Home Blog Page 842

జూన్‌ 10 న బాలయ్య అభిమానులకు పునకాలే!

నందమూరి నటి సింహం బాలయ్య బాబు గత సంవత్సరం భగవంత్‌ కేసరి సినిమాతో చాలా పెద్ద హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమా వసూళ్ల పరంగా భారీ కలెక్షన్స్‌ ను రాబట్టింది. ఈ సినిమా బాలయ్య కెరీర్‌ లోనే అతి పెద్ద హిట్‌ గా నిలిచిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా “NBK 109 ” వర్కింగ్ టైటిల్ తో    రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన గ్లిం ప్స్‌ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బాలయ్య మాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న విశ్వక్ సేన్ నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది .ఈ ఈవెంట్ కు బాలయ్య అతిదిగా విచ్చేశారు.

 ఆ ఈవెంట్ లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ జూన్ 10 న బాలయ్య బర్త్ డే సందర్భంగా NBK 109 మూవీ నుంచి మరో భారీ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ కు ఆరోజు పూనకాలు వచ్చేస్తాయి అని నాగ వంశీ తెలిపారు.

Pushpa 2 Unveils The Captivating Melody ‘Sooseki’

The much-anticipated sequel, ‘Pushpa 2: The Rule’, is gearing up for its worldwide release on August 15, 2024. ‘Pushpa 2’, starring Allu Arjun and Rashmika Mandanna as the main leads, is helmed by Maverick Director Sukumar.

The action-packed thriller generated significant anticipation all over the world for the actor’s never-seen-before avatar. As the film’s release date approaches, the makers have generated immense hype with the previously released teaser and first single. Now, adding to the anticipation, the makers unveiled the second single, ‘The Couple Song’.

‘The makers released the ‘Sooseki’ song via YouTube and shared a poster on their special media handles and wrote, “Join Pushpa Raj and Srivalli as they vibe to the super catchy #Pushpa2SecondSingle”.

With Melody Queen Shreya Ghoshal’s enchanting vocals, the lyrical video starts with Allu Arjun making his grand entrance onto the sets of Pushpa. Soon after, Rashmika Mandanna began singing and lip-syncing to the song’s lyrics. Together, the actors offer a glimpse of the iconic Couple Song choreography, showcasing their chemistry. The video concluded with a lively ensemble of Allu Arjun, Rashmika Mandanna, director Sukumar, dance choreographer Acharya, and the rest of the film’s crew dancing to the song’s signature steps.

The lyrics to this catchy melody are penned by renowned lyricist Chandra Bose in the Telugu version. Shreya Goshal lent her voice to the song across six languages, delivering a melodious melody in Telugu, Tamil, Hindi, Kannada, Malayalam, and Marathi. National Award winner Devi Sri Prasad is at the helm of the music direction, anticipating another chartbuster album for this flick.

Mani Shankar Aiyar Triggers Fresh Row On Indo- China War

Weeks after former Union minister and Congress leader Mani Shankar Aiyar found himself in the middle of a row over his comments on Pakistan, his remarks, this time on China, have again triggered a controversy.

Aiyar, while speaking at the Foreign Correspondents’ Club of South Asia, referred to the 1962 Indo-China war as an “alleged Chinese invasion”. “In October 1962, the Chinese allegedly invaded India,” Aiyar is heard saying in a video that has gone viral.

When a member in the audience questioned his use of the word “allegedly”, he sought to amend his stance and apologised for having used the word “mistakenly”.

Later, in a brief statement, Aiyar, who had also recounted that his entry into the Indian Foreign Service (IFS) was reversed after reports that he, studying in the UK then, was engaged in fund collection for the Chinese making him rush to India to clarify matters, said, “I unreservedly apologise for having mistakenly used the word ‘alleged’ before ‘Chinese invasion’ at the Foreign Correspondents Club this evening.”

The BJP criticised the Congress following another controversial remark by one of its senior leaders, who has often embarrassed his party with outspoken comments about PM Narendra Modi and his views on Pakistan. The BJP demanded that the Congress clarify its “love for the Chinese.”

BJP IT Cell chief Amit Malviya said in a post on X said, “Mani Shankar Aiyar, speaking at the FCC, during the launch of a book called Nehru’s First Recruits, refers to the Chinese invasion in 1962 as ‘alleged’. This is a brazen attempt at revisionism. He alleged that Aiyar wanted to “whitewash Chinese invasion”.

