Home Blog Page 720

యాక్షన్, థ్రిల్ మూమెంట్స్ తో సిటాడెల్‌..టీజర్‌!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా పలు వెబ్‌ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లలో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే  అది కచ్చితంగా హాలీవుడ్ స్పై థ్రిల్లర్‌కి రీమేక్‌గా వస్తున్న ‘సిటాడెల్’ అనే చెప్పుకోవాలి. ఇంగ్లీష్‌లో ‘సిటాడెల్’గా వస్తే ఇండియన్ వెర్షన్‌లో ఇది ‘సిటాడెల్ – హనీ బన్నీ’ సిరీస్‌గా రాబోతుంది.

ఇక ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌ను తెరకెక్కించిన దర్శకులు రాజ్ అండ్ డీకే లు దీనికి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ సిరిస్‌ను ఎప్పుడో మొదలు పెట్టినప్పటికీ విడుదల ఎప్పుడనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ, ఎట్టకేలకు గురువారం దీని గురించి మూవీ మేకర్స్‌ పెద్ద అనౌన్స్‌మెంట్‌ ని ఇచ్చారు. సమంత, వరుణ్‌లపై ఒక ఇంట్రెస్టింగ్ టీజర్‌ని సాలిడ్ యాక్షన్,  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నింపేసి ఈ వెబ్ సిరీస్‌పై అదిరిపోయే అంచనాలను పెంచేశారు.

ఈ సిరీస్ విడుదల తేదీ ని  కూడా మేకర్స్ తెలియజేశారు. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఒక్క హిందీ వెర్షన్‌లోనే మేకర్స్ దీనిని ప్రకటించారు. కానీ, ప్రైమ్ వీడియోలో గత సిరీస్‌ల తరహాలోనే ఇది కూడా పాన్ ఇండియా భాషల్లోనే  వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

ఆ వింటేజ్ మ్యాజిక్ రిపీట్ చేయనున్న శ్రీను వైట్ల!

మన టాలీవుడ్‌ దర్శకుల్లో టాప్ మోస్ట్‌ డైరెక్టర్స్‌ లో శ్రీను వైట్ల ఒకరు.  తన కెరీర్ లో టాలీవుడ్ కి సాలిడ్ హిట్స్ ని ఇచ్చిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల టాలీవుడ్‌ కి ఎన్నో సాలిడ్‌ హిట్లను అందించారు. వాటిలో మోస్ట్‌ ఎంటర్‌టైనర్ సినిమాలు ఢీ, వెంకీ, దుబాయ్‌ శీను సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ అన్ని సినిమాల్లో కూడా ఏదోక ఐకానిక్ సీన్ ట్రెండ్ సెట్టింగ్ కామెడీ సీన్ గా నిలిచిపోయింది. అలా మాస్ మహారాజ రవితేజతో చేసిన చిత్రం “వెంకీ” లో ట్రైన్ కామెడీ సీన్ ఎంత పెద్ద హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తన రాబోయే సినిమాలో మరోసారి ట్రైన్ కామెడీ సీన్ ని పెడుతున్నట్టుగా శ్రీను వైట్ల ఎపుడో కన్ఫర్మ్ చేశారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రం “విశ్వం” లో ఈ వింటేజ్ ట్రాక్ ని మళ్ళీ సెట్ చేస్తుండగా తాజాగా నేడు వచ్చిన మేకింగ్ వీడియోలో అయితే కొన్ని విజువల్స్ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

దీంతో ఈసారి కూడా ఈ కామెడీ ట్రాక్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనపడుతుంది. మరి శ్రీను వైట్ల అయితే ఆ వింటేజ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారో లేదో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.

ఆగస్టు 15న వచ్చేస్తున్న రఘుతాత!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమా  సూపర్ హిట్ కావడంతో  టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమా తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ సినిమా మహానటి లో అవకాశం దక్కించుకుంది.  ‘మహానటి’ లో సావిత్రి పాత్రలో కీర్తి తప్ప మరో నటిని ఊహించుకోలేము అన్నట్లుగా నటించి ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. ఇటీవల టాలీవుడ్ లో కొద్దిగా ఆఫర్లు తగ్గినా కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన చిత్రం ‘రఘు తాత’. సుమన్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ  తెరకెక్కుతోంది. తాజాగా ‘రఘు తాత’ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మలుపులతో కూడిన వినోదాన్ని ఆస్వాదించేందుకు రెడీగా ఉండండి’ అంటూ కాప్షన్ ను కూడా కింద జత చేశారు.

