Home Blog Page 791

 Epic Success: Kalki 2898 AD Nears Rs. 1000 Crore Mark

The globally acclaimed actor Prabhas and visionary director Nag Ashwin have struck gold with their latest epic, *Kalki 2898 AD*. This cinematic masterpiece has taken the box office by storm, raking in a staggering Rs. 950 crores globally in just 11 days and is set to break the Rs. 1000 crore barrier. Fans and critics alike are buzzing with excitement, speculating if it will outshine SS Rajamouli’s *RRR* in lifetime collections.

Boasting a star-studded cast that includes legends like Amitabh Bachchan, Deepika Padukone, Kamal Haasan, Rajendra Prasad, Disha Patani, Saswata Chatterjee, Brahmanandam, Anna Ben, Shobana, Mrunal Thakur, Dulquer Salmaan, Vijay Deverakonda, and Ram Gopal Varma, this film is a powerhouse of talent. Produced with a lavish budget by Vyjayanthi Movies and featuring an electrifying score by Santhosh Narayanan, *Kalki 2898 AD* is a cinematic spectacle you won’t want to miss.

నోరు పారేసుకోకు…నెక్ట్స్‌ జైలుకు నువ్వే!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా జనంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.  జగన్ లాగా చంద్రబాబు నాయుడు ప్యాలెస్ లకు పరిమితం కాలేదు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జనంలోనే ఉంటూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం సమావేశం అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్ని విధాలుగా నాశనం అవ్వాలో అన్ని విధాలుగా సర్వ నాశనం అయిందని విమర్శలు గుప్పించారు. ఐదేళ్ళలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దోచుకున్నది బయటపెడతానని.. చంద్రబాబుపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. కాకాణి గోవర్దన్ రెడ్డి చేసిన అవినీతి గురించి తీస్తే వారానికి ఒక సీరియల్ లా వస్తాయిని.. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి  తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.

ఇక నుంచి ఏపీలో ఆ విధానం రద్దు…!

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే 2024 ఇసుక విధానం రూపకల్పన చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

2019, 2021 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఉచిత ఇసుక సరఫరాపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ను విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో వెల్లడించారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు చేసింది ప్రభుత్వం.49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం వివరించింది.  డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్దారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించనున్నారు.

తమరికి అర్థం కాకపోతే వింతేముంది అంబటీ!

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు జరిగిందో గౌరవనీయ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి అర్థం కావడం లేదుట. ఈ సమావేశం గురించి వారికి వివరణ ఇవ్వాలిట. అయినా ఇద్దరు సీఎంల భేటీ ఎందుకు జరిగిందో తనకు అర్థమవుతుందని అంబటి ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. రెండేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి కూడా.. పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కాలేదని చెప్పిన మేథావికి.. ఈ భేటీ ఎలా అర్థమవుతుంది.. అని ప్రజలు అంబటిపై జోకులేసుకుంటున్నారు.

అంబటి తన జ్ఞానం ప్రదర్శించడాన్ని అక్కడితో ఆపడం లేదు. అంతకుమించి అతిశయమైన మాటలు మాట్లాడుతున్నారు. కృష్ణా జలాల నీటి పంపకాల అంశాన్ని తేల్చలేదని అంబటి అంటున్నారు. ఈ భేటీ కేవలం విభజన చట్టం ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటుచేసిన భేటీ అని ముందునుంచి ప్రకటిస్తూనే వస్తున్నారు.

ఆ సమస్యలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క భేటీతో తేలిపోయేవి కాదు. అయిదేళ్లపాటు పరిపాలన చేసి అసలు ఇలాంటి ప్రయత్నమే చేయని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుచరుడైన అంబటి రాంబాబు ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకోగలరని అనుకోవడం భ్రమ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమస్యలేమీ తేలకుండానే.. హైదరాబాదు లోని ఉన్న ఆస్తులు, సెక్రటేరియేట్ లో వాటాలను తెలంగాణ రాసిచ్చేసిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచర దళాలకు.. అసలు చంద్రబాబునాయుడు- రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం గురించి మాట్లాడే హక్కే లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇద్దరు సీఎంల భేటీ.. చాలా చక్కగా మూడంచెల్లో సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేదు. అయితే.. అంబటి మాత్రం లేని వివాదాల్ని బూచిలా చూపించే ప్రయత్నంలో ఉన్నారు.

