Home Blog Page 746

సొంత పార్టీకి జగన్ సమాధి కడుతున్నారా?

కొన్ని నిర్ణయాలు చారిత్రక తప్పిదాలుగా నిరూపణ అవుతుంటాయి. కాలక్రమంలో అవి ఎప్పటికీ దిద్దుకోలేనంత పెద్ద తప్పులుగా కూడా తేలుతుంటాయి. కొన్ని వ్యక్తిగత ఈగోల వల్ల చాలావరకు తప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో అయితే.. జనం నాడిని అంచనా వేయడంలో అవగాహన లేకపోవడం, ఎవరైనా చెబితే వినే అలవాటు లేకపోవడం వల్ల కూడా తప్పుడు నిర్ణయాలు దొర్లుతాయి. ఆ తప్పుడు నిర్ణయాలు.. సరిదిద్దలేనంత పెద్ద నష్టాన్ని కలిగించిన తర్వాత.. ఇక చేయడానికి మరేం ఉండదు. అదే పరిస్థితి ఎదురవుతోంది.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి!

ప్రజల్లో తన పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్నదనే సంగతిని జగన్ కు ఎవరూ చెప్పలేదో, చెబితే ఆయన నమ్మలేదో మనకు తెలియదు. కానీ.. వ్యతిరేకత ఉన్నదని మాత్రం గ్రహించి.. అదంతా అభ్యర్థుల మీదికి నెట్టడానికి వారిని అటు ఇటు మార్చారు. చాలా మందికి టికెట్లు నిరాకరించి కొత్తవారికి ఇచ్చారు. ఓటమి మాత్రం తప్పలేదు. అప్పట్లో పార్టీ నాయకులందరూ గట్టిగా వ్యతిరేకించినా.. జగన్ ఒంటెత్తు పోకడలతో దూసుకెళ్లి సగం స్థానాలను చేజేతులా ఓడించారు.

ఇప్పుడు కూడా ఆయన తీసుకుంటున్న ఒక నిర్ణయం పార్టీకి ప్రమాదకరంగా మారుతోంది. ప్రకాశం జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించనుండడం పట్ల ఆ జిల్లాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నిజానికి చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీచేయించడం మీదనే పార్టీలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఎవ్వరి మాటా వినకుండా జగన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. జిల్లాలో సమర్థులు లేరా.. చెవిరెడ్డిని వలసతెచ్చి పార్టీ సారథ్యం అప్పగించాలా? అని ప్రశ్నిస్తున్నారు.

జగన్ ఒంటెత్తు పోకడలే పార్టీని ఇటీవలి ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురిచేశాయి. ఇప్పటికీ ఆయన పార్టీలోని కీలక నాయకుల మాటలకు విలువ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతే.. క్రమంగా పార్టీ సమాధి అవుతుందని పలువురు అంటున్నారు. జగన్ తాను స్థాపించిన పార్టీకి తానే సమాధి కడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని సొంత వారే విమర్శిస్తున్నారు. మరి వారి హితవాక్యాలు జగన్ చెవికెక్కుతాయో లేదో చూడాలి. 

Double iSmart: ‘Maar Muntha Chod Chinta’ Song Promo Unveiled

The makers have unveiled the peppy and electrifying mass beats of the ‘Maar Muntha Chod Chinta’ song promo from the highly anticipated sequel ‘Double iSmart’.

The makers of Ram Pothineni’s and Puri Jagannadh’s most-awaited film, ‘Double iSmart’, have unveiled the promo for the second single, ‘Maar Muntha Chod Chintha’, and the song raises expectations.
The song promo unveils peppy beats with Ram Pothineni’s energetic dance moves, offering a sneak peek into the upcoming Desi party anthem and raising anticipation for the film.

Along with the promo, the filmmakers announced that they will release the full lyrical video of the song tomorrow at 4 p.m.

Renowned musical composer Mani Sharma leads the mass musical, with Shyam Kasarla penning the lyrics for this song. Rahul Sipliganj, Dhanunjay, and Keerthana Sharma provide energetic vocals for the Telugu version.

