Home Blog Page 738

డిసెంబర్‌ లో గేమ్‌ ఛేంజర్‌!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మెయిన్‌ లీడ్‌ లో నటిస్తుండగా..స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాలో చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా చేస్తుంది.

శంకర్‌ తెరకెక్కించిన భారతీయుడు 2 రిలీజ్ కావడంతో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే ఈ చిత్రం విడుదల పై ఇప్పుడు లేటెస్ట్ టాక్‌ ఏమిటంటే, డిసెంబర్ నెలను టార్గెట్ చేసినట్లు సమాచారం.

పుష్ప 2 ది రూల్ చిత్రం వాయిదా పడితే, అదే డేట్ కి గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలకే సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

చరణ్‌కి అరుదైన గౌరవం!

మెగా పవర్ స్టార్, గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న  పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో  రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది.

ఆగస్ట్‌లో 15వ వార్షిక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో చరణ్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి A.R రెహమాన్, కరణ్ జోహర్, రాజ్ కుమార్ హిరానీ, ఇంతియాజ్ అలీ, కబీర్ ఖాన్ వంటి దర్శకులు, నిర్మాతలు కూడా హాజరు కానున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు చరణ్‌ ఆహ్వానం అందుకున్నారు.

 అంతే కాదు నటన రంగంలో విశేష కృషి కనబరిచిన చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకలో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ గా అవార్డు అందుకోబోతున్నారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు చరణ్. 

మహేష్, రాజమౌళి సినిమా ఎప్పటి నుంచి అంటే!

నిన్నటి వరకు యావత్‌ ప్రపంచం మొత్తం కల్కి మేనియా నడిచిన సంగతి తెలిసిందే. నెక్ట్స్‌ ఏ సినిమా గురించి ఈ ఎదురు చూపులు అంటే కచ్చితంగా అందరి నోట నుంచి వచ్చే ఒకే ఒక్క మాట రాజమౌళి, మహేష్‌ బాబు సినిమా అనే చెబుతారు.   టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది వీరి సినిమానే.

అయితే ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ ఇంకో పక్క రాజమౌళి అండ్ టీం లొకేషన్స్ సీన్స్ డిజైన్ విషయాల్లో కసరత్తులు చేస్తుండగా అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా మొదలు కావడానికే చాలా సమయం పట్టేటట్లు కనిపిస్తుంది.

నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఈ సినిమా మొదలు అవుతుంది అనుకున్న సినిమా నెక్స్ట్ అక్టోబర్ కి వెళ్ళింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్‌ ప్రకారం సినిమా ఇక్కడ నుంచి కూడా లేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ సినిమా మొదలయ్యేది ఈ ఏడాది చివరలోనే అని తెలుస్తుంది. సో మరికొంత సమయాన్ని మేకర్స్ తీసుకోనున్నారని టాక్. ఇక ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ ఒక క్రేజీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా అలాగే రాజమౌళి మార్క్ స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

Anam slams Vijayasai Reddy promoted As `Grand Father’, Also From A1 To A2

AP Endowment Minister Anam Ramanarayana Reddy has ridiculed YSRCP Rajya Sabha leader Vijayasai Reddy alleging that he was promoted as `grand father’ and also from A1 to A2. It may be recalled that he is A2 in all the CBI and ED cases registered against former chief minister YS Jaganmohan Reddy as A1.

Now, he alleged that the YCP MP has resorted to several illegal and irregular activities in and around Visakhapatnam during the last five year’s YCP regime, the minister said that has been giving him promotion to become A1.

“Twitter Babai has been branded as A1 by Twitter Grandfather”, he flyed. Commanding the people of Lok Sabha constituency for defeating him in the recent polls, he asked do we need such wicked leaders?. 

Refuting Vijayasaireddy’s anger over accusations against him with regard to his alleged relationship with an endowment officer, Ramanarayana Reddy recalled that the YCP MP had earlier given abusive tweets against Nara Lokesh and Deputy Chief Minister Pawan Kalyan. Don’t you remember family values then?, he wondered.

