Home Blog Page 839

ఇక నుంచి మరింత ఎక్కువ కష్టపడతాను!

ఇటీవల విడుదల చేసిన  ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని టాలీవుడ్‌ ముద్దుగుమ్మ సమంత తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచిపోయాయో తనకే అర్థం కావట్లేదన్నారు. తనకు ప్రస్తుతం గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పుకొచ్చింది.

ఏ రంగంలో అయినా ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజం. నేను పక్కవారిని చూసి స్ఫూర్తి పొందుతాను. వారి విజయాలను చూసి ఈర్ష పడను, ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలనుకుంటాను. నేనెప్పుడూ పోటీని నెగెటివ్‌గా చూడను’ అంటూ సమంత తెలిపారు. సామ్ ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’లో నటిస్తున్నారు. సామ్‌ నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’పై రూపొందుతున్న తొలి చిత్రం ఇదే.

ఐఎండీబీ జాబితాలో టాప్ 15లో ఉన్న ఏకైక దక్షిణాది స్టార్‌ గా  సమంత ఉన్నారు. ఈ జాబితాలో దీపికా పడుకోణె అగ్రస్థానంలో ఉన్నారు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా.. నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ మూడో స్థానంలో ఉన్నారు. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్‌, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ టాప్ 10లో ఉండగా… తెలుగు , తమిళం నుంచి  తమన్నా భాటియా, నయనతార వరుసగా 16, 18వ స్థానాల్లో నిలిచారు.

ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త..ట్రైలర్‌ డేట్ ఫిక్స్‌!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.  ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకు మ‌హాన‌టి ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు  దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

జూన్‌ 27న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా రానుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 22 రోజులే ఉండ‌డంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ పాల్గోంటుంది క‌ల్కి టీమ్. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను ఇచ్చారు చిత్ర బృందం. ఈ మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

మూసిఉన్న ఆలయాన్ని తెరిచిన నిఖిల్‌ సిద్దార్గ్‌!

టాలీవుడ్‌ యంగ్‌ నటుడు నిఖిల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వా నిఖిల్‌ ఎంచుకున్న కథలు నిఖిల్‌ ని ఎక్కడికో తీసుకుని వెళ్లిపోయాయి. స్వామి రారా, కార్తికేయ‌, కార్తికేయ 2 వంటి సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్లు అందుకున్నాడు.

అయితే తాజాగా ఈ న‌టుడి చేసిన ప‌నికి సోషల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.ఏపీ లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ గుడి  మూసి ఉంది. అయితే ఈ ఆలయాన్ని తిరిగి  నిఖిల్‌ తెరిపించాడు.  ఆల‌యాన్ని తెరిపించడమే  కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని నిఖిల్ ఇన్‌స్టా వేదిక‌గా అభిమానులకు తెలియజేశాడు.

చాలా సంవత్సరాలుగా మూసేసిన ఆలయాన్ని నిఖిల్ తెరిపించ‌డంతో ఆయనపై గ్రామస్థులు ఆదరాభిమానాలు కురిపించారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

YS Jagan Remained With 11 Seats After Humiliating Defeat

With the TDP, Jana Sena and BJP alliance stormed into power in Andhra Pradesh, the out-going chief minister YS Jaganmohan Reddy created a new dismal record that no leader in the erstwhile Andhra Pradesh state also suffered so badly.

Campaigning with a bold slogan of `Why Not 175’ exuding confidence to win all seats and practically finishing the opposition, he was pushed to the corner by people with only 11 seats. It may be recalled that only in the Nagaland assembly presently there is no opposition.

All his ministers, except one, were defeated. In eight erstwhile districts YCP failed to open its account. Even in his family fortress Kadapa, Jagan could win only three seats, including himself.

Jaganmohan Reddy himself expressed surprise over his defeat after extending money transfer of Rs 2.70 lakh crore to poor, particularly women during the last five years of his rule. He was confident that those beneficiaries will stand behind him at any cost.  

Chandrababu Naidu’s promise of good governance, asset creation through development and continuation of welfare schemes with more focus looks to have resonated with voters.

