Home Blog Page 713

దసరాకి వచ్చేస్తున్న ఆన్‌స్టాపబుల్‌ 4..!

నంద‌మూరి బాల‌కృష్ణ అటు తన సినీ కెరీర్ లో 109 వ సినిమాని నిర్మిస్తుండగా.. ఆ సినిమాని చాలా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాడు.  ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో బాల‌య్య క‌నిపిస్తాడు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా బృందం భావిస్తోంది.

కాగా, ద‌స‌రా కానుక‌గా బాల‌య్య ఓ ట్రీట్ రెడీ చేస్తున్న‌ట్లుగా సమాచారం. బాల‌య్య హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ టాక్ షో ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమ్ అయ్యింది. ఇక రెండు సీజన్లు కూడా భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. లిమిటెడ్ వెర్షన్‌లో మూడో సీజన్ కూడా స్ట్రీమ్ అయ్యింది. దీంతో నిర్వాహ‌కులు ఇప్పుడు నాలుగో సీజ‌న్‌ను రెడీ చేస్తున్నారని టాక్‌. సెప్టెంబ‌ర్ లో అన్ స్టాప‌బుల్ సీజ‌న్-4ని స్టార్ట్ చేసి తొలి ఎపిసోడ్‌ని ద‌స‌రా కానుక‌గా స్ట్రీమ్ చేయాల‌ని చూస్తున్నట్లు సమాచారం.

దీంతో ఈ టాక్ షోతో మ‌రోసారి బాల‌య్య త‌న స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ నాలుగో సీజన్ లో కూడా చాలా మంది సెల‌బ్రిటీల‌ను బాల‌య్య ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చే వ‌ర‌కు ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిందే మరి.

రాజధాని ప్రియులకు శుభవార్త : నేటినుంచే స్వచ్ఛ మిషన్!

రాజధాని నగరానికి కూడా దిక్కులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయిదేళ్లపాటు కుమిలిపోయింది. మీ రాజధాని ఏదని అడిగితే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు అయిదేళ్లపాటు అవమానాలు పడ్డారు. చంద్రబాబునాయుడు కలల రాజధానిగా అమరావతికి రూపకల్పన చేస్తే.. జగన్ వచ్చి దానిని స్మశానంగా మార్చేసినప్పుడు ప్రజలు దుఃఖించారు. అలాంటి వారందరికీ ఇది శుభవార్త. బుధవారం నుంచి అమరావతి రాజధానిలో ‘ఆపరేషన్ స్వచ్ఛ’ ప్రారంభం కానుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. పెరిగిపోయిన కర్రతుమ్మ, ముళ్లచెట్లను సమూలంగా తొలగించి.. నిర్మాణాలకు అనుకూలతను రూపుదిద్దడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటే.. చంద్రబాబునాయుడుకు కీర్తి దక్కుతుందనే అసూయతో ఆ నగరాన్ని, రైతుల త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో జగన్ అయిదేళ్ల పాటు డ్రామా నడిపించారు. అయితే జగన్ డ్రామాలను ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో విశాఖను ఉద్దరించేస్తానని జగన్ పలుమార్లు ప్రగల్భాలు పలికినా.. ఆ జిల్లాలన్నీ కలిపి జగన్ కు కేవలం రెండే ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అంత దారుణంగా ఆయన పరిపాలనను, రాజధాని ముసుగులో చేసిన కుట్రలను ప్రజలు ఛీకొట్టారు. రాష్ట్రప్రజల్లో అమరావతి రాజధాని పట్ల ప్రేమ ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా వ్యక్తం అయింది. అలా అమరావతిని ప్రేమిస్తున్న రాష్ట్రప్రజలందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి.