He said that Endowment Assistant Commissioner Shanti was already under suspension. She was selected by the AP Service Commission in 2019 and posted  in Visakhapatnam.

“Commissioner-level officials investigated the allegations against her and suspended her. Even if the YCP government was in power, she would have been suspended. She has connections with political leaders. She committed corruption in the discharge of her duties” he added.

The minister revealed that she had applied to the commissioner for permission to buy a villa in Vijayawada. The commissioner did not given her permission, but she  was allowed to buy an apartment only.

“We have information that Revenue lawyer Subhash has a role in Visakhapatnam. Along with government lands, we are also investigating these lands on lease for 99 years with the permission of Chief Minister Chandrababu Naidu”, the  Minister Anam Ramanaraya Reddy made it clear.

Revanth Reddy vs Harish Rao Heats Up Telangana Politics

Ever since Revanth Reddy dethroned KCR in the 2023 December elections, Bharatiya Rastra Samithi MLA and former minister Harish Rao has been aggressively targeting the Congress party in Telangana over various issues relating to farmers, power, water and paddy procurement. He threw numerous challenges to Revanth Reddy in the last six months and also vowed to resign from his MLA post if the Congress government implements the farm loan waiver promise made in the manifesto. 

As Revanth Reddy’s government initiated the roll out of this historic poll promise on Thursday with the plan to complete the entire process in the next two weeks, Harish Rao’s resignation challenge became the talking point in political circles all over the state. While the Congress party supporters spread Harish Rao’s past videos in which he asserted to resign from his post if the scheme is implemented and demanded him keep his promise, the BRS party followers launched a counter attack by referring to Revanth’s old videos in which he challenged the government on various issues and didn’t stick to his words. 

The war of words between Revanth and Harish Rao reached a new high on Thursday as both of them traded charges over the ‘Resignation’ challenge. The Chief Minister took a sly dig on Harish Rao by criticising indirectly that those who challenged to resign will now run away as the farm loan waiver promise is fulfilled in the state. Revanth strongly asserted that the Congress party and the Gandhi family will never go back on any poll promise in history. 

Reacting on Revanth Reddy’s comments, Harish Rao came up with a sharp riposte in the form of press release later in the day. He hit back at Revanth by referring to the former’s challenges in the past when he didn’t keep his word on resignation after losing in Kondangal in the previous election. He also took potshots at the CM for not resigning as MLA when Telangana movement was at its peak before bifurcation. 

Harish Rao further lashed out at Revanth by claiming that he has the history of sacrificing his posts for the sake of Telangana and its people. He said he will always stand by the welfare of farmers and marginalized sections in the society. 

Harish again threw a challenge at Revanth Reddy that he would definitely resign from MLA post if his government fulfills all its election promises by August 15th including the 2 lacs loan waiver to all farmers in the state. 

Telangana Assembly Budget Session From 23rd

Telangana Legislative Assembly budget session will commence from  23rd of this month and Legislative Council meetings will be held from 24th. The Governor has issued a notification in this regard. The assembly is likely to continue for 10 days.

On the first day, the assembly will mourn the late Cantonment MLA Lasya Nandita.The full budget is expected to be presented on 25th of this month.  As the Union Finance Minister Nirmala Sitharaman is presenting her budget in the Parliament on 23rd, it will enable the state to incorporate grants and other funds allocated to the state before presenting a final budget in the assembly.

On the 25th of this month, the Cabinet will hold a meeting in the Assembly Committee Hall to approve the budget before it is introduced in the Assembly.The Rs 2.75 lakh crore vote on account budget was approved by the Assembly in February for four months, which will expire at the end of this month.

Apart from the budget, the government hopes to discuss and pass resolutions on Dharani, Rythu Bharosa, BC reservations in local bodies, job calendar, recovery from those who have benefited illegally in welfare schemes, statue of Telangana mother, government emblem etc.

The Leader of Opposition K Chandrasekhar Rao, who was absent from the last assembly sessions, has recently announced that he will attend the assembly session this time. His presence is likely to facilitate interesting encounters between the ruling party and also the opposition.