కయల్విజి పాత్రలో పక్కింటి అమ్మాయిలాగా సహజంగా నటిస్తూ నవ్వులు పూయిస్తూ సాగిన ట్రైలర్‌లో కీర్తి  నటన విపరీతంగా ఆకట్టుకుంది. హిందీ రాని ఓ తమిళ యువతీ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంది… చివరికి వాటిని ఎలా అధిగమించింది అనే కథ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు సుమన్ కుమార్. ఈ సినిమాలో రవీంద్ర విజయ్, ఎమ్మెస్‌ భాస్కర్‌ ఆనంద్‌ సామి, దేవదర్శిని కీలక పాత్రలలో యాక్ట్‌ చేశారు.

 ‘రఘు తాత’ సినిమాకి శ్యాన్‌ రోల్డన్‌ సంగీతం అందించారు. కన్నడలో భారీ బడ్జెట్ చిత్రాలు కేజీఎఫ్, కాంతారా వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు నిర్మించిన హోంభలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందుర్ ఈ సినిమాని నిర్మించారు. ఆగస్టు 15న భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పోటీగా ఈ మూవీ విడుదల కాబోతుంది.

హాయ్‌ నాన్న డైరెక్టర్‌ తో ఎన్టీఆర్‌ మూవీ!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర, వార్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్స్ లో తారక్ తీరిక లేకుండా పాల్గొంటున్నాడు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ లిస్ట్ లో ఓ కొత్త దర్శకుడు కూడా చోటు సంపాదించుకున్నాడని,  మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను ఆకట్టుకున్న అతనికి తారక్ అవకాశం ఇచ్చినట్లు టాక్‌ నడుస్తుంది.

ఇంతకీ అతనెవరో కాదు ‘హాయ్ నాన్న’ సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ శౌర్యువ్‌.. ఇతనితో ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్టు కొంతకాలం క్రితం  వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ కోసం మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారా? అన్న ఓ ప్రశ్నకు ఆయన స్పందించారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అసలు ఈ టాక్‌ ఎలా వచ్చిందో  కూడా నాకు తెలియడం లేదు.. ఇదంతా తప్పుడు సమాచారం.

అయితే ఏదో ఒక రోజు ఇది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చారు. ఇక శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘హాయ్ నాన్న’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను అలరించడంతో పాటు, తన దర్శకత్వ శైలిని చూపించారు.

Credit Goes To Chandrababu For SC, ST Sub-Categorization, Says Krishna Madiga

MMRPS Founder President Manda Krishna Madiga expressed happiness over the verdict given by the Supreme Court regarding the sub-categorization of SC and ST reservations. He said that the credit goes to Chief Minister Chandrababu Naidu and only because of that law justice survived.

If Chandrababu Naidu had not taken initiative by bringing a law on sub-categorization, he felt thousands of people may not be able to get jobs. As presently Chandrababu is Chief Minister, Krishna Madiga expressed confidence that the classification will be implemented with true spirit.

In Telangana also, he said Chief Minister Revanth Reddy said that the Congress kept a lawyer favouring classification. So, he expressed hope that the Congress government will inevitably implement it.  In this context, Krishna Madiga Madika appealed to the two Telugu state governments not to take up job appointments until the classification is completed.

 “MMRPS has been fighting for classification for 30 years. Many leaders lost their lives in this struggle to correct the injustice done to the nation. We dedicate this victory to all those who gave their lives in the movement. Special thanks to the judges who gave a favorable verdict”, he said.

He also extended thanks to Prime Minister Modi who took the initiative to speed up the process. He thanked former vice president Venkaiah Naidu and Kishan Reddy who took the process forward.

Meanwhile, AP Chief Minister Chandrababu Naidu welcomed the Supreme Court’s verdict on SC and ST sub-categorization and said it is commendable that six members of the seven-member judges gave a unanimous opinion.

The TDP chief asserted that Social Justice is the ideology of Telugu Desam Party and with the aim of justice for all, he brought the ABCD classification after studying the economic conditions by setting up the Ramachandra Rao Commission in 1996-97, when he was the Chief Minister.

