Home Blog Page 732

Telangana budget session begins tomorrow

The Telangana Legislative Assembly is scheduled to begin its Budget Session at 10 a.m. on Tuesday. The session will open with a condolence motion for former MLA Lasya Nandita, who tragically passed away in an accident. Nandita, elected from the BRS party in the previous assembly elections, will be honored with a formal tribute.

Chief Minister Revanth Reddy will move a resolution to express sorrow over Nandita’s death. Following this, the Assembly will be adjourned for a brief period.

The Advisory Committee on Parliamentary Affairs will then meet to finalize the schedule and agenda for the budget session.

CM Chandrababu and MLA Raju Talk Over Rushikonda Palace’s Public Access

The BAC meeting kicked off today’s assembly session with an intriguing discussion between CM Chandrababu Naidu and BJP MLA Vishnu Kumar Raju regarding the Rushikonda Palace.

MLA Vishnu Kumar Raju proposed making the Rushikonda Palace accessible for public viewing. He suggested charging an entry fee of Rs 30 or Rs 50, allowing everyone to see the luxurious toilet that reportedly cost Rs 25 lakh.

In response, Chandrababu Naidu commented, “Rs 50 is too much,” and noted that he had never encountered such an expensive toilet.

Raju further argued that the authorities should expose the alleged illegal construction of Rushikonda Palace to the public, displaying price details in front of every item. He urged the CM to disclose the extent of funds misappropriated by Jagan, asserting that revealing the contract agreements would expose all irregularities.

Vishnu Kumar Raju emphasized that it would be beneficial to discuss the Rushikonda Palace issue in the current assembly session.

‘Kannappa’ Unveils New Poster Featuring Sarathkumar as “Nathanadhudu”

Ever since the announcement has been made about Manchi Vishnu’s ‘Kannappa’, excitement has been rising around the much-awaited film, thanks to its star-studded cast.

Manchu Vishnu takes on the lead role, supported by its stellar ensemble cast of Prabhas, Akshay Kumar, Kajal Aggarwal, Mohan Babu, Sarath Kumar, Shiva Rajkumar, Preity Mukundan, Madhubala, Brahmanandam, and many others.

The makers of ‘Kannappa’ have unveiled a new poster of Sarath Kumar as “Nathanadhudu”. Sharing the poster on their social media handles, they revealed the details of his role and wrote, “Embark on the ‘#Kannappa’ adventure with @r_sarath_kumar as ‘Nathanadhudu’, leading the descendants of ‘Bhima Sena’ and ‘Hidimbi’, celebrated for their expertise in bow and arrows.”

Manchu Vishnu portrays the titular role of ‘kannappa’, a devoted follower of Lord Siva. The recently released teaser highlights Bollywood actor Akshay Kumar in the role of Lord Siva and offers glimpses of Prabhas, Kajal Aggarwal, Mohan Babu, Preity Mukundan, and Sarath Kumar.

Mukesh Kumar Singh, renowned for his legendary work on the mythological series ‘Mahabharatam’, is at the helm of direction for this epic film. Actor-producer Mohan Babu is backing the project with a high budget under the banners of 24 Frames Factory and Eva Entertainments. Mani Sharma and Stephan Devassy are jointly producing the musical tunes.

Recent reports suggest that the filmmakers are planning for a December release. If the rumors are true, it will clash with Allu Arjun’s highly anticipated sequel, ‘Pushpa 2: The Rule’, helmed by Sukumar. Slated for a pan-Indian release, ‘Kannappa’ will hit screens in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.

బడ్డీలో బాలయ్య రిఫరెన్స్‌.. ఇక పునకాలే కాసుకోండి!

మెగా హీరో అల్లు శిరీష్  తాజాగా నటిస్తున్న మూవీ  ‘బ‌డ్డీ’ ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప‌నులు ముగించుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాను సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తుండగా, ఫిక్ష‌న‌ల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ప్రేక్షకుల‌ను ఆకట్టుకోబోతుంది. ఇక ఈ సినిమాలో ఫ్లైట్ కెప్టెన్ గా అల్లు శిరీష్ న‌టిస్తుండ‌గా, ఓ గ్రాఫిక్స్ టెడ్డీ బేర్‌ చుట్టూ క‌థ సాగ‌నుంది. ఇప్ప‌టికే విడుదల అయిన ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ ని క్రియేట్‌ చేస్తున్నాయి.

