Home Blog Page 828

Kamal Haasan’s Comments On Hooch Tragedy Draws Criticism

Universal Actor Kamal Haasan has landed in a controversy for his foot-in-mouth remarks after visiting the victims of the hooch tragedy which took away the lives of nearly 50 people and left several hospitalized in Kallakurichi, Tamil Nadu. Kamal spoke to the media after coming out of the government hospital in Kallakurichi and his irresponsible comments on the tragedy resulted in huge backlash from all quarters. 

Instead of holding the government responsible for the hapless incident, Kamal said the victims were careless and exceeded their limit which is the reason for the tragedy. He said tipplers should be careful and drink occasionally, but not regularly. He further said that the government should establish psychiatric centres to counsel drunkards over the ill effects of drinking. 

Kamal also said that exceeding the limit in any form be it sugar or anything is bad. These remarks from the MNM party chief are met with sharp criticism from both the political circles and common people. 

Many are pointing out that Kamal Haasan has got no guts to hold the DMK government under MK Stalin responsible for not cracking down on illicit liquor which is prevalent throughout the state. Some even said that Kamal’s scant knowledge on social issues is another reason why he failed as a politician.

It is a known fact that Kamal Haasan’s party lost deposit in all seats it contested in the 2019 assembly and parliament elections.

Andhra Pradesh First Cabinet Meeting Today

The first cabinet meeting of the newly formed government in Andhra Pradesh will take place on Monday in the state secretariat in Velagapudi. Chief Minister and TDP president Nara Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan will preside over this meeting which will see the presence of all cabinet ministers who recently assumed charge of their respective ministries after allotment of portfolios.

The cabinet is likely to discuss various key aspects relating to the state. The roadmap for implementation of key poll promises like ‘Super Six’ schemes is going to be the main agenda for this meeting. The cabinet will come up with a rough estimation of the requisite budget to roll out all cash transfer schemes and other welfare measures. 

It is known fact that Chandrababu Naidu has signed files relating to Mega DSC, ban on Land Titling Act, Rs 4000 pension, opening of Anna Canteens and Skill Census implementation immediately after taking charge as Chief Minister few days ago. Now, the cabinet will discuss about implementation of all these promises immediately. 

Moreover, the cabinet is going to take a decision on the release of white papers on the facts and figures of all key ministries and its departments. Also, the funds required for construction of capital and Polavaram project are likely to come up for discussion in the meeting. 

Further, the cabinet will discuss about the budget sessions which are going to take place in July.

హఠాత్తుగా ‘అందరివాడు’ అయిపోయిన జగన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణాతిదారుణంగా ఓడిపోవడం అనేది.. బహుశా ఆ పార్టీలోని ఎమ్మెల్యే స్థాయి గల కొందరు నాయకులకు ఒక రకమైన విచిత్రానందాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. సొమ్ములు ఎటూ పోనాయి.. కనీసం ఆ రకమైన ఆనందం దక్కుతోందని వారు మురుస్తుండవచ్చు. ఇంతకూ ఆ ఆనందం ఏమిటో తెలుసా? ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్మోహన్ రెడ్డి.. తమ వంటి నాయకులు వెళితే కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తున్నారనేదే! అయిదేళ్లపాటూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కన్నూమిన్నూ గానకుండా అహంకారంతో ప్రవర్తించిన తమ పార్టీ అధ్యక్షుడు.. ఇప్పుడు కలవదలచుకున్నప్పుడు యాక్సెసిబుల్ గా ఉన్నారని వారు ఆనందిస్తున్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదు కదా.. కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని బాగా పేరొచ్చింది. ఒకరిద్దరు కాదు.. పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు ఇదే సంగతి చెప్పారు. నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడానికి కూడా తమకు అవకాశం దొరకడం లేదని పలు సందర్భాల్లో వాపోయారు. అపాయింట్మెంట్ దగ్గర మొదలైన గొడవే రఘురామక్రిష్ణ రాజు విషయంలో ఎన్నెన్ని మలుపులు తిరిగిందో కూడా అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. జగన్ హఠాత్తుగా అందరివాడుగా మారిపోయారు.