బహుశా వైసీపీ వాళ్లే కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి, పెయిడ్ కథనాలు వేయించారేమో తెలియదు గానీ.. టీటీడీ ఆస్తుల్లో, బోర్డు పదవుల్లో, ఆదాయంలో తెలంగాణ వాటా కోరుతున్నదని, సముద్ర తీరంలో వాటా కోరుతున్నదని, పోర్టుల్లో వాటా కోరుతున్నదని రకరకాల గాలి కబుర్లను పోగేసి.. వాటికి చంద్రబాబు నాయుడు వివరణ చెప్పాలని అడగడం.. ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

గేమ్‌ ఛేంజ్‌ అవ్వబోతుంది..చరణ్‌ నుంచి క్రేజీ పోస్ట్‌!

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ మైలురాయికి గుర్తుగా, రామ్ చరణ్ ఈ ఉదయం ఓ ఇన్‌ స్టా స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. చరణ్ హెలికాప్టర్ల వైపు నడుస్తున్న రెండు చిత్రాల కోల్లెజ్‌ను పోస్ట్ చేశారు, ఒకటి సినిమాలోనిది కాగా, మరొకటి చిత్రీకరణ పూర్తయిన తర్వాత తీసిన పిక్. పైగా ఈ పిక్స్ కింద “గేమ్ మారబోతోంది” అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.

అదేవిధంగా, ‘మా “గేమ్‌ఛేంజర్” చరణ్ సినిమా షూటింగ్ మొదటి రోజు నుండి చివరి వరకు సాగిన మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ. తాజాగా షూటింగ్ ముగిసింది. త్వరలో కొన్ని సాలిడ్ అండ్ క్రేజీ అప్‌డేట్‌లను మీ ముందుకు తీసుకువస్తున్నాము’ అంటూ చిత్రబృందం కూడా ఒక పోస్ట్ పెట్టి తెలిపింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా యాక్ట్‌ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో  అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

స్పిరిట్‌ మూవీ లో ప్రభాస్ ఆ పాత్ర చేయబోతున్నాడా!

సెన్సేషనల్‌ హిట్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ లో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. మరోవైపు ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పాత్ర పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

ఈసినిమాలో పవర్ ఫుల్ మాఫియా డాన్ గా ప్రభాస్ పాత్ర ఉండబోతోందని, ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని సమాచారం. అలాగే, ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారని.. అందులో ఒకటి పక్కా మాస్ లుక్‌ అని, ఆ లుక్ లో ప్రభాస్ నిజంగా ప్రేక్షకులకు షాక్ ఇస్తాడని మూవీ మేకర్స్‌ అంటున్నారు.

పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ తో ప్రభాస్ సరికొత్త గెటప్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడంట. అదేవిధంగా ప్రభాస్ రెండో లుక్ సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని సమాచారం.. అన్నట్టు ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉండనుందంట. ఇప్పటికే, 80 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

Hemant Soren Govt wins Trust vote In Jharkhand Assembly

Jharkhand Chief Minister Hemant Soren, who took the oath of office for the third time on July 4, won a vote of confidence in the 81-member Jharkhand Assembly on Monday. The new chief minister was supported by 45 MLAs.   

The current strength of the Jharkhand Assembly is 76. The ruling JMM-Congress-RJD alliance presented a support list of 44 MLAs to the Governor when Hemant Soren staked his claim to form the government on July 3.

JMM, Congress, and RJD legislators had expressed confidence in successfully passing the floor test, but the BJP argued that it would not be easy. BJP and AJSU legislators walked out of the House as the headcount for voting started. The BJP-led opposition has 24 legislators of the saffron party and three of the AJSU Party.

Earlier, BJP legislators trooped into the well seeking Speaker Rabindra Nath Mahto’s permission to allow MLA Bhanu Pratap Sahi to speak, which was turned down by the Speaker.

Hemant Soren was released from jail on June 28 after the High Court of Jharkhand granted bail to him in a money laundering case linked to an alleged land scam. He had resigned as the CM shortly before his arrest on January 31 by the Enforcement Directorate.

The ruling alliance comprises the JMM, Congress and the RJD while it is supported from outside by the lone CPI (ML) Liberation legislator. After the Lok Sabha elections, the strength of the JMM-led alliance has been reduced to 45 MLAs in the 81-member House, with 27 of the Jharkhand Mukti Morcha, 17 of the Congress and one of the Rashtriya Janata Dal.