Jaganmohan Reddy’s dismal performance in promoting industries, job creation, allegations of land grabbing and corruption against its key leaders distances him from his core voters. Moreover, his attitude of victimization attracted the ire of government employees.

Pushing state into severe financial crisis by mobilizing upto Rs 15 lakh crore debts and failure to spend on infrastructure created discontent even among his own party cadre.

During 2019 polls he appealed to people that he will fight with the Center for realizing `Special Status’ to the state if 25 of his candidates won in Lok Sabha polls.

Though his party won 23 MP seats, he was practically silent and unable to question `injustice’ to the state by the state on issues like not realizing bifurcation promises like steel plant at Kadapa, Railway Zone at Visakhapatnam and completion of Polavaram irrigation project. He was also unable to raise his voice when Center attempted to privatize Visakhapatnam Steel Plant.

The opposition accused him that he has been using his strength of MPs to shield from pending CBI and ED cases against him by extending support to the Narendra Modi government in Parliament on all issues.

BJP top leaders also who were continuing shielding Jaganmohan Reddy from all `crisis of governance’ suddenly shifted their focus on Chandrababu Naidu just a week before polling realizing that he is going to register a resounding victory in polls.

Real Game Changer In AP Politics `Power Star’

The stunning poll results in Andhra Pradesh, where the ruling YSRCP was pushed to almost `dust bin’ are surprising everyone. Even its political opponents also didn’t visualise such results. The real hero for this game changer will be Jana Sena chief Pawan Kalyan.

It was his determination for the last two years to avoid division among anti government votes by forming a coalition of TDP, Jana Sena and BJP helped to reach such magic results. Even TDP was a divided house on joining hands with Jana Sena and BJP till last minute didn’t show any interest in joining with TDP.

Moreover, it was Jana Sena chief YS Jaganmohan Reddy who realized dangerous consequences such a political alliance would be for his party. He tried his best to prevent any such alliance. With provocative accusations and abusive language against Pawan Kalyan, he attempted to halt Pawan Kalyan.

Moreover, he also tried his best to make use of his influence with BJP top leaders to persuade Pawan Kalyan from joining hands with TDP. Even, he  offered an alliance with Jana Sena and electoral strategist Prasanth Kishor revealed that he was asked to talk with Pawan Kalyan for an alliance.

Pawan Kalyan was pressured by his own community leaders warning him of joining hands with Chandrababu Naidu. Even BJP brought pressure on him suggesting both Jana Sena and BJP can go to polls declaring him as chief ministerial candidate.

But he can withstand all such provocations and pressures without leaving his political stand. Even on the issue of sharing of seats he adopted a very liberal view and `sacrificed’ several seats offered to him for the sake of BJP.

That’s why Jagan Mohan Reddy particularly focused his attention to ensure defeat of Pawan Kalyan. Despite Jagan’s efforts, resorting to personal insults, and seeing rifts among Kapu leaders, he firmly stood by the alliance.

After TDP chief Chandrababu Naidu’s arrest last year, TDP cadre was in a demoralized state and hardly any leaders came out to roads protesting his arrest. But, it was after Pawan Kalyan went to Rajahmundry jail to meet Naidu and unilaterally announce his decision of alliance with TDP, the political scenario completely changed. This has boosted the morale of the TDP cadre.

ప్రోటెం స్పీకర్ గోరంట్ల, స్పీకరుగా రఘురామ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు ఒకటొకటిగా మొదలయ్యాయి. తొమ్మిదో తేదీన అమరావతిలో ఎక్కడైతే రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారో అదే స్థలంలో అత్యంత భారీ స్థాయిలో పదవీ స్వీకార ప్రమాణం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
ఆ తర్వాత కుదిరితే జూన్ 11వ తేదీన లేదా, మరికొన్ని రోజుల వ్యవధిలో అసెంబ్లీని సమావేశపరచి ఎమ్మెల్యేలు అందరితోనూ ప్రమాణం చేయించే కార్యక్రమం నిర్వహిస్తారు. అసెంబ్లీ తొలి సమావేశానికి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించడానికి ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశంలో ఎంతో సీనియర్ నాయకుడు. పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావుకు కూడా మంత్రివర్గ సహచరుడు. ఆయన ఇప్పటికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతటి సీనియారిటీ ఉన్న నాయకుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం బాగుంటుందని పార్టీ అనుకుంటున్నట్టు సమాచారం. నిజానికి స్పీకర్ స్థానానికి కూడా ఆయన పేరునే పరిశీలించాలని అభిప్రాయం కూడా కొందరిలో ఉంది.

