Home Blog Page 772

మరీ కామెడీగా ఉన్న పిన్నెల్లి బొంకులు!

వినేవాడు ఎప్పుడూ చెప్పేవాడికి లోకువ అని సామెత. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు, సీఐ మీద హత్యాయత్నం చేసిన కేసుల్లో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.. పోలీసుల విచారణలో, ఇదే తరహాలో, తలాతోకాలేని సమాధానాలు చెబుతున్నారు. ఆయనను రెండురోజుల పోలీసు కస్టడీకి హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మాచర్ల పోలీసులు వెళ్లినప్పుడు తొలుత లోపలకు రానివ్వకుండా బయటే ఉంచేసిన జైలు అధికారులు, మళ్లీ కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత అనుమతించారు. మొత్తానికి పిన్నెల్లిని పోలీసులు విచారించడం సాయంత్రం 7 వరకు సాగింది. అయితే ఆయన పోలీసుల ప్రశ్నలకు చెప్పిన సమాధానాలే కామెడీగా ఉన్నాయి. 
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి అసలు తాను వెళ్లనే లేదని, ఈవీఎంను పగలగొట్టనే లేదని, నంబూరి శేషగిరిరావు (అక్కడి తెదేపా ఏజంటు, ఎమ్మెల్యే దాడికి గురైన వ్యక్తి) ఎవరో తనకు తెలియనే తెలియదని.. విచ్చలవిడిగా పిన్నెల్లి పోలీసులతో అబద్ధాలు చెప్పడం గమనార్హం. తాను స్వయంగా బూత్ లోకి అనుచరుల సహా చొరబడి.. అక్కడి ఈవీఎంను దారుణంగా నేలకేసి పగలగొట్టి, రెండోసారి కూడా దాన్ని ఎత్తుకుని మళ్లీ పగలగొట్టిన వీడియో.. ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిపోయిందో స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా.. ఆ వీడియోలో తాను చాలా స్పష్టంగా కనిపిస్తున్నానని తెలిసినా కూడా.. పిన్నెల్లి అసలు పాల్వాయి గేటు వెళ్లనే లేదనే అబద్ధాలు చెబుతున్నారంటే.. అందుకు చాలా గుండె ధైర్యం, బరితెగింపు కావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 
తొలిరోజు విచారణలో పిన్నెల్లి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని వార్తలు వస్తున్నాయి. రెండోరోజు విచారణలో.. సీఐపై హత్యకు ప్రయత్నించిన కేసు గురించి పోలీసులు ఆయనను విచారించే అవకాశం ఉంది. అయితే ఆ దాడి కేసుకు సంబంధించి.. పిన్నెల్లి ఇంకెన్ని చిత్రమైన జవాబులు చెబుతారో చూడాలి. 
ఇవాళ్టి రోజుల్లో గూగుల్ ట్రాకింగ్ ద్వారా.. పాల్వాయి గేటుకు వెళ్లివచ్చిన తర్వాత.. వెళ్లలేదని చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. అంత టెక్నాలజీ పిన్నెల్లి కేసుకు అనవసరం. చాలా స్పష్టమైన.. ఈసీ ఏర్పాటుచేసిన సీసీ టీవీ ఫుటేజీ ఉంది. అందులో ఆయన ఈవీఎంను పగలగొట్టడం చక్కగా రికార్డు అయింది. ఆ వీడియో చూపించినా సరే.. పిన్నెల్లి అందులో ఉన్నది నేను కాదు నా డూప్ అని గానీ.. లేదా బాహుబలి రేంజి గ్రాఫిక్స్ తో ఏఐ టెక్నాలజీ తో ఫ్యాబ్రికేట్ చేసిన వీడియో అని గానీ చెప్తారేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

Revanth Reddy’s comments intensifies debate about Jagan’s MP aspirations

Adding fuel to the ongoing speculations about YS Jagan resigning as Pulivendula MLA and contesting as Kadapa MP, Telangana Chief Minister and PCC chief Revanth Reddy made startling comments during his speech on the eve of 75th birth anniversary ceremony of YS Rajasekhar Reddy held in Mangalagiri by Congress party president YS Sharmila. 