స్మశానంలా మారిన అమరావతి ప్రాంతాన్ని మళ్లీ స్వప్నరాజధానిగా తీర్చిదిద్దడానికి పనులు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. ముళ్లచెట్లను తొలగించబోతున్నారు. నిర్మాణాలు కూడా త్వరితగతిన ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 130 కేంద్రప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో కూడా నిర్మాణాలు త్వరలోనే ప్రారంభం అవుతాయి. భూములు పొందిన సంస్థలు రెండేళ్లలోగా తమ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. వాటితో పాటు.. రాష్ట్రప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు కూడా కొలిక్కి వచ్చేస్తాయి. గత చంద్రబాబు పాలనలోనే చాలా వరకు పూర్తయిన నిర్మాణాలు అన్నింటినీ.. ఏడాది వ్యవధిలోగా పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఎటుచూసినా సరే.. మూడేళ్లలోగా అమరావతి రాజధాని నగరానికి ఒక స్పష్టమైన రూపురేఖలు ఏర్పడుతాయని పలువురు ఆశిస్తున్నారు.

మాస్‌ మహారాజా సినిమాలో సిద్దు రోల్‌ ఏంటంటే..!

మాస్‌ మహారాజా రవితేజ సినిమా హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్‌ బచ్చన్‌ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ పై చిత్ర బృందం చాలా ఆశలు పెట్టుకుంది. అందుకుగానూ ఆగస్టు 14న ప్రీమియర్‌ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవితేజ నటిస్తోన్న ఈ సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ కనిపిస్తాడని కొన్ని రోజుల క్రితమే ఆన్‌ లైన్‌ లో ఓ రుమార్‌ బయటకు వచ్చింది.

తాజా సమాచారం సినిమా సెకండాఫ్‌ లో  సిద్ధు ఫైట్ సీక్వెన్స్‌లో కనిపించి మెరుస్తాడంట. దాదాపు రెండు మూడు నిమిషాల పాటు సిద్ధు రోల్‌  ఉంటుందని  సమాచారం . హరీష్ శంకర్‌ డైరెక్షన్‌ లో  తెరకెక్కిన ఈ సినిమాలో  రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

హరీశ్‌ శంకర్‌ తో రవితేజ మూడో సినిమా కావడంతో సినిమా పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే.

నా లైఫ్‌ లో మేజర్‌ పార్ట్‌ అంతా కూడా అతనితోనే..: హరీశ్‌ శంకర్‌!

టాలీవుడ్ లో షాక్‌, మిరపకాయ్‌ సినిమాల తరువాత మాస్‌ మహారాజ రవితే, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కలిసి చేస్తున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ మిస్టర్‌ బచ్చన్‌ సినిమా. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ను డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఎలా చూపించారు? ఎందుకు మిరపకాయ్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు గ్యాప్ వచ్చింది అనే విషయాల పై హరీష్ అభిమానులు, ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ కామెంట్స్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

తన ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత, సెకండ్ అవకాశం ఇవ్వడమే గొప్ప. వీడే చిత్రం అప్పటి నుండి రవితేజ గారితో నా జర్నీ మొదలు  అయ్యింది. ఈ చిత్రం తర్వాత నా ఆటోగ్రాఫ్, షాక్, మిరపకాయ్. అంటే నా లైఫ్ లో 10 – 12 ఏళ్లు రవితేజ గారి సెట్స్ లోనే ఉన్నా. సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే, మొత్తం నా లైఫ్ లో మేజర్ పార్ట్ ఆయనతో ఉన్నా.

అలా చెప్పే కన్నా, అతను నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు అని చెప్పాలి. షాక్ ఫ్లాప్ అయ్యాక, పిలిచి మిరపకాయ్ అవకాశం ఇచ్చారు. నాకొక దారి వేసాడు. ఆ దారిలో వెళ్లిపోతున్నా నేను. ఒక సక్సెస్ ఇచ్చి వదిలారు. ఇక నా లైఫ్ నేను చూసుకోవాలి అనే చిన్న దాంతో తప్ప, ఏ రోజు కూడా మిరపకాయ్ నుండి మిస్టర్ బచ్చన్ కి ఉన్న గ్యాప్ లో మేమిద్దరం కలవని నెల లేదు, వెళ్ళని హాలీడే లేదు.

ఎప్పుడూ సినిమా గురించి మాట్లాడుకోలేదు. మా బంధం, సినిమాలకి మించి ఉంటుంది. అంతే తప్ప వేరే రీజన్ ఏమి లేదు.మిస్టర్ బచ్చన్ లో నా మాస్ మహారాజ ను ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎలా చూడాలి అని అనుకుంటున్నారో, అంతకు 100 టైమ్స్ చూపించాను అని చాలా గర్వంగా చెప్తాను అంటూ హరీష్‌ చెప్పుకొచ్చారు.