Amid the controversy, Congress distanced itself from the senior leader’s remarks. Congress general secretary Jairam Ramesh pointed out that Aiyar had subsequently apologised ‘unreservedly’ for using the term ‘alleged invasion’ ‘mistakenly,’ and that the party distances itself from the ‘original phraseology’. He pleaded that ‘allowances must be made for his age.’

Ramesh also accused Prime Minister Narendra Modi of giving a ‘clean chit’ to the Chinese for their incursions in May 2020. “The outgoing PM, however, gave a clean chit publicly to the Chinese on June 19th 2020, seriously weakening our negotiating position. 2000 sq km of territory including Depsang and Demchok remain out of bounds for Indian troops,” he said in a post on X.

భారతీయుడు 2 నుంచి అదిరిపోయే సాంగ్ ఔట్‌!

లోక నాయకుడు కమల్‌ హాసన్‌, కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌  శంకర్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2 .ఈ సినిమా ఇంతకు ముందు వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  ఈ సినిమాలో కాజల్‌, నటుడు సిద్దార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా  భవానీ శంకర్‌  మెయిన్‌ రోల్స్‌ చేస్తున్నారు.

ఈ సినిమాని భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌  మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌  సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా
  ఉంది.  మేకర్స్ ఈ సినిమాను జులై 12 న గ్రాండ్ గా  విడుదల  చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి  విడుదలైన  గ్లింప్స్‌  వీడియో ,పోస్టర్స్ విడుదల చేయగా సినిమాపై భారీగా అంచనాలు భారీగా పెరిగాయి.  తాజా గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్‌ విడుదల చేశారు.

శౌర అంటూ సాగే  ఈ పాట ప్రేక్షకులను  బాగా  ఆకట్టుకుంటుంది.  ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ ను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ మధ్య “చెంగలువ”  అంటూ సాగే  లవ్ సాంగ్ తాజాగా విడుదల అయింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో రిలీజ్ జూన్ 1 న గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Congress, BRS Put Show On 10 Years Of Telangana State Formation

The 10th Telangana Formation Day on June 2 turned out to be a political tug of war between ruling Congress and opposition BRS. Both the parties are streamlining to claim the credit for the state formation.

Chief Minister A Revanth Reddy confining celebrations for one day on June 2 and mostly making it a government sponsored party affair, by inviting Congress former chief Sonia Gandhi. He met her on Tuesday evening in New Delhi and formally invited her for the celebrations.

He is planning to felicitate her for `giving Telangana state’, along with several people, who played key role during Telnagna agitation. He has given the task of preparing `Telangana fighters’ list to TJS chief Kodanda Ram. He said they will be invited officially and felicitated on this occasion.

There was also discussion to invite BRS chief and former chief minister K Chandrasekhar Rao for these celebrations and felicitate him along with Sonia Gandhi. However, till now there is no official confirmation.

On the otherhand, BRS is making a move to celebrate the festival for three days, starting from June 1. BRS is gearing up for a three-day grand celebration to commemorate the 10th Telangana state Formation Day.

While Revanth Reddy decided to confine celebrations for a grand show at the parade ground, the BRS has decided to celebrate the decade in a grand way across the state. KCR called upon the party ranks to organize the closing ceremony of Telangana state’s birth decade celebrations.

The celebrations will kick off on June 1 at 5 PM with a candlelight rally from the Telangana Martyrs’ Memorial in Gun Park to the Amara Jyothi memorial at Tank Bund. This event is being organised to pay homage to the martyrs who laid down their lives for the cause of Telangana. BRS president and former Chief Minister K Chandrashekhar Rao along with numerous Telangana activists and citizens, will participate in the event.

On June 2, the State Formation Day celebrations will be held at Telangana Bhavan, the party’s headquarters. KCR will hoist the national flag at 9.30 am and later the party flag, on the occasion.  Grand celebrations will be organised in all district headquarters by the party district presidents on June 3. The activities will include hoisting of the party flag, followed by various service activities such as distribution of fruits and food to the needy.

రెండు వారాల్లో ఓడలు బండ్లయ్యాయా?