Justice to all castes, religions and communities according to population proportion is TDP’s ideology, he said. Moreover, he said that they had followed social justice in the recently held elections and the composition of the cabinet.

భార్య ఉండగా ప్రియురాలితో వెంకీ మామ!

భగవంత్‌ కేసరి సినిమాతో మూస కథలు, ఫోర్స్ డ్ కామెడీకి స్వస్తి పలికాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలయ్యను సరికొత్తగా చూపించి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. తన నుండి ఇక నుండి కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తాయని ఇటీవల ఓ ప్రకటనలో తెలిపాడు అనిల్. ఈ తరుణంలో మరొక సీనియర్  హీరో విక్టరీ వెంకీతో అనిల్‌ ఓ కొత్త చిత్రాన్ని మెుదలు పెట్టాడు. విభిన్న కథ, కథనంతో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు ఈ ఒంగోలు కుర్రాడు. గతంలో వెంకీ మామకు రెండు సూపర్ హిట్లు అందించాడు ఈ యంగ్‌ డైరెక్టర్.

తాజా చిత్రాన్ని కూడా పర్ఫెక్ట్ గా తెరకెక్కించి హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని  ఉవ్విళ్ళూరుతున్నాడు రావిపూడి. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించి ఇతర నటీనటుల సీన్స్ పూర్తి చేసారు. రెండో షెడ్యుల్ ను ఆగస్ట్ 9 నుండి పొల్లాచిలో మెుదలు పెట్టనున్నారు. హీరో విక్టరీ వెంకీ మామ ఈ షెడ్యుల్ నుండి మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు.

తాజాగా  హైదరాబాద్ లో ఈ చిత్రంలో వెంకీ లుక్ కు సంబంధించిన ఫోటో షూట్ చేశారు. ఈ చిత్రంలో వెంకటేశ్ EX పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ విక్టరీ భార్య పాత్రలో కనిపిస్తుండగా..అందాల తార టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తోన్న మీనాక్షీ చౌదరి వెంకీ ప్రియురాలి పాత్రలో మెరవబోతుంది.

హీరో..భార్య.. మాజీ ప్రేయసి కథనంతో ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా అభిమానుల ముందుకు రానుంది. SVC బ్యానర్ లో 58వ చిత్రంగా రానున్న భారీ బడ్జెట్ లో నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 

చరణ్‌ ని ముప్పుతిప్పలు పెడుతున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబుతో మరో సినిమాకి ఓకే చెప్పాడు. అయితే గతేడాది చరణ్‌, ఉపాసన దంపతులకు క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు పాపది ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. పాపవి కొన్ని ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ వాటిలో కూడా ఎక్కడ క్లీంకార ముఖం చూపించలేదు.

దీంతో తమ అభిమాన హీరో ముద్దుల కూతురును చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. కాగా క్లీంకార అలాగే రామ్ చరణ్ పై నాగబాబు తనయ నిహారిక కొణిదెల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిహారిక నిర్మాతగా అందరూ కొత్త వారితో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా మరి కొద్ది రోజుల్లో అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఓ ఇంటర్వూ లో మాట్లాడుతూ ” మా ఫామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లీంకారపైనే. క్లీంకార ముద్దుగా మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.

మా చరణ్ అన్నని ముప్పుతిప్పలు పెడుతోంది. ఫుడ్ పెట్టడానికి మా అన్న ఎన్నో సాహసాలు చేయాలి, కుక్క పిల్లను చూపించి అటు ఇటు తిప్పుతూ… చరణ్ అన్నని పరిగెత్తిస్తుంది. చరణ్ అన్నకి క్లీంకార అంటే ప్రాణం. నేను ప్రత్యక్షంగా చుసిన వాళ్లలో చరణ్  అన్న వరల్డ్‌ బెస్ట్ నాన్న. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. చరణ్‌ అన్న యాక్ట్‌ చేసిన సినిమా ఆస్కార్ గెలవడం, అంతేకాకుండా  పవన్ కళ్యాణ్ బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం కూడా క్లీంకార వచ్చాకే జరిగాయి. మా ఇంటికి, మా అందరికి  క్లీంకార లక్కీ డార్లింగ్” అని నిహారిక చెప్పుకొచ్చారు.

Senior IAS Sri Lakshmi set Up A park with Rs 2.18 crore In Her Father’s Name

Senior IAS officer Y Sri Lakshmi, who is notorious for her proximity with former chief minister YS Jaganmohan Reddy and involvement in large scale corrupt and irregular practices, has set up a park in her father’s name spending Rs 2.18 crore of government money. Moreover, she only inaugurated the park in January this year, reaching the peak of her misuse of power.

It may be recalled that she was accused in a CBI case, in which Jaganmohan Reddy was A 1 and was also in jail for some time. Though during bifurcation of the state, she was posted in Telangana, after formation of YCP government in the state, she got her cader shifted to AP by approaching the court.

Her father  is not a freedom fighter and or a great social worker who has done social service work. Only a retired railway engineer.   retired. In Machilipatnam in January this year a memorial park was started in his name Y. Nageswara Rao and installed his statue in it.

At that time she was a  Special Chief Secretary in the State Municipal and Urban Development Department. She inaugurated the beautiful park built at a cost of Rs 2.18 crore, on January 24. While Rs 2 crore was spent from the funds of the State Green and Beautification Corporation, another Rs. 18 lakhs were spent for the establishment of the park.

Nageswara Rao’s statue was installed inside the park on a warlike basis. Parks have been constructed under the Amrit scheme in many towns under the auspices of the State Green and Beautification Organization under the Municipal and Urban Development Department.

Central and state governments are jointly developing parks and ponds as part of the Amrit scheme. The parks are especially named after famous people of that area. Locals say that Nageswara Rao, who named the park in Machilipatnam, worked as an engineer in the railways in different areas, but he did not do anything to provide better services to the people in terms of railways in Machilipatnam.

జగన్ శాడిజం… మూల్యం అనంతం!

కేవలం చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ దక్కుతుందనే అసూయతో, ఓర్వలేనితనంతో జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలు కలలుగన్న రాజధాని అమరావతి మీద పగబట్టారు. అమరావతి రాజధానిని స్మశానంగా మార్చేశారు. ఐదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణాన్ని వీలైనంత ముందుకు తీసుకు వెళ్ళ వలసిన బాధ్యతకు బదులుగా 70-80 శాతం పూర్తయి ఆగిన నిర్మాణాలను కూడా గాలికి వదిలేశారు. దాని ప్రభావం ఇప్పుడు నిర్మాణ పనులను తిరిగి చేపట్టడం మీద తీవ్రంగా పడుతోంది. భారీ వ్యయం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఖర్చుపెట్టినా సరే నాణ్యత అనుకున్నంత స్థాయిలో ఉంటుందా లేదా అనే భయం కూడా వెన్నాడుతోంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క అసూయ, దుగ్ధ కారణంగా రాష్ట్ర రాజధానికి ఒక శాపం తగిలినట్లు అయింది. అందుకోసం చెల్లించవలసిన మూల్యం అనంతంగా మారుతోంది!

అమరావతి రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేసారు! మూడు రాజధానుల మాయమాటలతో రాష్ట్రమంతా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. దానిని గుర్తించిన ప్రజలు ఆయనను కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరిగి ఏర్పడిన తర్వాత రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచన ప్రారంభించగనే రకరకాల అవాంతరాలు ఎదురవుతున్నాయి. సచివాలయం, హెచ్ఓడీ టవర్లు, హైకోర్టు భవనం పునాదులు పూర్తిగా ఐదేళ్లుగా నీళ్లలోనే నానుతున్నాయి. ఇప్పటివరకు పూర్తయిన కాంక్రీట్ పునాదులు ఎంత మేరకు సురక్షితమో, ఎంత పట్టిష్టంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఈ భవనాల పటిష్టత, నిర్ధారణకు అమరావతి ప్రాంతానికి హైదరాబాదు, మద్రాసు ఐఐటీ నిపుణులు కూడా రానున్నారు.
ఈ పునాదులలో నిలిచిపోయిన నీటిని తోడి వేసేందుకు మాత్రమే కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది అని అంచనాలు వేస్తున్నారు. ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి అసూయ పుణ్యం అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఐఏఎస్ అధికారుల కోసం ఇతర ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు కూడా 70-80 శాతం పూర్తయ్యాయి. వాటి కొనసాగింపు పనులు కూడా జగన్ చేపట్టలేదు. ఇప్పుడు ఆ భవనాల పటిష్టతను కూడా ఐఐటి నిపుణులు వచ్చింది నిర్ధారించవలసిన అవసరం ఏర్పడింది. వాటిని సాధారణ స్థితికి తీసుకురావడానికి మరెన్ని కోట్లు ఖర్చవుతుందో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన సరళి వల్ల ఏర్పడింది అని ప్రజలంతా అనుకుంటున్నారు. పాజిటివ్ ఆలోచన లేని ఒక వ్యక్తికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితిలో పడిపోతుందో తెలుసుకోవడానికి అమరావతి రాజధాని పెద్ద ఉదాహరణ అని అందరూ అంటున్నారు.