Similarly, the BJP’s strength in the assembly has reduced to 24, as two of its MLAs  Dhulu Mahto (Baghmara) and Manish Jaiswal (Hazaribag)  are now MPs. The saffron party expelled Mandu MLA Jaiprakash Bhai Patel after he joined the Congress.

ఆయన దగ్గర కంట్రోల్డ్‌ పవర్‌ ఉంది!

సెన్సేషనల్ కాంబో అయిన కమల్ హాసన్, శంకర్ ల తాజా చిత్రం భారతీయుడు 2, జులై 12 వ తేదీన ఈ సినిమా విడుదలకు రెడీ గా ఉంది. ఈ చిత్రానికి కి సంబందించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే వేగవంతంచేయడం జరిగింది. అందులో భాగంగానే ఆదివారం తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. డైరెక్టర్ శంకర్ ఈ ఈవెంట్ లో పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

మాకు సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియెన్స్ కోసం స్ట్రెయిట్ పిక్చర్ చేయాలని అనిపించింది, గేమ్ చేంజర్ ద్వారా ఆ అవకాశం దొరికింది అని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ పోర్షన్ పూర్తయ్యింది. ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు, ఆయన దగ్గర ఓ కంట్రోల్డ్ పవర్ ఉంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అనే మంచి యాక్టర్.

సినిమా చూస్తే మీకు ఎలాగూ ఈ విషయం అర్థం అవుతుంది.రామ్ చరణ్ తో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా 10-15 రోజుల షూటింగ్  మాత్రమే మిగిలి ఉంది. తర్వాత విడుదలకి రెడీ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్ చేసిన కామెంట్ల తో గేమ్‌ ఛేంజర్‌ సినిమా పై అందరిలో మరింత ఆసక్తి నెలకొంది.

చారులత వచ్చేసింది!

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని యాక్ట్‌ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ”సరిపోదా శనివారం”. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది, ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ గరం గరంకు విశేషమైన స్పందన వచ్చింది. నాని సెకండ్ లుక్ పోస్టర్ రివీల్ అయిన తర్వాత, చిత్ర బృందం చిత్ర కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానుల ముందుకు తీసుకుని వచ్చింది.

ఈ పోస్టర్‌లో, ప్రియాంక చారులత అనే పోలీసు పాత్రలో కనిపిస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఎస్‌జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నసంగతి తెలిసిందే. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సరిపోదా శనివారం ఆగస్ట్ 29, 2024న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

నా పెళ్లాం బెల్లం రా అంటున్న ప్రియదర్శి..డార్లింగ్‌!

టాలీవుడ్‌ యంగ్‌ నటుడు, మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న యాక్టర్‌ ప్రియదర్శి ప్రధానపాత్ర లో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తన సెన్సేషనల్ హిట్ చిత్రం “బలగం” తర్వాత మరిన్ని మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ హీరో అలాగే యంగ్ హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన తాజా చిత్రమే “డార్లింగ్”.

మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే నభా నటేష్ రోల్ పై ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చిన చిత్ర బృందం ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఆమె సైడ్ నుంచే సినిమాలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని తాజా ట్రైలర్ లో చూస్తే తెలిసిపోతుంది. అపరిచితుడు తరహాలో ఒకే మనిషిలో మరికొన్ని పర్సనాల్టిస్ ఉంటే… ఆ మనిషి అమ్మాయి అయ్యి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని భార్యతో పారిస్ వెళ్ళాలి అని కోరుకుంటున్న యువకుడుకి తగిలితే ఎలా ఉంటుంది… అనే ఫన్ లైన్ తో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని చిత్ర బృందం అందించేందుకు రెడీ అవుతుంది.

మరి ఈ ట్రైలర్ లో నభా అయితే అదరగొట్టేసింది అని చెప్పుకోవాల్సిందే. అలాగే ప్రియదర్శి కూడా తన మార్క్ టైమింగ్ లో కనిపిస్తున్నాడు. ఇంకా ట్రైలర్ లో వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా చాలా బాగుందనే చెప్పుకోవాలి. మరి ఈ ఎంటర్టైనర్ ని “హను మాన్” నిర్మాతలు నిర్మాణం వహించగా ఈ జులై 19న సినిమా విడుదలకు రెడీ అవుతుంది.