Home Blog Page 769

Intrigue of SSMB 29: Mahesh Babu’s Dialect Mentor Revealed!

Following the global triumph of “RRR,” acclaimed director SS Rajamouli is now setting his sights on his next ambitious venture, tentatively titled “SSMB 29.” This highly anticipated film features the renowned Super Star Mahesh Babu in the lead role, promising a cinematic experience that fans are eagerly awaiting.

Rumors are abuzz about the film’s official launch, which is speculated to take place on August 9, 2024. This announcement has fueled anticipation for what is expected to be a high-budget extravaganza. Adding to the excitement, it has been revealed that veteran actor Nasser has been brought on board as Mahesh Babu’s dialect coach. This strategic move aims to refine the actor’s dialogue delivery, ensuring a fresh and enthralling performance that will captivate audiences.

Currently, rigorous workshops are in full swing, with Mahesh Babu dedicating significant effort to perfecting his dialogues under Nasser’s expert guidance. This preparation is set to elevate the actor’s performance, offering fans a new and dynamic portrayal that stands out in his illustrious career.

Produced on an opulent scale by Durga Arts, “SSMB 29” is poised to be a visual and narrative spectacle. The production is gearing up to commence filming soon, with extensive preparations underway to bring Rajamouli’s visionary storytelling to life.

Stay tuned for further updates on “SSMB 29” as this monumental project unfolds, promising to set new benchmarks in Indian cinema.

రూ.500, 200 నోట్ల రద్దు…హింట్‌ ఇచ్చిన బాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నోట్ల రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది గత ఐదేళ్లలో దోచేసిన సొమ్ముతో వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని, అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేయాల్సిందేనని బాబు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని బ్యాంకర్లకు సూచించారు.

 ఈ మేరకు బుధవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.5,40,000 కోట్లతో రుణాలను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాల నిధుల మంజూరు, రైతు రుణాల మాఫీ, పెట్టుబడి సాయం అందించే విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి బాబు కోరారు. 

ఇదిలా ఉంటే.. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తడం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోసారి మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు చేయబోతుందా? అందులో భాగంగానే చంద్రబాబు ఈ ప్రస్తావన తీసుకువచ్చారా అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.

ఇక 2016 నవంబర్ 8న మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.1000, 500 నోట్లను రద్దు చేసి వీటి స్థానంలో రూ.2000, 500, 200 నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

మహిళల ఉచిత బస్సు సౌకర్యం గురించి బాబు ప్రభుత్వం కసరత్తు!

ఏపీలో మహిళల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత నెల 13న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 కీలక హామీలపై సంతకం చేశారు. మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేయగా, ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రంపై ఐదో సంతకం చేయడం తెలిసిన విషయమే. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ దిశగా బాబు ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలోనూ ఆడపడుచులకు కానుకగా అతి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నారు. గత నెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబు.. సూపర్ సిక్స్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంపై రంగం సిద్ధం చేస్తున్నారు. మహిళల పాలిట వరంలా మారిన ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ హాలులో ఉదయం 11గంటలకు ఈ సమావేశ జరగనుండగా పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రీ బస్సు ప్రయాణంపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులను పురమాయించిన చంద్రబాబు పలు నివేదికలను తెప్పించుకున్నారు.

చరణ్‌ కి కొంచెం బ్రేక్‌ కావాలి!

గేమ్ ఛేంజ‌ర్‌’లో రామ్ చ‌ర‌ణ్ షూటింగ్ పార్ట్ పూర్తయిన విషయం తెలిసిందే. ఇందుకోస‌మే చాలా రోజులుగా బుచ్చిబాబు ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే గేమ్ ఛేంజ‌ర్‌ తరువాత బెర్తు త‌న‌దే కాబట్టి. చర‌ణ్ – బుచ్చిబాబుల కాంబోలో సినిమా ఏనాడో ఫిక్సయిన సంగతి తెలిసిందే. చ‌ర‌ణ్ రాక కోస‌మే ఆ టీమ్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తోంది. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా అవ్వ‌గానే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉంది.

 అయితే చర‌ణ్ తొంద‌ర‌ప‌డ‌డం లేదు. త‌ను కొంత బ్రేక్ తీసుకోవాల‌నుకొంటున్నాడు. ఇప్ప‌ట్లో చ‌ర‌ణ్ బుచ్చిబాబుకు కాల్షీట్లు ఇచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తుంది. ద‌స‌రా త‌ర‌వాతే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంద‌ని సమాచారం. అయితే బుచ్చిబాబు మాత్రం ఖాళీగా లేడు. స్క్రిప్టుని మ‌రింత ప‌క‌డ్బందీగా రాసుకొంటున్నాడు. అందుకోసం ఓ రైటింగ్ టీమ్ ని కూడా పెట్టుకొన్నాడు.