‘మా కార్యకర్తల మీద బైండోవర్లు, రౌడీషీట్లు వేస్తున్నారు’
‘ప్రజలను, మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’
‘మామీద దాడులు జరుగుతోంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు’
‘పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని అంతమొందించాలని చూస్తున్నారు’
‘మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. ఇప్పుడు గీత దాటి వ్యవహరిస్తున్న అధికారులు అందరూ అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’
.. ఈ డైలాగులు అన్నీ ఎక్కడైనా విన్నట్టుగా అనిపిస్తోందా? మీరు అనుకుంటున్నది నిజమే. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గత అయిదేళ్లుగా మొరపెట్టుకుంటున్న విషయాలే ఇవన్నీ కూడా! అయిదేళ్ల పాటూ కొన్ని వందల సందర్భాల్లో ఇలాంటి మాటలు మనం తెదేపా నాయకుల నుంచి విన్నాం. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కూడా.. ‘పోలీసులను అడ్డుపెట్టుకుని నన్ను అంతం చేయాలని జగన్ ప్రభుత్వం చూస్తున్నది’ అనే ఆరోపణలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసి కేవలం రెండు వారాలు మాత్రమే అవుతోంది. అప్పుడే బండ్లు ఓడలయ్యాయా? లేదా, ఓడలు బండ్లయ్యాయా? అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఈ మాటలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ప్రత్యేకించి.. అయిదేళ్ల పాటూ అప్రకటిత హోం మంత్రిగా, సకల శాఖల మంత్రిగా రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం అంతటినీ తన కనుసైగలతో శాసించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు ఈ బేలపలుకులు పలుకుతున్నారు.
పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఒక్కడి మీద కేసులు నమోదు అయినందుకే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుదేలైపోతూ, కిందామీదా అయిపోతోంది. పిన్నెల్లి మీద కేసులు పెట్టడం అన్నదే తెలుగుదేశం పార్టీతో పోలీసు యంత్రాంగం, ఎన్నికల అధికారులు అంతా కుమ్మక్కు అయిపోయినట్టే అని మాట్లాడుతున్నారు. పిన్నెల్లి ముఠా దాడిలో తలకు గాయమైన సీఐ ఆలస్యంగా కేసు పెట్టడం కూడా నేరమేనట. పదిరోజుల పాటు ఆ సీఐ నిద్రపోతున్నారా? అని సజ్జల రామక్రిష్ణారెడ్డి రంకెలు వేస్తున్నారు.
ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ముకాస్తున్న అధికారుల, పోలీసుల పేర్లు నోట్ చేస్తున్నామని.. తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తామని తెలుగుదేశం వారు హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు పాపం.. ఓడలు బండ్లయ్యాయి. ఇన్నాళ్లూ అధికారంలో ఉంటూ పోలీసుల్ని తమ చెప్పుకింద చీమల్లా చూసిన వారు.. ఇలాంటి బేల పలుకులు పలుకుతున్నారు.

MLA Pinnelli Should Report At SP Office Daily

While granting interim bail to Macherla YCP MLA Pinnelli Ramakrishna Reddy in three more criminal cases, AP High Court judge Justice Venkata Jyotirmayi has imposed certain conditions on him.

According to the court verdict, he should report daily at SP’s office in Narasaraopet between 10 am to 5 pm and she ordered him not to go beyond Narasaraopet and inform the SP of Palnadu, where he is staying there and also details of his mobile numbers.

Pinnelli was ordered to surrender his passport in the Gurjala Magistrate Court. Do not leave the country without court permission. Palnadu SP has been ordered to take all kinds of measures to protect the victims and to arrange patrols for their protection.

The High Court directed the Chief Electoral Officer of the state to issue orders to keep a full vigil on Pinnelli’s movements with police officers. It decided not to interfere in any kind of criminal activities and not to repeat the criminal incidents.

The High Court also made it clear that it will be the responsibility of Pinnelli Ramakrishna Reddy controlling the followers and ensuring that there were no attempts to disturb the tranquility of the area and the victims.

It was also  made clear that  he should not talk to the media about his role in the cases and also should not  meet the victims and witnesses. The police have been given flexibility to take appropriate action as per law if the conditions imposed by the court are violated.

