Home Blog Page 850

బెంగుళూరు రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి?!

రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారా? ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో? ఏమో? ముందే వీలైనంత ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నారా?  పార్టీ అధినేతలు ఎటూ విదేశీయాత్రల్లో ఉన్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఇతర నాయకులు.. ఈ విరామ సమయాన్ని విచ్చలవిడిగా పండగ చేసుకునే ఉద్దేశంతో ఉన్నారా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. బెంగుళూరు పోలీసులు పట్టుకున్న ఒక రేవ్ పార్టీ బాగోతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఉన్నారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.

బెంగుళూరు శివార్లలోని ఒక ఫాంహౌస్ లో దాదాపు వందమందితో నిర్వహించిన భారీ రేవ్ పార్టీని పోలీసులు ఛేదించారు. పోలీసులు దాడి చేయడంతో ఈ పార్టీలో అనేకమంది తెలుగు టీవీ నటీమణులు, మోడళ్లు పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఒక వ్యాపారవేత్తకు చెందిన ఫాంహౌస్ లో ఈ రేవ్ పార్టీ సాగినట్టు సమాచారం. ఈ దాడిలో పట్టుబడిన వాటిలో జాగ్వార్, బెంజ్ సహా 15 ఖరీదైన కార్లను పోలీసులు సీజ్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ట్విస్టు ఏంటంటే.. ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న ఒక వాహనం ఈ పార్టీలో సీజ్ అయిన వాటిలో ఉంది. ఈ పార్టీకి సదరు మంత్రే వెళ్లారా? లేదా ఆయన స్వయంగా సొంత వాహనాలకు మాత్రమే వాడవలసిన స్టిక్కర్ ను తీసుకోగలిగేంతటి ఆయన సన్నిహితులు ఆ పార్టీలో ఉన్నారా? అనేది తేలలేదు.

అయితే తన పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కరుతో వాహనం పట్టుబడిందని తెలియగానే మంత్రి కాకాణి అప్రమత్తం అయ్యారు. ఆ పార్టీతో గానీ, ఆ వాహనంతో గానీ తనకు సంబంధం లేదని ఆయన చెప్పేశారు. ఆ స్టిక్కరు 2022 లో చెల్లుబాటు పూర్తయిన స్టిక్కరు అని కూడా ఆయన చెప్పారు. ఎక్స్‌పెయిర్ అయిన స్టిక్కరే కావొచ్చు గాక.. కానీ అలాగని.. ఆయన పేరుతో ఉండే స్టిక్కరును ఎవరు పడితే వారు పొందలేరు కదా అనేది ప్రజల అనుమానం. ఆయన ఎక్స్‌పెయిర్ అయిన స్టిక్కరును తన అనుంగు సహచరులు ఎవరికైనా ఇచ్చారేమో,  వారే ఈ పార్టీలో ఉన్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలా కాకపోతే.. తక్షణం ఆ కారు నెంబరు కూడా స్పష్టంగా తెలుస్తున్నది గనుక.. కాకాణి గోవర్దన్ రెడ్డి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన ఎమ్మెల్యే స్టిక్కరును ఆ కారు యజమాని అక్రమంగా వాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తే ఆయన చిత్తశుద్ధిని కొంతవరకైనా నమ్మవచ్చు. ఆ స్టిక్కరు ఎక్స్‌పెయిర్  అయినదనే ఒకే మాటతో తనకు సంబంధం లేదని తప్పించుకోవాలని చూస్తే.. బహుశా ప్రజలు నమ్మకపోవచ్చు.

ఇంకో ట్విస్టు ఏంటంటే.. ఇదే రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ కూడా ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. అయితే హేమ వాటిని ఖండిస్తూ.. తాను హైదరాబాదులోనే ఉన్నానని, ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానని ఒక వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. 

Chandrababu’s ‘Pen Drive’ Key Source For SIT Report?

Chief Minister YS Jaganmohan Reddy, who had reportedly plotted to create an atmosphere of terror on the polling day by now allowing political opponents to raise their voice, seems to be shocked with the aggressive reaction from the Election Commission of India (ECI).

