Home Blog Page 760

జగన్ కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీలు!!

ఐదేళ్లపాటు దుర్మార్గమైన పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి.. కేవలం ప్రజాదరణ కోల్పోయాడనే కారణం ఒక్కటి మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా ఆయన అనుసరించిన ఒంటెత్తు పోకడలు కూడా ఇప్పుడు తమ ప్రభావం చూపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనే సంగతిని గ్రహించిన పార్టీ నాయకులు అంతా ఇప్పటికే వలస బాట పడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీ లలో తమను ఎవరూ చేరదీస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్న వారు కూడా.. భవిష్యత్తుకు గ్యారెంటీ లేని వైసిపి నీ వదలి, చంద్రబాబు పంచన చేరడానికి ఉత్సాహ పడుతున్నట్టుగా తెలుస్తోంది.

మండలి డిప్యూటీ చైర్మన్ జకీయ ఖానం, తాను వెళ్లి తెదేపాకు చెందిన మంత్రి ఫరూక్ ను కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. వైసిపి లో ఏదో మొక్కుబడిగా పదవి ఇచ్చారే తప్ప ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. జకీయా బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు ఉన్నారు. కొందరు అప్పుడే నేరుగా కలవకుండా.. వర్తమానం పంపి, సమ్మతికోసం ఎదురు చూస్తున్నారు. ఓకే అంటే పార్టీలో చేరుతానని అంటున్నారు.

జగన్ జమానాలో ఎమ్మెల్యే లకే వీసమెత్తు విలువ ఉండేది కాదు. ఎమ్మెల్సీల పరిస్థితి చెప్పే అవసరమే లేదు. ఐదేళ్లలో జగన్ వారితో సమావేశం అయిన సందర్భాలే లేవు. ఎన్నికల్లో ఓడిపోయి కేవలం 11 మంది మాత్రమే గెలిచిన తరువాత ఆయనకు వీరు కనిపించారు. మండలిలో సంఖ్యాబలం మెజారిటీ ఉన్న వీరితో సమావేశం పెట్టుకున్నారు. జగన్ బుద్ధి ఎలాంటిదో వారికి అప్పుడే అర్థం అయింది.

గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు మండలిలో తన పార్టీకి మెజారిటీ లేదనే ఉద్దేశంతో ఏకంగా మండలిని రద్దు చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. తీరా తెదేపా నుంచి కొందరిని తమలో కలుపుకుని అక్కడ కూడా మెజారిటీ వచ్చాక ఊరుకున్నారు. 

ఇప్పుడు తెదేపా కు మండలిలో మెజారిటీ లేదు. అయితే మండలి రద్దు వంటి అనాలోచిత నిర్ణయానికి వారు వెళ్లడం లేదు. నిమ్మలంగానే ఉన్నారు. కాకపోతే జగన్ తీరు గ్రహించిన, అక్కడ భవిష్యత్తు లేదు అని భయపడుతున్న వైసిపి ఎమ్మెల్సీలు తెదేపాలోకి రావాలని అనుకుంటున్నారు. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే మండలి లో టిడిపి బలం పెరుగుతుందని.. జగన్ కు షాక్ తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

నెల తిరక్కుండానే లక్ష్యం వైపు వడివడిగా.. బాబు అడుగులు!!

చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇంకా సరిగ్గా నెల కూడా పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీలు అన్నింటినీ పూర్తి చేయడం గురించి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక కీలక హామీలు ఇప్పటికే అమలు లోకి వచ్చాయి. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధుల కల్పన అనేది చంద్రబాబు గరిష్టంగా శ్రద్ధ పెడుతున్న వ్యవహారాల్లో ఒకటిగా ఉంది.

బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున నైపుణ్య గణన కు సంబంధించిన ఫైల్ మీద కూడా తొలి సంతకం పెట్టిన చంద్రబాబు.. ఉద్యోగాల కల్పన విషయంలో అంతే దూకుడుగా ఉన్నారు. పారిశ్రామిక వేత్తలు రావడం, సీఎంతో భేటి కావడం, పరిశ్రమల ఏర్పాటు గురించి మంతనాలు సాగడం అనేది జగన్ పాలన ఐదేళ్లలో  వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినన్ని కూడా జరగలేదు. కానీ చంద్రబాబు ఈ నెలలోనే పెట్రో కారిడార్, ఈవీ వాహన తయారీ వంటి సంస్థల మంతనాలు సాగాయి.

