Home Blog Page 728

KCR Flays Congress Maiden State Budget Lacking vision

BRS chief and Leader of Opposition K Chandrasekhar Rao has described the Congress government’s maiden budget as lacking vision. He dubbed the budget as anti-farmer and anti-poor.

KCR, who attended the Assembly session for the first time on Thursday after becoming the Leader of Opposition,said that the budget reflected the government’s indifference to the needs of various sections, particularly farmers and the lower classes.

Speaking at the Assembly media point after the State budget presentation, he lamented that the Congress government had back stabbed the people of Telangana on multiple counts, with no clear policy formulation on any aspect. He said the budget speech lacked substance and sounded more like“storytelling” rather than a well-structured financial plan.

Emphasizing his belief that the budget lacks substance and fails to present any new initiatives, he accused the government of merely reiterating the previous Vikramarka budget without offering any comprehensive understanding of the state’s economy.

“What is the agricultural policy, the industrial policy, the IT policy, or the policy for the poor? There is no clarity in this budget. It sounds more like a platform speech than a budget speech,” he asked.

The BRS chief expressed concern over the lack of support for farmers, mentioning the absence of schemes like Rythu Bharosa in the budget. He stated that by criticising the previous BRS government and accusing its predecessor of misusing funds, the Congress government appeared to be planning to discontinue farm investment support to farmers.

“The Congress government has failed to provide any assurance to farmers regarding the purchase of paddy, supply of free electricity, or provision of water. This government deceived both farmers and individuals practising traditional occupations,” he added.

Rao said the previous BRS government had implemented numerous schemes aimed at the economic development and welfare of all sections. However, he deplored that the Congress government had turned its back on the Yadav, Dalit and fishermen communities, and appeared to have discontinued schemes introduced by the previous BRS government for their socio-economic empowerment.

Highlighting the plight of women, the former Chief Minister pointed out that the promise of interest-free loans up to Rs.1 lakh crore was not new and that the current budget lacked innovative schemes.

He said that the Congress government had no clear policy on crucial sectors such as agriculture, industry, IT, and welfare for the poor even after seven months in administration. “This budget is nothing more than a collection of vague promises without any concrete policy formulation,” he observed.

ప్రభుత్వం మారినా పెద్దిరెడ్డి దందాలు సేమ్ టు సేమ్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నెంబర్ టూ. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పెత్తందారీ ధోరణులతో అయితే చెలరేగుతారో, ఆయన అంతకు మించి వ్యవహరిస్తారు. తనకు తిరుగులేదన్నట్లుగానే ఐదేళ్లపాటు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అధికార దురహంకారంతో చెలరేగిపోయిన వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే ఆయన పెత్తందారీ పోకడలకు మాత్రం తిరుగు లేకుండా ఉంది. అధికారులు ఆయన జోలికి వెళ్లడానికి భయపడతారు, సరి కదా హైకోర్టు చెప్పినా కూడా తనకు ఖాతరులేదని తాను తలచిందే చేస్తానని ఆయన నిరూపిస్తున్నారు. ఆయన పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినదే.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో తమ అధికారంలో ఉన్న రోజుల్లో తిరుపతిలోని తన ఇంటి ముందుగా మునిసిపల్ కార్పొరేషన్ డబ్బులతో సిసి రోడ్డు వేయించుకున్నారు. 2019-20 లో తొమ్మిదిన్నర లక్షల రూపాయల ఖర్చుతో ఈ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు పూర్తయ్యాక దానికి రెండు వైపులా పెద్ద పెద్ద ఇనుప గేట్లు పెట్టించి పెద్దిరెడ్డి వాటికి తాళాలు వేయించారు. మునిసిపాలిటీ వేసిన రోడ్డు మీద సామాన్య ప్రజలు ఎవరూ తిరగకుండా నిషేధం విధించారు. అయితే ఈ అరాచకత్వానికి వ్యతిరేకంగా జనసేన నాయకులు కిరణ్ రాయల్ తదితరులు ఆందోళన చేసి గేట్లను తొలగించే ప్రయత్నం చేయగా గతంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు వారికి హామీ ఇచ్చారు.

