Home Blog Page 717

వైరల్‌ గా మారిన యంగ్‌ హీరో వీడియో!

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్‌ హీరోల్లో  న‌వీన్ పొలిశెట్టి ఒకరు. నవీన్‌కి  ఇటీవ‌ల ఓ ప్ర‌మాదానికి గురికావ‌డంతో గాయాల‌పాలయ్యాడు. అయితే, త‌నకు జ‌రిగిన ప్ర‌మాదం గురించి ఈ యాక్ట‌ర్ ఓ వీడియో రూపంలో అసలేం జరిగింది, త‌న ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాల గురించి అభిమానుల‌తో పంచుకున్నాడు. అయితే, తాజాగా న‌వీన్ పొలిశెట్టి మ‌రో వీడియోతో అభిమానుల ముందుకు వ‌చ్చాడు.

అయితే, ప్ర‌స్తుతం త‌న చెయ్యి ఫ్రాక్చ‌ర్ కావ‌డంతో నవీన్‌ ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో త‌న ప‌రిస్థితిపై తానే సెటైర్ వేసుకునేలా ఓ ఫ‌న్నీ వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. దీంతో అత‌డికి రోజూవారి లైఫ్ లో ఒక చెయ్యి ప‌నిచేయ‌క‌పోవ‌డం ఎంత కష్టంగా ఉందో చాలా ఫ‌న్నీగా తెలిపాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక తాను ప్ర‌స్తుతం కోలుకుంటున్నాన‌ని.. త్వ‌రలోనే అభిమానుల ముందుకు వ‌స్తాన‌ని తెలియజేశాడు.

దేవరలో ఈ పాట వేరే లెవల్‌ అంతే..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబోలో3 తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” పై పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు భారీ అంచనాలు క్రియేట్‌ అయిన  సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి వస్తున్నా ఒకో అప్డేట్ మరిన్ని అంచనాలు పెంచుతు వెళుతుంది.

అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే రెండో సాంగ్ పై కూడా ఓ క్రేజీ పోస్టర్ తో ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. అయితే అనిరుద్ అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ పై మాత్రం గట్టి హైప్ ఇప్పుడు జనరేట్ అవుతుంది. అలా ఇపుడు రానున్న రెండో సాంగ్ పై ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ ట్వీట్ గుర్తుంచుకొండి మళ్ళీ మాట్లాడుదాం అంటూ గట్టి నమ్మకాన్ని అయితే అభిమానులకి ఇచ్చేశారు. దీంతో ఈ సాంగ్ పై విపరీతమైన అంచనాలు అయితే పెరిగిపోయాయి. అలాగే ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

రామ్‌ సినిమాలో నందమూరి నటసింహం!

రామ్ పోతినేని తాజాగా నటించిన సినిమా డబుల్‌ ఇస్మార్ట్‌. ఈ సినిమా రామ్‌, పూరి కలయికలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌ కు సీక్వెల్‌ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, గ్లింప్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింతా అంటూ సాగే సాంగ్ అయితే అభిమానులకు మంచి కిక్‌ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు.

స్కంద సినిమా ప్లాప్‌ కావడంతో ఆగస్టు 15న విడుదల కానున్న డబుల్‌ ఇస్మార్ట్‌ పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు డబుల్ ఇస్మార్ట్ విడుదలకు సిద్దం అవుతుండగా…మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా ఒకే చెప్పేశాడంట. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్‌ మహేష్. కాగా ఈ దర్శకుడు రెండవ చిత్రంగా రామ్ పోతినేనికి కథ వినిపించాడని ఇండస్ట్రీ టాక్.

ఈ చిత్రం మల్టీస్టారర్ గా తెరకెక్కబోతుందని నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో  నటిస్తున్నట్టు వార్త వినిపిస్తోంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో హ్యూమర్ టచ్ ఉండేలా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్టు సమాచారం. దీంతో రామ్ అభిమాను ఫుల్ ఖుషి గా ఉన్నారు. ‘గాడ్ అఫ్ మాస్ బాలయ్య’, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ కలిసి నటిస్తే ఫుల్ మీల్స్ పెట్టినట్టు ఉంటుందని, ఈ చిత్రం రామ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా మిగులుతుందని రామ్ అభిమానులు అనుకుంటున్నారు.