Delivering the judgement, the Judge advised that those who are in the election ring and public representatives should be very responsible. The Judge quoted Supreme Court’s saying in a case

 that the wheels of justice may turn slowly but they turn correctly. The case was posted to June 6, ordering the police to file a counter in this case.

People From 87 Countries In Solidarity Opposing IPS ABV’s Suspension

Thousands of people from as many as 87 countries have signed in an online petition promoted by AP Tomorrow seeking immediate posting to senior IPS officer AB Venkateswara Rao, who is now under suspension.

N. Chakraborty, president of the organization, said that the collection of signatures by them has received a mixed response. He alleged that the AP government is deliberately delaying even after the CAT orders that the suspension for the second time is against the rules.

So far, more than 35,000 people from 87 countries have supported the collection of signatures. The report of collection of signatures has been sent to the Election Commission. He said that Venkateswara Rao is going to retire by May 31.

On the 23rd of this month, a hearing was held in the High Court on the petition to cancel the suspension of IPS officer AB Venkateswara Rao. CAT issued orders on 8th of this month, suspending AB Venkateswara Rao for the second time and violating the decision taken by the state government.

Challenging the order, the Chief Secretary of the State Government filed a petition in the High Court. The High Court, after hearing arguments from both sides, reserved its verdict. A special summer vacation bench heard the suit.

Reversing the earlier decision taken by the state government, CAT made it clear that the two suspensions on the same charge is invalid. CAT ordered the state government to immediately hand over the responsibilities and pay the salary arrears while lifting the suspension.

 As the CAT judgment was not accepted by the CM Jagan Mohan Reddy government, which is targeting and harassing IPS AB Venkateswara Rao, it later filed a lawsuit in the High Court. Deputy Secretary General Administration G Jayaram filed an affidavit on his behalf in the petition filed by CS.

Jayaram said in the affidavit that CAT did not consider the fact that there were sufficient reasons for the suspension. He said that CAT has failed to comply with the judgments given by various High Courts. CAT orders are not rational.

 On the other hand, the AP Tomorrow organization has taken up the collection of signatures for the posting of senior IPS officer AB Venkateswara Rao.

ఓవరాక్షన్ : అన్నప్రాసన నాడే ఆవకాయ డైలాగులు!

రెగ్యులర్ గా రాజకీయాలు ఫాలో అయ్యేవారికి కూడా మలసాల భరత్ అనే పేరు కొత్తే. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ.. మొన్నమొన్నటిదాకా అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటూ గడిపిన ఈ మలసాల భరత్.. ఒక్కసారిగా హెలికాప్టర్ షాట్ లాగా వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వాలిపోయి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో గతంలో వైసీపీ తరఫున గుడివాడ అమర్నాధ్ గెలిచారు. అయితే.. ఈ అయిదేళ్లలో అమర్నాధ్ అత్యంత అసమర్థుడిగా పేరుపడ్డారా.. లేదా, మలసాల భరత్ చూపించిన బలం, ప్రకటించిన ఆఫర్లు జగన్ ను ఊరించాయో తెలియదు గానీ.. మొత్తానికి అమర్నాధ్ ను గాజువాకకు బదిలీచేసేసి.. అనకాపల్లి టికెట్ భరత్ చేతిలో పెట్టారు.
ఈ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా కొణతాల రామక్రిష్ణ రంగంలోకి దిగారు. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉండడం ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. అసలే జగన్ సర్కారు పట్ల రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన వ్యతిరేకతకు తోడు స్థానిక కారణాలు కూడా జతకలవడంతో.. అనకాపల్లి ఎమ్మెల్యేగా కొణతాల గెలుపు ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.
అయితే, మలసాల భరత్ మాత్రం.. రాజకీయంగా అరంగేట్రం చేసిన ఈ తొలి ఎన్నికల్లోనే ఆవకాయ ఘాటును మించిపోయిన డైలాగులు వల్లిస్తున్నారు. రాబోయే ముప్పయ్యేళ్లపాటు అనకాపల్లిలో నేనే ఎమ్మెల్యేగా ఉండబోతున్నాను.. అని ఈ యువనాయకుడు ఫలితాలకు ముందే ప్రకటించేస్తున్నారు. 2029లో కూడా జగన్ తనకే టికెట్ ఇస్తారని, ఇప్పుడు గెలిచిన తర్వాత.. రాబోయే అయిదేళ్లలో తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంత గొప్పగా పనిచేస్తానో చూసి డంగైపోయి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చి తీరుతారని భరత్ చెప్పుకుంటున్నారు.
మామూలుగా అయితే అనకాపల్లి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఏదో గత ఎన్నికల్లో వారు అక్కడ గెలవలేకపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బలం కూడా తోడై.. అక్కడ కూటమి విజయదుందుభి మోగిస్తుందని అంచనాలు సాగుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఇంకా బొడ్డూడని ఈ కుర్ర నాయకుడు, ఆవకాయ డైలాగులు వల్లిస్తుండడం జనానికి నవ్వు తెప్పిస్తోంది.