తొలిరోజు అసెంబ్లీలో ప్రమాణం చేసేసి నిమిషమైనా సభలో ఉండకుండా ఇంటికి పారిపోయిన జగన్.. మరురోజు అసెంబ్లీ వైపే చూడకుండా పులివెందులలో తేలారు. రెండు రోజులుగా ఆయన నియోజకవర్గ ప్రజలతో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ప్రజాదర్బార్ జరుగుతందట. కడప జిల్లా, ఇరుగు పొరుగు  జిల్లాల్లోని అనేకమంది పార్టీ నాయకులు వచ్చి జగన్ ను కలుస్తున్నారు. అందరికీ అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి. అందరితోనూ ముచ్చటపెడుతున్నారు. జగన్ పాలనలో పనులు చేసిన సొంత పార్టీ కాట్రాక్టర్లకు కూడా బిల్లుల చెల్లింపు జరగలేదు. జగన్ హయాంలో బిల్లుల చెల్లింపు అనేది సొంత పార్టీలోని కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం అయిందని కూడా విమర్శలున్నాయి. అలాంటి వారందరూ కూడా వచ్చి జగన్ తో మొరపెట్టుకుంటూ ఉంటే ఆయన వారికి సర్ది చెప్పి పంపుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా, బటన్లు నొక్కడానికి ఒక్కో ఊరిలో సభ పెట్టినప్పుడు.. పరదాలు కట్టుకుని, చెట్లను నరికి, దుకాణాలు మూయించి.. జనాలను ఆయన సమీపానికి కూడా రానివ్వనంత భద్రత మధ్య బతికారు. ఓడిపోయిన తర్వాత హఠాత్తుగా అందరివాడు అవతారం ఎత్తి.. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా సభకు కూడా వెళ్లకుండా పులవెందుల ప్రజలకు ఏం చేయగలనని ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారో తెలియదు గానీ, నాయకుడు యాక్సెసిబుల్ గా మారడం మంచి పరిణామం అని వైసీపీ నేతలు లోలోన ఆనందిస్తున్నారు. 

వంగలపూడి అనిత మాట ఆదర్శం కావాలి!

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనిత తిరుమలలో చెప్పిన ఒక మాట అందరికీ ఆదర్శంగా నిలిచే మాట. తిరుమలలో విలేకరులు చాలా సహజంగా వంగలపూడి అనితను కలిసి చాలా విషయాల మీద ఆమె అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరారు. ఇందకు జవాబుగా.. అనిత.. తాను దైవదర్శనానికి వచ్చానని.. తిరుమలలో సాంప్రదాయాలు మాత్రమే పాటిస్తానని.. అంతేతప్ప ఇక్కడ రాజకీయాలు మాట్లాడబోనని అనిత ఒక్కమాటలో తేల్చేశారు.

నిజం చెప్పాలంటే అనిత చెప్పిన ఆ ఒక్క మాట తిరుమలకు వచ్చే ప్రతి నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో.. తిరుమల పవిత్రతను ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా భ్రష్టుపట్టించారు. ఆ క్రమంలో తిరుమలలో అనుచితమైన రీతిలో రాజకీయ విషయాలు మాట్లాడడం కూడా ఒకటి. ప్రతినెలా ఒక గుంపును తనతోపాటూ ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలకు తీసుకు వెళ్లే అలవాటు ఉన్న రోజా వంటి వారైతే.. దర్శనం పూర్తిచేసుకుని బయటకు రాగానే.. మీడియా వాళ్లు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కునేవాళ్లు. జగనన్న పరిపాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నా అనే పడికట్టు డైలాగుతో ప్రారంభించి.. చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను, నారా లోకేష్ ను అత్యంత లేకి పదజాలంతో తిట్టిన తర్వాత.. అక్కడినుంచి తిరిగి వెళ్లేవారు కాదు.

వైసీపీకి చెందిన ప్రతినాయకుడూ గుడిలోకి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం.. బయటకు వచ్చి జగన్ భజన చేయడం ఒక సాంప్రదాయంగా మార్చుకున్నారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా మహిళకు వీడియో కాల్ చేసి మాట్లాడిన వీడియో లీక్ అయినప్పుడు.. ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమలలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. సదరు నగ్న సంభాషణల ఎంపీ గోరంట్ల మాధవ్ చర్యలను సమర్థిస్తూ బరితెగించి మాట్లాడారు. తిరుమల పవిత్రతను ఆయన ఆ రకంగా కూడా భ్రష్టు పట్టించారు. అయితే తిరుమలలో నాయకులు ఎలా ప్రవర్తించాలో ఒక ప్రమాణాలు సెట్ చేసేలాగా.. హోం మంత్రి వంగలపూడి అనిత తిరుమలకు దైవదర్శనార్థం వచ్చానని.. ఇక్కడి సాంప్రదాయాలు పాటిస్తానే తప్ప.. రాజకీయాలు మాట్లాడనని తెగేసి చెప్పారు. నాయకులందరూ కూడా తిరుమల వచ్చినప్పుడు అనిత మాటలను ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. 