బుచ్చిబాబు ఆఫీసు ఇప్పుడు ఏడెనిమిది రైట‌ర్ల‌తో నిండుగా ఉంది. వీళ్లంతా చ‌ర‌ణ్ స్క్రిప్టుని కాచి వ‌డ‌బోసే కార్య‌క్ర‌మంలో బిజీగా ఉన్నారు. ఇదంతా సుకుమార్ స్టైల్‌. త‌ను రైటింగ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటాడు. ఇప్పుడు శిష్యుడు కూడా అదే పంధా లో నడుస్తున్నాడు. రెహ‌మాన్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు ట్యూన్లు కూడా సిద్ధ‌మ‌య్యాయి. హైద‌రాబాద్ శివార్ల‌లో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప‌నుల్లో బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు.

‘దేవ‌ర’ షూటింగ్ లోపాల్గొన్న ఆ న‌టి.. !

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్ఆర్‌ సినిమా తరువాత చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఏ రేంజ్‌ లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే.

 దేవ‌ర చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫియ‌ర్ సాంగ్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో మ‌రో న‌టి శ్రుతి మ‌రాఠే కూడా యాక్ట్‌ చేస్తుంది.

ఎన్టీఆర్ భార్య పాత్ర‌లో శ్రుతి న‌టిస్తోంది.తాజాగా ఆమె హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న‌ ‘దేవ‌ర’ షూటింగ్ లో ఎంటర్‌ అయ్యింది. ఈమేర‌కు తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ ద్వారా చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్దమవుతున్నారు.

అదరగొట్టిన సితార్‌ సాంగ్‌ ప్రొమో!

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. ఈ సినిమా షూటింగ్‌ ని ఇటీవలే పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాని  డాషింగ్‌ డైరెక్టర్‌ హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీ గా పెరిగాయి. ఇక ఈ సినిమా నుంచి సితార్ సాంగ్ ను విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌డంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ముందు ఈ సాంగ్ ను జులై 8న రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన మేక‌ర్స్ కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డేట్ ను జులై 10కి మార్చారు. అయితే, ఈ సాంగ్ ప్రోమోను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. చ‌క్క‌టి మెలోడి మ్యూజిక్ తో ఉన్న ఈ ప్రోమో అభిమానుల‌తో డ్యాన్స్ చేయించేలా ఉంది. ఈ పాట‌లో ర‌వితేజ వింటేజ్ లుక్ లో కనువిందు చేస్తున్నాడు. ఇక ఆయ‌న వేసిన స్టెప్పులు అయితే ఫ్యాన్స్ కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేస్తాయని చెప్పవచ్చు.

ఈ సినిమాలో అందాల భామ భాగ్య‌శ్రీ బొర్సె కథానాయిక గా న‌టిస్తోండ‌గా, జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర‌లో చేస్తున్న విషయం తెలిసిందే. జులై 10న రిలీజ్ అయ్యే సితార్ సాంగ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Chandrababu Released Rs 5.6 Lakh crore credit plan, Focusing on Agriculture


Chief Minister Chandrababu Naidu has released an annual credit plan with Rs 5.4 lakh crore presiding over the meeting of the State Level Bankers Consultative Committee (SLBC) meeting in Secretariat on Tuesday. Out of this, Rs.3.75 lakh crore will be allocated to priority sectors and Rs. 1.65 Crores have been allocated to other sectors. For the agriculture sector Rs. 2.64 lakh crore has been set as the credit target.

Chandrababu said that 14 percent more loans will be given to the agricultural sector than before. Dairy, poultry, fisheries, mechanization in cultivation and infrastructure will be given priority. He deplord that during the last five-years the Jagan government has destroyed the banking sector.

For the first time after the formation of the coalition government, a meeting of the state level bankers’ committee was held. CM Chandrababu explained the government’s priorities for bankers. SLBC congratulated CM Chandrababu Naidu who became the Chief Minister for the 4th time.

Finance Minister Payyavula Keshav, Agriculture Minister Achchennaidu, Union Bank Executive Director Sanjay Rudra, SLBC Convenor CVN Bhaskar Rao, other bank officials and officials of various departments participated in the meeting.

Chandrababu said that the help of bankers is needed for the implementation of DBT schemes and management of development programs. The CM asked the bankers to cooperate in the matter of subsidized loans and assistance to the beneficiaries under various schemes.

The bankers brought to the attention of the CM that the difficulties they were facing required cooperation from the government. The ministers stated that the banking sector was fragmented along with the other systems during the previous government.

The AP government has made it clear that the role of bankers is crucial in the promotion of agriculture sector and industries and strengthening of Dwcra communities. 

 For the financial year 2023-24, Rs.3.23 lakh crore has been earmarked for the priority sector, while the credit plan target for this financial year is Rs.3.75 lakh crore. The loan target is 16 percent higher than in the past.

Last year the loan target of Rs.2.31 lakh crore was set for the agriculture sector, of which 90 percent i.e. Rs.2.08 lakh crore loans were sanctioned. For the MSME sector an amount of Rs 87,000 crores was projected, which is 26 percent more than the previous year’s Rs 67,000 crore.