కాగా బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ మల్టీ స్టారర్ సినిమాలో నటిచడం కొత్తేమి కాదు గతంలో విక్టరీ వెంకీతో ‘మసాలా’ సినిమాలో నటించాడు.

రాజాసాబ్‌ ఫస్ట్‌ సింగిల్‌ ఎప్పుడో తెలుసా!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన తాజా చిత్రాల్లో కల్కి ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌ గా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 1200 కోట్లు రాబట్టి విజయవంతం గా ముందుకు దూసుకుపోతుంది. ఇక ప్రభాస్‌ లేటెస్ట్ చిత్రాల్లో ముఖ్యంగా అభిమానులకి ఫీస్ట్ ఇచ్చే సినిమాలా రాబోతున్న పక్కా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా “ది రాజా సాబ్” కూడా ఒకటి.

ఇటీవల వచ్చిన గ్లింప్స్ కి  అభిమానుల నుంచి సాలిడ్ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుండగా… తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై ఓ తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రానికి  థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి తను ఈ సినిమా మొదటి పాట వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని అభిమానులతో చెప్పుకొచ్చాడు.

సో రాజా సాబ్ పాట వినాలి అంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే అని చెప్పుకొవచ్చు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా థియేటర్లలోకి విడుదల కాబోతుంది.

వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను!

0

తొలివలపు సినిమాతో టాలీవుడ్‌ కి పరిచయమైన హీరో గోపిచంద్‌. ఈ సినిమా 2001 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో ఈ సినిమా 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే గోపిచంద్‌ కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తర్వాత జయం, నిజం, వర్షం లాంటి సినిమాలలో నెగిటివ్ పాత్రలు  చేసి మెప్పించాడు.

ఆ తర్వాత 2004లో విడుదలైన యజ్ఞం సినిమా తన కెరీర్ ను  మలుపు తిప్పింది. ఇక అప్పుడు నుంచి ప్రతి ఏడాది ఓ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు గోపీచంద్. ఈ క్రమంలోనే తాజాగా గోపీచంద్ తన 23 ఏళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నోట్ ను అభిమానుల ముందుకు తీసకుని వచ్చాడు. ఈ లేఖ లో తాను సినీ పరిశ్రమకు వచ్చి 23 సంవత్సరాలు గడిచిపోయాయని.. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న నా నిర్మాతలకు, దర్శకులకు, సహనటులు, సిబ్బంది అందరికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.

అలాగే నటుడిగా నేను అనుభవించిన ఈ ప్రయాణం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతగానో రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ నాకు చూపించిన నిరంతరం మద్దతు, ప్రోత్సాహానికి,  అలాగే మీడియా సభ్యులు, తెలుగు సినీ జర్నలిస్టులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఎల్లప్పుడూ నా కోసం మీరందరూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మీ మద్దతుకు, నా అభిమానులందరికీ పెద్ద చప్పట్లు అంటూ పేర్కొన్నాడు. మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుందని.. మీరందరూ ప్రతిరోజు నాకు అతి పెద్ద బలం అని త్వరలో విశ్వం సినిమాతో మిమ్మల్ని కలుస్తా అంటూ తెలియజేశాడు.

అల్లు వారబ్బాయి సినిమాలో జై బాలయ్యకి అదిరిపోయే రెస్పాన్స్‌!

అల్లు శిరీష్‌ హీరోగా బడ్డీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన టెడ్డీ అనే సినిమాకి దీన్ని రీమేక్ గా తీర్చిదిద్దారు. కానీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందని వస్తుంది.

ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్లీ చూపించారని కొందరు అంటుంటే లాజిక్ లెస్ గా అనిపించిందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా విషయంలో కొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకుల వద్ద గట్టిగా పేలాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలను అనుసరిస్తూ కొన్ని సీన్లు చేశారు అవి అదిరిపోయాయి. ఇక ఒక మెషిన్ గన్ వాడుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ పేరు తలుచుకుంటూ మూసేసిన ప్రతి పబ్ ముందు వినబడే ఏకైక పాట జై బాలయ్య అంటూ టెడ్డీబేర్ తోటి మెషిన్ గన్ ఆపరేట్ చేయించిన విధానం సూపర్‌ గా ఉంది.

ముఖ్యంగా ఆ సీన్ పడినప్పుడైతే థియేటర్లో మంచి రెస్పాన్స్ లభించింది. అల్లు హీరో సినిమాలో జై బాలయ్య డైలాగులు అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో కూడా సూపర్‌ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ ప్రిషా సింగ్ హీరోయిన్లుగా శ్యామ్ ఆంటోనీ దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఏందన్నా ఇట్ట చూసుకోకపోతే ఎట్టా?

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఏ చిన్న విషయం జరిగినా అది నెక్ట్స్‌ మినిట్‌ సోషల్‌ మీడియాలో వెంటనే ప్రత్యక్షమైపోతుంది. ఈ విషయంలో చాలా ఈజీగా మూవీ మేకర్స్‌ ట్రోలర్స్ కి దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన దేవర సినిమా పోస్టర్ గురించి రకరకాల ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. మిగతా సినిమాలతో పోలిస్తే ప్రమోషన్లలో దేవర సినిమా కాస్త వెనకబడే ఉందని చెప్పుకొవచ్చు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సింగిల్ ఐదో తేదీన విడుదల చేయబోతున్నామంటూ చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్లో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ఇద్దరూ హగ్ చేసుకుని ఉన్నట్టు కనిపిస్తోండగా ఒక మంచి రొమాంటిక్ పోజ్ లో నిలబడి అభిమానులకు కనిపిస్తున్నారు. అయితే ఈ పోస్టర్ ఎడిటింగ్ విషయంలో మాత్రం ట్రోల్స్ విపరీతంగా మొదలు అయ్యాయి. అదేంటంటే ఎన్టీఆర్ కాళ్లు ఈ పోస్టర్ లో ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు.

దీంతో పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఒక పాన్ ఇండియా హీరో, బాలీవుడ్ నుంచి తెచ్చుకున్న హీరోయిన్ లు ఉండగా పోస్టర్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారో అంటూ  అభిమానులతో పాటు సామాన్య నెటిజన్లు కూడా మూవీ మేకర్స్‌ ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇంతకుముందు విడుదల చేసిన పోస్టర్లో కూడా ఇదే పొరపాటు జరిగిందని… దాన్ని ఇప్పుడు కూడా సరిహద్దుకోకపోతే ఎలా అని కామెంట్ల మీద కామెంట్లు  వినిపిస్తున్నాయి.

35 నుంచి ఫ్రెండ్‌షిప్‌ యాంథెమ్‌ వచ్చేసింది!

టాలీవుడ్‌ యంగ్ బ్యూటీ నివేదా థామ‌స్ న‌టిస్తున్న లేటేస్ట్‌  చిత్రం ’35-చిన్న క‌థ కాదు’ . ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దీంతో ప్రేక్షకుల్లో సినిమా మీద ఓ పాజిటివ్‌ వైబ్‌ వచ్చింది.

అయితే, ఈ సినిమా నుంచి తాజాగా ఫ్రెండ్ షిప్ యాంథెమ్ ప్రొమోను చిత్ర బృందం విడుదల చేసింది. స్నేహితుల దినోత్సవం కానుకగా ఈ పాటను ఆగస్టు 4 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాట‌లో స్కూల్ ఫ్రెండ్స్ మ‌ధ్య సాగే స్నేహాన్ని మ‌న‌కు చూపించబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో న‌టుడు విశ్వ‌, ప్రియ‌ద‌ర్శి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా నంద కిషోర్ ఈమ‌ని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 15న విడుదల చేసేందుకు మూవీ మేక‌ర్స్ విడుదల చేస్తున్నారు.