అయితే ఈలోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- తన భూమిలోని రహదారితో పాటు గేట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. నిజానికి అది ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన రోడ్డు. ఆయన సొంత రోడ్డు కాదు. తాము రోడ్డుని ఎక్కడ ధ్వంసం చేయలేదని గేట్లను తీసివేయడం లేదని, కేవలం ప్రజల రాకపోకలు కనుగుణంగా చర్యలు చేపడుతున్నామని కార్పొరేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించేలా గేట్లు తొలగించాలని కోర్టు ఆదేశించింది. అధికారులు గేట్లు తెరిచారు. అయితే పెద్దిరెడ్డి ఇంటిదాకా వచ్చాక అక్కడ కొత్తగా మరొక గేటు ఏర్పాటు చేయడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ రోడ్లో ప్రజలు ఎవరూ తిరగడానికి వీలు లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా సరే పెద్దిరెడ్డి దందా యధావిధిగా కొనసాగుతోందని, ఆయనను అడ్డుకోగలిగే వారు ఎవరూ లేరని ప్రజలు అనుకుంటున్నారు.

Tollywood young hero Akash Puri Announces New Name

Tollywood’s rising star Akash Puri, renowned for his performances in films like Mehbooba, Romantic, and his recent release Chor Bazaar, has taken a significant step in his career. On the occasion of his birthday today, Akash announced a major change—he will now be known as Akash Jagannadh.

In a heartfelt message shared across his social media platforms, Akash Jagannadh revealed his new name and hinted at exciting projects on the horizon. He expressed enthusiasm for his upcoming ventures, promising to deliver captivating narratives that will further showcase his talent.

Adding to the excitement, Akash Jagannadh has recently signed an endorsement deal with RC Trend Setters, where he will represent the clothing brand as its new ambassador. Fans can look forward to more updates on his upcoming films and projects as he continues to make waves in the industry.

విజయ్‌ సినిమాలో రవితేజ హీరోయినా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” అనుకున్న రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయింది.  అయితే ఆ సినిమా తర్వాత తాను తన 12వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విజయ్ లుక్ ఒకటి లీక్ అయ్యి ఇంటర్నెట్ ని షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మరోసారి విజయ్  టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌ గా మారాడు.

అయితే ఈ మూవీ మొదటి నుంచి హీరోయిన్ విషయంలో మంచి సస్పెన్స్ గానే ఉంది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాలో అయితే లేటెస్ట్ యంగ్ బ్యూటీ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ఆమెనే ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ “మిస్టర్ బచ్చన్” సినిమాలో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్స్ నటిస్తున్నట్టుగా టాక్‌. ప్రస్తుతం శ్రీలంక లో షూటింగ్ స్పాట్ నుంచి ఓ పిక్ అయితే వైరల్ అవుతుంది. దీంతో ఈమె ఈ సినిమాలో ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. 

KTR Criticizes Telangana Budget as Deceptive and Directionless

Hyderabad: BRS Working President KTR has strongly criticized the Telangana budget, describing it as a disappointing document that fails to meet expectations and breaks numerous promises. He labeled the budget as one of defaults and deceptions, accusing the government of mixing cuts and failing to deliver on its guarantees.

KTR criticized the budget for lacking clear policy direction and vision. He condemned the changes in allocations and the impact on various sectors, including agriculture and social welfare. He expressed dissatisfaction with the reduced support for farmers, claiming that the promises made to them were not fulfilled. He also denounced the budget’s treatment of female children, differently-abled individuals, and the elderly, describing it as a fraud against Mahalakshmi beneficiaries and other vulnerable groups.

The BRS leader also accused the government of ignoring the promises made to Dalits and tribals, asserting that their needs had been neglected. He criticized the budget for its failure to provide adequate support for minorities and the unemployed, and for its lack of a clear plan for the development of Hyderabad. KTR expressed frustration over the insufficient funds allocated for the city’s infrastructure and the absence of support for auto-rickshaw drivers and families affected by suicides.

Overall, KTR described the budget as directionless and lacking in meaningful support for various sectors and communities.