Meanwhile, during the assembly elections, Congress had 64 MLAs and CPI one seat, making the ruling party strength of 65 MLAs. But after Congress won the Secunderabad Cantonment by-election and as many as 10 MLAs from BRS  joined the Congress, the strength of the party has reached 76.

On the 11th of this month, Legislative Assembly Speaker Gaddam Prasad Kumar, Legislative Council Chairman Gutta Sukhender Reddy, convened a review of the assembly session’s arrangements with various department heads.

కలిదిండి రాజు గారిది సింగిల్ పాయింట్ ఎజెండా!

సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వస్తే చాలా రకాల ఎజెండాలు పెట్టుకుని పనిచేస్తారు. ఆర్థికంగా నెక్ట్స్ లెవెల్ కు ఎదగడం దగ్గరినుంచి, నాయకత్వం పరంగా, అధికారం పరంగా ఎదగడం గురించి పావులు కదుపుతూ ఉంటారు. వివిధ హోదాలు, పదవులు ఆశిస్తూ ఉంటారు. తద్వారా రాగల ప్రయోజనాలను లెక్కవేస్తూ ఉంటారు. కానీ.. ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కలిదిండి రఘురామక్రిష్ణరాజు మాత్రం సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. ఓ నెలరోజులు వ్యవహారాలను బాగా స్టడీచేసిన ఈ కలిదిండి రాజు.. తీవ్రమైన ఆరోపణలతో గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారిమీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆ కేసు అంతు తేల్చేదాకా.. దానికి సంబంధించి తాను ఆరోపించిన వ్యక్తులను విచారించే దాకా, వారికి శిక్షలు పడేదాకా విశ్రమించకూడదని ఆయన గట్టి నిర్ణయంతో ఉన్నట్టుగా ఉంది.

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత సీఎం జగన్ తో విభేదించారు. జగన్ మీద తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడడం ప్రారంభించారు. ప్రభుత్వ పాలన గురించి నిశిత విమర్శలతో ఇంటర్వ్యూలు ఇస్తూ, యూట్యూబ్ వీడియోలు విడుదల చేస్తూ.. జగన్ దళాలను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. భరించలేకపోయిన జగన్ తన భక్తులైన పోలీసు అధికారుల్ని పురమాయించారు. ఆయన మీద రాజద్రోహం కేసులు బనాయించి సీఐడీని ఉసిగొల్పారు.

హైదరాబాదు నివాసంలో ఉన్న రఘురామను అరెస్టు చేసి తీసుకువచ్చి.. తీవ్రంగా హింసించారు. దీనిపై అప్పట్లోనే కోర్టుల్ని ఆశ్రయించి.. బెయిలు తెచ్చుకున్న రఘురామ.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత..  హత్యాయత్నం కేసు పెట్టారు. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఎం జగన్మోహన్ రెడ్డి, మరో సీఐడీ అధికారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంటు మీద కేసులు పెట్టారు.

అప్పటినుంచి రఘురామ అదొక్కటే ఎజెండాగా తిరుగుతున్నారు. ఆయన మంత్రి పదవి అడగలేదు, స్పీకరు కలగన్నారు గానీ పట్టుబట్టలేదు. తనను కొట్టిన వారి భరతం పడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసు సంగతి త్వరగా తేల్చాలని ప్రెస్ మీట్లు కూడా పెట్టిన ఆయన తాజాగా గుంటూరు జిల్లా ఎస్పీని కూడా కలిశారు. హత్యాయత్నం జరిగినట్టుగా తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఎస్పీకి అందజేశారు. తనకు పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అంటున్నారు.

తమాషా ఏంటంటే.. రఘురామ ఇప్పట్లో మీడియా వారు ఎవరు కలిసినా సరే.. తన మీద హత్యాయత్నం గురించి తప్ప మరో మాట మాట్లాడేలా లేరు. అది తేలితే గానీ.. మరో అంశం మీదికి దృష్టి సారించకూడదని పట్టుబట్టినట్టుగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. 