ఎన్నికల సంఘం ఏం చేసినా ఏడుపేనా?

పోస్టల్ బ్యాలెట్లు అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడుసుకుంటున్నది. గత ఎన్నికలకంటె ఈ దఫా పోస్టల్ బ్యాలెట్లు లక్షన్నరకు పైగా అదనంగా పోల్ కావడం కూడా.. వారిలో పెరుగుతున్న భయానికి ఒక కారణం. ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా తమకు వ్యతిరేకంగా పడతాయని వారు ముందునుంచి ప్రిపేర్డ్గ్‌గానే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే.. ఉద్యోగుల ఓట్లు చెల్లకుండాపోయేందుకు ముందునుంచి తమకు చేతనైన కుట్రలు అమలు చేస్తూ వచ్చారు. ఆ కుట్రలను ఆలస్యంగా గుర్తించిన ఉద్యోగులు, ఎన్నికల సంఘం నుంచి కొన్ని సడలింపులు కోరితే.. ఇప్పుడు తమ కుట్రలు ఫలించకపోయే సరికి ఎన్నికల సంఘం మీద పడి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏడుస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ అనేది ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ముప్పుగా మారబోతోంది. గత ఎన్నికల సమయంలో ఉద్యోగుల ఓట్లు జగన్ కు బాగా కలిసి వచ్చాయి. తాను అధికారంలోకి వస్తే వారంరోజుల్లోనే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, పీఆర్సీ వంటి ఇతర అనేక హామీలతో ఉద్యోగులను ఊరించారు. జగన్ ను నమ్మి ఉద్యోగులు ఎగబడి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఉద్యోగులను ఎన్ని రకాలుగా వేధించారో ముప్పుతిప్పలు పెట్టారో అందరికీ తెలుసు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ’పీఆర్సీ వద్దు మాకు పాత జీతాలే ఇవ్వండి’ అని ఉద్యోగులు మొరపెట్టుకునే పరిస్థితిని జగన్ కల్పించారు.
దానికి తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు ఉద్యోగులు ఎగబడి వేశారు. క్యూలైన్లలో నిల్చుని వేశారు. గత ఎన్నికల కంటె ఒకటిన్నర లక్ష ఓట్లు ఎక్కువ పడ్డాయి. అయితే.. పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చే విషయంలో అటెస్టింగ్ అధికారులు కొన్ని చోట్ల సంతకాలు చేయకుండా, స్టాంపు వేయకుండా ఫారంలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు బ్యాలెట్లు వేసేసిన తర్వాత ఆ సంగతి గుర్తించి గొల్లుమన్నారు. తమ ఓట్లు చెల్లకుండా చేసేందుకు చాలా ప్రాంతాల్లో ఒక వ్యూహాత్మక కుట్ర జరిగిందని వాపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా.. పోస్టల్ బ్యాలెట్లకు కొన్ని సడలింపులు ఇచ్చారు. సంతకం ఉండి, స్టాంపు లేకపోయినా చెల్లుతాయని ప్రకటించారు. ఈ ఆదేశాలపై వైఎస్సార్ సీపీ ఏడుస్తోంది. ఇదంతా తెలుగుదేశం కుట్ర అని ఆరోపిస్తుంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా.. పోస్టల్ బ్యాలెట్లలో అన్యాయం జరగకుండా ఒక ఉత్తర్వులు ఇస్తే.. వాటి మీద పడి ఏడుస్తుండడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.