీదనా? లేదా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదనా? అనేది కూడా ఆలోచించాలి.
స్థానికంగా ప్రజలను సంప్రదించి వివరాలు సేకరించినప్పుడు తెలిసివస్తూన్న వాస్తవాలు ఇంకోరకంగా ఉంటున్నాయి.

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ను ఓడించే స్థాయిలో తమ పార్టీ బలపడాలి అనే ఉద్దేశంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలుగా ఒక అరాచకత్వాన్ని అక్కడ  నెలకొల్పింది. చిట్టచివరకు అధికార పార్టీ నాయకులు ఎంతగా దిగజారారంటే.. తెలుగుదేశం నాయకులు తమ సొంత డబ్బుతో పేద ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టడానికి అన్న క్యాంటీన్లని ఏర్పాటు చేస్తే.. వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసేసారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా ఎక్కడా కనిపించకూడదు అన్నట్లుగా చెలరేగిపోయారు.

ప్రత్యేకించి గ్రామ సర్పంచ్ స్థానాలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సమయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దురాగతాలకు అంతులేకుండా పోయింది. తెలుగుదేశం తరఫున నామినేషన్ వేయడానికి కూడా ఎవరూ రాకుండా అందరిని భయభ్రాంతులకు గురి చేశారు. కిడ్నాపులు చేశారు. బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి తెలుగుదేశం వారిని బలవంతంగా తమ పార్టీలో చేర్చుకున్నారు. కుప్పం మునిసిపాలిటీని తమ పార్టీ వశం చేసుకున్నారు. కుప్పంలో పార్టీని మరింతగా బలోపేతం చేసి.. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి అక్కడి నాయకుడికి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు.

అయితే ఐదేళ్లపాటు కుప్పం నియోజకవర్గ మీద స్పెషల్ ఫోకస్ తో సాగించిన అరాచకత్వాన్ని ప్రజలు మౌనంగా గమనిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పర్యటించినా.. ఎప్పటిలాగానే ఆయనకు ఆదరణ దక్కుతూ వచ్చింది. స్థానిక సంస్థల ఫలితాలు మాత్రం తెలుగుదేశానికి వ్యతిరేకంగా నమోదు అయ్యాయి.

అయితే అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయానికి పోలీసింగ్ వ్యవస్థ కొంత నిష్పాక్షికంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు వెల్లువలాగా తమ కసి తీర్చుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.. అనేది స్థానికంగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం. ఐదేళ్లపాటు చేసిన అరాచకాలు బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే ఓటర్లు వెలువలాగా తరలివచ్చారని అంటున్నారు. ఇక్కడి ఓట్లు చంద్రబాబు నాయుడుకి గతంలో తగ్గిన మెజారిటీని భర్తీ చేసేలాగా ఈసారి గొప్ప మెజారిటీ ఇవ్వబోతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం పట్ల కేవలం వ్యతిరేకత మాత్రమే కాదు కసితో కుప్పం ప్రజలు జిల్లాలో అత్యధిక ఓటింగ్ లు నమోదు చేశారని అక్కడి వారు చెబుతున్నారు.

నాని ఒక్కడేనా.. చాలామందిని టార్గెట్ చేశారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అసహనంతో  రగలిపోతున్న వాతావరణం కనిపిస్తూనే ఉంది. రాష్ట్రంలో మెజారిటీ అభ్యర్థులకు తమ ఓటమి ఖరారు అయింది. సొంతంగా చేయించుకున్న సర్వేలు, పోలింగ్ సరైన తర్వాత సొంతంగా సాగించిన అధ్యయనాలలో తమ ఓటమి వారికి స్పష్టంగా తెలిసిపోయింది. అందువల్ల వారంతా అసహనంతో పేట్రేగిపోతుండడం సహజం. అయితే తమాషా ఏమిటంటే ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా.. విపరీతమైన ఫ్రస్టేషన్ తో రగిలిపోతున్నారట.  ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి తాము నెగ్గితే పార్టీ అధికారంలోకి రాకపోతే ఏం చేసుకోవాలి. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా అనేది వారి అసహనానికి కారణం.

ఈ నేపథ్యంలో చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీద జరిగిన దాడి.. తదనంతర పర్యవసానాలు కీలకంగా గమనించాలి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత నా అని చెప్పిన మాటను పరిగణనలోకి తీసుకోవాలి. ‘‘చంపేయండి రా.. బై ఎలక్షన్స్ వస్తాయి’’ అని తనపై దాడి చేసిన వారిలో ఎవరో అన్నట్లుగా తన గన్ మెన్ తో పాటు,  మరికొందరు తనతో చెప్పారని పులివర్తి నాని మీడియాకు వెల్లడించారు. అంటే వారు ఓడిపోతారని వారికి అర్థం అయిపోయిందని, తనను చంపేయడం ద్వారా బై ఎలక్షన్ కి వెళ్లాలనుకుంటున్నారని పులివర్తి నాని చెప్పుకొస్తున్నారు.

ఇప్పుడు ప్రజలలో కలుగుతున్న సందేహం ఏంటంటే.. గెలిచే అవకాశం ఉన్న తెలుగుదేశం మరియు కూటమి పార్టీల అభ్యర్థులను ఇలా అంతమొందించేస్తే ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పోలింగుకు అసలు ప్రజలే రాకుండా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తాము ఈసారి కచ్చితంగా నెగ్గగలమనే ఆశ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది వైసీపీ అభ్యర్థులలో ఉన్నదో కదా అని అనుమానం కలుగుతుంది. ఫలితాలు వెల్లడయ్యేవరకు ఈ 20 రోజులు మాత్రమే కాదు ఆ తర్వాత ఎమ్మెల్యేలు గెలిచిన సరే తెలుగుదేశం అభ్యర్థుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారిపోతాయా అనే భయం ప్రజలలో కలుగుతుంది.