జగన్ కడుపుకొడితే.. చంద్రబాబు ఆకలి తీరుస్తున్నారు!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించిన తక్షణం విధ్వంసంతో  పరిపాలన ప్రారంభించారు. అమరావతిని సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు నాయుడు ముద్ర ఉంటుందని, ఆయనకు కీర్తి దక్కుతుందని అక్కసుతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అందరూ అనుకున్నారు. అవన్నీ కూడా చంద్రబాబు మీద ఆయన కక్షపూరిత నిర్ణయాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ వ్యవస్థను రద్దు చేయడం మాత్రం దుర్మార్గమైన నిర్ణయంగా పేరు పడింది. తటస్థులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేని నిర్ణయం అయింది.

2014 తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. నిరుపేదలకు, కూలీలకు, రిక్షా ఆటోవాలాలకు ఎంతోమందికి ప్రతి ఊరిలోనూ ఈ అన్న క్యాంటీన్లు ఎంతో సదుపాయంగా ఉండేవి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అన్నార్తుల ఆకలిని ఈ అన్న క్యాంటీన్లు తీర్చాయి.

అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లను రద్దు చేయడం బహుధా విమర్శల పాలయ్యింది. జగన్ సొంత పార్టీలో కూడా అనేకమంది నాయకులు అన్న క్యాంటీన్ రద్దు చేయడానికి వ్యతిరేకించారు. చాలామంది మేధావులు కూడా అన్న క్యాంటీలను రద్దు చేయకుండా, కావలిస్తే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో వాటిని నడపవచ్చునని సలహా ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అవేవీ తలకెక్కలేదు తాను తలచిందే కరెక్ట్ అన్నట్లుగా పేదవాడి కడుపు కొట్టారు.

అన్న క్యాంటీన్లు మూసివేసిన తర్వాత విపరీతంగా విమర్శలు రావడంతో.. బొత్స సత్యనారాయణ వంటి నాయకులు అన్న క్యాంటీన్లను మరో రూపంలో ప్రారంభిస్తామని ఆసుపత్రుల వద్ద రోగులకు వారి బంధువులకు సేవలు అందించేలా చూస్తామని రకరకాల మాయమాటలు చెప్పారు. అవేమీ కార్యరూపంలోకి రాలేదు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి రానేలేదు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన తొలి సంతకాలలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 203 చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. రాష్ట్రమంతా ఒకే రీతిలో, ఒకే మెనూతో వీటిని నిర్వహించబోతున్నట్లుగా మంత్రి నారాయణ ప్రకటించారు.

జగన్ కడుపు కొడితే, పేదవాడి ఆకలి తీర్చే నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తిరిగి అమలులోకి తీసుకు వచ్చినందుకు నిరుపేదలు రాష్ట్రమంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక విమానాలకు బడ్జెట్ లేదమ్మా!

జగన్ మోహన్ రెడ్డి వైభవోపేతమైన జీవన శైలి నెమ్మదిగా రూపు మార్చుకుంటోంది. అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయన రాజభోగాలను ఎలాగైతే అనుభవించారో అందరికీ తెలుసు. ప్రజలు ఓడించిన తరువాత.. ఇప్పుడిప్పుడే ఆయన సామాన్యుల్లాగా బతకడం నేర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్న రోజుల్లో ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లాలన్నా సరే.. ప్రత్యేక విమానం తప్ప మరొకటి ఎక్కేవారు కాదు. అలాంటిది.. అయిదేళ్ల తర్వాత తొలిసారిగా బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన ఇతర ప్రయాణికులతో కలిసి ఇండిగో విమానంలో వచ్చారు.