తాజాగా చంద్రబాబు సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ఎంత అనుకూలమైనదో వివరించారు. నైపుణ్య గణన ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ ఇస్తామని తెలియజెప్పారు. ఈ ప్రయత్నాలు ఏపీ పారిశ్రామిక పురోగతికి బాటలు వేస్తాయి. ప్రత్యేకించి యువత పురోగతి, ఉద్యోగాల కల్పన విషయంలో చంద్రబాబు శ్రద్ధ ఈ నెల రోజుల్లోనే అనేక విధాలుగా వ్యక్తం అవుతుందని పలువురు అంటున్నారు.

పార్టీ దూకుడుకు బ్రేకులు వేస్తున్న చంద్రబాబు 

ఇన్నాళ్ళూ అనేక అవమానాలను భరిస్తూ, సహిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటే సహించలేక పోతున్నారు. ఇంకా తమ మీద భౌతికంగాను పరోక్షంగానూ దాడులు జరుగుతుంటే ఊరుకోలేక పోతున్నారు. ఇలాంటి అసహనంలో తెదేపా కార్యకర్తలు కొందరు అదుపు తప్పిపోతున్నారు. అయితే ఇలాంటి పార్టీ శ్రేణుల దూకుడు కు చంద్రబాబు బ్రేకులు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతే సంయమనంతో ఉండడం అవసరం అని చెబుతున్నారు. 

తప్పుడు రాతలు రాసినందుకు తెదేపా కార్యకర్తలు కొందరు విశాఖలోని డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తమ పార్టీ వారు చేసిన పనిపట్ల ముసిముసిగా నవ్వుకోకుండా, వారిని మరింత ప్రోత్సహించకుండా బ్రేకులు వేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియాపై న్యాయపరంగా పోరాడుదాం అని పిలుపు ఇస్తున్నారు. 

అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి అని చంద్రబాబు మార్గదర్శనం చేస్తున్నారు. 

ఇదొక్కటే కాదు.. తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా ప్రవర్తించినప్పుడు కూడా.. చంద్రబాబు ఇదే పని చేశారు. వైసిపి వారి భవనాన్ని కూల్చేశారు కదా అని మురిసిపోలేదు. 

ఇన్నాళ్ళ అసహనం పెల్లుబుకుతుంది గనుక పార్టీ వారు అక్కడక్కడా అదుపు తప్పడం సహజం అని.. అయితే చంద్రబాబు నాయుడు చాలా సహనంతో అందరినీ దారిలోకి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ పాపాలను దిద్దుతున్న చంద్ర సర్కార్ 

జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో.. అన్ని రకాల వ్యవస్థలను కూడా పణంగా పెట్టి అందిన కాడికి డబ్బులన్నీ పథకాలకు తరలించిన నాయకుడు. ఆయన అసమర్థ పరిపాలన విధానాలకు నిర్వీర్యం అయిపోయిన రంగాలలో స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థలకు అందవలసిన నిధులన్నిటినీ కూడా పక్కకు మళ్లించిన తీరు ఆయనది. ఆ సంస్థల ఆర్థిక నిర్మాణం కుప్పకూలి పోయింది. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఒక ప్రధాన హామీ గా ప్రకటించారు. ఇప్పుడు తను అధికారం లోకి రాగానే.. స్థానిక సంస్థలను ఆర్థికంగా పరిపుష్టం చేసే దిశగా వాటికి నిధులు విడుదల చేయడం జరిగింది.

రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ మిగిలిన వారి కంటే కాస్త ఆలస్యంగా గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఆ వెంటనే స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ రకంగా ఆర్థిక శాఖ పరంగా కూడా.. ఇచ్చిన ఎన్నికల హామీని ఘనంగా నిలబెట్టుకున్నట్లయింది.

స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను పయ్యావుల కేశవ్ విడుదల చేశారు. దీనితో సుమారు 250 కోట్లు స్థానిక సంస్థలకు విడుదల అయినట్టు అయింది. ఈ సంస్థల సొమ్మును జగన్ పక్కదారి పట్టించి.. నిర్వీర్యం చేశారో.. అవే సంస్థలకు తిరిగి జవ జీవాలు ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ, పాలన యంత్రాంగంలోని అన్ని సంస్థలను ముంచేసి.. పథకాలు చాలు అన్నట్టుగా జగన్ వ్యవహరించారు. సంక్షేమంతో పాటు.. అన్ని వ్యవస్థలను కాపాడే పని చంద్రబాబు చేస్తున్నారు.

గోతులు తవ్విన పెద్దలపై కూడా వేటు పడుతుందా?

పార్టీని ప్రక్షాళన చేయడం అనే అందమైన మాటను ప్రయోగిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ప్రక్షాళన చేయడం అంటే మరేమీ కాదు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా.. బేరీజు వేయకుండా.. తనకు ఇష్టం వచ్చిన రీతిలో నచ్చని వారిని సస్పెండ్ చేసుకుంటూ వెళ్లిపోవడం మాత్రమే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనలో తొలి అడుగు అన్నట్టుగా కదిరి మాజీ ఎమ్మెల్యే పి వెంకట సిద్ధారెడ్డిని సస్పెండ్ చేశారు. 2019లో గెలిచిన పీవీ సిద్ధారెడ్డి, 2024 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కలేదని అక్కసుతో తెలుగుదేశం అభ్యర్థికి సహకరించారనే ఆరోపణల మీద జగన్ వేటు వేశారు. 

ఏదో ఒక మామూలు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు గనుక.. ఒకింత ఆరోపణలు వినిపించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వేటు వేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి- కుడి ఎడమ భుజాలుగా చలామణి అయ్యే అనేకమంది పెద్ద తలకాయలు.. తమకు కిట్టని అనేకమంది నాయకులు ఓడిపోవడానికి శక్తివంచన లేకుండా ఈ ఎన్నికల్లో పనిచేశారు. వారందరి మీద కూడా వేటు వేయగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా? అనే చర్చ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తోంది. గెలుపు మీద అపరిమితమైన అతి విశ్వాసం ఏర్పడడంతో.. 2024 ఎన్నికలకు పూర్వం.. మంత్రి పదవుల వద్ద తమకు పోటీ రాకూడదనే ఉద్దేశంతో ఒకరి వెనుక ఒకరు గోతుల తవ్వుకున్న నాయకులు చాలామంది ఉన్నారు. కేవలం మంత్రి పదవులు మాత్రమే కాకుండా స్థానిక రాజకీయాలలో తమ పెద్దరికానికి అడ్డు వస్తున్నారని ఇతర అభ్యర్థులను ఓడించడానికి కుట్రలు చేసిన వారు, అందుకోసం నిధులు సరఫరా చేసిన వారు కూడా ఉన్నారు. వారందరి దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డికి తెలియనివి ఏమీ కాదు. కానీ వారి మీద వీసమెత్తు చర్య తీసుకోగల ధైర్యం జగన్ కు లేదు అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎవరి నియోజకవర్గం పని వారు చూసుకోకుండా.. పక్క నియోజకవర్గాలలో గోతులు తవ్వడం మీద దృష్టి సారించినందు వల్లనే ఈసారి ఎన్నికల్లో మరీ ఘోరంగా 11 స్థానాలకు వైసీపీ పడిపోయిందని.. లేకపోతే తమకు ఉన్న ఓటు బ్యాంకుకు కనీసం 50 సీట్లు అయినా దక్కి ఉండేవని కొందరు అంటున్నారు. 

జగన్మోహన్ రెడ్డి పార్టీలో అధినేత వద్ద ప్రాపకం లేని నాయకుల పట్ల కఠినంగా కత్తి ఝుళిపించగలరేమోగాని.. ఆయనకు భజన చేస్తూ ఆయనను మభ్యపెడుతూ పార్టీకి ద్రోహం చేసే వారిని గుర్తించలేకపోతున్నారనే అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తోంది. మరి జగన్ నిజంగా తన పార్టీని కాపాడుకోదల్చుకుంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

AR Rahman Returns: Musical Marvel in ‘Indian 2

Tonight, brace yourselves for the global premiere of ‘Indian 2’ (or ‘Bharateeyudu 2’ in Telugu), the highly-anticipated sequel to Kamal Haasan’s legendary patriotic saga that captured hearts back in 1996. With its predecessor still a cult favorite nearly three decades later, anticipation for this cinematic extravaganza is at an all-time high.

Just ahead of the premiere, director Shankar dropped a bombshell: the incomparable AR Rahman, whose musical genius defined the original ‘Indian’, returns to work his magic on ‘Indian 2’. Rahman’s iconic theme has been masterfully reimagined by Anirudh Ravichander for this sequel, earning praise and gratitude from Shankar for their collaborative brilliance.

Featuring a stellar cast including Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, and more, ‘Indian 2’ promises an enthralling storyline under the prestigious Lyca Productions banner. Stay tuned for the grand unveiling and immerse yourself in the magic of ‘Indian 2’.

Pawan Kalyan, Ram Charan Head to Mumbai for Anant Ambani’s Wedding

Anant Ambani, son of Mukesh Ambani, the titan of Asia’s corporate world, is all set to tie the knot with Radhika Merchant on July 12, 2024. The extravagant affair will unfold at Mumbai’s prestigious Jio World Convention Centre in the bustling Bandra Kurla Complex (BKC).

Adding to the glamour, Mega heroes Pawan Kalyan and Ram Charan, accompanied by their wives, have jetted off to Mumbai for the festivities. They were seen making their way through Hyderabad airport, each gearing up to join in the opulent celebrations.

With a guest list that promises stars from Bollywood, Tollywood, and political circles, this wedding is poised to be a dazzling spectacle. Keep your eyes peeled for more updates on this star-studded affair!

Minister Nara Lokesh commends Union Minister’s assurance on Vizag Steel plant

Andhra Pradesh Minister Nara Lokesh expressed satisfaction with the assurance from the Union Minister that there would be no privatization of Visakhapatnam Steel plant.

Speaking to the media on Thursday, Nara Lokesh remarked, “Union Minister HD Kumaraswamy has respected the sentiments of the people of Andhra Pradesh by confirming there will be no privatization of the steel plant. I extend my gratitude to him for this assurance.”

Lokesh acknowledged that the union minister’s statement on the Visakhapatnam Steel plant issue might have disappointed some sections of the media.

He reaffirmed the coalition government’s commitment to the welfare of the state’s residents, emphasizing, “We are a government by the people and for the people. Our foremost priority is to fulfill the aspirations of our citizens.”

Andhra Pradesh Transfers 19 IAS and 2 IPS Officers

In a significant administrative reshuffle, Andhra Pradesh has transferred 19 IAS officers and 2 IPS officers. State Chief Secretary Neerabh Kumar Prasad issued the orders on Thursday.

Key transfers include G Anantharamu as Special Chief Secretary for Forests, Environmental Science, and Technology, R P Sisodia as Secretary of the Stamps and Registration Department, G Jayalakshmi as Chief Commissioner of CCLA, Kantilal Dande as Principal Secretary of R&B, and Suresh Kumar as Principal Secretary of Investments and Infrastructure, with additional charges of the Village Ward Secretariat and GAD Secretary.

Other notable appointments include Saurabh Gaur as Secretary of the IT Department and RTGS, Yuvaraj as Secretary of Industries, Commerce, and Food Processing Department, Harshvardhan as Secretary of Minority Welfare Department, and P Bhaskar as Secretary of Backward Classes Welfare Department, with additional charge of EWS and GAD Services. The government has transferred K Kannababu as Social Welfare Secretary and given him the additional charge of Commissioner of Tribal Welfare and Panchayati Raj.

Additional transfers include Vinay Chand as Secretary, Vivek Yadav as Secretary of the Department of Youth Services and Sports, Surya Kumari as Secretary of Women and Child Welfare and Differently Abled Welfare, and C Sridhar as Director of Industries. The government has posted J Nivas as Additional Secretary in the Finance Department, appointed Vijayarama Raju as Director of School Education, and assigned Dilli Rao as Director of the Agriculture Department. Himanshu Shukla has taken charge of the Information and Public Relations Department. Additionally, the government has transferred Harikiran from the Agriculture Department and relieved Girija Shankar from the Finance Ministry.

Registrations Temporarily Suspended in Telangana Due to Technical Snag

Registrations in Telangana state have been temporarily suspended. The Department of Stamps and Registrations said in this regard. Officials said the disruption was caused since Thursday afternoon due to a technical snag. He said that there were difficulties as Aadhaar was not linked to the registrations. 

Officials said there was a technical issue with regard to eKYC verification in the UDIA. Efforts are being made through technical experts to resolve this issue, he said. Those who came for registrations said they were suffering due to a technical problem. If the technical issue is resolved, the process of registration of waiting persons will be completed. In crowded places, they have been asked to come tomorrow.