కాగా, ఈ సినిమాలో అభిమానుల‌కు ఓ స‌ర్ప్రైజ్ ఉండ‌నుంద‌ని సమాచారం. ఈ సినిమాలో నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కు సంబంధించిన ఓ రిఫ‌రెన్స్ ఉండ‌బోతుందని సమాచారం. ‘జై బాల‌య్య’ స్లోగ‌న్ తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్ల‌నున్నాయని చిత్ర యూనిట్ ఊరిస్తుంది. ఓ యాక్ష‌న్ సీన్ సంద‌ర్భంగా ఈ స్లోగ‌న్ ఉంటుంద‌ని, ”భ‌గ‌వంత్ కేస‌రి” సినిమాలోని థీమ్ మ్యూజిక్ కూడా ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేయ‌నుంద‌ని చిత్ర బృందం ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా అజ్మ‌ల్, ముఖేష్ కుమార్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో చేస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 2న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది.

కన్నప్ప సినిమాలో శరత్‌ కుమార్‌ పాత్ర అదే!

మంచు వారి అబ్బాయి మంచు విష్ణు హీరోగా , తన డ్రీం ప్రాజెక్ట్ చిత్రం “కన్నప్ప”  సినిమా గురించి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమాని ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో  ఇండియా లోనే భారీ మల్టీస్టారర్ సినిమాగా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మరి శరత్ కుమార్ పై రీసెంట్ గానే ఓ లుక్ పోస్టర్ కూడా వచ్చి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు అసలు శరత్ కుమార్ పాత్ర ఏంటి.. ఆయన మూవీలో ఎలా కనిపిస్తారు అనేది మరో ఇంట్రెస్టింగ్ లుక్ పోస్టర్ తో చిత్ర బృందం రివీల్ చేశారు. ఈ చిత్రంలో శరత్ కుమార్ “నాత నందుడు” గా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

అలాగే తాను పాండవ భీమ సేన, హిడింబిలకి వారసుడు కాగా కోయల ప్రజలకి నాయకుడుగా కనిపిస్తారని ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో మేకర్స్ తెలిపారు. మరి ఈ రోల్ సినిమాలో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూడాలి. 

వైసీపీకి కీలకనేత వీడ్కోలు : అవకాశవాదుల్ని రానివ్వొద్దు!!

గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయిన మద్దాళి గిరిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తెలుగుదేశంలో చేర్చుకోరాదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడుగా కూడా పనిచేసిన మద్దాళి గిరి.. తాజాగా పార్టీకి రాజీనామా చేసేయడంతో.. తెలుగుదేశంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గిరి టీడీపీవైపు చూస్తున్నారని వార్తలు వస్తుండగా పార్టీ కేడర్ మండిపడుతున్నారు. అవకాశవాదులు తిరిగి వస్తే చేర్చుకోరాదని అంటున్నారు.
మద్దాళి గిరి తెలుగుదేశం తరఫున గెలిచాన వైసీపీలోకి వెళ్లిపోయారు. అక్కడ పదవులు తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించినప్పుడు కూడా ఆయన మేలుకోలేదు. పార్టీ గెలుస్తుందేమో ఇంకేదైనా లబ్ధి పొందుతూ బతకవచ్చునని అనుకున్నారు. నిజానికి జగన్ టికెట్లు నిరాకరించిన అనేకమంది సిటింగ్ ఎమ్మెల్యేలు అప్పుడే పార్టీకి రాజీనామా చేసేసి ఇతర పార్టీల్లో చేరారు. కొందరు తెదేపాలోకి, జనసేనలోకి వెళ్లినా.. అక్కడ అవకాశం లేకపోయినా సరే.. వైసీపీని వీడి కాంగ్రెసులో చేరిన వారు కూడా ఉన్నారు. కానీ.. మద్దాలి గిరి ఎంతటి అవకాశవాది అంటే ఆయన అసలు రాజీనామా చేయనేలేదు. జగన్ మళ్లీ గెలుస్తాడేమో అని ఎదురుచూస్తూ గడిపారు. ఇప్పుడు ఓటమి ఖరారయ్యాక.. జగన్ తన తీరుతో మళ్లీ గెలవబోయేది కూడా ఉండదని అర్థమైన తర్వాత.. ఇప్పుడు రాజీనామా చేశారు.

ఇంత ఘోరమైన అవకాశవాదుల్ని పార్టీలో చేర్చుకోవడం ఎప్పటికైనా పార్టీకి ప్రమాదకరం అని కార్యకర్తలు అంటున్నారు. సాధారణంగా చంద్రబాబునాయుడు.. ఇలాటి అవకాశవాదుల్ని తిరిగి తేర్చుకోవడం పట్ల ఉదారంగా ఉంటారనే అపకీర్తి ఉంది. పార్టీ బలంగా ఉండడమే ప్రయారిటీ అనుకునే చంద్రబాబు.. వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ వచ్చినా చేర్చుకుంటారని అంటుంటారు. ఎన్నికలకు ముందు అయితే.. ఇలాంటి చేరికలు ఓకే గానీ.. గెలిచినప్పుడు మాత్రం మన చెంతకు వచ్చి, పార్టీ ఓడిపోయినప్పుడు పారిపోయే  వారు వద్దనేది కేడర్ మాటగా ఉంది.