Revanth Reddy opened up about the ongoing rumours and stated that he will campaign every corner of Kadapa district if a by-election for the Loksabha constituency is announced in the coming days and make sure Sharmila wins it with a thumping majority. His shocking comments sparked huge debate because rumours have been making rounds that Jagan is likely to resign as MLA and contest as MP in order to checkmate Naidu in Delhi. 

He predicted that YS Sharmila will become the Chief Minister of Andhra Pradesh and Rahul Gandhi will ascend to the throne of Prime Minister in 2029 without any doubt and promised to extend full support and cooperation to increase the hold of congress in Andhra Pradesh. 

Revanth Reddy attacked Chandrababu Naidu, Pawan Kalyan and Jagan Mohan Reddy by comparing their names to BJP. He said there is no opposition party in Andhra Pradesh as all three of them have a strong nexus with the centre. 

He said Sharmila is the true successor of Rajasekhar Reddy and her hardwork will pay off one day in future. He lauded Rajasekhar Reddy’s contribution to the united Andhra Pradesh and commended his decorum and decency against opposition parties when he was in power. 

మూడు రకాలుగా చంద్రబాబుకు జననీరాజనం!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే విధానాన్ని ప్రారంభించారు. తెదేపా ప్రభుత్వం నూతన ఇసుక విధానానికి ఇంకా రూపకల్పన జరగాల్సి ఉంది. అది జరిగే వరకు ప్రస్తుతం ఇసుక నిల్వ పాయింట్లలో ఉన్న సుమారు 48 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించే ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇసుకకు ధర లేకుండా కేవలం తవ్వకానికి అయ్యే ఖర్చు, సీనరేజీ చార్జీలు, నిర్వహణ ఖర్చులు మాత్రమే ప్రజలనుంచి వసూలు చేస్తారు. మొత్తానికి జగన్ సర్కారు పాలన సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రజలకు ఊహించనంత చవకగా ఇసుక లభిస్తోంది. ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మూడు రకాలుగా ప్రజలు చంద్రబాబునాయుడుకు నీరాజనాలు పడుతున్నారు.
మొదటిది- ఇసుక ఉచితంగా ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ట్రాక్టరు ఇసుక సగటున 4-5 వేల రూపాయల ధర పలికేది. బ్లాక్ లో 6వేలకు మించి ఇసుక ట్రాక్టరు విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏడాదికి 870 కోట్లు ప్రభుత్వానికి లాభం వచ్చేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఆ మొత్తం ప్రభుత్వానికి వచ్చిన మాట నిజమే  గానీ, ఇసుక ముసుగులో ఏడాదికి యాభైవేల కోట్ల రూపాయల వరకు వైసీపీ నేతలు స్వాహా చేస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు కొత్త విధానంలో ఒక ట్రాక్టరు ఇసుక కనిష్టంగా 800 రూపాయలకే దొరికే అవకాశం ఉంటుంది. బోట్ మెన్ లో నదిలోకి వెళ్లి తెచ్చే ఇసుక విక్రయించే ప్రాంతాల్లో మాత్రం ధర ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. జగన్ పాలనలో ఇసుక ధర కంటె ఇప్పుడు దాదాపు నాలుగోవంతు ధరకే ఇసుక లభించినందుకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
రెండోది- జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. కొత్త ఇసుకవిధానం తీసుకువస్తానంటూ.. సుమారు ఏడాది పాటూ ఇసుకసరఫరాను బంద్ చేశారు. అప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం మొత్తం స్తంభించిపోయింది. భవన నిర్మాణ కూలీలుగా జీవితాలు సాగించే వారిలో వందల మంది ఆకలిచావులు చచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు అలాంటి ఘోరం చేయలేదు. కొత్త ఇసుక విధానం తేవడానికి కసరత్తు చేస్తున్నారు గానీ.. అప్పటిదాకా విక్రయాలు స్తంభించకుండా.. ఉన్న 48లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా అందించే ఏర్పాటును ప్రారంభించేశారు. 
మూడోది- జగన్ పాలన కాలంలో ఇసుక కొనుగోలుకు కేవలం నగదు చెల్లింపులు మాత్రమే ఉండేవి. డిజిటల్ పేమెంట్స్ అంగీకరించేవారు కాదు. కేవలం ఈ ఒక్క కారణం చేత.. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు సాగించిన దోపిడీని మొత్తంగా లెక్కకడితే.. ఏడాదికి 50వేల కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. అయితే.. చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక పంపిణీ విధానంలో కూడా వారు చెల్లించే కనీస చార్జీలను కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే చెల్లించే వ్యవస్థ తెచ్చారు. దీనివల్ల దోపిడీలేని పారదర్శకత పెరిగింది. 
ఈ మూడు కారణాల చేత కొత్తగా తెచ్చిన ఉచిత ఇసుక విధానం విషయంలో చంద్రబాబును ప్రజలు కీర్తిస్తున్నారు. 