టిల్లు క్యూబ్‌ లో హీరోయిన్‌ గా తెలుగమ్మాయి!

యంగ్‌ స్టార్ బాయ్‌ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన‌ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల ను అందుకున్నాయో తెలిసిన విషయమే. సిద్ధు త‌న‌దైన యాక్టింగ్ తో  ఈ సినిమాల‌ను ఆడియెన్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యేలా చేయ‌డంలో ఫుల్‌ గా స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా ”టిల్లు క్యూబ్” అంటూ ఈ సినిమాల‌కు కొన‌సాగింపును చేస్తున్నాడు.

అయితే, డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ గా త‌న‌ అందాల‌తో కుర్ర‌కారును బాగా ఆక‌ట్టుకుంది. ఇక టిల్లు స్క్వేర్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా త‌న అందంతో పాటు అభిన‌యంతో కట్టిపడేసింది. అయితే, టిల్లు క్యూబ్ లో ఓ తెలుగు బ్యూటీని హీరోయిన్ గా తీసుకునేందుకు సిద్ధు ప్లాన్ సిద్దం చేస్తున్నాడంట.

”ట్యాక్సీవాలా” ఫేం ప్రియాంక జావల్క‌ర్ ఇటీవ‌ల స‌రైన హిట్ లేక స‌త‌మ‌తువుతోంది. అయితే, ఈ బ్యూటీని ‘టిల్లు క్యూబ్’ లో లీడ్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని టాక్‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే, అమ్మ‌డికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకొవచ్చు. ఈ సినిమాతో ఆ అమ్మడు తిరిగి త‌న కెరీర్ ను ట్రాక్ ఎక్కించే అవ‌కాశం దొరుకుతుంది. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌రలో రానుంది.

నాని సరిపోదా శనివారం సినిమా వాయిదా!

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ నేచురల్‌ హీరో నాని , హీరోయిన్‌ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి నేచురల్‌ స్టార్‌ నాని పోస్టర్లను విడుదల చేయగా..అవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి చారులత క్యారెక్టర్‌ లో ప్రియాంక మోహన్‌ ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేయగా..అందులో ప్రియాంక అందంగా ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ సినిమాని టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి ఓ క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో దర్శకుడు ఎస్ జె సూర్య ఓ సాలిడ్ క్యారెక్టర్‌ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాపై మంచి బజ్ ఆల్రెడీ అయితే ఉంది. ఇక ఎప్పటికప్పుడు మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ ని అందిస్తుండగా ఇపుడు ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 29 నుంచి కేవలం కొన్ని రోజులు వెనక్కి వెళ్లినట్టుగా సమాచారం. దీంతో ఈ మూవీ సెప్టెంబర్ రెండో వారానికి మారినట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

KTR supports His party’s Defections, But Slams Congress As `Mother of Defections’

BRS Executive President and former minister K T Rama Rao has supported large scale `defections’ engineered during his party’s regime with most of Congress, TDP and YCP MLAs being `merged’ into his party.

But lamenting Congress party as `mother of defections’ in India, he pointed out its `unlawful defection of MLAs’ in the state. He termed present defection of BRS MLAs into Congress as opportunistic and exposing the hypocrisy and double-standards of the Congress party.

He said that it was Congress which introduced the ‘Aayaram-Gayaram’ culture in India, but the same party introduced the Anti-Defection Law in 1987.  Referring to BRS promoting defections during KCR’s regime, KTR said that there is a huge difference between `merger’ and `defection’.

He pointed out that during the BRS regime, political parties have merged in the BRS Legislative Party as per the Constitutional provisions, while the Congress is encouraging defections. KTR, who is presently in New Delhi along with his another former minister T Harish Rao consulting several legal and constitutional experts to explore ways to approach the Supreme Court seeking disqualification of the defected elected representatives.

He revealed plans to approach President Droupadi Murmu, Lok Sabha Speaker Om Birla and the Election Commission of India in this regard. He is also mulling over holding a meeting of like-minded political parties at the Constitution Club to discuss the way forward.

The party invited all the victims of the BJP and the Congress to come together for a joint fight against the defections, he said and alleged Congress as the `mother of defections’ in India.

Rama Rao slams that the Congress, which is encouraging defections in Telangana, was making a huge cry over defection of its MLAs into BJP and other political parties in States such as Goa, Madhya Pradesh and Haryana among others.

“Rahul Gandhi made Congress candidates in Goa take oath against defecting to other parties. When Congress MLAs joined the BJP in Karnataka, Siddharamaiah claimed that the BJP purchased them for Rs 50 crore”, he added.

KTR ridiculed that in its manifesto, the Congress promised to amend the Schedule 10 of the constitution to ensure automatic disqualification of elected representatives upon defection,” he reminded.

He took potshots at Congress Lok Sabha leader Rahul Gandhi for delivering an Oscar-level act by holding the Constitution in Parliament, and shortly thereafter shaking hands with BRS defected MLA Pocharam Srinivas Reddy welcoming him into the party. “What sort of hypocrisy is this?” he questioned.