Beginning with the shifting of Intelligence Chief and DGP, besides sending a key police officer to Assam on poll duty, the ECI conveyed that it is serious to ensure law and order during the polling in the state. Moreover, it has also transferred some key officers like Anantapur DIG.

It has sent warning signals to several officers and they tried to be `neutral’. Though some polling agents of TDP were kidnapped in Punganur, they were set free by the time of starting of polling. This has led to mostly peaceful polling in faction-ridden districts like Kadapa, Kurnool, Anantapur and Chittoor.

This made some YCP MLAs, who are known for their violent behaviour, become restless and resorted to post-poll violence. Incidents of Tadipatri, Tirupati and Palnadu clearly established that the police colluded with the ruling party MLAs in resorting to indiscriminate violence to terrorize political opponents.

But, forming of SIT against erred police officers created panic both among officers and also YCP leaders. Now, the SIT report is likely to act like a domicile sword on certain officers, who acted in proximity with the ruling party.

According to the sources, the `Pen Drive’ provided by TDP chief Chandrababu Naidu has provided key evidence for the SIT report. It contained specific evidence in atleast 30 incidents of violence. For the first time in the recent past, a TDP delegation led by its politburo member and a former police officer Varla Ramaiah met the DGP Harish Gupta and handed over this `Pen Drive’.

Both police and YCP circles are surprised at how TDP can collect such crucial evidence within a short period. Intelligence IG Vineet, who is leading the SIT has reportedly handed over this `pen drive’ to SIT members as a crucial basis for their investigations at the field level.

Anirudh Delivers Electrifying ‘Fear Song’ For Jr. NTR’s Devara

The much-awaited Man of Masses Jr. NTR’s Fear song was officially released on the evening of May 19. As fans eagerly awaited the first single from ‘Devara’, the makers chose to release the Fear song to celebrate the actor’s birthday, making it the perfect present for Jr. NTR fans.

Musical sensation Anirudh Ravichander, at the helm of music direction, has composed and sung the Fear song. True to Anirudh’s style, the track is immediately captivating, featuring dynamic beats and infectious tunes. The potent lyrics, penned by renowned lyricist Ramajogayya Sastri, complement Anirudh’s vocal and musical arrangements.

As Jr. NTR mentioned earlier in an event, ‘Fear’ is a recurring theme in Devara, and this song heightens the anticipation even more. The song captivates listeners due to Anirudh’s exceptional music, which overshadows the rest of the elements. His electrifying performance shines through, despite the complex lyrics.

Beautifully shot against the coastal backdrop, the ‘Fear’ song is a classic hero elevation song that glorifies the ruthless nature of Jr. NTR’s character, known as the ‘Lord of Fear’ to his enemies. In the song, Koratala Siva presents Jr. NTR in a massy avatar who eliminates enemies with his ferociousness, featuring a sea filled with blood. The song was released in five languages, including Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam, via YouTube.

Helmed by talented director Koratala Siva and backed by Nandamuri Kalyan Ram under the banner of Yuvasudha Arts, Janhvi Kapoor acts as the female lead for this action thriller. Anticipating its release, the film is scheduled to arrive in theaters later this year.

అందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు!

టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్‌ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించింది.  ఇటు తెలుగు తో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. అయితే కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉన్నప్పుడే  కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి జంటకు ఓ బాబు కూడా కలగడంతో కాజల్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం కాజల్ నటించిన లేడి ఓరియెంటెడ్ మూవీ సత్యభామ ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతోంది. దీనితో కాజల్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది. అయితే పెళ్లి తర్వాత అవకాశాలు రావడంపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.పెళ్ళైతే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే అనే అభిప్రాయాన్ని కాజల్ తప్పని భావించారు.