Siddharth Apologizes After Comments on Telangana CM’s on Drug Awareness video

Kamal Haasan and Siddharth’s much-anticipated film “Indian 2” is set to release on July 12, with the actors actively participating in promotional events. However, during a recent media interaction, both stars were questioned about recent comments made by Telangana Chief Minister Revanth Reddy. The Chief Minister suggested that actors should make a two-minute video against drugs to qualify for increased ticket prices for their films.

In response, Siddharth made some striking remarks. “I have acted in many Telugu films,” he said. “I was the first actor in Hyderabad to pose for hoardings with a condom in my hands, promoting safe sex. I believe in taking responsibility as an actor, and we will demonstrate our commitment whenever required.”

Siddharth also criticized the Chief Minister’s approach, stating, “It’s not correct for the CM to mandate that we must do something specific to get a benefit like increased ticket prices.” His comments quickly went viral on social media, sparking a debate among netizens. Some felt it was inappropriate for Siddharth to react to the Telangana CM’s request in such a manner.

Amidst the backlash, Siddharth posted a video apologizing for his remarks. He clarified that his intention was not to criticize Telangana CM Revanth Reddy and that his words had been misunderstood. Siddharth emphasized that he and his colleagues always support anti-corruption and anti-drug initiatives.

22న ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం సాధారణ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా? కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దిగజారిపోయిన పార్టీకి సారధిగా సభలో కూర్చోవడానికి బదులు ఎమ్మెల్యేగా రాజీనామా  చేసేస్తే కాస్త పరువు దక్కుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిర్ణయం మాత్రమే కాదు. ఈనెల 22 వ తేదీన శాసనసభ సమావేశాలను నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, అదేరోజు తన పదవికి రాజీనామా చేయాలని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ మేరకు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 

జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఆయనను చూసి ఎవరైనా సరే జడుసుకు పోవాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన రాజకీయ పార్టీకి భవిష్యత్తులో అసలు నామమాత్ర అస్తిత్వం కూడా  ఉండదని పలువురు అంచనా వేస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయదలుచుకున్నారని సర్వత్రా  వినవస్తోంది.

జగన్ కేవలం 11 మంది సభ్యుల నాయకుడిగా అసెంబ్లీలోకి వెళ్లడానికి సిగ్గుపడుతున్నారు. మొహమాటపడుతున్నారు. అవమానంగా భావిస్తున్నారు. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన దుస్థితి సంప్రాప్తించినందుకు కుమిలిపోతున్నారు. అందుకే ఈ పరిస్థితుల నుంచే దూరంగా పారిపోవాలని చూస్తున్నారు.  ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాలని అనుకోవడం పట్ల అసలు సీక్రెట్ ఇదేననే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. 

ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసి,  పులివెందుల నియోజకవర్గం నుంచి తల్లి వైఎస్ విజయమ్మను లేదా భార్య భారతిని పోటీచేయిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రియమైన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉండగా.. ఆయనతో కూడా రాజీనామా చేయించి.. జగన్ కడప ఎంపీగా పోటీచేస్తారని.. ఢిల్లీ రాజకీయాలకు పరిమితం కావాలని అనుకుంటున్నాకరని కూడా సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువలా సాగుతున్నాయి. 