పులివర్తి నాని ఒక్కరే కాదని, రాష్ట్రంలో ఇంకా అనేకమంది తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు టార్గెట్ చేసినట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. వేరువేరు ప్రాంతాలలో జరుగుతున్న  సంఘటనలు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

‘సొంత వారికి బిల్లు’లపై కోర్టుకెళ్లనున్న కాంట్రాక్టర్లు!

అవసానదశలో కూడా దింపుడు కళ్లెం అప్పులాగా.. రిజర్వు బ్యాంకు నుంచి నాలుగువేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వివిధ పథకాల కింద బటన్లు ఆల్రెడీ నొక్కబడిన వాటి యొక్క లబ్ధిదారులకు పోలింగ్ ముందురోజు వేయాలని అనుకున్న సొమ్ములు 14వేల కోట్ల పైచిలుకు ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి రకరకాల పథకాలకు పంచవలసిన డబ్బును పెండింగుపెట్టి.. సరిగ్గా పోలింగ్ కు ముందు డబ్బు వేయడం ద్వారా.. అనుచిత లబ్ధి పొందాలని ప్రభుత్వం అనుకుంది. అయితే ఈసీ ఆ కుట్రకు బ్రేక్ వేసింది.పోలింగ్ తర్వాత ఇచ్చుకోవచ్చునని చెప్పింది.

పోలింగు ముగిసి రెండు రోజులు అవుతోంది… పథకాల లబ్ధిదారులకు నిధులు పంపిన దాఖలాలు కనిపించడం లేదు గానీ.. కొత్తగా సేకరించిన అప్పులతో కలిపి తమ సొంత మనుషులైన కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేయడానికి కుట్ర జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారం నుంచి దిగిపోతున్నామని అర్థం కాగానే.. జగన్ ఇలాంటి కుట్రలకు తెరలేపడం గురించి చంద్రబాబునాయుడు గగ్గోలు పెడుతున్నారు. అయితే తాజాగా, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. చాలాకాలంగా బిల్లులు రాకుండా పెండింగులో ఉన్న కాంట్రాక్టర్లు కొందరు కలిసి.. ముందు పనులు పూర్తిచేసిన వారికే ముందు బిల్లులు చెల్లించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదివరలో తెలుగుదేశం హయాంలో పూర్తిచేసిన అనేక పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా మానేశారు. ఆ తర్వాత పనులు చేసిన వారికి కూడా సక్రమంగా బిల్లులు చెల్లించలేదు. తీరా ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయే వాతావరణం ఉన్నట్టు అర్థం కాగానే.. హఠాత్తుగా తనకు కావాల్సిన కొందరికరి వేల కోట్ల బిల్లులు చెక్కులు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి.
అయితే కొందరు కాంట్రాక్టర్లు కలిసి కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.

ముందు పనులు చేసిన వారికి ముందు బిల్లులుఇవ్వాలని, లేదా.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ బిల్లుల చెల్లింపు కుట్రను ఆపాలని వారు కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. జగన్ సర్కారు పతనం కావడానికి ముందు తీసుకున్న చివరి నిర్ణయం  కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే. ఈ చివరి నిర్ణయం కూడా కోర్టు ద్వారా ఆగిపోయే వాతావరణం కనిపిస్తోంది. 

పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

బాలీవుడ్ టాలెంటెడ్‌ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌ లాహోర్‌లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు.

ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రచారంలో భాగంగా హీరామండి టీమ్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ.. సోనాక్షి సిన్హాను పెళ్లి గురించి ప్రశ్నించారు.

 ‘అలియా భట్‌, కియారా అద్వానీ పెళ్లి చేసుకున్నారు?. మరి మీది ఎప్పుడు’ అని అడగ్గా.. సోనాక్షి వెంటనే అక్కడ నవ్వులు పూయించారు. ‘మీరు నన్ను ఆటపట్టిస్తున్నారు కదా. వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు నేను ఎంతగా ఎదురుచూస్తున్నానో మీకు తెలుసు. ఎప్పుడో ప్రారంభించిన హీరామండి షూటింగ్ కూడా అయిపోయింది. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కానీ నాకింకా పెళ్లి కాలేదు. నాకు  తప్ప ఈ సిరీస్‌లో నటించిన అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయ’ అని సోనాక్షి అన్నారు.

హీరామండిలో నటించిన షర్మిన్ సెగల్ కూడా పెళ్లి చేసుకుందని కపిల్ శర్మతో సోనాక్షి అన్నారు. వెంటనే మనీషా కొయిరాలా మాట్లాడుతూ… ‘రిచా చద్ధా పెళ్లి చేసుకుని  తల్లి కూడా కాబోతుంద’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. నటుడు అలీ ఫజల్‌ను 2023 అక్టోబర్‌లో రిచా వివాహమాడారు. ఫిబ్రవరి 2024లో తాను గర్భం దాల్చినట్లు ఆమె ప్రకటించారు. షర్మిన్ వివాహం 2023 నవంబర్‌లో జరిగింది. 2024 మార్చిలో అదితి రావ్ హైదరీ వివాహం జరిగింది. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.