కన్నప్ప సినిమాలో మరో స్టార్‌ హీరో!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న, తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌,  లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు ఎంతో కష్టపడుతున్నాడు. అయితే, ఈ సినిమాలో తాజాగా మరో సౌత్ హీరో కూడా కనిపించబోతునట్లు సమాచారం. తమిళ హీరో శింబు కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

కొన్ని సీన్స్ లో మాత్రమే శింబు పాత్ర ఉంటుందట. మరి ఈ వార్తలో ఎలాంటి వాస్తవం ఉందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ బాగా ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలను పెంచింది. ఈ సినిమాలో  ప్రీతి ముకుందన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు

ఓవర్‌ చేయకురోయ్‌..నీ దిష్టే తగిలేలా ఉంది!

టాలీవుడ్‌ మాస్ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌- మాస్‌ మహారాజా రవితేజల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజకు ఇండస్ట్రీలో మంచి హిట్లను ఇచ్చిన వారిలో హరీష్‌ కూడా ఒకరు. తాజాగా హరీష్‌ , రవి కాంబోలో మూడో సినిమాను చేయబోతున్నారు.

‘మిస్టర్’ బచ్చన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చాలా స్పీడ్‌ గా షూటింగ్ జరుపుకుంటోంది.  కాగా ఈ మూవీకి సంబంధించి హరీష్ శంకర్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉన్నాడు. ఈక్రమంలోనే తాజాగా మిస్టర్ బచ్చన్  సాంగ్ షూటింగ్ లో రవితేజని ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి.” ప్రపంచంలో అందరికీ వయసు వస్తుంది.కానీ అన్నయ్యకి తప్ప. కాశ్మీర్ వ్యాలీలో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హైదరాబాద్ లో దిగుతాం” అంటూ మిస్టర్ బచ్చన్ సినిమా అప్డేట్ ఇస్తూ ఓ వార్తను షేర్ చేశాడు.

అయితే హరీష్ శంకర్ ట్వీట్ కి తాజాగా రవితేజ రిప్లై ఇస్తూ..’ ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు. దీంతో రవి ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్, రవి అభిమానులు వీళ్లిద్దరి బాండింగ్ పై కామెంట్లు పెడుతున్నారు. అజయ్ దేవగన్ ‘రైడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా టైం కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మెగా కంపౌండ్‌ నుంచి గుడ్‌ న్యూస్‌..కొత్త..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు. తాజాగా తన కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేశాడు. గత సంవత్సరం విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్న తేజ్‌ …ఇప్పుడు మరో కొత్త స్పెషల్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
 దీనికి SDT18 అనే వర్కింగ్ టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ రోహిత్‌ కేపీ తీర్చిదిద్దుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ SDT18 పోస్టర్ ను మూవీ మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.  హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన కెరీర్ లో ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండబోతున్నట్లు అన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న SDT18 తొలిషెడ్యూల్‌ ప్రారంభమైనట్లు సమాచారం.

Tollywood Bigwigs To Meet Dy. CM Pawan Kalyan

Tollywood heaved a sigh of relief with the change of guard in Andhra Pradesh. This is primarily because of the hurdles created by the previous government led by YS Jagan Mohan Reddy in the name of restrictions over the number of shows and ticket prices for big-budget films in Andhra Pradesh in the last five years. 

Despite efforts from Chiranjeevi, Mahesh Babu, Rajamouli, Prabhas and others, Jagan went ahead with his punitive measures whenever big-ticket films released. Due to this, the whole film industry backed Pawan Kalyan and Chandra Babu Naidu in these elections. 

Now that the NDA alliance has come to power with a thumping majority, the film industry is in a happy space. As a sizeable chunk of the total revenues for high-budget films is recouped from Andhra Pradesh, top producers in Tollywood are hoping that the new dispensation will offer good support in the next five years. 

Tollywood is very optimistic because top-tier actor Pawan Kalyan is a key player in the current regime. Moreover, Janasena MLA Kandula Durgesh has been handed over to the cinematography ministry which looks after the welfare of films. 