అయితే స్పీకర్ స్థానం మీద ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణరాజుకు ఆశ ఉంది. తనను అసెంబ్లీ స్పీకరుగా చూడాలని తన సన్నిహితులు చాలామంది కోరుకుంటున్నారంటూ ఆయన గతంలో బహిరంగంగానే వెల్లడించారు. స్పీకర్ కాకపోతే ఆయన నుంచి మంత్రి పదవి కోసం పోటీ ఎదురవుతుంది. చిట్టచివరి నిమిషంలో ఎన్నికల ప్రచార పర్వం కూడా మొదలైపోయి టికెట్ల కేటాయింపు అంతా జరిగిపోయిన తర్వాత హెలికాప్టర్ లో వచ్చి దిగిన నాయకుడి లాగా పార్టీ సభ్యత్వం తీసుకున్న రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే టికెట్ను గద్దలా తన్నుకు పోవడమే కొంతమందికి రుచించలేదు. అలాంటిది మంత్రి పదవి కూడా ఆయన ఆశిస్తే పార్టీలో గందరగోళం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడమే పార్టీకి సేఫ్ అని చాలామంది భావిస్తున్నారు.

రఘురామను స్పీకరుగా కూర్చోబెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పుండు మీద కారం రాసిన చందంగా ఉంటుందనే వాదన కూడా పార్టీలో ఉంది. మరొకవైపు ప్రొటెం స్పీకరుగా పార్టీ ఆలోచిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తనకు మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు. 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు రకరకాల సమీకరణాల రీత్యా ఆయనకు పదవి దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి కావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్టు సమాచారం.

ఐ-ప్యాక్ దళం జగన్‌ను ముంచిన విధంబెట్టిదనిన..

జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ సాంతం మునిగిపోయాయి. మళ్లీ కోలుకుంటారో లేదోనని భయం పుట్టేంత పెద్ద దెబ్బ పడింది. జగన్మోహన్ రెడ్డి.. కాంతిలేని మొహంతో.. ఎవరు ఎన్ని చేసినా తమ పార్టీ యొక్క పరిస్థితిని 40 శాతం కంటె తక్కువకు నెట్టలేకపోయారని ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పంచిపెడితే.. ఆ మాత్రం 40 శాతం ఓటు బ్యాంకు రికార్డుల్లో మిగిలిందో అందరికీ తెలుసు. అయితే ఇంత దారుణమైన ఓటమి అసలు ఎలా సాధ్యమైంది? 175 సీట్లు గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన వ్యక్తి.. కనీసం 17 కూడా గెలవలేకపోయాడే? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ఈ ఓటమికి మూలకారణం ఎవ్వరు? ఏమిటి? అనే చర్చ కూడా ప్రజల్లో నడుస్తోంది. అయితే జగన్ పరాజయానికి ఒక కీలక కారణం మాత్రం ఐప్యాక్ వారి వ్యూహ, ప్రచార సారథ్యం అని పలువురు భావిస్తున్నారు.

జగన్.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. ట్వీటు ద్వారా తప్ప మీడియా ముందుకు వచ్చి ప్రజలకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అసలు ఎక్కడా బయట సంచరించలేదు. కానీ ఐప్యాక్ కార్యాలయానికి మాత్రం వెళ్లారు. తద్వారా ఆ ఐప్యాక్ బృందాలు తనకు ఎంత ముఖ్యమో ఆయన చెప్పకనే చెప్పారు. అయితే విశ్లేషకులు భావిస్తున్న దానిని బట్టి.. ఐప్యాక్ వారి వ్యూహాలు వికటించి, వారి డ్రామాలు ఎబ్బెట్టుగా మారి ప్రజలు ఛీత్కరించుకోవడం వలన ఓటమి వరించిందని తెలుస్తోంది.