Puri Jagannadh directs the film, promising double action and entertainment, jointly backed by Puri Jagannadh and Charrmmee Kaur under the banner of Puri Connects.

Starring Ram Pothineni and Kavya Thapar in the lead roles, the film also features Bollywood actor Sanjay Dutt as the main antagonist.

Both Ram and Puri Jagannadh are striving to deliver a blockbuster following their recent flops. Scheduled for a pan-Indian release, the film will hit screens in Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam languages on Independence Day, August 15, this year.

విశ్వం కోసం ప్రభాస్ వాయిస్‌ ఓవర్‌!

యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త చిత్రం ‘విశ్వం’ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్‌ అవుతుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో గోపీచంద్ పాత్రను ప్రభాస్ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారు. సినిమాలో గోపీచంద్ పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ను ప్రభాస్ చెప్పబోతున్నాడని తెలుస్తుంది. పైగా ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది.

గోపీచంద్ – ప్రభాస్ మంచి స్నేహితులు. అందుకే, ప్రభాస్ ‘విశ్వం’ సినిమా కోసం తన వాయిస్ ను అభిమానుల ముందుకు తీసుకుని రాబోతున్నాడంట. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ‘విశ్వం’ సినిమాకి మంచి బ‌జ్ ను క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో కావ్య తాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. చేత‌న్ భ‌రద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. 

యుద్దనేపథ్యంలో సాగే ప్రేమకథ!

ప్రభాస్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి డైరెక్షన్‌ లో  ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఫౌజీ  అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా యాక్ట్‌ చేయనున్నట్లు సమాచారం. అందుకే ఈ టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటుందంట. ప్రస్తుతానికి ఇదే ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ గా ఉంది.

దీని కంటే మంచి టైటిల్‌ ఆలోచన వస్తే.. దాన్నే ఫిక్స్‌ చేస్తారని సమాచారం. ఏమి ఆలోచన రాకపోతే ‘ఫౌజీ’ టైటిల్‌నే ఖరారు చేస్తారట. 1947 కంటే ముందు సాగే కథ ఇది. ప్రభాస్‌ బ్రిటీష్‌ సైన్యంలో ఓ సోల్జర్‌గా కనిపించనున్నాడు.యుద్థ నేపథ్యం ఉన్నా హను స్టైల్‌లో సాగే అందమైన ప్రేమకథ కూడా ఇందులో మేళవించబోతున్నారని తెలుస్తుంది. కథానాయికగా చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘సీతారామం’ ఫేమ్‌ మృణాళ్‌ ఠాకూర్‌ పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది.

విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బాణీలు సిద్థం చేసినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

వేదిక ఏదైనా నా పని అదే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

బాలీవుడ్‌ హీరోయిన్ సోనాక్షి సిన్హా రీసెంట్ గా తన ప్రేమికుడితో కలిసి ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ భామ.. తాజాగా ‘కాకుడా’ అనే హారర్‌ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు హారర్‌ చిత్రాలంటే ముందు నుంచి కూడా ఇష్టముండదు. అందుకే ఎప్పుడూ ఆ చిత్రాలు చేయడానికి ప్రయత్నించలేదు. కాకపోతే, మొదటిసారి ‘కాకుడా’ స్క్రిప్ట్‌ చదువుతుంటే నాకు బాగా సరదాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశాను’ అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.

సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్మి ఈ మూవీ చేశాను. ఇందులో కామెడీ సన్నివేశాలు నాకు చాలా బాగా నచ్చాయి. దర్శకుడికి కూడా ఈ జానర్‌ పై మంచి పట్టు ఉంది. అసలు ప్రేక్షకులను ఎక్కడ భయపెట్టాలో.. ఎక్కడ నవ్వించాలో ఈ చిత్ర దర్శకుడికి చాలా బాగా తెలుసు. తనలాంటి దర్శకుడితో తొలిసారి పని చేయడం ఆనందంగా ఉంది. నేను పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాను. వేదిక ఏదైనా నటించడమే నా పని. ఓటీటీ, థియేటర్‌ అంటూ నాకేమీ తేడాలు లేవు’ అంటూ సోనాక్షి  వివరించింది.