As per the latest reports, Tollywood’s top producers like Ashwini Dutt, Dil Raju, China Babu, Naga Vamshi, TG Viswa Prasad, Damodar Prasad, BVSN Prasad, DVV Danayya and others are going to meet Deputy CM Pawan Kalyan on Monday. 

The group of producers representing Tollywood is likely to request Pawan Kalyan to sort out the ongoing issues relating to flexibility in prices, allowing to screen more number of shows and resolving single theatre issues etc. 

The outcome of this crucial meeting will be revealed tomorrow evening. 

Mayawati Reinstates Nephew Akash Anand As Her Successor

Weeks after the party failed to win a single seat in the Lok Sabha polls, Bahujan Samaj Party (BSP) chief Mayawati Sunday reinstated her nephew Akash Anand as both her political heir and the party’s national coordinator.

This decision was taken at a meeting held in Lucknow to review the party’s poor performance in the 2024 elections, the BSP’s national general secretary Mevalal Gautam confirmed. All national office-bearers and leaders of the party from all states including Anand were said to be present.

Significantly, this comes after the BSP chief Mayawati has removed his nephew Akash Anand earlier in May — as BSP’s National Coordinator and her successor, while terming him immature.

Taking to social media platform X, Mayawati wrote, “I declared Akash Anand as the National Coordinator of BSP and my successor, but in the larger interest of the party and the movement, he is being separated from both these important responsibilities until he attains full maturity”.

He was removed from the post after being booked by the Sitapur police in Uttar Pradesh for allegedly promoting hatred and enmity, among other charges under sections of the Indian Penal Code and the Representation of the People Act.. The charges followed an election rally in which he was heard calling the BJP government “gaddaron ki sarkar” (a government of traitors).

Significantly, in the 2024 polls held, the BSP, which contested alone this time, could not win a single seat as compared to its 2019 Lok Sabha election performance, where Mayawati formed an alliance with Akhilesh Yadav and won ten seats. In terms of voting percentage, the party played fairly poorly.

Congress contested only 17 seats in UP, won six seats, and got 9.46 percent of the votes. BSP contested on all 80 seats, did not win a single seat, and the party got only 9.19 percent of the votes. The BSP fielded candidates in 424 Lok Sabha seats across the country, including 79 in UP, and none of them won.

ఈ కుట్ర ఎక్కడ పుట్టిందో నిగ్గు తేల్చాలి!

సాధారణంగా రాజకీయ నాయకులు తమ గురించి, తమ పార్టీ గురించి ఏదైనా దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరిగితే సీరియస్ గా తీసుకుంటారు. వాటి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అధికార పార్టీ మీద సోషల్ మీడియాలో అలాంటి తప్పుడు ప్రచారం జరిగితే గనుక వారి మీద అనేక రకాల కేసులు బనాయించి చిత్రవధకు గురి చేయడం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాం. సోషల్ మీడియా లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టేవారిని వేధించడానికి జగన్ సర్కారు ప్రత్యేక చట్టాలు తెచ్చింది కూడా! అయితే కేవలం రాజకీయ దూషణలు విషయంలో మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే ప్రతి సందర్భంలోనూ కొరడా ఝులిపించడం అవసరం.

తిరుమల తిరుపతి దేవస్థానాల గురించిన అసత్య ప్రచారం చాలా సీరియస్ విషయం. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది హిందూ భక్తుల నమ్మకాలను ప్రభావితం చేసే దుష్ప్రచారం ఇది. తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలు 300 నుంచి 200 కు తగ్గించారని, అదనపు లడ్డూల ధర 50 నుంచి 25 కు తగ్గించారని సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. టీటీడీ ఈ ప్రచారాన్ని ఖండించింది. అలాంటి ఆలోచన లేదని తెలిపింది. అక్కడితో ఈ వివాదం సమసిపోయింది. అక్కడితో ప్రభుత్వం ఊరుకోకూడదు.

అసలు ఇలాంటి కుట్ర ప్రచారం ఎక్కడ పుట్టిందో పోలీసులు కనిపెట్టాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి జరిగిన కుట్ర. ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను మొగ్గలోనే తుంచేయకపోతే చాలా ప్రమాదం. అందుకే తిరుమల గురించి తప్పుడు ప్రచారాలను పుట్టించిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి.