Home Blog Page 718

జగన్ పక్షపాత వైఖరి పై సుప్రీం దెబ్బ!

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రదర్శించిన అహంకారపూరిత పక్షపాత వైఖరికి గొడ్డలి వేటు లాంటి దెబ్బ వేసింది సుప్రీం కోర్టు. ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణకు పచ్చ జెండా ఊపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలను వంచించారో ఆ భాగోతాలకు చెక్ పెట్టింది. ‘‘ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటికీ సాధ్యం కాదు- ఆ విషయం తెలిసినా  సరే చంద్రబాబు నాయుడు డ్రామా ఆడారు. వర్గీకరణ చేసినా సరే కోర్టు కొట్టేస్తుందని తెలిసిన ఆయన ఆ పని చేశారు. ఆయన ప్రజలను మోసం చేశారు’’ అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు దార్శనికతను, చిత్తశుద్ధిని తప్పుపట్టారు. ఎస్సీలలో బాగా వెనుకబడిన వారికి కూడా న్యాయం జరగాలన్న చంద్రబాబు నాయుడు తపనను ఆయన నిందించారు. అక్కడికేదో తాను ప్రతి విషయంలోనూ రాజ్యాంగబద్ధంగా నడుచుకునే మహానుభావుడి లాగా చాటుకుంటూ ఎస్సీ వర్గీకరణ అనే డిమాండును పూర్తిగా తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగం అందుకు అనుమతించదని అన్నారు.
 
ఓటు బ్యాంకు రాజకీయాలను గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెసుకు, జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ మాల వర్గంలో ఆదరణ ఎక్కువ అని, అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ చేసినప్పటికీ కూడా కోర్టు ద్వారా తాను పొందే లబ్ధి ఏదీ ఉండదని జగన్ కు ఒక అభిప్రాయం ఉండేది. అందువల్ల.. ఆయన పరిపాలన కాలంలో ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోలేదు సరికదా, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. వర్గీకరణ అసలు  సాధ్యమే కాదని, అసలు సరైన  ఆలోచనే కాదని అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు.

అమరావతి రాజధాని మీద జగన్ ఏ రకంగా అయితే పగబట్టారో, ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద కూడా అదే విధంగా పగబట్టారు. అమరావతి రాజధానిని ఎవరు పూర్తిచేసినా సరే.. దానికి సంబంధించిన కీర్తి చంద్రబాబుకు దక్కుతుందని, చంద్రబాబు నిర్మించిన నగరంగానే అమరావతి చరిత్రలో మిగులుతుందని జగన్ కు అసూయ. అందుకే దానిని స్మశానంగా మార్చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు తాను పూనుకున్నా సరే.. కొత్తగా న్యాయం జరిగే వర్గాల్లో అభిమానం తొలుత ఆ పనిచేసిన చంద్రబాబు పట్లనే ఉంటుందని ఆయన అనుకున్నారు. అందుకే వర్గీకరణను వ్యతిరేకించారు.

తీరా సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో వర్గీకరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తమ తమ పరిధిలో ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు అవకాశం ఏర్పడడం.. అణగారిన వర్గాల పట్ల జగన్ అహంకారానికి దెబ్బ అని పలువురు అంటున్నారు. 

CM Chandrababu Reviews CRDA, Emphasizes Investment-Driven Land Allocation for Amaravati

Amaravati: Today, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu conducted a review of the Capital Region Development Authority (CRDA). During the meeting, he asserted that land allocations in Amaravati would be granted only to those who contribute to wealth creation and bring in investments. He also announced plans to reassess previous land allocations.

Chandrababu confirmed that the capital would remain within the 8,352 square kilometers identified earlier, as per the Government Order No. 207 issued in 2015, which defines the CRDA’s jurisdiction. He instructed officials to retract the inclusion of certain villages in the Mangalagiri Municipality.

In the CRDA meeting, discussions also focused on transforming Amaravati into an education hub by inviting various educational institutions. Chandrababu directed officials to proceed with the construction of a four-lane Karakatta road and the Inner Ring Road (IRR).

ఆ ముగ్గురు యంగ్ హీరోల మల్టీ స్టారర్‌!

టాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌-ఏఎన్నాఆర్‌- కృష్ణ-శోభన్‌ బాబుల కాలం నుంచే మల్టీ స్టారర్‌ సినిమాలు రావడం కామనే. ఆ తరువాత వచ్చిన జనరేషన్‌ లో కూడా మల్టీస్టారర్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పటి తరంలో కూడా యంగ్‌ హీరోలు, సీనియర్‌ హీరోలు కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 , వాల్తేరు వీరయ్య..ఇలా చాలా సినిమాల లిస్టే ఉంది.

తాజాగా మ‌రో కొత్త కాంబోకి  టాలీవుడ్‌ లో తెర లేచింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ – విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ లు కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఓ ర‌కంగా ఇది మినీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా అనే చెప్పుకోవాలి.