కుమారుడికి పవన్‌ అని పేరు పెట్టిన నటుడు!

తమిళ యంగ్‌ స్టార్‌ హీరో శివ కార్తీకేయన్‌, అతని భార్య ఆర్తి తమ కుమారుడికి పవన్‌ అనే పేరును పెట్టారు. ఇటీవల జరిగిన తన కుమారుడి నామకరణం, ఊయల వేడుకకు సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.  

 పవన్…శివ కార్తీకేయన్‌,  ఆర్తిలకు మూడవ సంతానం. ఇది వరకే వారికి ఓ కుమార్తె ఆరాధన, కుమారుడు గుగన్‌ ఉన్నారు. జులై 15న శివకార్తికేయన్ తన మూడవ బిడ్డకు పేరు పెట్టే వేడుక నుండి ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అతని పోస్ట్‌కి “ఆరాధన – గుగన్ – పవన్ ” అని హార్ట్ ఎమోజితో క్యాప్షన్ జత చేసాడు.ఈ వీడియోలో అతని భార్య, కుమార్తె, కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడిన కొన్ని ఫోటోలను, కార్యక్రమం క్లిప్పింగ్స్‌ను జతపరిచాడు.

 జూన్ 2న ఆర్తి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒక రోజు తర్వాత శివకార్తికేయన్ తమిళం, ఇంగ్లీష్ లో ఆ విషయాన్ని పంచుకున్నారు. ఆ పోస్ట్ లో “జూన్ 2 న పుట్టిన మా కుమారుడికి  స్వాగతం పలుకుతున్నప్పుడు మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. మా కుటుంబం కొంచెం పెద్దదిగా మారుతుంది. మాకు మీ అందరి ప్రేమ, మద్దతు,  ఆశీర్వాదాలు కావాలి” అంటూ పోస్ట్ చేసాడు.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం ”క”

యంగ్ హీరోల్లో ఒకరైన కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా చిత్రం ”క” . ఈ సినిమా ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేయ‌గానే అభిమానుల్లో క్యూరియాసిటీ మొదలయ్యింది. ‘క’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసింది. ఇక తాజాగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం పుట్టిన‌రోజు కానుక‌గా ఈ సినిమా టీజ‌ర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

1970 నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓ పోస్ట్ మెన్ గా క‌నిపిస్తున్నాడు. అయితే, అత‌డికి సంబంధించిన‌ గ‌తం గురించి తెలుసుకునే క‌థే ఈ సినిమా మెయిన్ గా ఉండ‌నున్న‌ట్లు ఈ టీజ‌ర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్ష‌న్ కు ఏమాత్రం కొదువ లేకుండా ఈ టీజ‌ర్ క‌ట్ ఉండటంతో సినిమాపై మంచి ఆస‌క్తి నెల‌కొంది.

ఇక కిర‌ణ్ అబ్బ‌వ‌రం మేకోవ‌ర్ కూడా ప‌ర్ఫెక్ట్ గా ఉండ‌టంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో తాన్వి రామ్, న‌య‌న్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుజిత్, సందీప్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా వస్తుంది. 

అంబానీ వివాహం పై బాలీవుడ్‌ బ్యూటీ కామెంట్స్‌!

0

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ, రాధికల పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక కోసం దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుపెట్టినట్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న టాక్‌. ఇక ఈ వివాహ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు హాజరు అయిన సంగతి తెలిసిందే.