గత అయిదేళ్లపాటూ ఐప్యాక్ ఏం చేసింది.. అనే సంగతి కాస్త పక్కన పెట్టండి.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించారు. యాత్ర పొడవునా.. స్టే చేసిన ప్రతిచోటా స్థానిక ప్రజలతో నాయకుడు ఇంటరాక్ట్ అయ్యే ఒక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం బహిరంగంగా కాకుండా, ఇండోర్ లో అంటే కల్యాణ మండపాల్లోనో, అలాంటిఇతర హాళ్లలోనో జరిగేది. ఇక్కడ సాధారణంగా పెద్ద పెద్దకామెడీ ఎపిసోడ్లు నడుస్తుండేవి.

ఇక్కడకు వచ్చే ప్రజలను ఐప్యాక్ బృంద సభ్యులే కోఆర్డినేట్ చేస్తుండేవారు. అంటే కేవలం అక్కడ జగన్ తో మాట్లాడే అవకాశం దక్కే ప్రజలను గ్రామాలనుంచి తోలుకు రావడం మాత్రమే కాదు. వారికి ఐప్యాక్ బృందాలే శిక్షణ కూడా ఇచ్చేవి. ఏం మట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. జగన్ ను ఎలా పొగడాలి.. జగన్ స్కీములను ఆకాశానికెత్తేస్తూ ఏమేం చెప్పాలి నేర్పేవాళ్లు. వాళ్లు ఆ కార్యక్రమంలో నాటకం ఆడుతున్నట్టుగా అదంతా అప్పజెప్పి వెళ్లేవాళ్లు. ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో హోరెత్తించడం వారి పని. అలాగే బస్సు యాత్రలో రోడ్ల మీద కూడా.. జనం వచ్చి జగనన్న కాళ్లు మొక్కి.. ఆయన దీవెనలు తీసుకుని.. ఆయన పథకాల్ని పేరుపేరునా చెప్పి మరి కొనియాడడం… లాంటి జుగుప్స కలిగించే డ్రామాలనీ ఐప్యాక్ వారి ప్లానింగ్ పుణ్యమే. ఇలాంటి అతి వేషాలు.. టోటల్ గా జగన్ పరువు తీశాయని, జనానికి ఎబ్బెట్టుగా అనిపించి.. ఆయన పాలనంటే చీదర పుట్టిందని పలువురు అనుకుంటున్నారు. మొత్తానికి అనేక రకాల ప్రయత్నాలతో జగన్ మీద ప్రజల్లో అసహ్యం పుట్టేలాగాచేసి ఐప్యాక్ జగన్ కొంపముంచిందని ప్రజలు అనుకుంటున్నారు. 

జగన్ మాటల్లో కనిపిస్తున్న ‘జైలుభయం’!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారా? ఈసారి జైలుకు వెళితే ఇప్పట్లో బయటకు వచ్చేది ఉండదని కూడా ఆందోళన చెందుతున్నారా? ఆయనలో ఈ జైలుభయం బాగా ఎర్లీగా స్టార్ట్ అయిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినవస్తోంది. ఆయన ఇప్పుడు జైలు జీవితం గురించి ఆందోళన చెందుతున్నారు. అసలే ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదురైంది. 151 సీట్లనుుంచి ఒక్కసారిగా 11 సీట్లకు గ్రాఫ్ పడిపోయింది. ప్రజలు తన పరిపాలనను దారుణంగా తిరస్కరించారు. ప్రజల మద్దతు లేదు. ఉద్ధండులు అనుకున్న పార్టీ నాయకులు అందరూ పరాజయం పాలయ్యారు. వారు ఎంత నిలకడగా తన వెన్నంటి ఉంటారో తెలియదు. ఇలాంటి భయాలు జగన్ ను వెన్నాడుతున్నాయి.