బెంగళూరులో ఏముండాది జగనన్నా!

మాయల మరాఠీ ప్రాణం సప్త సముద్రాలకు అవతల.. దెయ్యాలదీవిలో మర్రిచెట్టు తొర్రలోని పంజరంలోని చిలకలో ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం మొత్తం బెంగుళూరు ప్యాలెస్ లోని ఉన్నదేమో అని నవ్వుకుంటున్నారు తెలుగు ప్రజలు! ఐదేళ్లలో అధికారంలో ఉన్న కారణంగా అతి తక్కువ సందర్భాలలో మాత్రమే బెంగళూరు ప్యాలెస్ ను విజిట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, పరాజయం పాలైన తర్వాత ఈ 40 రోజులలోనే నాలుగో మారు ప్రయాణం అయ్యారు. ఈ 40 రోజులలో ఆయన తాడేపల్లి కంటే ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్ లోనే గడిపారని అనుకోవచ్చు. అంతగా బెంగుళూరు ప్యాలెస్ లో ఎట్రాక్షన్ ఏమున్నదో కదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. అప్పట్లోనే బెంగుళూరులో కళ్ళు చెదిరే ఒక అతిపెద్ద ప్యాలెస్‌ను తన కోసం నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంపీ అయ్యారు. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి అయ్యే కోరికతో అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉండాల్సి వచ్చేసరికి జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద మరో బ్రహ్మాండమైన ప్యాలెస్ ను నిర్మించుకున్నారు. రాష్ట్ర విభజన, అమరావతి కేంద్రంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రారంభించిన తర్వాత, తొలి రోజుల్లో అక్కడ రాజధాని ఉండడానికి సుముఖంగానే కనిపించిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో మరొక ప్యాలస్ ను కూడా నిర్మించుకున్నారు. సీఎం అయి, రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం కి మార్చే ఆలోచన చేసిన తర్వాత అక్కడ ఋషికొండను ధ్వంసం చేసేసి సముద్రం వ్యూ ఉండేలాగా సర్కారు సొమ్ముతో..  నభూతో న భవిష్యతి అనిపించేలా మరొక  ప్యాలెస్ ను నిర్మించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉండాలనే భ్రమతో అది తనకు శాశ్వత నివాసం అవుతుందని ఆశపడ్డారు. కానీ ప్రజలు దారుణంగా తిరస్కరించి ఆయన ఇంటికి పరిమితం చేశారు.

ఋషికొండ ప్యాలెస్ ను విస్మరిస్తే జగన్ కు సొంతంగా ఉన్న మూడు ప్యాలెస్ లలో బెంగళూరు ప్యాలెసే అత్యంత వైభవోపేతంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. తొలి రోజుల్లో తప్ప అధికారం దక్కిన పుణ్యమా అని ఐదు సంవత్సరాలు ఆ ప్యాలెస్ వైభవానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కేవలం సాధారణ ఎమ్మెల్యేనే గనుక, అసెంబ్లీకి వెళ్లే అలవాటు కూడా లేదు గనుక చిటుకుమంటే బెంగుళూరు వెళ్లి ఆ ప్యాలెస్ వైభవాన్ని అనుభవిస్తున్నారని జనం నవ్వుకుంటున్నారు.

Chandrababu promises Action on Revenue Issues

Chief Minister N. Chandrababu Naidu addressed the media at the party’s headquarters, NTR Bhavan, in Amaravati, discussing the measures being taken to address grievances from the public. Chandrababu emphasized that the government’s primary goal is to resolve the complaints submitted by victims, with a particular focus on revenue-related issues.

He assured that action would be taken against officials responsible for revenue-related problems and irregularities. He noted that some records had been tampered with and highlighted that issues have been prevalent across various mandals.

The Chief Minister’s remarks reflect a commitment to tackling administrative inefficiencies and ensuring accountability among government officials.