అదేవిధంగా, బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోహీరోయిన్స్‌ చాలామంది ఈ వేడుకల్లో కనిపించి అలరించారు. కొందరు సినీ ప్రముఖులు అయితే వివాహ వేడుక వద్ద వద్ద చిందులు కూడా వేసి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అనంత్‌ – రాధిక పెళ్లికి హాజరుకాకపోవడంపై తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఓ ఇంటర్వ్యూలో ‘అనంత్‌ అంబానీ వివాహానికి హాజరవుతున్నారా ?’ అని ఓ విలేకరి అడగగా.. తాప్సీ మాట్లాడుతూ.. ‘ఆ పెళ్లికి నేను వెళ్లడం లేదు. నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తా. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను’’ అంటూ తాప్సీ తెలిపింది. మొత్తానికి ప్రస్తుతం తాప్సీ కామెంట్స్‌  ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

యంగ్‌ హీరోతో రొమాన్స్‌ కి సై అంటున్న లేడీ సూపర్‌ స్టార్‌!

లేడీ సూపర్‌ స్టార్‌, బ్యూటీ న‌య‌న‌తార ప్ర‌స్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఆమె న‌టించే సినిమాల కోసం మూవీ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్ప‌టికే బిగ్ బాస్ ఫేం కెవిన్ హీరోగా నటించ‌బోతున్న ఓ సినిమాలో న‌య‌నతార న‌టించ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ఓ వార్త షికారు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను డెబ్యూటంట్ విష్ణు ఇడ‌వ‌న్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఇక ఈ సినిమాలో న‌య‌న‌తార పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ వినిపిస్తోంది. ఈ మూవీలో న‌య‌న్ కెవిన్ కంటే వ‌య‌సులో పెద్ద‌దిగా కనిపిస్తుందంట. అయినా కూడా కెవిన్ ను ప్రేమించే పాత్ర‌లో న‌య‌న్ రెచ్చిపోయి నటించనున్నట్లు  సినీ వర్గాలు చెబుతున్నాయి.

లోకేశ్ క‌న‌గ‌రాజ్ శిష్యుడైన విష్ణు ఇడ‌వ‌న్ ఈ సినిమాను రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుతున్నట్లు టాక్‌. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా న‌య‌న్ భ‌ర్త విఘ్నేష్ శివ‌న్  ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు. దీంతో న‌య‌న్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎట్రీ ఎప్పుడంటే!

స్టార్‌ హీరోల కుమారులందరూ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. మరికొంతమంది వారసుల కోసం అటు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నందమూరి, అక్కినేని , మెగాస్టార్‌ కుటుంబ వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్లు అందుకుంటూ తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ను సొంతం చేసుకుంటున్ఆరు.

కాగా సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఘట్టమనేని రమేష్, మహేష్. రమేష్ హీరోగా అంతగా రాణించకపోవడంతో నిర్మాతగా స్థిరపడ్డారు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఎదుగుతూ ఇండస్ట్రీని శాసించే హీరోలలో ఒకరిగా, తండ్రి కృష్ణ లెగసీని కంటిన్యూ చేస్తూ సూపర్ స్టార్ గా పిలవబడుతున్నాడు.  ఇప్పుడు ఘట్టమనేని మూడో తరం నటుడిగా ఘట్టమేని గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకే ఇప్పటి నుండే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్నాడు. ఒకవైపు స్టడీస్ కంటిన్యూ చేస్తూ మరో వైపు న్యూయార్క్ లోని  ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. గతంలో మహేష్ నటించిన 1నేనొక్కడినేలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు గౌతమ్. కానీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉంటాయి.

సూపర్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం గౌతమ్ కు ప్లస్ పాయింట్ కానీ మహేష్ లెగసీ కంటిన్యూ చేసి, అభిమానుల అంచనాలను అందుకోవాలంటే నటనలో పరిణితి సాధించాలి. అందుకోసమే ఇప్పటి నుండే గౌతమ్ కు శిక్షణ ఇప్పించబోతున్నారు మహేష్‌.

 గౌతమ్ నాలుగేళ్ల పాటు ఈ శిక్షణ తీసుకోనున్నట్టు సమాచారం. కాగా మహేష్ గారాల పట్టి సితార కూడా యాక్టింగ్ పట్ల మక్కువ ఎక్కువ. చూడాలి మరి సితారను ఇండస్ట్రీకి తీసుకువస్తారో లేదో వేచి చూడాల్సిందే.