కాజల్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత నా కెరీర్ లో ఎలాంటి మార్పు రాలేదు. బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.అయితే ఈ విషయంలో టాలీవుడ్ లో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇక్కడ పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ఎంతగానో ఆలోచిస్తున్నారు. త్వరలోనే  టాలీవుడ్ లో కూడా మార్పు వస్తుంది. అందుకు ఉదాహరణ నేనే అని కాజల్ తెలిపింది .నా భర్త నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం సమయం కేటాయిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

జగన్ విదేశీయాత్ర మానసిక వైద్యం కోసమేనా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంత సస్పెన్స్ తరవాత యూరోపు యాత్రకు బయల్దేరి వెళ్లారు. ఆయన పిల్లలు లండన్ లోనే చదువుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పిల్లలు అక్కడినుంచి ఓటువేయడానికి వచ్చారు కూడా. జగన్ తిరిగి సకుటుంబంగానే విహారయాత్రకు వెళుతున్నట్టుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి. అందుకోసమే ఆయన, తాను బెయిలు మీద బయట ఉన్నందున, సీబీఐ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. సీబీఐ ఆయన విదేశాలకు వెళ్లడానికి అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ.. సీబీఐ కోర్టు అనుమతించింది. మొత్తానికి ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు కూడా!

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు జగన్మోహన్ రెడ్డి యూరోప్ యాత్ర ప్లాన్ చేసుకోవడం వెనుక ఉద్దేశం కేవలం విహార యాత్ర మాత్రమేనా? అంతకుమించిన మర్మం ఇంకేమైనా ఉన్నదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి కి రహస్యంగా చేయిందలచని కొన్ని చికిత్సల కోసమే ఈ విదేశీ పర్యటన పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన కొన్ని చికిత్సలు చేయించుకున్నారంటూ వదంతులు వినిపించాయి. ఆయన ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకు చికిత్స చేయించుకోవడమే ఆయన విదేశాలకు వెళ్లారని.. షెడ్యూలు వివరాలు బయటకు చెప్పకుండా కొన్ని రోజులు విదేశాల్లో గడపడం వెనుకమర్మం అదేనని వదంతులు వచ్చాయి.

ఆ తర్వాత అనేక సందర్భాలలో విపక్షాలు జగన్ గురించి అలాంటి ఆరోపణలు చేశాయి. జగన్ కు కొన్ని రకాల మానసిక రుగ్మతలు ఉన్నట్టుగా ఆయన సొంత పార్టీ వారే చెబుతున్నారంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్ కుటుంబసమేతంగా జూన్ 1 వ తేదీన తిరిగివచ్చేలాగా పదిరోజుకు పైగా విదేశీయాత్ర ప్లాన్ చేసుకోవడంతో.. మళ్లీ ఆయన మానసిక చికిత్సకు సంబంధించి పుకార్లు వినిపిస్తున్నాయి. జగన్ ఈ ఎన్నికల్లో ఓటమిచెందితే గనుక.. నెలల వ్యవధిలోనే మరోసారి విదేశాలకు చికిత్స నిమిత్తం వెళ్లవచ్చునని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.

మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన రష్మిక!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చలో అంటూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చలో అంటూ దూసుకుపోతుంది. చలో తరువాత రష్మిక కు మంచి ఆఫర్స్ వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ వరుసగా తెలుగుతో పాటు తమిళం ,కన్నడ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటుంది.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్‌ హిట్ కావడంతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఈ భామ గత ఏడాది బాలీవుడ్‌లో  రణ్ బీర్‌ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇలా భాష ఏదైనా వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో చాలా  సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 , అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘కుబేర’.. రష్మిక ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో ఇంకో రెండు క్రేజీ సినిమాలకు కమిట్‌ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రష్మిక ఛాన్స్‌ కొట్టేసింది. ఇది కేవలం రష్మిక మాత్రమే చేయగలిగిన పాత్ర అని, అందుకే ఆమెను కలిసినట్లు దర్శకుడు శిబి వివరించారు.

దూకే ధైర్యమా…దేవర ముంగిట నువ్వెంత…అదరగొట్టిన అనిరుధ్‌!

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం దేవర. మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అటు తారక్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతి నాయక పాత్రలో చేస్తున్నట్లు సమాచారం.