ఓడిపోయిన తర్వాత జగన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తన పాతరికార్డునే మళ్లీ వినిపించారు. అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు ఎన్నో వందల కోట్లు పంచిపెట్టాను. వారి ప్రేమ ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు.. అంటూ వాపోయారు. దాదాపుగా కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. ‘ఏదో జరిగింది.. కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు’ అంటూ తనను ఓడించడానికి ఏదో కుట్రలు జరిగినట్టుగా ఆయన అనుమానాలను ఇండైరక్టుగా వ్యక్తం చేశారు. ‘ఏం జరిగినా సరే, ఎంత చేసినా సరే.. నా ఓటు బ్యాంకును 40 శాతానికంటె తగ్గించలేకపోయారు’ అని కూడా జగన్మోహన్ రెడ్డి బీభత్సమైన ధీమా కూడా వ్యక్తం చేశారు.

వీటన్నింటి మధ్యలో మేకపోతు గాంభీర్యం తెచ్చిపెట్టుకుని మరికొన్ని సంగతులు కూడా చెప్పారు. ప్రతిపక్షంలో ఉండడం నాకేమీ కొత్తకాదు అని అన్నారు. నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే ఉన్నానని కూడా చెప్పారు. ఈ అయిదేళ్లు తప్ప అని క్లెయిం చేసుకున్నారు. నా రాజకీయ జీవితంలో ఎవరూ పడనటువంటి ఇబ్బందులు కూడా పడ్డాను.. అని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా తన జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. ‘అంతకంటె ఎక్కువ ఇబ్బంది పెట్టినా కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని జగన్ చెప్పుకున్నారు. అంటే.. నన్ను మళ్లీ జైలుకు పంపినా కూడా రెడీ అని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా సీబీఐ కేసులు పెండింగులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన బెయిలు మీద మాత్రమే బయటఉండి ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి బాధ్యతలు చూశారు. ఆ కేసుల్లో తీర్పు వెలువడి శిక్ష పడితే పూర్తి స్థాయిలో జైలుకు వెళ్లాల్సిందే. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి హోదాలో, ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీ నాయకుడిగా.. ఢిల్లీలో మోడీని ఆశ్రయించి.. తన కేసుల విషయంలో శిక్ష పడకుండా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయబలం దారుణం అయిపోయింది. మోడీ పట్టించుకుంటాడనే గ్యారంటీ లేదు. అదే సమయంలో.. తాను అధికారంలో ఉండగా.. చంద్రాబబునాయుడును అకారణంగా జైల్లో పెట్టించి వేధించిన వైనం ఆయననే వెన్నాడుతుంటుంది. చంద్రబాబునాయుడు కక్షసాధించదలచుకుంటే తనకు జైలుజీవితం తప్పదని ఆయన అనుకుని ఉండొచ్చు. అందుకే జైలు జీవితం గురించిన భయాన్ని ఇండైరక్టుగా వెలిబుచ్చారని ప్రజలు భావిస్తున్నారు. 

Chandrababu Likely To Take Oath As CM Fourth Time On June 9

Celebrations broke out in the Telugu Desam Party  (TDP) camp as the tripartite alliance headed by the party is set to form the government in Andhra Pradesh with a thumping majority.

After getting a massive mandate in the assembly polls that no other party witnessed even during the combined Andhra Pradesh after independence, TDP workers began bursting firecrackers and distributing sweets.

A festive atmosphere was prevailing at the TDP headquarters as the leaders and workers joined the celebrations. TDP chief Nara Chandrababu Naidu remained the center of attraction both in state politics and also in national politics after these results. He  is likely to take oath as the new chief minister of Andhra Pradesh for the fourth time on June 9, party sources said.

In the history of Andhra Pradesh till now no one took oath as Chief Minister four times. He is the longest serving Chief Minister of the combined state also. While TDP has won a record number of 135 seats, its allies Jana Sena winning all 21 seats emerged as the second largest party in the assembly. Another ally BJP has won 8 out of 10 seats it contested.

Chief Minister YS Jaganmohan Reddy, who claimed `why not 175’ indicating his ambition of `no opposition assembly’ like in Nagaland, was finished to 11 seats even forgiving a chance to claim as a recognised opposition leader.

Except Peddireddi Ramachandra Reddy, all other ministers in his cabinet were defeated. In eight erstwhile combined districts, the party failed to open its account. Even in his fortress Rayalaseema region it fared very badly. In his own Kadapa district he was confined to three seats.