Dulquer Salmaan’s ‘Lucky Bhaskar’ locks festival date

After stealing hearts of Telugu moviegoers with his impressive performance in Mahanati and Sita Ramam, Malayalam heartthrob Dulquer Salmaan is gearing up to consolidate his image in Tollywood with his upcoming film Lucky Bhaskar, a heist thriller which has him playing a middle class bank employee who turns a parvenu overnight. 

As per the latest reports, the makers of Lucky Bhaskar locked September 7th as the release date. The film will have festival advantage in Telugu States as Vinayaka Chavithi falls on the same date. The shooting formalities of Lucky Bhaskar are nearing completion and the team is planning to kick start the promotional campaign very soon. 

Dulquer Salmaan took to X to announce this news. He posted “This 𝐕𝐢𝐧𝐚𝐲𝐚𝐤𝐚 𝐂𝐡𝐚𝐭𝐮𝐫𝐭𝐡𝐢, Get ready to experience #LuckyBaskhar’s unforgettable journey on the Big Screens! 💫🏦Worldwide Grand Release on 𝟕𝐭𝐡 𝐒𝐄𝐏𝐓 in Telugu, Malayalam, Tamil & Hindi Languages🤩“. 

A new poster featuring the Sita Ramam actor in a uber cool classy avatar in a retro get-up has been unveiled on this occasion. 

Happening beauty Meenakshii Chaudhary is the female lead in Lucky Bhaskar. Sensible filmmaker Venky Atluri, who delivered big hits with Tholi Prema and Sir, is aiming to score a hat-trick with this film. GV Prakash is the music composer. 

Suryadevara Nag Vamshi and Trivikram’s wife Sai Soujanya are jointly bankrolling the film. 

ఎమ్మెల్సీలపై జగన్ వక్రనిర్ణయాలకు చెక్!

జగన్మోహన్ రెడ్డి భవితవ్యం గురించి ముందే గ్రహించిన ఎమ్మెల్సీలు కొందరు.. ఎన్నికలకు పూర్వమే ఆ పార్టీని విడిచి పెట్టడం జరిగింది. అయితే.. వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ.. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారి మీద వేటు వేసేశారు. వీరిలో రెండు స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరగగా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. అయితే అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరకపోయినప్పటికీ.. వక్రపూరితంగా ఆరోపణలు బనాయించి.. వేటు వేసిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి.. జగన్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. వీరిని మండలి ఛైర్మన్ అనర్హులుగాి ప్రకటించినప్పటికీ.. ఆ స్థానాలు ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయవద్దని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జగన్ కుట్రకు ఆరకంగా బ్రేక్ పడింది. 

విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మరో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విషయంలో ఇలాంటి ఆదేశాలు వెలువడ్డాయి. 
ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘురాజు భార్య సుబ్బలక్ష్మి అక్కడ వైస్ ఎంపీపీగా ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. భార్య పార్టీ మారింది గనుక.. రఘురాజుపై కూడా పార్టీ ఆగ్రహించింది. ఆయన ఎమ్మెల్సీ స్థానానికి ఎసరు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారంటూ.. నోటీసులు ఇచ్చి అనర్హత వేటు వేశారు. 
ఇంతకూ వారు పేర్కొన్న కారణాలు వింటే నవ్వొస్తుంది. పార్టీ నాయకుల మీద విమర్శలు చేశారట. ప్రభుత్వం మీద విమర్శలు చేశారట. ఇవే కారణాలుగా వేటు వేయడం జరిగింది. ఈ తీరుపై రఘురాజు హైకోర్టుకు వెళ్లడంతో, ఆయన ఖాళీని నోటిఫై చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

అదే  మాదిరిగా ఇవాళ జంగా కృష్ణమూర్తి విషయంలో కూడా తీర్పు వచ్చింది. తనను అనర్హుడిగా చేయడంపై జంగా హైకోర్టుకు వెళ్లారు. జగన్ ద్వారా అనేక రకాలుగా నష్టపోయిన జంగా ఆ పార్టీనుంచి బయటకు వచ్చాక వేటు వేయడం జరిగింది. ఆ విషయంలో కోర్టుకువెళ్లగా ఆయన స్థానాన్ని కూడా నోటిఫై చేయవద్దని ఈసీకి ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి తనను ధిక్కరించిన మండలిలోని సభ్యులపై వేటు వేయించడానికి జగన్ ఎంచుకున్న వక్రమార్గాలు కూడా ఫలించడం లేదు. 

