మనం చాలా మాఫియా సినిమాల్లో చూస్తూ ఉంటాం. మాఫియా డాన్.. తన కష్టాలు చెప్పుకోవడానికి, తన ప్రత్యర్థుల వల్ల ముప్పు ఉన్నదని ఆవేదన చెప్పుకోవడానికి డీజీపీ లేదా కమిషనర్ వంటి పోలీసు ఉన్నతాధికారి వద్దకు వెళ్లి.. తన గోడు చెప్పుకుంటూ ఉంటాడు. కాకపోతే ఎవరైనా పెద్ద నాయకుడితో కలిసి.. దైవదర్శనానికి గుడికి వెళ్తాడు. లేదా, తన మీద దాడులు జరుగుతున్నాయంటూ పబ్లిక్ లో ధర్నాకు కూర్చుంటాడు.
సరిగ్గా ఆయన ఆ యాక్టివిటీలో ఉన్న సమయంలో.. ఆయన ప్రత్యర్థి ముఠాకు సంబంధించిన అందరినీ ఒక్కొక్కరుగా లేపేస్తూ ఉంటారు. వరుస హత్యలు జరుగుతాయి. ఏ హత్యలో కూడా, ఈ మాఫియా డాన్ పేరు వినిపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే.. ఆయన అందరి కళ్లెదురుగా వేరే పనిలో ఉండగా.. ఈ హత్యలు జరిగాయి కాబట్టి.. అని తేల్చేస్తారు.
అచ్చంగా ఇదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కక్షలు, ఫ్యాక్షన్ హత్యలు గా మారి ప్రమాదకరంగా తయారవుతున్నాయా? అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే.. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండాపోయాయని ఆరోపిస్తూ ఢిల్లీలో ధర్నాకు కూర్చుంటున్నారు.
అక్కడలా జరుగుతుండగానే.. ఇక్కడ పీలేరులో తెలుగుదేశం నాయకుడు గిరినాయుడు ఇంట్లోకి పదిమంది దుండగులు చొరబడి ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఆయన మీద తుపాకీతో కాల్పులు జరిపారు.
తన మీద దాడికి దిగిన దుండగులను ప్రతిఘటించిన గిరినాయుడు.. తేరుకుని వారితో కలబడి వారినుంచి తుపాకీని లాక్కోవడంతో.. వారంతా బైక్ పై పారిపోయినట్టుగా తెలుస్తోంది.
కాల్పులు తెలుగుదేశం నాయకుడి మీద జరిగాయి గనుక.. సహజంగా వైఎస్సార్ కాంగ్రెస్ వారికి చెందిన వారి పనే అనే అనుమానం కలుగుతుంది. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జగనన్న ఢిల్లీలో ధర్నాకు కూర్చుంటూ.. ఇక్కడ తన శ్రేణులను అల్లకల్లోలం చేయసేయాల్సిందిగా పురమాయించి వెళ్లారా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పీలేరులోని తెదేపా నేత గిరినాయుడు మీద హత్యాయత్నం ఖచ్చితంగా వైసీపీ వారి పనే అని కూడా అంటున్నారు.
ఆ ఇద్దర్నికాదని జాన్వీ ఓటు ఎవరికో తెలుసా!
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వీ కపూర్ తాజాగా ఎన్టీఆర్ పై క్రేజీ కామెంట్లు చేసింది. జాన్వీ కపూర్ తాను ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్ట పడతారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పుకొచ్చింది. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ లలో మీరు ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు, జాన్వీ కపూర్ చాలా భిన్నంగా స్పందించి సమాధానం తెలిపింది.
విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ ఇద్దర్నీ కాదని, జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేసేందుకు తాను ఇష్టపడతాను అని జాన్వీ చెప్పుకొచ్చింది. ‘ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్‌తో ఓ సాంగ్ చేశా. మరో సాంగ్ చేయడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని జాన్వీ కపూర్ తెలియజేసింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి దేవర సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు..గుర్తు పట్టడం చాలా కష్టం!
టాలీవుడ్ యంగ్ రౌడీ హీరో ‘విజయ్ దేవరకొండ’ గురించి ప్రత్యేక చెప్పానవసరం లేదు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న రోల్స్ చేసి.. స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘పెళ్లి చూపులు’ సినిమా విజయ్‌కు సూపర్ హిట్ ఇస్తే.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ డిజాస్టర్ లుగా నిలిచినా… ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కొంచెం ఫర్వాలేదనిపించాయి.