Apart from forming his government later this week, Chandrababu Naidu is also now to play a key role in the formation of the NDA government at the center after BJP failed to get a majority of seats on its own. He will be participating in the NDA meeting later on Wednesday.

వన్ అండ్ ఓన్లీ ‘100%’ హీరో పవన్ కల్యాణ్!

ఆయన పార్టీ పెట్టి పదేళ్లు అయింది. తొలిసారి ఎన్నికలు వచ్చినప్పుడు అసలు సమరాంగణంలోకి తన పార్టీని తీసుకురాలేదు. కూటమి పార్టీల్లో భాగస్వామిగా కష్టపడ్డారు. రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు.. పార్టీని ఒంటరిగా బరిలోకి దించి భంగపడ్డారు. చిన్న పార్టీతో పొత్తు పెట్టుకుని 175 స్థానాల్లో పోటీచేస్తే కేవలం ఒక్కచోట పార్టీ గెలిచింది. ఆ గెలిచిన వంచించి పార్టీ ఫిరాయించాడు. పార్టీ శ్రేణులు మరీ డీలాపడ్డాయి. కానీ ఆయన మాత్రం మడమ తిప్పలేదు. పార్టీని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే కట్టుబడ్డారు. ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేయడాన్నే అలవాటుగా మార్చుకున్నారు. మొత్తానికి మూడోసారి ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. పార్టీని పోటీచేయించారు. ఈసారి ఎన్నికలు ఆయనకు రాష్ట్రం కనీవినీ ఎరుగని రికార్డును కట్టబెట్టాయి. చరిత్రలో ఎవ్వరూ చేయనివధంగా వందశాతం సక్సెస్ సాధించారు. ఆ రకంగా వన్ అండ్ ఓన్లీ హీరో ఇన్ ఏపీ పాలిటిక్స్ అన్నట్టుగా పవన్ కల్యాణ్ నిలిచారు.

పవన్ కల్యాణ్ పార్టీ జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీచేసింది.. మొత్తం 21 మందీ గెలిచారు. అలాగే 2 ఎంపీ స్థానాల్లో పోటీచేయగా ఇద్దరూ గెలిచారు. నూటికి నూరుశాతం విజయాలు నమోదు చేసిన పార్టీగా పవన్ కల్యాణ్ ఏపీ చరిత్రలో రికార్డు సృష్టించారు. చరిత్రలో ఎక్కడైనా పొత్తుల్లో ఒకటిరెండు స్థానాలు పుచ్చుకుని, ఆ రెండు చోట్ల గెలిచిన పార్టీలు ఉండవచ్చు. కానీ ఇంత పెద్దసంఖ్యలో సీట్లలో పోటీచేసి నెగ్గడం చిన్నవిషయం కాదు.
ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ విజయం పవన్ కు ఆషామాషీగా ఏం దక్కలేదు. అందుకు ఆయన చాలా కష్టపడ్డారు. తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమైనప్పుడు.. పార్టీ శ్రేణులు చాలా పెద్ద ఆశలే వ్యక్తం చేశాయి. కానీ తొలుత పవన్ 30 సీట్లకు ఒప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ మాత్రం సీట్లు తీసుకున్నందుకే విమర్శలు వచ్చాయి. ఆయనను పలువురు ఎద్దేవాచేశారు. ఇంతలో కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చిన తర్వాత.. వారికి దక్కిన 10 సీట్లను పవన్ కల్యాణ్ తన వాటా నుంచే ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి ఫైనల్ గా 21 స్థానాలు మాత్రమే దక్కాయి. చాలా మంది ఎగతాళి చేశారు. కానీ పవన్ ఎక్కడా రెచ్చిపోకుండా, అవమానం ఫీల్ కాకుండా ఉన్నారు. ఆయన తెలివితేటలు ఏంటంటే.. కచ్చితంగా తమ పార్టీకి బలం ఉన్న స్థానాలను మాత్రమే ఎంచుకున్నారు. వాటికోసం పట్టుబట్టి తీసుకున్నారు. ఆ ఫలితంగానే మొత్తం అన్ని స్థానాల్లోనూ విజయం సాధించారు. వన్ అండ్ ఓన్లీ హీరోగా గెలవగలిగారు.