ఏపీ ప్రజల్ని రంజింపజేస్తున్న రేవంత్ జోకులు!

‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాడట వెనకటికి ఒక మహాప్రబుద్ధుడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కూడా అదేవిధంగా కనిపిస్తోంది. ఏదో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభను కాస్త ఆర్భాటంగా నిర్వహిస్తూ, అతిథిగా ఆహ్వానించిన పాపానికి ఆయన షర్మిల జీవితం నలుగురిలో నవ్వుల పాలయ్యే తరహా ప్రసంగంతో కామెడీ చేస్తున్నారు. జోకులు వేస్తున్నారు. 2029 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నిన్న మొన్నటిదాకా ఇసుమంతైనా పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ సారథిగా ఉన్నటువంటి వైయస్ షర్మిల రాష్ట్రంలో ప్రచారానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి చుట్టూ పలుమార్లు తిరిగినా ఆయన పట్టించుకోలేదు. చివరికి పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్లారు. కనీసం వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న కడపకు ఒక పర్యాయం కూడా రేవంత్ అడుగుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడో శవాసనం వేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏమాత్రం మెరుగైన ప్రదర్శన చూపలేకపోయింది. ఓటు శాతాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. 
తీరా ఇప్పుడు వైఎస్ జయంతి కోసం ఏపీలో అడుగుపెట్టి రాబోయే నాలుగేళ్లలో అధికారంలోకి వచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలపడిపోతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అవుతుందట! తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి షర్మిల శక్తివంచనలేకుండా పాటుపడ్డారు. చివరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటికీ తగు ఫలితం మాత్రం ఆమెకు దక్కలేదు. కనీసం ఆ రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ షర్మిల అస్తిత్వం కూడా ఉండకుండా బయటికి గెంటేసారు. ఆమె ఏపీలో రాజకీయాలు చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగని ఆమె ఏపీ సారధి అయిన తర్వాత ఆయన అందించిన సహకారం ఎంత మాత్రమూ లేదు. కాగా ఇప్పుడొచ్చి 2029 కల్లా షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతుందని, తాను ఆమె వెన్నంటి నిలుస్తానని ఆయన ప్రకటించడం చూసి  ప్రజలు నవ్వుకోవడం తప్ప మరేం చేయగలరు.

ఏపీ మహిళలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

 ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఇంతకుముందే చర్చించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకం కింద కూటమి ఎన్నికల సమయంలో ఆరు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఈ పథకం కూడా ఉంది. ఈ పథకం కింద 18 ఏళ్ల వయసు దాటిన.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తారు. ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది.

త్వరలోనే విధివిధానాలను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Epic Success: Kalki 2898 AD Nears Rs. 1000 Crore Mark

The globally acclaimed actor Prabhas and visionary director Nag Ashwin have struck gold with their latest epic, *Kalki 2898 AD*. This cinematic masterpiece has taken the box office by storm, raking in a staggering Rs. 950 crores globally in just 11 days and is set to break the Rs. 1000 crore barrier. Fans and critics alike are buzzing with excitement, speculating if it will outshine SS Rajamouli’s *RRR* in lifetime collections.

Boasting a star-studded cast that includes legends like Amitabh Bachchan, Deepika Padukone, Kamal Haasan, Rajendra Prasad, Disha Patani, Saswata Chatterjee, Brahmanandam, Anna Ben, Shobana, Mrunal Thakur, Dulquer Salmaan, Vijay Deverakonda, and Ram Gopal Varma, this film is a powerhouse of talent. Produced with a lavish budget by Vyjayanthi Movies and featuring an electrifying score by Santhosh Narayanan, *Kalki 2898 AD* is a cinematic spectacle you won’t want to miss.