 మంచు మనోజ్ ఈమ‌ధ్య విల‌న్ పాత్ర‌ల వైపు ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడు. ‘మిరాయ్‌’లో త‌ను విల‌న్‌. ఇవి కాకుండా మ‌రో రెండు సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల్లోనే నటించబోతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో మ‌రో సినిమా తాజాగా చేరిందనే చెప్పుకోవచ్చు. ‘నాంది’తో ఆక‌ట్టుకొన్న విజ‌య్ క‌న‌క‌మేడ‌ల మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ రెడీ చేసుకొన్న‌ట్టు ఇండస్ట్రీ టాక్‌. నిజానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది.

కానీ బెల్లంకొండ షెడ్యూల్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల అది సాధ్య పడలేదు. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధ‌మైంది.

చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విజయ్‌!

హీరో విజయ్‌ ఆంటోనీ తాజాగా నటిస్తున్న సినిమా తుఫాన్‌. వాస్తవానికి ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే మరో ఐదు  తెలుగు సినిమాలు   కూడా ఈ రోజే విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేసినట్టు మూవీ మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

తాజాగా పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో దర్శకుడు విజయ్ మిల్టన్ “తుఫాన్” సినిమాను తెరకెక్కించారు. ఇక వాయిదా పడ్డ “తుఫాన్” సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్దం కాబోతుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదల చేసిన స్నీక్ పీక్ కు హ్యూజ్ రెస్పాన్స్ లభిస్తోంది.

ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఈ “తుఫాన్” ఇవ్వబోతున్నట్లు  చిత్ర బృందం చెబుతుంది. మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ నటించిన ఈ సినిమా కి యాక్షన్ సుప్రీమ్ సుందర్ కొరియోగ్రాఫర్.

రజినీ మెచ్చిన మహారాజ..డైరెక్టర్‌ ని ఇంటికి పిలిచి!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌సేతుపతి తాజాగా నటించిన సినిమా ‘మహారాజ’. ఈ మూవీ ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. సస్పెన్స్‌, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ నిథిలన్‌ స్వామినాథన్‌ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభినందించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. డైరెక్టర్ ను తన ఇంటికి ఆహ్వానించి మరీ ప్రశంసించారు. రజనీకాంత్‌తో కలిసి తీసిన ఫోటోలను దర్శకుడు నిథిలన్‌ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆయనతో సమావేశమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రజనీకాంత్‌ తనతో సినిమా, జీవితం గురించి చాలా విషయాలు పంచుకున్నారని సమాచారం. మీ మాటలు బంగారు అక్షరాలతో వ్రాసిన నవల చదివినట్లుగా ఉన్నాయి. వాటి నుంచి నేను తమిళ సినిమా ప్రపంచంలో మరో జీవితాన్ని చవిచూస్తాను. మీ జీవితానుభవ విషయాలు నాతో పంచుకుని చాలా సంతోషాన్ని ఇచ్చారు. మీ వినయం, ఆతిథ్యానికి నేను ఎప్పటికీ మరిచిపోలేనుని తన సోషల్‌ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. 

జిక్కీ ప్రొమోసాంగ్‌ ఎలా ఉందో తెలుసా..మీరైతే..!

మాస్ మహారాజా రవితేజ, అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  అటు రవి, హారీష్‌ శంకర్‌ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూడో సింగిల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.‘జిక్కీ’ అంటూ సాగే సాంగ్ ప్రోమో కట్ చాలా అందంగా ఉంది. ఈ ప్రోమోలో భాగ్యశ్రీ బొర్సె అందానికి అభిమానులు ఎవరైనా సరే అలా ఫిదా కావాల్సిందే. ఆమె అందమైన రూపాన్ని చూసేందుకు రవితేజ కూడా ఆమె జాడ కోసం వెతుకుతున్నట్లు మనకు ఈ ప్రోమోలో తెలుస్తుంది. ఈ సాంగ్‌కు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, రమ్య బెహరా ఆలపించారు.

ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరికల్ వీడియోను శనివారం సాయంత్రం 4.59 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం హైలైట్‌గా ఉండబోతుందని ఇప్పటికే విడుదల అయిన పాటలు ప్రూవ్ చేశాయి. ఈ సినిమాను ఆగస్టు 15న గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకుని రాబోతున్న సంగతి తెలిసిందే.

కల్కి సినిమా మీరింకా చూడలేదా..అయితే ఈ బంపరాఫర్‌ మీకోసమే!

రికార్డుల రారాజు, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజాగా నటించి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ముందుకు దూసుకు పోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఏ చిత్రానికి సాధ్యం కాని లాంగ్ రన్ ను కల్కి మూవీ కొనసాగిస్తుంది.

తాజాగా ఈ చిత్ర బృందం మరొక ఇంట్రెస్టింగ్ ప్రమోషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 9 వ తేదీ వరకు టికెట్ ధరను 100 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించింది. ఇది అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పుకొవచ్చు. ఇప్పటి వరకూ ఈ సినిమాని  చూడని వారికి  ఇది మంచి అవకాశం అనే చెప్పుకొవచ్చు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన కీలక పాత్రల్లో నటించారు.

సంపత్‌ నంది , శర్వా కాంబోలో రాబోతున్న సినిమా!

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ లతో ప్రేక్షకులను అలరించడానికి టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ ఎప్పుడూ ముందు ఉంటాడనే సంగతి తెలిసిందే.  ఈ నటుడు చివరిసారిగా మనమే చిత్రంలో కనిపించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ శర్వా యాక్షన్‌ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తరువాత శర్వా36, శర్వా37 చిత్రాలు రెడీ గా ఉన్నాయి. ఇప్పుడు మరోక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీరో శర్వానంద్, క్రియేటివ్ డైరెక్టర్ సంపతి నంది కాంబోలో ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది. ఇది కన్ఫర్మ్ అయితే శర్వానంద్ నటించే 38 వ చిత్రం ఇదే కాబోతుంది.

YCP fielding Botsa From Visakha MLC polls

The YCP leadership has finalized the name of former minister and key leader from the North East region of the state Botsa Satyanarayana as its candidate in the ensuing  MLC elections from the combined Visakhapatnam district local bodies constituency. The elections are scheduled to be held on August 30.

YCP chief and former chief minister YS Jaganmohan Reddy has announced selection of his candidature by the party after  following a meeting held at the camp office with party leaders from the district.

During the meeting, Jagan Mohan Reddy consulted with the party leaders, including MLAs, MLCs, and the contested  candidates for Lok Sabha and Assembly seats in recent elections from the combined  Visakhapatnam District.

YS Jagan Mohan Reddy emphasized the importance of unity and coordination among the party leaders. He highlighted the significant majority held by the YSRCP in the local bodies of the Visakhapatnam district, cautioning against potential unethical practices by the ruling party.

The YCP chief called on all party leaders to work cohesively and face any challenges posed by the opposition. He stressed the need for effective coordination committees to ensure a successful campaign.

The election is needed due to the resignation of Vamshi Krishna Srinivas, who had won as YCP candidate in the 2022 polls unanimously, but joined Jana Sena party just before assembly elections. After the YCP leadership complained against him stating he had defected into Jana Sena, the Legislative Council Chairman disqualified him.

Though YCP is having two third majority among the electorate, as the TDP is attempting to engineer large scale defections to capture this seat, Jaganmohan Reddy seems to have chosen Botsa Sathyanarayana as a potential candidate who can face such challenges.

The Visakha district Collector, who is returning officer for the by-election, will issue notification on August 6 and he will receive nominations till August 13. After the polling on August 30, the counting of votes will take place on September 3.

The Municipal Corporations, Municipalities, Zilla Praja Parishad and Mandal Praja Parishad members of Visakhapatnam, Anakapalli and Alluri Sitaramaraju districts of the joint Visakhapatnam district will exercise their right to vote in the MLC elections.

పెద్ద ప్లాన్‌ లోనే హను రాఘవపూడి…సుభాష్‌ చంద్రబోస్‌ గా ప్రభాస్‌!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ తాజాగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పటికే 1200 కోట్ల బిజినెస్‌ ను రాబట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి.

తాజాగా ప్రభాస్‌ నటించే నెక్ట్స్‌ సినిమా పై క్రేజీ అప్‌ డేట్‌ ఒకటి ఫ్యాన్స్‌ ను పండగ చేసుకునేలా చేస్తోంది. అదేంటి అంటే. ‘కల్కి’ సినిమా తర్వాత ప్రభాస్ కొంత గ్యాప్ తీసుకుని మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’తో తిరిగి రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైంది.

ఆ గ్లింప్స్‌ కి భారీగా రెస్పాన్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత ప్రభాస్‌ ఓ పీరియాడిక్ డ్రామా సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత అతను సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ , ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ 2 సినిమాల్లో చేయబోతున్నారు. కేవలం ఈ  నాలుగు సినిమాలే  కాకుండా ప్రభాస్‌  ఖాతాలో కల్కి 2 కూడా ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ను ఆ సినిమా టీం ఎప్పుడో ప్రకటించింది. నాగ్ అశ్విన్ త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పనులను మొదలు పెట్టనున్నారు.

మొదటి పార్ట్‌తో పాటు రెండో పార్ట్‌ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇప్పటికే షూట్ చేశారట. అయితే ఈసారి ఏ ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది కాకుండా ఆయన హను రాఘవపూడి తీయబోయే చిత్రం ‘ఫౌజీ’లో నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అనేక అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు అభిమానుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.. మరి ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఫౌజీ చిత్రం అపూర్వమైన చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో.. భారతదేశానికి స్వాతంత్య్రం  రాకముందు జరిగిన యుద్ద కథను చూపించబోతున్నారు. అంతేకాకుండా ఈ ఫౌజీ సినిమాలో ప్రేమకథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని గతంలోనే టాక్‌ వినిపించింది. అయితే, ఇది సుభాష్ చంద్రబోస్ కాలాన్ని చూపుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.