దేవర  సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. దీని గురించి ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో ఈ ఫస్ట్ పార్టును అత్యంత భారీగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

ప్రమోషన్స్ లో భాగం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించిన దాని ప్రకారం పాట ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగు తో పాటు హిందీ, తమిళ వెర్షన్స్ కి అనిరుధ్ సంగీతం అందిస్తూనే పాట పాడాడు. మూడు నిముషాల 16 సెకన్ల నిడివి గల ఈ పాట కి  అయితే గూజ్ బంప్స్ గ్యారెంటీ  అంతే.

స్ట్రాంగ్ రూముల కాపలా మన బాధ్యతే!

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే.. కేవలం పెద్దసంఖ్యలో ప్రజల్ని ఉత్సాహపరిచి ఎక్కువశాతం పోలింగ్ నమోదు అయ్యేలా చూడడం ఒక్కటీ సరిపోదు. ఓట్లు పోలైన ఈవీఎంలు అన్నీ కౌంటింగ్ వరకు భద్రంగా ఉండేలా చూసుకోవడం కూడా కీలకమైన బాధ్యతే. ఈవీఎంలను కాపాడడం అనేది కేవలం పోలీసులు, కేంద్ర మిలిటరీ బలగాల పనిమాత్రమే అనుకోవడానికి కూడా వీల్లేదు. అది మనందరి బాధ్యత. మీరంతా ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూముల మీద వెయ్యికళ్లతో నిఘా పెట్టండి. లేకపోతే నష్టపోయేది మనమే.. అని ఎన్డీయే కూటమి పార్టీలు తమ కార్యకర్తలకు హెచ్చరికలు జారీచేస్తున్నాయి.

ఇప్పటికీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు పోలీసు యంత్రాంగం సహకరిస్తోందనే సమాచారం పలువురిని కలవరపెడుతోంది. అసలు కేవలం వైసీపీ నాయకులను మాత్రమే వెంటబెట్టుకుని పోస్టల్ బ్యాలెట్లను తరలించిన దుర్మార్గమైన వ్యవహారాలు కూడా విజయనగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా.. అసలు స్ట్రాంగ్ రూముల వద్ద మానిప్యులేషన్ చేసి.. నెగ్గే ఆలోచనలో కూడా వైసీపీ దళాలు ఉన్నట్టుగా ఒక ప్రచారం నడుస్తోంది. తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లినందుకే చంద్రగిరి తెలుగుదేశం ఎమ్మెల్యే అబ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. గుంటూరులో  స్ట్రాంగ్ రూము ఉన్న నాగార్జునయూనివర్సిటీలో పోలీసు అధికారులు, సీఎం సెక్యూరిటీ టీం కలిసి పార్టీలు చేసుకోవడం కూడా వివాదాస్పదం అయింది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను ఏకంగా మార్చేసి.. అడ్డదారిలో గెలవడానికి కూడా వైసీపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం నాయకులు తమ కార్యకర్తలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారిచేస్తున్నారు. జాగ్రత్తలు చెబుతున్నారు. మీరందరూ విధిగా స్ట్రాంగ్ రూముల వద్ద వంతుల వారీగా 24 గంటల కాపలా ఉండండి. పార్టీకి విధేయులైన కార్యకర్తలనే కాపలా బృందాలుగా ఏర్పాటు చేయండి. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా పార్టీ వర్గాలకు, ఈసీకి ఫిర్యాదు చేయండి అంటూ పురమాయిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఈవీఎంలకు కాపలా కాయాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

టీచర్లను వాలంటీర్లతో పోలుస్తారా? ఇంత ఘోరమా?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తిస్తూ, వారి మీద పగబట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటే అందుకు ప్రధాన కారణం పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అనే ఆరోపణలు ఉపాధ్యాయవర్గాల నుంచి సుదీర్ఘకాలంగా ఉన్నాయి. ఉపాధ్యాయులు పీఆర్సీ విషయంలో గానీ, పాత పెన్షన్ విధానంలోగానీ.. జగన్ సర్కారు మీద పోరాడిన నాటినుంచి ప్రభుత్వం వారి మీద పగబట్టింది. పగబట్టినట్టుగానే.. వారి చుట్టూ నిబంధనల ఉచ్చు బిగించి.. వారిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. టీచర్లకు పనిభారాన్ని బీభత్సంగా పెంచారు. టీచర్లు అసలు పాఠాలు చెప్పాలో.. తమ చుట్టూ పెట్టిన నిబంధనల్ని అన్నింటినీ ఫాలో అవుతూ రోజంతా గడిపేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో టీచర్లు అంటేనే చులకనగా మాట్లాడుతూ వచ్చిన ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా తణుకులోని ఒక పాఠశాలను ఆయన పరిశీలించారు.