లీకైన నాని సినిమా..ఆ బ్లాక్‌ బస్టర్ కథతో!

నేచురల్‌ స్టార్ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని సరసన ఆడిపాడేందుకు యంగ్‌ హీరోయిన్‌ ప్రియాంక మోహన్ రెడీ అయ్యింది. ఇక నానికి విలన్ గా ఎస్‌జే సూర్య యాక్ట్‌ చేస్తున్నాడు. అదితి బాలన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాని  డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఇప్పటివరకు సినిమా మీద సరైన అంచనాలు లేవు..మూవీ టీమ్‌ కూడా ఎలాంటి బజ్‌ ని క్రియేట్‌ చేయలేదు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది మూవీ టీమ్‌. అందులో భాగంగానే టీవీ ఛానెల్స్‌ కు  ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు.   ఈ సరిపోదా శనివారం అనే సినిమా లైన్ రజనీకాంత్ భాషా సినిమా లైన్ ని పోలి ఉంటుందని సమాచారం. నాని చిన్నప్పటినుంచి ఆవేశపరుడుగా ఉంటే అది ఎప్పటికైనా అనర్థమే అని భావించి నాని దగ్గర అతని తల్లి మాట తీసుకుంటుందట. పూర్తిగా గొడవలు జోలికి వెళ్లకుండా ఉండమంటే అది జరిగే పని కాదని తెలిసి వారంలో శనివారం మాత్రమే గొడవలకు వెళ్లాలని మిగతా రోజులు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ఉండాలని నాని దగ్గర నుంచి  మాట తీసుకుంటుందట. ఈ లైన్ ని బేస్ చేసుకుని మిగతా డ్రామా అంతా వివేక్ ఆత్రేయ రాసుకున్నాడని లైన్ విన్నప్పుడే తనకు సినిమా భలే నచ్చేసి వెంటనే చేస్తాను అని విలన్ గా చేస్తున్న సూర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఆ డేట్ ని మరే పెద్ద సినిమాలు బ్లాక్ చేసుకోలేదు కాబట్టి నానికి ఈ సినిమా సోలో రిలీజ్ అని తెలుస్తుంది. నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి అనే సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కానీ ఈ సినిమా అయితే కనెక్ట్ అయ్యేట్లు ఉందని సమాచారం. ఈ సినిమాకి దాదాపు 150 కోట్లు బడ్జెట్ అయిందని నాని కెరియర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాలో సోకుల పాలెం అనే ప్రాంతాన్ని ప్రత్యేకంగా సెట్ వేసి సృష్టించినట్లు కూడా చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

ఈ ఏడాదిని మెగా సంవత్సరంగా పిలుస్తున్న అభిమానులు..ఎందుకో తెలుసా..!

2024 సంవత్సరం మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చిన ఏడాది అని చెప్పుకోవచ్చు. గతేడాది రామ్‌ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార పుట్టిన తరువాత మెగా ఫ్యామిలీకి అన్ని  మంచి విషయాలే కలిసి వస్తున్నాయి. మరి ముఖ్యంగా 2024 సంవత్సరం అయితే మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతోంది.

ఈ నేపథ్యంలో మెగా అభిమానులు 2024 ను మెగా నామ సంవత్సరంగా పిలుచుకుంటున్నారు. అందుకు గల నేపథ్యాలను ఒకసారి పరిశీలిస్తే…ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఆయన బ్లడ్ బ్యాంక్, చిరు చేస్తున్న పలు సేవ కార్యక్రమాలకు గాను భారత ప్రభుత్వం మెగాస్టార్ ను పద్మవిభూషణ్ వంటి గౌరవ ప్రదమైన అవార్డును అందజేసిన సంగతి తెలిసిందే.  ఇక మెగా తనయుడు రామ్ చరణ్ నటించిన సినిమా  ‘RRR’. పాన్ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా విడుదల  ఆయిన ఈ మూవీ ఎన్నో రికార్డులను కొల్లగొట్టి రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ ని తీసుకుని వచ్చింది. అంతే కాకుండా ఆర్.ఆర్.ఆర్ సినీ నటులు ఎంతో  ప్రతిష్టాత్మకంగా గా భావించే ఆస్కార్స్ కు వెళ్లింది. అంతేకాకుండా ఆస్కార్‌ కూడా అందుకుంది.

ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజక వర్గం నుండి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిచి మొట్టమొదటి సారి ఏపీ అసెంబ్లీలో కాలు పెట్టారు. అంతే కాకుండా  కేవలం ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. దాంతో పాటుగా ఏపీ ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.

ఒకే వేదిక పై బావ బావమరిది..ఇక అభిమానులకు పూనకాలే!

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నారే నితిన్‌ తెలుగు సినీ పరిశ్రమకు మ్యాడ్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ పై నితిన్‌ ఆయ్‌ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కంచిపల్లి అంజిబాబు డైరెక్షన్‌ లో ఈ సినిమా రాబోతుంది.
ఈ సినిమాని  ఆగస్టు 15న భారీ చిత్రాల పోటీ మధ్యలో చిన్న సినిమాగా విడుద చేయడం అవసరమా అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఆయ్ ట్రైలర్ చూశాక ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా చూడాల్సిందే అనేటాక్ వినిపిస్తుంది.

ఆయ్ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల చూపు పడింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా మొదలుపెట్టింది. ఇప్పటికే పిఠాపురంలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిందేకు ఏర్పాట్లు చేస్తోంది నిర్మాణ సంస్థ. తాజా సమాచారం ప్రకారం ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతారనే వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినపడుతుంది.

అదే జరిగితే ఆయ్ కు అదిరిపోయే పబ్లిసిటి రావడం గ్యారెంటీ. అటు నందమూరి ఇటు అల్లు అభిమానుల సపోర్ట్ కూడా ఇక ఆయ్ సినిమాకే  లభిస్తుంది. ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి ఫన్ స్టోరీతో రూపొందుతోన్న ‘ఆయ్’ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. రామ్ మిరియాల ‘ఆయ్’ కు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

సలార్ 2 ఇప్పట్లో లేనట్లేనా..అసలేం జరిగిందంటే..!

రెబల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన సినిమా  సలార్. కన్నడ  ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకుని వస్తామని సినిమా మొదట్లోనే నీల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే మొదట పార్ట్ చివరలో పార్ట్ -2 త్వరలోరానుందని టైటిల్  కూడా వేసేసాడు.  కానీ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా వచ్చేలా కనిపించట్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్‌  ను సెట్స్ పైకి తీసుకుని వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మైత్రీ సంస్థ ఆగష్టు 9న పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం నుంచి సమాచారం అందింది.

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ని తారక్‌ సొంతం చేసుకున్నాడు.  ప్రస్తుతం చేస్తున్న ‘దేవర’ అనే సినిమా రెండు భాగాలుగా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం త్వరలోనే షూట్ ముగించుకోనుంది. సలార్ నిర్మాతలు సలార్ 2 ను సెట్స్ పైకి తీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ప్రభాస్ డేట్స్ ఇప్పట్లో దొరికేలా లేవు సలార్ నిర్మాతలకు. డార్లింగ్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. సెప్టెంబరు నుండి హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించే చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు.

వచ్చే ఏడాది ప్రారంభంలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఆ వెంటనే కల్కి -2 ఉండనే ఉంది. ఇలా ఎటు చూసుకున్నా సలార్ – 2 కు ఇప్పట్లో మోక్షం లేనట్టే కనిపిస్తుంది. ఈ లోగా తారక్ ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ మొదలు కాబోతుంది. సో ప్రశాంత్ నీల్ బిజీ అవుతాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది. తారక్ తో రెండు పార్ట్స్ ఫినిష్ చేసాకే సలార్ -2 ఉంటుందని తెలుస్తుంది. 

Pawan Kalyan Backs AP Cab Drivers, Fly Asking Them To Leave Hyderabad

Jana Sena chief and  Deputy Chief Minister Pawan Kalyan extended his support to cab drivers from Andhra Pradesh, who are working in Hyderabad and deplored Telangana cab drivers allegedly asking them to leave Hyderabad, which he says not justified at all.