మహేష్‌- జక్కన్నల సినిమా టైటిల్‌ ఇదేనా?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన కెరీర్‌ లో 29 వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు హీరో, ఇటు దర్శకుడు కెరీర్‌ లోనే అతి భారీ బడ్జెట్‌ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా గురించి ఇప్పటికే హాలీవుడ్‌ రేంజ్‌ లో రాబోతుందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏది చేయలేదు. తాజాగా వినిపిస్తిన్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించనున్నట్లు సమాచారం.  ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చకచక జరుగుతున్నటు సమాచారం.

 ఈ మూవీలో తన పాత్రకు తగ్గట్టు మహేశ్ బాబు తన లుక్ ను మార్చే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల అంబానీ వివాహానికి హాజరయిన మహేశ్ లుక్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బ్లాక్ డ్రెస్ లాంగ్ హెయిర్ తో మైండ్ బ్లోయింగ్ లుక్ లో మహేష్ బాబు అదిరిపోయాడు.

కాగా వినిపిస్తున్న సమాచారం మేరకు రాజమౌళి, మహేశ్ బాబుల చిత్రానికి సంబంధించి ఇంట్రెస్ట్ న్యూస్ ఒకటి తాజాగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ ను  రాజమౌళి  పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ అంచనాలను అనుకోవడం చాలా కష్టం. బంగారం లాంటి మహేశ్ బాబుకు గోల్డ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Former CM KCR Criticizes Congress Government’s Budget As Betrayal

Hyderabad: Former Chief Minister and BRS chief K. Chandrasekhar Rao criticized Finance Minister Mallu Bhatti Vikramarka for presenting what he termed as an “anti-farmer budget.” Speaking at a media point after the budget speech, KCR accused the Congress government of betraying all sections of society.

“The Congress government has backstabbed all sections of society,” KCR stated. He pointed out that the previous administration had introduced several schemes for the welfare and economic development of various groups. 

KCR highlighted the discontinuation of the sheep distribution scheme aimed at the economic upliftment of the Yadav community, and the lack of mention of the Dalitabandhu initiative. “The voice of the downtrodden has been silenced. There is no mention of Dalitabandhu. There is no aid for fishermen,” he noted. 

KCR also criticized the reannouncement of interest-free loans for women, calling it an old scheme. “This budget shows no new policy formulation. They had a clear understanding of agriculture, but this government is an enemy of the farmer. There’s no grain procurement, no electricity supply, and no water supply,” he alleged.

He further criticized the absence of Rythu Bandhu and Rythu Bharosa in the budget. “When our MLAs asked about the Rythu Bharosa, there were no answers. This government has betrayed farmers and workers. It didn’t sound like a budget speech; it was more like a political rally. There’s no clarity on industrial or IT policy,” KCR concluded.

మరోసారి తల్లి కాబోతున్న బొంగరాల కళ్ల పిల్ల!

టాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో నటించిన ప్ర‌ణీత సుభాష్ త‌న‌కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ప్రణీత మంచి రోల్ లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా రెండోసారి త‌ల్లికాబోతున్న‌ట్లు తెలిపింది.

తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోల‌ను త‌న ఇన్స్టాలో పోస్ట్ చేసి ఈ శుభవార్త ను అభిమానుల‌తో పంచుకుంది. రౌండ్ 2.. ఇక నుంచి ప్యాంట్లు స‌రిపోవు అంటూ త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని సంతోషంగా వివరించింది. 2021లో వ్యాపార‌వేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్న ప్రణీత, 2022లో ఓ ఆడ‌పిల్లకు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు మ‌రోసారి త‌ల్లి కాబోతుండ‌టంతో తాను సంతోషంగా ఉన్న‌ట్లు పేర్కొంది.

కొద్ది రోజుల క్రితమే త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది ప్ర‌ణీత. ప్ర‌స్తుతం ప్ర‌ణీత సుభాష్ బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైర‌ల్  గా మారాయి. 