జగన్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వైభవం అనూహ్యమైనది. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్లాలన్నా కూడా ఆయన హెలికాప్టర్ లో మాత్రమే వెళ్లేవారు. తాడేపల్లి నుంచి కడప వెళ్లాలంటే కూడా ప్రత్యేక విమానం మాత్రమే ఎక్కేవారు. ఈ స్థాయిలో ఆయన వైభవం పరిఢవిల్లింది. ఆయన అధిరోహించే ప్రత్యేక విమానాలే.. ఎంత విలాసవంతంగా ఖరీదుగా ఉంటాయో తెలియజెప్పే ప్రత్యేక కథనాలు కూడా మీడియాలో అనేకం వచ్చాయి. జగన్ అయిదేళ్లలో కేవలం ప్రత్యేక విమానాల కోసం పెట్టిన ఖర్చు మొత్తం గణిస్తే వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
నిజానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ముందు ఇంకా చాలా సింపుల్ లైఫ్ గడిపేవారు. హైదరాబాదు లోటస్ పాండ్ లో నివాసం ఉండే ఆయన తరచూ కడప లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ఎక్కువగా రైలు ఎక్కేవాళ్లు. ప్రతి స్టేషన్లోనూ తలుపు దాకా వచ్చి అక్కడ గుమికూడే వందల మంది పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసి.. ఒకటిరెండు మాటలు మాట్లాడి వెళ్లేవారు.

అంత సింప్లిసిటీ నుంచి సీఎంగానే జగన్ ఒక్కసారిగా టాప్ గేర్ వేసేశారు. అన్నీ ప్రత్యేక విమానాలే. తీరా ఓడిపోయిన తర్వాత.. బెంగుళూరు నుంచి గన్నవరంకు సాధారణ పౌరవిమానంలో రావడం విశేషం.
నెమ్మదిగా జగన్ పాత బాటలోకి వెళ్తారని.. రైలు ప్రయాణాలు కూడా చేస్తారని, ప్రజలతో మమేకం కావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారం పోయిన వెంటనే.. ఇలా వైభవం మొత్తం హరించుకుపోవడం పట్ల మాత్రం జనం నవ్వుకుంటున్నారు. 

జగన్ వినుకొండ పర్యటనలో అల్లర్లకు వైసీపీ స్కెచ్!

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్తితుల పరంగా అల్లకల్లోలం సృష్టించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రరచన చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే, తమ పార్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయంటూ అడ్డగోలు ఆరోపణలతో ఆ పార్టీ వారు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మద్యం దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి హత్యకు గురైతే.. దానికి రాజకీయ రంగు పులిమి.. పరామర్శ కోసం జగన్ వినుకొండ వెళుతున్న సందర్భంగా కూడా అల్లర్లకు రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత పార్టీ వారు కూడా వారి దగ్గరకు రావడం లేదు. ఇలాంటి సమయంలో తెదేపా కార్యకర్తలు కూడా గత అయిదేళ్లలో వారి అవినీతిని ప్రశ్నిస్తున్నారు.
కొన్నిరోజుల కిందట తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకనాధ రెడ్డిని స్థానికులు వ్యతిరేకించారు. దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిన ఆయన వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. తంబళ్లపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతే తప్ప పరిస్థితులు అదుపు తప్పలేదు. అయితే.. ఆ సంఘటన తర్వాత.. వైసీపీ నాయకులకు కొత్త అయిడియా వచ్చినట్టుంది.

గతంలో పోలీసులు వద్దని చెప్పినప్పటికీ.. తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పుంగనూరు పర్యటన ప్లాన్ చేసుకుని.. పరిస్థితులు అదుపు తప్పేలా ప్రణాళిక రచించారు. ఘర్షణలు జరిగాయి. వారు కోరుకున్నదే జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటివి జరిగితే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నట్టుగా ప్రభుత్వంపై బురద చల్లవచ్చునని వారి ప్లాన్ గా తెలుస్తోంది.

దానికి కొనసాగింపుగానే.. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. రషీద్ హత్య అనేది కేవలం ఒక మిష. తన పర్యటన ద్వారా.. రెచ్చగొట్టే ప్రకటనలు చేయాలనే ఉద్దేశంతోనే జగన్ వెళుతున్నారని తెలుస్తోంది. పోలీసులు ఆయన పర్యటనను ఆపడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ జగన్ వెళ్లడం అనివార్యం అయితే.. వినుకొండలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా అభిప్రాయపడుతున్నారు.