నిష్ణాతులైన టీచర్లున్నా పరీక్షల్లో నూరుశాతం ఫలితాలు రావడం లేదంటే.. టీచర్ల నిర్లక్ష్యమే కారణం అని ఆయన అంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మెరుగుపడడం లేదని అన్నారు. తమ పార్టీ కాంట్రాక్టర్లు దోచుకోవడానికే కోట్లు ఖర్చు పెడుతున్నారనేది వాస్తవం. ఫలితాలకు సౌకర్యాలకు సంబంధం ఉండదని ఇంత పెద్ద అధికారి ఎప్పుడు తెలుసుకుంటారో?

ఆయన అహంకారపూరిత మాటలకు మరో నిదర్శనం ఏంటంటే.. ఒక వాలంటీర్లు 50 ఇళ్లను చూస్తోంటే.. ఒక వాలంటీరు 25 మంది పిల్లలను చూడలేడా అని అంటున్నారు. వాలంటీర్ల పనికి టీచర్ల పనికి అసలు పోల్చడం ఏంటని.. ఆయనకు అంతఘోరమైన పోలిక తెచ్చే  ఆలోచన ఎలా వచ్చిందోనని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు జీతాలుగా ఇస్తున్నది ఉచిత సొమ్ము ప్రజలసొమ్ము అంటున్న ప్రవీణ్ ప్రకావ్.. అక్కడికేదో సొంత డబ్బు ఇస్తున్నంతగా రెచ్చిపోతున్నారని టీచర్లు అంటున్నారు.

నూరుశాతం ఫలితాలు అనేది .. పిల్లలతో కాపీ కొట్టిస్తే తప్ప సాధ్యం కాదనేది ఆయనకు తెలియని సంగతా? ఇప్పుడు వందల వేల కోట్ల రూపాయలు వైఎస్సార్ సీపీ ఎన్నికల్లో ఖర్చు పెట్టింది. 175 స్థానాలు గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే చెబుతున్నారు. మరి పార్టీ 100 శాతం సీట్లు గెలవకపోతే.. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అవుతుందా.. ప్రవీణ్ ప్రకాశ్ నిర్వచనం ప్రకారం అంతే కదా.. అని ప్రజలు అంటున్నారు.

JD Lakshmi Narayana Questions CM Jagan’s Foreign Tour

Former IPS officer and President of Jai Bharat National Party VV Lakshmi Narayana has questioned Chief Minister YS Jaganmohan Reddy’s foreign tour at a time the state is facing incidents of post-poll violence.

He deplored that after polling riots broke out in many districts and factions of TDP and YCP attacked each other at several places. He wondered but neither the government, nor these parties took any action in this regard.

He asked how can the Chief Minister go on a foreign tour in such circumstances without bothering the law and order scenario in the state. He expressed concern that even ministers are also not seen anywhere attempting to control the situation.

He reminded that the Chief Minister and Ministers should make efforts to restore peace and security in the state. But, none of them seems to be bothered by the frightening situation at various places. He said that he was disturbed seeing live scenes on television channels when goons were making havoc on roads without any fear.

Lakshmi Narayana expressed concern that even leaders of political parties attempted to control their cadre. He asked why no party suspended such goons, who took part in violent incidents? Even probationary orders under Section 144 too remained as a farce and not implemented properly.

Former Joint Director of CBI expressed concern over the role played by `money power’ in these elections. He said that money was spent extravagantly with the aim of winning.  He cautioned the administration to take necessary precautionary measures on June 4, day of counting of votes to ensure peace and security of people.

He suggested that the Special Investigation Team (SIT) should go in depth of violent incidents, complete their investigation quickly and give a comprehensive report. Strict action should be taken against those responsible, he added.