జోరు తగ్గించని బాలయ్య బాబు..కుర్ర హీరోలకు పోటీగా!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాతో బిజీబిజీగా గడుపుతున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హిందూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో ఆయన తన ఫోకస్ అంతా సినిమాల మీదకు మార్చారు. అందుకే ఒక పక్క ఏపీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నా సరే ఆయన వాటికి హాజరుకాకుండా తన సినిమా షూటింగ్లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతానికి బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న నందమూరి బాలకృష్ణ 109 సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. బాబీ డైరెక్షన్ లో ఈ  సినిమాని భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాని అక్టోబర్ లేదా నవంబర్ కి పూర్తి చేసి మంచి విడుదల తేదీకి ఈ సినిమాని రంగంలోకి  దింపాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే సినిమా అయిపోయిన వెంటనే బాలకృష్ణ రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అందులో ఒకటి అఖండ 2. ఈ సినిమాని అఖండ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి కాకుండా 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. ఈ బోయపాటి సినిమాతో పాటు బాలకృష్ణ మరొక సినిమా కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం మీద ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కాబట్టి మూవీ అనౌన్స్ చేసే సమయంలో డైరెక్టర్ ఎవరు అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక బాలకృష్ణ ఊపు చూస్తుంటే కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడా అని అనిపిస్తుంది. అయితే కుర్ర హీరోలే ఆచితూచి సినిమాలు చేస్తుంటే బాలకృష్ణ మాత్రం మంచి జోష్ లో సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు.

కమల వ్యూహం : మన సాయం ప్రజలకు తెలియాలి!

విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లండి.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా కట్టుబడి ఉన్నదో.. ఎంతెంత నిధులు కేటాయిస్తున్నదో విస్తృతంగా ప్రచారం చేయండి. రాష్ట్రవ్యాప్తగా భాజపాను బలోపేతం చేయండి.. కేంద్రంలోని మోడీ సర్కారు తలపెట్టడం వల్లనే.. ఏపీలో పెండింగ్ పనులన్నీ వేగవంతం అవుతున్నాయనే విషయాన్ని ప్రతి పౌరుడికీ తెలిసేలా చెప్పండి.. అని కమలనాథులు రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు భారీగా ఉన్న నేపథ్యంలో.. కేకులు కట్ చేసి కమలనాయకులు పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో.. వారి మీద పార్టీ నిర్మాణ బాధ్యత కూడా బాగా పెరుగుతోంది.

ప్రత్యేకహోదా ను ఏపీకి ఇవ్వకుండా వంచించినందుకు కేంద్రంలోని మోడీ సర్కారు, బిజెపి పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో బాగా విముఖత ఏర్పడింది. పైగా 2019 ఎన్నికలకు పూర్వం.. బిజెపితో తెగతెంపులు అయ్యాక.. చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాటాలతో మోడీ సర్కారు వైఖరిని ఎండగట్టారు. మొత్తానికి బిజెపి ప్రాభవం ఈ రాష్ట్రంలో కొడిగట్టిపోయింది. ఆ పార్టీ మళ్లీ ఎప్పటికీ కోలుకోవడం కష్టం అనే స్థాయికి ప్రజల్లో వారిపట్ల విద్వేషం పెరిగింది.

తెలుగుదేశంతో జట్టుకట్టడం వల్ల.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వారికి లాభం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కావడం మాత్రమే కాదు.. అసలు కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి తెదేపా కీలకం అయింది. అయినా సరే.. ఏపీలో తమ పార్టీని క్రమంగా బలోపేతం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. కూటమిగా ఉండడం ఓకేనేగానీ.. రాష్ట్రంలో తమకు ఆదరణ పెంచుకోవాలనే కోరిక బిజెపి వారిలో ఉంది. అందుకే ఇప్పుడు కేంద్ర కేటాయింపుల గురించి ప్రతి మారుమూల గ్రామానికి తెలిసేలా.. అంతా మోడీ ఘనత అని ప్రచారం జరిగేలా ప్రతి పార్టీ కార్యకర్త కూడా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

ప్రత్యేకహోదా అనే మాటను తెలుగు ప్రజలు మరచిపోయేలాగా.. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన ప్యాకేజీలను, అమరావతికి, పోలవరానికి ఇస్తున్న నిధులను గురించి ప్రచారం చేయాలంటున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు అమరావతి రాజధానికి అనుకూలంగా చాలా విస్పష్టమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో.. దానికి తాము మరింతగా నిధులిస్తే తమ పార్టీని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో బిజెపి ఉన్నట్టుగా తెలుస్తోంది.