He demanded that the Telangana government should address the issue with a humanitarian approach and also advised cab drivers from Telangana to be sympathetic towards their fellow cab drivers from Andhra Pradesh. He deplored that their displacement would deprive over 2,000 families of their livelihood.

When some of such drivers met him at the Jana Sena office, he patiently heard their concerns and extended his sympathies and expressed hope that the Telangana government should respond positively to address their problems.

TThey deplored that a section of cab drivers from Telangana have been urging the Transport Department to stop the “illegal” plying of taxis registered in states other than Telangana. They claimed that these taxis were affecting their business.

 “The unity of the people of both the Telugu states alone take us forward on the path of progress. I repeatedly say that Andhra Pradesh should follow the path of development because if the opportunities here grow, the migration from Andhra to Telangana will stop. As a result, the people of Telangana will get more employment opportunities in various sectors,” Pawan Kalyan said.

The cab drivers, who called on him told that they are being stopped from operating in Hyderabad and because of this they are unable to live there. They told him that officials and cab drivers in Hyderabad were harassing them and asking them to leave Hyderabad on the ground that on June 2 Hyderabad ceased to be the joint capital of the two states.

Deputy chief minister said that there is no reason to stop Andhra Pradesh cabs from staying in Hyderabad after expiry of the common capital. However, he assured that suitable opportunities will soon be created for them in Andhra Pradesh itself, as work on Capital Amaravati will start soon.

Meanwhile, a group of cab drivers from Andhra Pradesh working in Hyderabad had last month also met Human Resources Development Minister Nara Lokesh and complained that they are being asked to pay life tax on their vehicles once again due to the expiry of the term of Hyderabad as the joint capital.The cab drivers said they already paid life tax on their vehicles in the undivided Andhra Pradesh and that imposing the tax again would result in huge financial loss to them.

Vinesh Phogat Created History At Paris Olympics

0

From being dragged on the streets to staying on pavements for 40 days, Vinesh was at the centre of Indian wrestlers’ massive protest alongside Sakshi and Bajrang Punia against the former WFI chief Brij Bhushan Sharan Singh on sexual harassment charges, has now created history at Paris Olympics 2024.

Vinesh Phogat, after what she has been through in the last 18 months or so, out of nowhere, confirmed India’s fourth medal at the Paris Olympics in women’s 50kg category wrestling. The colour of the medal will be different as Vinesh became the first Indian female wrestler to make it to the Gold medal match and will become the seventh wrestler for India to win an Olympic medal after KD Jadhav, Sushil Kumar, Yogeshwar Dutt, Sakshi Malik, Bajrang Punia and Ravi Kumar Dahiya.

Vinesh had her toughest bout in the very first round as she was up against the Japanese champion and top-seed Yui Susaki, who was coming into the clash with an 82-0 record in international wrestling. Vinesh didn’t give up till the final minute and the last few seconds saw her make probably the biggest move of her career as she beat Susaki on points.

Vinesh Phogat started the day by slaying a giant and ended it by breaking a barrier. By making it to Wednesday’s final in the 50 kg category, she rose to a pedestal that no Indian woman wrestler has ever reached. After overcoming the defending champion, the so-far unbeatable Japan’s Yui Susaki, in the first round, Phogat took down Cuba’s Yusneylis Guzman Lopez in the semi-final to be a win away from an Olympic gold.

There isn’t a direct parallel that captures Susaki’s perceived invincibility on the wrestling mat. The closest, perhaps, would be Rocky Marciano’s otherworldly run of 49 unbeaten boxing bouts. The Japanese legend’s record, however, puts a shadow on Marciano’s: she had been undefeated in 95 international matches in her entire career as a wrestler that began as a junior in 2010.

Vinesh jumped onto the match with a huge loud cry as she broke into tears. It meant so much to her more than just beating the reigning world champion. The quarter-final and the semi-final against Ukraine’s Oksana Livach and Yusneylys Guzman of Cuba were relatively and figuratively child’s play for Vinesh and she has her eyes set on that Olympic Gold.