తగ్గి మాట్లాడడం జగన్ కు చేతనవుతుందా?

విశాఖలో స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలోకి మారిపోకుండా కాపాడుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద బాధ్యత. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ స్థానం వారి ఖాతాలో ఉండేది. వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరడం వలన ఉప ఎన్నిక ఏర్పడింది. మళ్లీ తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకోగలిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరువు నిలబడుతుంది.

అయితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బుజ్జగించడం, అనునయించడం వారికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత సుహృద్భావ వాతావరణంలో మాట్లాడగలరు అనేదాన్ని బట్టి పర్యవసానాలు ఉండబోతున్నాయి. జగన్ కాస్త తగ్గి మాట్లాడగలరా? అనేది అనుమానం. సాధారణంగా ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు ఇవ్వని జగన్.. కార్పొరేటర్లతో ఎలా బిహేవ్ చేస్తారనేది ప్రశ్నగా ఉంది.  విశాఖలో వైసీపీలో మిగిలిన కార్పొరేటర్లు జగన్ తో  భేటీకి తాడేపల్లికి రానున్న తరుణంలో ఈ అంశం కీలకంగా మారుతుంది.

విశాఖపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పరిణామాలలో 12 మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరారు. ఇంకా 12 మందికి పైగా పార్టీ మారనున్నట్లుగా పుకార్లు అప్పట్లో వినిపించాయి. అయితే కార్పొరేటర్లను కాపాడుకోవడానికి గుడివాడ అమర్నాథ్ ఒకవైపు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా నోటిఫికేషన్ విలువడటంతో వారిని బుజ్జగించడానికి పార్టీ విడిపోయే ఆలోచనను దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
విశాఖ నుంచి 45 మంది కార్పొరేటర్లు రెండు బస్సులలో బయలుదేరి తాడేపల్లి జగన్ ప్యాలెస్ కు ఆయనతో భేటీ కావడానికి వస్తున్నారు. అయితే ఈ 45 మంది కూడా స్థిరంగా పార్టీలో కొనసాగే వారేనా లేక వారిలో కొందరికి ఫిరాయిస్తారా అనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఈ విషయం జగన్ మోహన్ రెడ్డి వారితో ఎలా మాట్లాడుతారు అనేదానిపై ఆధారపడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. జగన్ ఇటీవలి కాలంలో ఘోరమైన పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో పార్టీ నేతలతో కాస్త ఆవేశంగా ‘పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి’ అనే తరహాలో ఆయన మాటలు ఉంటున్నాయి. ఇది పలువురిని నొప్పిస్తోంది.

‘జగన్ ఇలాగే వ్యవహరిస్తే పార్టీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు కూడా మిగలరు’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నాయకులే ఓటమికి బాధ్యులని ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకున్నారని ఇలా రకరకాలుగా తాను ఎవరితో అయితే సమావేశమవుతున్నాడో వారిని నిందించడం ఇటీవల కాలంలో జగన్ వైఖరిగా మారింది. అదే మాదిరిగా కార్పొరేటర్లతో కూడా వ్యవహరిస్తే నష్టం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారిని బుజ్జగించేలాగా బతిమాలి అయినా ఒప్పించే లాగా పార్టీ పట్ల నమ్మకం భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే లాగా చేస్తే తప్ప కార్పొరేటర్లను కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లతో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థల ప్రజల ప్రతినిధులను కూడా జగన్ బుజ్జగించాల్సి ఉంటుంది. కానీ ఆయన అహంకారం వీడి మెత్తగా మాట్లాడడం నేర్చుకోగలరా అనేది పార్టీ వారికే అనుమానం గా ఉంది.