మరి మద్దాళి గిరి ఏ పార్టీలో చేరుతారో.. తెదేపా అధినేతనే ఒప్పిస్తారో.. లేదా,,. జనసేన, భాజపాలో చేరే అవకాశాన్నిఎంచుకుంటారో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇకపై గిరి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

ఆ ఇద్దరు భామలతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న మాస్‌ కా దాస్‌!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమాతో విశ్వక్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా విశ్వక్‌సేన్‌కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంత‌రం విశ్వ‌క్ “మెకానిక్‌ రాకీ” అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఎస్‌ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన విశ్వక్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31 ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ట్రయాంగల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఫిమేల్ లీడ్ గా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
 ఇప్పటికే ఈ సినిమాలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్‌ డేట్‌ లో వస్తున్న మిస్టర్‌ బచ్చన్‌!

దర్శకుడు హరీష్ శంకర్, మాస్‌ మహారాజా రవితేజతో కలిసి చేస్తున్న మూడో  సినిమా “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం సినిమా బృందం ఈ సినిమా విడదుల తేదీని తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ ను చిత్ర బృందం ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

నిజానికి ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల చేద్దామని అనుకున్న పుష్ప 2 పోస్ట్ పోన్ అవ్వడంతో సినిమా కాస్త ముందుగానే విడుదలకు సిద్దం అయిపోయింది. యాక్షన్ ఎపిసోడ్స్ కు అధిక ప్రాధాన్యత ఈ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తుంది. రవితేజ.. బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాలో ఆయన అభిమానిగా కనిపించబోతున్నట్లు ఓ టాక్‌.

ఈ సినిమాలో హీరో రవితేజ నిజాయితీ ఉన్న ఆదాయపు పన్ను అధికారిగా కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో హీరో రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. జగపతిబాబు ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడిగా యాక్ట్‌ చేస్తున్నారు. 

బాలయ్య కూడా అదే రోజు వస్తే..ఇక సందడే సందడి!

నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌ లో 109 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాబీ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు బయల్దేరి వెళ్లింది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను డైరెక్టర్‌ బాబీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.

కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుకగా విడుదల అవుతుందని అనుకుంటున్న తరుణంలో ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు బాలయ్య. దీంతో షూట్ వాయిదా పడుతూ వచ్చింది. అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇటీవల బాలయ్య షూటింగ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్‌.

అయితే దీని గురించి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ డేట్ కు వస్తే వారం గ్యాప్ లో అనగా 25న రానున్న శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ నుండి గట్టి పోటీ ఏర్పడనుంది.  వారం గ్యాప్ లో రావడం వలన కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. వీటితో పాటు పుష్ప-2, కన్నప్ప కూడా డిసెంబర్ లోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న బాలయ్య, బాబీ చిత్రానికి ‘వీరమాస్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

చరణ్‌ -బుచ్చిబాబు సినిమా ఎప్పటి నుంచి అంటే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి ఇప్పటికే చాలా కాలం అవుతోంది. ఈ సినిమా చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తోంది. శంకర్, రామ్ చరణ్ ల సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ కారణంగానే బుచ్చి సినిమా ఆలస్యం అయ్యిందనే విషయం తెలిసిందే. శంకర్ ఎప్పుడు షూటింగ్  ఉందంటారో ఎప్పుడు లేదంటారో ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు.

కాగా శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్టు కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటనలో తెలిపాడు. చరణ్ కు సంబంధించి కేవలం 10రోజుల షూటింగ్ మాత్రమే ఉందని తెలుస్తోంది. దీంతో చరణ్ శంకర్ సినిమాకు బైబై  చెప్పేసి బుచ్చి బాబు సినిమా సెట్స్ పైకి రానున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు తీసుకుని వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలోపు రామ్ చరణ్ గెడ్డం, మీసం పెంచే పనిలో ఉన్నారు. అనుకున్న గెటప్ వస్తే షూటింగ్ స్టార్ట్ చేయాలని బుచ్చిబాబు రెడీ గా ఉన్నాడు.

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని ఇండస్ట్రీలో ఓ టాక్‌ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాకు “పెద్ది” అనే   టైటిల్ ని ఫిక్స్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్టుగా వినిపిస్తుంది. అయితే దీని గురించి చిత్ర బృందం నుంచి ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

 కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోస్తిస్తున్న సంగతి తెలిసిందే.