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వీడీ 12’. ఈ చిత్ర షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్‌ను గత నెలలో విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా విజయ్‌కు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బైక్‌పై వెనకాల కూర్చొని తీక్షణంగా చూస్తున్నాడు. గడ్డం, పొట్టి షార్ట్ హెయిర్ స్టైల్‌లో గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. ఇది చూసిన నెటిజన్స్.. ‘ఎలా ఉండే వాడు.. ఎలా అయిపోయాడు’, ‘విజయ్ దేవరకొండను గుర్తుపట్టడం చాలా కష్టమే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వీడీ 12 తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే..
Farmers Meet Rahul Gandhi Day After Union Budget
A day after the presentation of the 2024 Union Budget, which remained silent on the long-standing demand for legalised MSP, a delegation of farmer leaders from across India met with Rahul Gandhi.
The Leader of the Opposition was sought out in the parliament complex on Wednesday, where the INDIA bloc opposition leaders were protesting against what they considered a partisan and non-inclusive budget. The farmers’ delegation informed Gandhi of various issues they faced in their own states that needed amplification.
A 12-member farmer leaders delegation also reportedly requested to introduce a private member bill to address their longstanding demands. In a related development, leaders from the Samyukt Kisan Morcha (non-political) and Kisan Mazdoor Morcha announced their plans to burn effigies of the Modi government nationwide and launch a fresh protest to push for the legalisation of the Minimum Support Price (MSP) guarantee. This protest will include a “long march” to support the Opposition’s private bills.
“In our manifesto, we have mentioned MSP with a legal guarantee. We have done the assessment and it can be implemented. We had a meeting right now where were decided that we will talk to the other leader of the I.N.D.I.A alliance to put pressure on the Govt that MSP legal guarantee should be given to the farmers of the country,” Gandhi said after meeting farmer leaders.
Initially, the group of farmers was denied entry to Parliament. Speaking to the media during the Opposition protest, Rahul Gandhi questioned this: “Some farmers wanted to meet me, so I called them inside the office. But they were not allowed to come inside. You will have to ask the Prime Minister the reason for this.”
“Because they are farmers, maybe this is the reason they are not allowing them in,” said Rahul Gandhi. His remark may have recalled for many the barricading of Delhi borders against the farmers’ protest marches earlier this year.
Subsequently, the protesting farmers will take out a tractor rally nationwide on August 15, when the country marks Independence Day. They will also burn copies of new criminal laws.
అజిత్ తో ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ ప్రాజెక్ట్!
పాన్ ఇండియా సినిమా దగ్గర తన సినిమాలతో అదరగొట్టిన దక్షిణాది దర్శకుల్లో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరనే సంగతి తెలిసిందే. మరి ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరకు సౌత్ నుంచి బిగ్గెస్ట్ మాస్ హీరోలతోనే సాలిడ్ సినిమాలు చేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అటు కన్నడ లో రాకింగ్ స్టార్ యష్ ఇటు మన తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేసి మాస్ ఆడియెన్స్ కి క్రేజీ ట్రీట్ ని ఇచ్చాడు.. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో బిగ్గెస్ట్ మాస్ హీరోతో సినిమా చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
అది కూడా ఒక్క సినిమా కాదు ఏకంగా రెండు సినిమాలు అజిత్ తో నీల్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇది కానీ నిజం అయితే డెఫినెట్ గా మన సౌత్ సినిమా నుంచి మరో సెన్సేషనల్ మాస్ హిట్ కాంబినేషన్ గా మారుతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం అజిత్ విడా ముయార్చి , గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బిజీగా ఉండగా ప్రశాంత్ నీల్ సలార్ 2 తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి కలుద్దామంటునన క్రేజీ కాంబో!
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో లో రాబోతున్న క్రేజీ మూవీ కూడా ఒకటి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం గ్యారంటీ అని అందరూ అనుకుంటున్నారు.
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి సినీ సర్కిల్స్ లో ఓ క్రేజీ సమాచారం వినబడుతోంది. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబో లో రాబోతున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారని సమాచారం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు ”సంక్రాంతికి కలుద్దాం” అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ టైటిల్ ఉంటుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారట.
దీంతో వెంకటేశ్ నుంచి మరోసారి కుటుంబ కథా చిత్రం రాబోతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పోరాడే వేళ : వైసీపీకి మరో దెబ్బ పడిందే!
ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన స్థాయికి తగ్గట్టుగా ఉండాలని అనుకుని.. ఢిల్లీకి వెళ్లి అక్కడ ధర్నాకు ఉపక్రమించారు. అదే సమయంలో.. ఇక్కడ వైసీపీ భవనం మధ్యలోంచి ఒక ఇటుక జారిపోయింది. ఆ పార్టీ తరఫున గత అయిదేళ్లపాటు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ లాగా కొందరు వ్యక్తుల చేతుల్లో నడిచే పార్టీలో తాను కొనసాగలేను అని ఆయన తేల్చి చెప్పేశారు. అదే గుంటూరు జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ పార్టీకి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే కిలారి రోశయ్య కూడా రాజీనామా చేయడం ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికల్లో కిలారి రోశయ్య పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర మీద గెలిచారు. అయితే గత ఎన్నికల సమయంలోనే పార్టీ నేతలు ఆయనను వేధించారనే ప్రచారం ఉంది. ఆ ఎన్నికల్లో ఆస్తులు అమ్మి, తాకట్టు పెట్టి మరీ ఆయన ఎన్నికల ఖర్చులు పెట్టుకున్నారు. విజయం సాధించినప్పటికీ.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి ఉంది.
తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి పొన్నూరు టికెట్ మళ్లీ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. అక్కడైతే గెలిచే అవకాశం లేదు అని చెప్పి.. మరో ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. తొలుత లావు శ్రీకృష్ణ దేవరాయలును గుంటూరు ఎంపీగా అనుకున్నారు. లావు ససేమిరా అని చెప్పి.. తెలుగుదేశంలోకి వెళ్లడంతో కిలారి రోశయ్యను గుంటూరు ఎంపీగా ఆయనకు ఇష్టం లేకపోయినా పోటీచేయించారు. ఆ రకంగా తనను బలిపశువును చేశారనే అభిప్రాయం ఆయనకు ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్నాళ్లకు ఆయన పార్టీకి రాజీనామా చేయడం విశేషం.
‘వైసీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. నన్ను మానసికంగా కుంగదీశారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. కొందరు వ్యక్తుల ఇష్టప్రకారమే నడుపుతున్నారు’ అని రోశయ్య ఆరోపణలు చేశారు.
కిలారి రోశయ్య తర మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి జనసేనలో చేరవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వారి చేరికకు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగానే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కల్కి’ రికార్డుకి ఎసరు పెట్టే దిశగా మార్వెల్ హీరోస్..?
పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ ప్రెస్టీజియస్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఇటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా కల్కి రికార్డుల మోత మోగిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ కల్కి రికార్డుపై కన్నేశారు మార్వెల్ హీరోస్.
ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న ”డెడ్ పూల్ & వోల్వరిన్” మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఇండియాలో భారీగా క్రేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కల్కి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. కల్కి హిందీ బెల్ట్ లో తొలిరోజు ఏకంగా రూ.22 కోట్ల వసూళ్లతో 2024లోనే టాప్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi slams Budget 2024 Is A ‘kursi Bachao’ Budget
Taking a swipe at the Union government, Congress MP and Lok Sabha leader of the Opposition Rahul Gandhi on Tuesday described the Union Budget 2024 as a “kursi bachao” (save the chair) budget.
The former Congress chief also claimed that the budget was “copy and paste” job of the Congress manifesto for 2024 polls and previous budgets.
In a post on X, Gandhi said, ” ‘Kursi Bachao’ Budget. Appease Allies: Hollow promises to them at the cost of other states. Appease Cronies: Benefits to AA with no relief for the common Indian. Copy and Paste: Congress manifesto and previous budgets.”
The Congress also slammed the Union Budget as being “more focused on posturing than action” and claimed that the “copy-paste government” has borrowed heavily from the party’s manifesto for the Lok Sabha polls. The opposition party in its post claimed that the government had “tacitly” admitted that “mass unemployment is a national crisis”, and said the budget has “political compulsions written all over it”.
Former Union finance minister P. Chidambaram has also pointed out that chunks of the Budget appear to be copied from the Congress manifesto released ahead of the Lok Sabha elections 2024, held between April and June.
In a post, Congress president Mallikarjun Kharge said, “The Modi government’s ‘copycat budget’ could not even copy the Congress’ justice agenda properly! The Budget is distributing half-hearted rewadis (sops) to dupe its coalition partners so that the NDA survives.”
Samajwadi Party (SP) president Akhilesh Yadav linked her announcements of several development measures for Bihar and Andhra Pradesh to the BJP’s political compulsion to “save” its government and asked if there was anything for Uttar Pradesh, India’s most populous state.
Yadav said Uttar Pradesh has given the country its prime minister, claiming that the state’s farmers have received nothing despite the government’s earlier promises of doubling their income.
Meanwhile, the BSP chief Mayawati said while the country is struggling with extreme poverty, unemployment, inflation and underdevelopment, the government at the Centre has no intentions of working towards its upliftment.